కృష్ణమ్మ వాకిట్లో కర్వేపాకు చెట్టు!
సరికొత్త తెలుగు చిత్రం
టైటిల్ క్రెడిట్ - జిలేబి
కథ కాన్సెప్ట్ - కృష్ణ ప్రియ
*ఫోటో క్రెడిట్ 'గూగ్లాయనామః'*
ఈ మధ్య మా సీతమ్మ తల్లి మరీ మరీ పాపులర్ అయిపోనాది !
సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టు ఓ చిత్ర రాజం !
సీతమ్మ తలలో పేలు ! - ఓ పేరొందిన బ్లాగర్ గారి టపా !
సీతమ్మ అగ్ని ప్రవేశం చేసి సాధించినది ఏమిటి ? మరో రౌడీ రాణి ప్రశ్న !
రామా, చట్ మ (ర) లా నీ (పై) కంప్లైంట్ ! ఓ జిలేబీ టపా !
ఆ పై ప్రతి ఒక్కరూ సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టు మీద టపా సినిమా రెవ్యూ రాసి పడెయ్యడం !
ఈ మధ్య యు ట్యూబ్ చూస్తే, మంగమ్మ వాకిట్లో మందార చెట్టు ! అన్న మరో 'మినీ సినిమా' కనబడ్డది!
వావ్ అనుకుంటే, కృష్ణ ప్రియ 'బ్లాగిణి' గారు కృష్ణమ్మ వాకిట్లో కర్వేపాకు చెట్టు కి కథ చెప్పెసేరు !
టూకీ గా 'కృష్ణమ్మ వాకిట్లో కర్వేపాకు చెట్టు ' కథ కమామీషు!
కృష్ణమ్మ వాకిట్లో కర్వేపాకు చెట్టు.. కాన్సెప్ట్
(గమనిక ఈ సినిమా టైటిలు కథ పేటెంటు రైటులు
సర్వం జిలేబీ & కృష్ణ ప్రియ గారివి!
All right reserved!)
అక్కా చెల్లెళ్లు చెగోడీలు, పాలకాయలూ, అరటి పండ్లూ, చెరుకు గడలుతింటూ, తగువులాడుకుంటూ,..సద్దుకుపోతూ, ఊరెంబడ తిరుగుతూ, ఉంటారు
వెంట బడిన అబ్బాయిలని ‘పిలకెక్కడ రా నీకూ :) ‘ అనుకుంటూ వారి భరతం పడుతూ ఉంటారు !
అప్పుడేమో, ఆఅ ఊళ్ళోకి మన హీరో వస్తాడన్న మాట.
హీరో కి కర్వేపాకు అంటే మరీ మోపెడంత గంపెడంత ప్రియం.
ఏ ఇంట్లో కర్వేపాకు చెట్టు ఉందో ఆ ఇంటి అమ్మాయినే మను వాడ తా నని ఘోరాతి ఘోరం గా తన బామ్మ జిలేబీ దగ్గిర మన హీరో శపథం పట్టి ఆ ఊరు వచ్చాడన్న మాట !
అప్పుడేమో, హీరో బామ్మ జిలేబీ కర్వేపాకు గురించి ఒక ఫ్లాష్ బ్యాక్ చెబ్తుం దన్న మాట !
ఫ్లాష్ బ్యాక్ ఏమో ఆఖరి దాకా డైరెక్టరు ప్రేక్షకులకి చెప్పడన్న మాట.
అప్పుడేమో, హీరో బామ్మ జిలేబీ కర్వేపాకు గురించి ఒక ఫ్లాష్ బ్యాక్ చెబ్తుం దన్న మాట !
ఫ్లాష్ బ్యాక్ ఏమో ఆఖరి దాకా డైరెక్టరు ప్రేక్షకులకి చెప్పడన్న మాట.
హీరొయిన్ ఎవరు సినిమా లో ?
బులుసు గారి ఫేవరైట్ సినీ తార ఇలియానా అన్న మాట.
బులుసు గారి ఫేవరైట్ సినీ తార ఇలియానా అన్న మాట.
హీరో ఎవరు మరి ?
పనిలేక రమణ గారి ఫేవరైట్ సినీ తారడు అన్న మాట !
పనిలేక రమణ గారి ఫేవరైట్ సినీ తారడు అన్న మాట !
అప్పుడేమయ్యిం దంటే ....
ఎవరండీ అక్కడ ! కథ పొడిగించండి మరి !
ఎక్కడండీ రాజ్ కుమార్ & బులుసు గారలు ?
కామెడీ ట్రెక్ రాయడానికి త్వరపడండి మరి !
కామెడీ ట్రెక్ రాయడానికి త్వరపడండి మరి !
కథా చిత్రానువాదానికి S. చందూ గారు
ఎక్కడున్నా వెంటనే రావలెను !
ఎక్కడున్నా వెంటనే రావలెను !
చిత్రం డైరెక్టు టు హొమ్ టెలికాస్ట్ చెయ్య బడును!
తలా ఓ వెయ్యి రూపాయలు చందా కట్టి
మీ ఒన్స్ ఇన్ లైఫ్ టైం మూవీ ప్రీమియర్ అడ్వాన్సు బుకింగ్ కి వేగిర పడండి !
చీర్స్
జిలేబి.
అర్జంట్ గా..బ్యాంకు అకౌంట్ నంబర్ మెయిల్ చేయండి. ఇంతలోనే కౌంటర్స్ క్లోజ్ అనేయగలరు సుమీ!
ReplyDelete"జేజమ్మ వాకిట్లో జెఫ్ఫా చెట్టు" గురించి మీరు ప్రస్తావించక పోవడంతో బ్రహ్మీకి కోపం వచ్చిందట ..ఫోన్ చేసి కస్సుబుస్సు మంటున్నాడు
ReplyDeleteగంగమ్మ వాకిట్లో గన్నేరు చెట్టు అని ఇంకో సినిమా కూడా మీరే తీస్తున్నారని ఫిల్మ్ నగర్లో ఒక వార్త హల్ చల్ చేస్తోంది.. దీని పై మీ ప్రతిస్పందన?
DeleteLOL..బాగుంది. జిలేబీ ప్రోడ్యూసర్ గారూ... కాకపోతే టైటిల్ సూపర్ అయినా కథ అరిగిపోయింది. కొత్త కథ ఏమైనా ఆలోచిద్దాం. మరి స్టోరీ సిట్టింగ్ ఇంటర్వల్ ముందు బాంగ్ కోసం బాంగ్ కాక్ కీ,క్లైమాక్స్ ఆలోచించడానికి కాలిఫోర్నియా కీ, ఫస్ట్ హాఫ్ సెట్ చేసుకోటానికి ఫ్రాన్స్, సెకండ్ హాఫ్ కోసం సవుత్ ఆఫ్రికా కీ టికేట్లూ అవీ కోసి రెడీ అయిపోండి. బడ్జేట్ లో ఎక్కడా కాంప్రమైజ్ కావద్దు మనం..
ReplyDeleteఏంటీ జిలేబీగారి సినిమా ప్రొడ్యూసరా :) సినిమాల గురించి తెలుసుకోవాలయితే
ReplyDelete