శ్రీ వారి "సెల్ఫీ" సేవ !
శ్రీ మన్మధ నామ సవంత్సరే
దక్షిణాయనే వర్ష ఋతౌ
శ్రావణ మాసే శుక్ల పక్షే
....
విచ్చేసిన వారందరికీ శుభోదయం. ఈ కళ్యాణ సేవ తదుపరి స్వామీ వారితో సెల్ఫీ సేవ ప్రారంభ మగుతుంది .
మీ మీ మోబైళ్ళ తో పద్మావతీ మంగ తాయారు సమేత స్వామీ వారితో సెల్ఫీ దిగాలనుకున్న వాళ్ళందరూ తలో వెయ్యిన్నూట పదహార్లు కౌంటర్లో చెల్లించి రశీదు పుచ్చుకోవాల్సిందని మనవి .
ఏడుకొండల వాడా వెంకటరమణా గోవిందా గోవిందా అంటూ భక్త జనవాహిని కౌంటరు మీద పడింది .
కౌంటరు కలెక్షను మొదలయ్యింది :)
ఆ హా ఒకా నొక కాలం లో మీ మోబైళ్ళు కి నో ఎంట్రీ . ఆ పై స్విచ్ ఆఫ్ మోడ్ ; ఆ పై సైలెంట్ మోడ్ ;
The current trend is "selfie" mode :) Mod "I" ndia :)
స్వామీ వారు , అమ్మ వారలు కూడా మరింత సింగారించు కునేరు. సెల్ఫీ లో మనం బాగా కనబడాలి కదా మరి :
స్వామీ వారి తో సెల్ఫీ దిగండి . మీ జీవితాన్ని శుభకరం గా మలచు కోండి .
మీకు మొబైలు లేదా ? no problem.
పక్కనే సామ్సంగ్ వారు 'స్వామి సంఘ్' అనే సరికొత్త మేడ్ ఇన్ ఇండియా 'ఇండీ' మొబైల్ షాప్ కూడా తరిచేరు . అందులో కొనుక్కోవచ్చు . స్టేటు బ్యాంకు వారి పన్నెండు నెలల ఇంట్రెస్ట్ ఫ్రీ ఇంస్టాల్ మెంట్ ఆఫర్ కూడా ఉంది .
అట్లాగే ఐఫోన్ వారి 'ఐపద్మిని' అనే సరి కొత్త ఇండీ మొబైల్ కూడా ఉందండోయ్ .
ఆఫర్ ఆఫర్ ఆఫర్ !
బై ఒన్ గెట్ ఒన్ ఫ్రీ మేడ్ ఇన్ ఇండియా మోబైళ్ళు కూడా ఉంది
ఆలశించిన ఆశా భంగం. భలే మంచి చౌక బేరం
రారండోయ్ రారండోయ్
పిల్లా జెల్లా రారండోయ్ !
శుభోదయం
చీర్స్
జిలేబి
(Mod "I" ndia )