రావి శాస్త్రి వారి - నల్ల మేక - జూలు విదిలించిన జిలేబి 'సింగం' !!
కౌరవ సైన్యాన్ని చూసిన ఉత్తర కుమారుడు రథం మీంచి గభీ మని గెంతి నట్టుగా, జీవహింస చేయాలనే కృత నిశ్చయం తో వస్తోన్న తోటమాలీ ని దగ్గరగా రానిచ్చి గోడమీంచి చెంగున రోడ్డు మీదికి ఉరికింది నల్లటి కుర్ర మేక.
తోట గల ఆసామీ తోట చుట్టూ దిట్టంగా ఎత్తుగా గోడ కట్టుకున్నాడు. కాని ఆ గోడకి ఒక చోట ఒక వార మునిసిపల్ చెత్త డబ్బా ఉంది . సరిగ్గా అక్కడే ఆ గోడకి ఒక ఇటిక జారింది . ఈ రెండు భోగట్టాలూ తోట గల ఆసామీ గమనించ లేదు .
నల్ల మేక గమనించింది.
నిచ్చన వేసుకొని స్వర్గానికి వెళ్ళినట్టుగా, చెత్త డబ్బానీ, ఇటిక జారిన సందుని ఆధారం చేసుకుని తోట గోడ ఎక్కింది నల్ల మేక .
పేరుకి పిట్ట గోడే కాని, నిజానికి ఆ గోడ చాలా ఎత్తుగా ఉంది. లోనికి గెంతుతే మళ్ళీ పైకి రాడానికి అటు వైపు చెత్త డబ్బాలూ, జారిన ఇటుకలూ లేవు. అందు చేత గోడ మీదనే నిల్చొని ,
"ఈ మనుష్యులు గడుసు వెధవలు " అనుకొంది నల్ల మేక.
నల్ల మేకం భారతం చదవలేదు. హరికథ లైనా వినలేదు. అందుచేత అది ఎరుగదు, గడుసు తనం లేని కుర్రవాడు అభిమన్యుడని ఒకడుండేవాడని .
మేకల్లో అభిమన్యుడి వంటి ది కా దీ మేక .
పద్మ వ్యూహం లా ఉండే ఆ తోటలో ప్రవేశిస్తే మళ్ళీ బైటికి రావడం కష్టమని గుర్తించిన నల్ల మేక , గోడ మీదనే నిల్చొని పస్తాయించి చూసింది
పూర్తి గా ....
చీర్స్
జిలేబి