ఫ్లాష్ ! ఫ్లాష్ ! అతి త్వరలో కష్టే ఫలే కబుర్లు ధారావాహిక !
గురుడు కన్యారాశి లో ప్రవేశిస్తున్న ఈ శుభ దినాన బ్లాగు లోకపు వారి సౌలభ్యం కోసం ప్రైవేట్ అయిన బ్లాగు నించి కష్టే ఫలే వారి టపాలు జిలేబి బ్లాగు ఓ ఫ్యాన్ ఆర్ట్ విత్ జేకే జిలేబీయం లో ధారా వాహిక గా రాబోతోందని తెలియ జేయడానికి సంతోషిస్తున్నా !
తెలుగు వారి పంచ దశ లోకమనబడు ఈ బ్లాగు లోకం లో కష్టే ఫలే వారి ని వారి టపా మాధుర్యాన్ని తెలియని వాళ్ళు ఉండరని అంటే అతి శయోక్తి కాదు; కాని ఈ మధ్య వారి బ్లాగు సెలెక్టివ్ ఇంటలిజెంషియా వారికి మాత్రమె పరిమిత మై పోవడం తో వారి టపాలని తెలుగు వాళ్ళందరూ చదవడానికి సౌకర్యం లేకుండా పోయింది (ముఖ్యం గా జిలేబి చదవడానికి :))
కాబట్టి వారి టపా మాధుర్యాన్ని గూగల్ సెర్చ్ లో మళ్ళీ కనబడేలా చేయడానికి ఈ పునర్బ్లాగీకరణం చేయడం జరుగుతోంది; వారి పేరు మీదనే ఈ టపాలన్నీ ప్రచురించ బడతాయి ;
అందరికి ఉపయోగ పడుతందని ఆశిస్తో !
మొదటి టపా కై ఓ ఫ్యాన్ ఆర్ట్ విత్ జేకే జిలేబీయం లో వచ్చిన టపా !
— శర్మ కాలక్షేపం కబుర్లు—
Posted on సెప్టెంబర్ 23, 2011
గురు, దైవ వందనం
కన్న తల్లి తండ్రులకు సాష్టాంగ దండ ప్రణామాలు. పెంచిన తల్లి తండ్రులకు సాష్టాంగ దండ ప్రణామాలు.
అడుక్కునైనా చదువుకోమన్న శ్రీ దేవరభట్ల రామా రావు గారికి నమస్కారాలు. శ్రీ. చెఱుకుపల్లి హనుమత్ కవిరాట్ లక్ష్మణశాస్త్రిగారికి, జోస్యుల వేకట నరసింహంగారికి, సమయపాలన నేర్పిన వర్రె అప్పలరాజు మాస్టరికి, తెలుగు మాస్టారు సుబ్రహ్మణ్యంగారికి, జాన్ మాస్టారికి వందనములు.
నేటి కాలంలో బోధగురువులు శ్రీచాగంటి కోటేశ్వర రావుగారికి నమస్కారం. తెలుగు వ్రాయడానికి తన బ్లాగు ద్వారా సహకారం అందించిన శ్రీభైరవభట్ల కామేశ్వర రావు గారికి నమస్కారం. నాలుగు తెలుగు అక్షరాలు తప్పులేకుండా వ్రాయడం వచ్చినంతనే బ్లాగు వ్రాయమని ప్రొత్సహించిన భమిడిపాటి ఫణిబాబుగారికి వందనం. ఏందరో మహానుభావులు అందరికీ వందనం.
పూర్తి గా చదవడానికి రాబోవు టపాలు చదవడానికి ఈ లింకు నొక్కవలె
శుభోదయం
జిలేబి