మకుటా రామ - వయాంగ్ కులిత్ - Legacy of Rama's Crown-భాగం - 5
(పతేట్ సంఘ)
పన్నెండు-పదిహేనవ అంకం
అర్జునిడి ప్రవేశం అడవి లో; అతని తో బాటు బాదరాయణుడు, బాదరాయుని సంతానం ;
అర్జునినికి గల వివిధ పేర్లు వీరి ప్రకారం(మనకు తెలీనివి) -జనక, కుంబలవలి, పమది, జాహ్నవి, విభత్సు, కుంతది (కుంతీ పుత్రా?) ; పాండుసివి ;
విభీషణుడి ని వీడిన మదలోభ మాత్సర్యాలు అర్జునిని ప్రేరేపిస్తాయి; వాటి ప్రేరేపణ లకు తావివ్వకుండా అర్జునుడు వాటి తో పోరాడి బాదరాయుని సలహా తో వాటిని అగ్ని అస్త్రం గా ప్రయోగించి దగ్ధం చేస్తాడు.
పదహారవ అంకం
నారదుని ప్రవేశం; శోకతప్త యైన సెంబద్ర (సుభద్ర) ; అర్జునిని జాడ తెలియక ఉండటం; నారదుల వారి ని సలహా అడగటం; తన భర్త మళ్ళీ మాయ మయ్యాడు అంటే మళ్ళీ ఎవరినైనా ప్రేమించి పెళ్లి చేసుకుని రావటానికి వెళ్ళాడేమో అని విచార పడటం; నారదుల వారు కారణ మది కాదని రామ మకుటం కోసం పార్థుడు వెళ్ళా డని చెప్పటం; సెంబద్ర తానూ అర్జునిని కలవాలని చెప్పటం తో, నారదుల వారు సెంబద్ర ని మగ వాని గా మార్చి బంబాంగ్ సింతవక అన్న పేరు పెట్టడటం; దుర్యాపుర అరణ్య ప్రాంతాలలో అర్జునిని వెదక మని సెంబద్ర తో చెప్పటం !
పతేట్ మన్యుర
పదిహేడవ అంకం
బంబాంగ్ సింతవక అర్జునిని వెతుకుతూ వెళ్ళటం; దారిలో గ్రామాల వర్ణన
పదినెనిమిదవ అంకం
ధర్మరాజు సభ; వెళ్లి న అర్జునిడి జాడ ఇంకా తెలియటం లేదు; అజాత శత్రువు (ధర్మజుడు) చింతాక్రాంతుడవటం; భీముని నకులుని పిలిచి వాళ్ళ అభిప్రాయాలనడగటం; అర్జునిని వెతుకుతూ భీముని వెళ్ళ మనటం;
పందొమ్మిద వ అంకం
భీముని వర్ణన; అతని వస్త్రముల వర్ణన; అతని బలము ఎట్లాంటిదో చెప్పటం; భీముడు అర్జునిని వెతుకుతూ వెళ్ళటం;
ఇరవై వ అంకం
సింతవక ఘటోత్కచుని అడవి లో కలవటం; వీళ్లద్దరి మధ్య సంభాషణ; తాను సింతవక అని చెప్పటం; ఘటోత్కచుడు అర్జునిని జాడ సింతవక కి తెలుసా అని ఆడగటం; సింత వక ఘటోత్కచుడు తన శిష్యుడైతే చెబ్తాననటం; ఘటోత్కచుడు కోపగించ టం; వీళ్ళ యిద్దరి మధ్యా యుద్ధం; సింత వక గెలవటం; ఘటోత్కచుడు సింత వక శిష్యుడు గా ఒప్పేసు కోవటం; యిద్దరూ కలిసి అర్జునిని వెతక టానికి నిష్క్రమణ .
ఇరవై ఒకటవ అంకం
అర్జునిని ప్రవేశం; మహంబీర (గరుడుడు ) అర్జునిని కయ్యానికి కాలు దువ్వటం; అర్జునుడు తాను వర సిద్ధి కై వచ్చానని ఇట్లా తన శక్తిని గరుడు ని తో పోట్లాట కి యుప యోగించ ననటం; గరుడుడు నిష్క్రమణ; కువర (సర్పము) , సితుబంద (ఏనుగు) అర్జునిని పై కి రావటం; అర్జునుడు యోగ ముద్రలో కి వెళ్ళటం; అతని నించి ఒక వింత కాంతి వచ్చి వీళ్ళ యిద్దరిని ఓడించటం;
బాదరాయణుడు అర్జునిని తో శిఖరం ఎక్కేటప్పుడు గాలి వాటం మనకే ఎప్పుడూ ఉండదు; మనం గమనిక తో ఉండాలని ఉద్బోధ చేయటం;
ఇరవై రెండవ అంకం
కేశవ సిద్ధి ఆశ్రమ వాటిక; కుంభకర్ణుడు ప్రవేశం; కేశవ సిద్ధి తేజస్సు విభీషణుడు తేజస్సు పోలి ఉందని కేశవ సిద్ధి ని తనకు మోక్షం ప్రసాదించా లని కోరటం; కేశవ సిద్ధి ఉపదేశం; రాక్షసుడై నా, దేవత లైనా మంచి అన్నది చేయక పోతే దాని పరిణామాలని ఎదుర్కోవలసి వస్తుందని చెప్పటం; ఆ పై కుంభ కర్ణుని అడవి లో కి వెళ్లి ఒక తేజోవంత మైన మనిషి కనడతాడు అతని ద్వారా నీకు మోక్ష ప్రాప్తి కలుగుతుందని చెప్పటం; కుంభ కర్ణుని నిష్క్రమణ.
హనుమంతుల వారి ప్రవేశం; తాను కర్ణుని ఎదిరించి విజయ ధను తెచ్చానని చెప్పటం; ఈ విజయ ధను నిజంగా పాండవ మధ్యముని కి చెందాల్సిందని కాని కర్ణుడు దాన్ని కాజేసాడని చెప్పటం ; అందుకనే కర్ణుని ఓడించి ఈ ధను తెచ్చా నని చెప్పటం; దీన్ని అర్జునినికి ఇద్దా మనటం;
కేశవసిద్ధి హనుమంతుల వార్ని మృదువుగా హెచ్చరించటం; తను తపస్వి ఇట్లాంటి పనులు చేయకుండా యుండాల్సిందని అనటం; మళ్ళీ వెళ్లి తపస్సు చేసుకోమని చెప్పటం; హనుమంతు ల వారి నిష్క్రమణ .
అర్జునిని ప్రవేశం; కేశవ సిద్ధి తేజస్సు చూసి తనే రామ మకుటాన్ని ఇవ్వ గలవాడన్న నిర్ధారణ కి రావటం; ఆ మాటే చెబ్తే కేశవ సిద్ది ఔనని, అర్జునిని పరీక్షిస్తాడు. విజయ ధను ని యిచ్చి యిదే తీసుకు పొమ్మంటాడు;
అర్జునుడు విజయధను ని గుర్తించి యిది తనది కాదని దాన్ని తాను తాకనని; యుద్ధం లో ఎవరైనా దాన్నెక్కు పెట్టి , యుద్ధం లో ఓడితే చావనన్న చస్తా కాని దాన్ని తీసుకోనని చెప్పటం; అది కర్ణుడిదని చెప్పటం;
కేశవ సిద్ధి అర్జునిని నిబద్ద త కి సంతోషించి రామ మకుటాన్ని బోధిస్తాననటం;
కేశవ సిద్ధి 'హస్త బ్రత' (అష్ట వ్రత ) -రామ మకుట బోధన - అర్జునిని కి దాన్ని అందించటానికి మొదలు పెడతాడు ;
హస్త బ్రత (అష్ట వ్రత!)
సశేషం