'ఇచ్చట ఫ్యామిలీ అద్దెకు ఇవ్వబడును ' అన్న బోర్డు చూసి ఆ నాజూకు అమ్మాయి లోపలికి వచ్చింది.
'ఎస్ మేడం , హౌ కేన్ ఐ హెల్ప్ యు ' అంది అక్కడ కూర్చున్న కోమలాంగి.
'నాకో ఫ్యామలీ అద్దెకు కావాలి' చాలా క్యాషువల్ గా చెప్పింది నాజూకు అమ్మాయి.
కోమలాంగి తన దగ్గరున్న ఫ్యామలీ ఆల్బమ్స్ చూపించింది.
'ఎన్ని రోజులకి కావాలండీ అద్దెకు?'
జస్ట్ ఫార్ వీక్ ఎండ్
వీక్ ఎండ్ చాలా ఎక్స్పెంసివ్ వీక్ డేస్ అయితే కాస్తా చవక' చెప్పింది కోమలాంగి.
ఓ ఐసీ. నో ప్రాబ్లెమ్. నాకు వీక్ ఎండ్ కే కావాలి
ఓకే. స్పెసిఫికేషన్ చెప్పండి. ఫ్యామలీ లో ఎంత మంది ఉండాలి ?
నాజూకు అమ్మాయి చెప్పడం మొదలెట్టింది.
వీక్ ఎండ్ రెండు రోజులకి కావాలి. ఫ్యామలీ లో పేరెంట్స్, గ్రేండ్ పేరెంట్స్, మావయ్యల ఫ్యామలీ రెండు, అత్తయ్య ఫ్యామలీ ఒకటి, అక్కయ్యా వాళ్ళు నలుగురు, అన్నయ్యా వదినలు ఇద్దరు'
హబ్బీ ఏమైనా..... ??? కోమలాంగి ప్రశ్నార్థకం గా ఆగింది.' హబ్బీ ఎమన్నా కావాలా? అడుగుదాని అనుకుని.
'నో నో ... నో హబ్బీ. .. ఐ యాం డేటింగ్... కాబోయే అతని కోసం ఫ్యామలీ పరిచయం చేద్దామని అంతే !' చెప్పింది కోమలాంగి.
ఓహ్... నో ప్రాబ్లం... ఇది మా బిల్లు పూర్తి రొక్కం కట్టి వెళ్ళండి. మీరు చెప్పిన అడ్రెస్స్లో మీ ఫ్యామలీ మీరు చెప్పిన డేట్స్ కి వచ్చేస్తారు' చెప్పింది కోమలాంగి.
వాళ్లకి ఏమైనా టిప్స్ వగైరా...?
నో మేడం ! ఆల్ సర్విస్ చార్జెస్ కలిపే మా సర్విస్' చెప్పింది కోమలాంగి.
నాజూకు అమ్మాయి తృప్తి గా తలపంకించి షాప్ నించి బయటకు పడి కారు ఎక్కింది. !
కొంత సేపట్లో నే మరో యువకుడు వచ్చి, 'హల్లో - నాకో ఫ్యామలీ అద్దెకు కావాలి!' చెప్పాడు. యు నో ఐ యాం డేటింగ్ ఏ గర్ల్'
ఎస్ సర్... మీ ఫ్యామలీ సైజు వగైరా చెప్పండి' ఈ లిస్టు చూడండి ఉజ్జాయింపుకి - జస్ట్ ఇప్పుడే కస్టమైజ్ చేసాం మరో కస్టమర్ కి... మీకు సూట్ అయితే అట్లాగే తీసేసు కోవచ్చు. అఫ్కోర్స్ మీరు మీ చాయిస్ ఇంకా మార్చు కోవచ్చు కూడా' చెప్పింది నాజూకు అమ్మాయి..
ఆ వీక్ ఎండ్ లో....
నాజూకు అమ్మాయి, ఆ యువకుడు కలిసి తమ తమ ఫ్యామలీ తో ఫోటో లో దిగ బడ్డారు!...
'డార్లింగ్... we can get married... we have established our family!' చెప్పాడా అబ్బాయి.
ఎస్. సంతృప్తి గా చెప్పింది అమ్మాయి కూడా...
చీర్స్
జిలేబి.
:) :)
ReplyDeleteఉందిలే .. ఇటువంటి కాలం ముందు ముందునా!!
వనజ వనమాలీ గారు,
Deleteమీరూ ఉందిలే అంటే మరి నేను కాదంటా నా !
జిలేబి.
ఎస్కార్టులు ఉన్న కాలంలో ఫామిలీ ఎస్కార్టులు రాకుండా ఉంటాయా.
ReplyDeleteRao S Lakkaraju గారు,
Deleteఅంతే కదా మరి ? ఫ్యామలీ లు తక్కువై పోతున్నప్పుడు ఇక అరువు తెచ్చు కున్న ఫ్యామలీ ల తో టే మనం సర్దుకు పోవాలి కామోసు !
జిలేబి.
అవును ఇలాంటి ముదనష్టపు కాలం ఉంటుంది
ReplyDeleteబుద్దా మురళి గారు,
Deleteఅంతే నంటా రా !
జిలేబి.
రెండు నిమిషాల బంధువుల మార్పు?
ReplyDeleteగెల్లి గారు,
Deleteరెండు నిముషాల అద్దె బంధువుల తో ఫోటో ప్రహసనం! అంతే !
ఆ పై ఎవరికీ వారే disjointed ఫ్యామలీ నగరే !
జిలేబి.
బాగా చెప్పారు.ఎదుటి వాల్లను మోసం చేసున్నామని తమను తాము మోసం చేసుకుంటున్నారు,ఇప్పటి యువత.ఈ ట్రెండ్ ఇప్పటికే మొదలైనట్లుంది.
ReplyDeleteరమణా రెడ్డి గారు,
Deleteఇక్కడ మోసం అన్నదానికి తావు లేదేమో అనుకుంటా. మారుతున్న కాల వ్యవస్థ లో, 'ధనం మూలం ఇదం జగత్తు లో extended ఫ్యామలీ లు గట్రా ఇక జమానా మరిచి పోయి, ఇట్లా అద్దెకు తెచ్చు కున్న వాటి తో నే సర్దుకు పోతారేమో మరి ! అంతే
జిలేబి.
ఆ నాజూకు అమ్మాయి, అ యువకుడూ - ఇద్దరూ అనాథలా?
ReplyDeleteతెలుగు భావాలు గారు,
Deleteఅనాధలు కాదను కొండీ! కాని లేని ఫ్యామలీ ని ఎట్లా తెచ్చి మనకూ ఫ్యామలీ ఉంది సుమా అని చెప్పుకోవడం మరి ? అంతే అనుకుంటా !
జిలేబి.
good story... may turn to a pathetic realty soon
ReplyDeleteపురాణ పండ ఫణి గారు,
Deleteఏమో ! ఆ కాలం మునుమునుపు ఇక ఇట్లా గే ఉంటుం దేమో మరి !!
జిలేబి.
ఇది కూడా చూడాలా మేము?
ReplyDelete