ఇక మీదట నా బ్లాగులో కామెంట్లు బంద్ !
ఏమోయ్ జిలేబి మరీ నీరసం గా 'మొగం' గట్లా వేలాడదీసుకుని ఆ 'లయపు' టాపు మందు అట్లా బేజారు గా కూర్చొని ఉండావు ? మా అయ్యరు ప్రశ్నించేరు .
హూ అన్నా
ఏమిటో మళ్ళీ నీ కొచ్చిన ప్రాబ్లం ? అయ్యరు పృచ్చ !
ఇక మీదట నా బ్లాగు కి కామెంట్లు బంద్ అన్న టపా పెట్టే సా నండీ చెప్పా 'గద్గమైన డక్కుత్తిక తో కంట్లో నీళ్ళు సుడి తిరుగు తుంటే మా అయ్యరు గారి కంట కనపడ కుండా దాచేస్తో .
హ హా హా అంటూ లయపు టాపు అదిరి పోయేటట్టు మా అయ్యరు గారు నవ్వేరు .
జిలేబి , ఆ మధ్య బ్లాగు బందు . నో మోర్ టపాలు అంటూ ఓ టపా పెట్టేవు !
ఆ పై వంద గంటలు కూడా గడవ క ముందే , నీ దురదస్య దురదః జిలేబి నామ్యా దురదః అంటూ టపా మళ్ళీ రీ ఓపెన్ చేసేవు .
మరి ఈ సరి కొత్త ట్విస్టు ఏమిటి ?
నువ్వు పాటి కి టపాలు రాస్తా ఉంటావు - అంటే , నీకు అనిపించిన జాతకాల పరిశీల న లని, నీకు అనిపించిన 'రాబోయే కాలం లో (అది ఎప్పుడు వస్తుందో మరి ఎవరికెరుక!) వచ్చే సో కాల్డ్ 'ప్రళయాల్ని, నీకు మరీ దురద ఎక్కువైతే , బాల్చీ తన్నిన వాళ్ళ జాతకాలని తిరగదోడి మరో మారు వాళ్లకి టపా కడతావు !
తోచిన చెత్త ని, నీకు తోచిన సో కాల్డ్ 'వచన' కవితల్ని, 'ఏక' వాక్య కవితల్ని (కొన్ని రోజులు పోతే ఏక పద కవితల్ కూడా రాస్తా వేమో మరి ! ఆ పై ఏకాక్షర కవిత యే ఇక బాకీ!) జనాల మీద ద్రోలి , వాళ్ళు నీ టపాల వాడి కి, వేడికి, 'మోడీ'కి , తల బొప్పి పెడితే , నిన్ను ఓ ఝాడూ లాగిడ్డామంటే , ఆయ్ నా బ్లాగు లో ఓన్లీ 'టపాస్' నో 'కారా మింటు' అంటా నంటే జనాలు ఊరు కుంటారా !
నాకు సంతోషం వేసింది. హమ్మయ్య ! అయ్యరు గారు ఈ కామెంట్ బంద్ కి ఒప్పుకోక పోవడం తో నాకు మరీ సంతోషం వేసింది ! ఎక్కడ అయ్యరు గారు ఓకే జిలేబి టపాలు కట్టు కామెంట్లు బంద్ జేసుకో అనేస్తే ఇక నా పరిస్థితి ఏమయ్యేది ! కామెంటడం ఒక కళ ! ఆ కామెంట్ల లో ఎన్నెన్ని చమత్కారాలు, చమక్కులు, కొండొకచో 'వాతలు' , బ్లడ్ ప్రెషర్ పెంపొందించే తూట్లు ! అబ్బ, ఫ్రీ గా బ్లడ్ ఇట్లా సర్కులేషన్ అయ్యే ఏకైక ఎక్సేర్సైజ్ ఇదియే కదా ఇవన్నీ వదులు కోవాలంటే ఇక మరి ఎట్లా !
అంతే నంటారా అయ్యరువాళ్ ! కామెంటు బందు చెయ్య వద్దంటా రా ! ఈ మారు కళ్ళ లో (కనిపించని కళ్ళ లో !) వెయ్యి వాట్ల బల్బు వెలుగు తూంటే అడిగా !
మరి జిలేబి, నేను బందు చేయి, అన్నా ఏం చేసి ఉండే దానివి ? ఓ రెండు రోజులు బందు చేసి ఆ పై రాబందు లా మళ్ళీ ఆ కామెంట్ల మెతుకుల కి ఆశ పడి మళ్ళీ కామెంటు ఓపెన్ చేసే దానివి అంతే కదా ! ఆ పాటి దానికి ఇంత హైరానా పడడ మెందు కోయ్ !
హమ్మయ్య !
కామెంటడం ఒక కళ ! రండి , అందరం అందర్నీ ప్రోత్సహిద్దాం !
చీర్స్
జిలేబి