ఈ బ్లాగ్ లోకం లో అజ్ఞాతల కి అసలు విలువ లేకుండా పోతోంది!
అజ్ఞాతల్ అనగా ఎవరు ! జ్ఞాతుడు కాని వాడు. అనగా 'జ్ఞాతత్వములకు ' అతీతుడై న వాడు! అటువంటి అతిధి మన మీద ఎప్పుడూ కినుక వహించి కామెంటు చెళ్ళు మని కొట్టును! అది అజ్ఞాత జన్మ హక్కు !
ఈ జన్మ హక్కును పరి పరివిధాల మనం తెగ్గోస్తున్నాం. ఇది చాలా బాధా కరమైన, చింతించ వలసిన విషయం మరి!
ఆయ్ జిలేబి, మా టపా మా బలాగు, మా ఇష్టం. అజ్నాతలు అల్లా టప్పా కామెంటులు కొట్టే రంటే 'ఖబడ్దార్' జాన్తా నహీ ! సవాలే సవాల్ ! వాళ్ళని చీల్చి చెండా డు తాం అంటారా ? బలాగు అయ్యలారా, అమ్మ లారా మరో మారు సావకాశం గా ఆలోచించండి!
మన బలాగు లోకం లో అన్నీ తెలిసిన వాళ్ళు మన టపా లని చదివి ము ము నగవు లేకుంటే వః వహ అనుకుని అట్లే వెళ్లి పోతారు. వాళ్ళు మన టపా చదివేరా, లేకుంటే వారికి నచ్చిందా (ofcourse, you know I write for my satisfaction, yet you know.... I like to know if you liked you know...!) అన్న విషయం మనకు తెలీకుండా పోయి మనం ప్చ్, మన టపా కి ఇంతే రెస్పాన్స్ అనుకుంటాం.
అప్పుడు తటాల్మని విద్యుల్లత లా , ఆకాశం లో మెరిసే తారలా ఓ అజ్ఞాత వచ్చి ఓ కామెంటు కొట్టి వెళ్లి పోతాడు.
మనం ఆ కామెంటు చదివి తలా తోకా అర్థం కాకుండా, ఓరీ వీడి బండ బడ, మనం అంత కనా కష్ట పడి ఓ టపా రాస్తే, ఈ అజ్ఞాత 'ముకడా' వాడు ఇట్లా రాసి పోతా డా అని వాపోయి, 'ఏయ్ , అజ్ఞాతా - దమ్ముంటే నీ నిజ మైన పేరుతో రా... మొనగాడి వైతే, సత్తా ఉన్న వాడి వైతే నీ ముకడా తెరూ అంటాం!
జవాబు ఉండదు. సైలెంట్! మనం రేయనక పగలనక పది నిమిషాలకో మారు మన టపా చూస్తాం. వచ్చాడా వచ్చాడా ఆ అజ్ఞాత ముకడా వాడు ? ఎక్కడి వాడు ? ఏమి రాసాడు రిప్లై ? ప్చ్ జవాబు ఉండదు.
ఆ అజ్ఞాత ముకడా వాడు మరో టపా కి వెళ్లి అక్కడో కామెంటు కొట్టి వెళ్లి పోయుంటాడు ఈ మధ్య లో.
ఇక చూడండి, 'వ్యాఖ్యల పేచీ యే మరి తండో ప తండం గా! హారం లో రంజు గా అజ్ఞాతల కామెంటు వరదలు పొంగి పొరలును!
ఈ అనా నీ మస్సు ల కి అందుకే మనం సరిఅయిన విలువ ఇచ్చి గౌరవం ఇచ్చి వాళ్ళని మన అక్కున జేర్చుకుని వాడి కోసం కాకుంటే ఆవిడ కోసం నేను ఒక టపా అంకితం ఇచ్చి వాళ్ళని 'నైసు ' చేసుకో దలచుకున్నా !
'అన్నా' నీ మనసు తెలీక తప్పిదములు చేయుచున్నాము !
నీవు జ్ఞాత తత్వములకు అతీతుడవు !
నీవు ఇందు గలడందు లేవని లేదు !
ఎందెందు వెతికినా నువ్వు గలవు.
పూర్వ కాలం లో నిన్ను 'ఆకాశ రామన్న' అనెడి వారు.
ఈ కాలం లో నువ్వు 'అనానీ' మస్ వాడి వై పోయేవు.
అన్నా , నీ మనసు తెలీక నిన్ను గౌరవించాలని తెలీని వాళ్ళం.
కరుణించు దేవా ఆకాశ రామన్న!
చీర్స్
జిలేబి.

:))
ReplyDeleteఅజ్ఞాతలకు మీ టపాల్లో కామెంటే అవకాశం ఇవ్వట్లేరు.. ఎంత ధైర్యం మీకు..ఆయ్..
ReplyDelete