Tuesday, October 18, 2016

మకుటా రామ - వయాంగ్ కులిత్ - Legacy of Rama's Crown-భాగం - 2

 
మకుటా రామ - వయాంగ్ కులిత్ - Legacy of Rama's Crown-భాగం - 2


మొదటి అంకం

క ఏక అధి దశ పూర్వ ? అంటూ ఈ అంకం మొదలవు తుంది. శూన్యం నించి ఆవిర్భవించింది అంతా అంటూ మొదలయి హస్తిన వర్ణన  ఉంటుంది. విశేషం ఏమిటంటే హస్తిన కి నౌకా తీరం ఉండటం !  (జావా ద్వీపం కాబట్టి హస్తిన క్కూడా తీరం వచ్చి ఉండ వచ్చు).

దుర్యోధన, ద్రోణ, సంగ్కుని, కార్తమరామ ల మధ్య సంభాషణ - టూకీ గా - దుర్యోధనునికి వచ్చిన కలలో దేవతలు శ్రీ రాముల వారి మకుటాన్ని - వారి పరిపాలనా దక్షత సిద్దాంతాన్ని ఈ భారత కాలం లో ప్రసాదించ డానికి ఒక తపస్వి వేచి ఉన్నాడు. ఎవరికైతే అర్హత ఉన్నదో వారికది లభ్యం అవుతుందని కల. ఈ విషయమై, మిగిలిన వాళ్ళ అభిప్రాయాలని కోరడానికి దుర్యోధనుడు ద్రోణుని మొదట తన అభిప్రాయం అడుగుతాడు.

ద్రోణుడు కూడా తానూ అట్లాంటి విషయం గురించి విని ఉన్నాడని ఆనతి కాలం లో నే ఇట్లాంటి వరమివ్వడం జరుగుతుందని దానికై ఎవరికైతే అర్హత ఉన్నదో వారి కి అది లభ్యమవు తుందని అంటాడు.

అట్లాంటి వరాన్ని ఎట్లా పొందడం ఎట్లా దాన్ని కాపాడు కోవడం అని సంగ్కుని అడగటం దానికి జవాబు గా ద్రోణుడు వరమంటే ఏమిటి అని చెప్పడం తో సంగ్కుని అడుగుతాడు కౌరవుల కి దాన్ని పొందే అర్హత ఉందా అని.

దానికి సమాధానం గా ద్రోణుడు తాను విన్నది 'సంబివర' వ్యాపారులు (దేశాటనం చేస్త్తూ వ్యాపారం చేసు కునే వాళ్ళు ?) అనుకుంటున్నది చెబ్తాడు - పాండవ మధ్యముడు 'జనకుడు', తన దేశమైన (ఇలాకా ? ) మధుకర ని వీడి  ఏదో యాత్ర కి బయలు దేరాడని, జనకుడు యాత్రకి బయలు దేరితే ఖచ్చితం గా అది ఇట్లాంటి ఏదో వరం కోసమే అయ్యుంటుందని అంటాడు .

ఆ పై మరో సంభాషణ సంగ్కుని కి ద్రోణుని కి మధ్య - జనకుడు ప్రయత్నిస్తున్నాడు అంటే అది మనకు దక్కడం కష్ట మేమో అన్న సందేహానికి , ప్రయత్నం ఉంటే మానవుడు దేన్నైనా సాధించ గలుగు తాడు అంటూ ద్రోణుడు సుదీర్ఘ వివరణ ఇస్తాడు - > సూక్ష్మం గా -> కర్మ సిద్దాంతం; శరణాగతి; 

ఈ ఉద్బోధ విన్నాక దుర్యోధనుడు తను ఆ ప్రయత్నం చేస్తా నంటే, సంగ్కుని రాజకీయ చతురుడు దుర్యోధనుడు కాకుండా వేరే ఎవరైనా అర్జునుని కి సమ ఉజ్జీ వెళ్ళా లని అంటాడు ( దుర్యోధనుడు వెళ్లి పరాభవం చెందితే అది బాగోదు - రాజకీయ చతురత ).

అర్జునిని సమ ఉజ్జీ ఐన బసుకర్ణ ని పంపించాలని నిర్ణయం జరుగుతుంది.

రెండవ అంకం -

ఈ రెండవ అంకం లో కర్ణుడు దుర్యోధన సంభాషణ - దుర్యాపుర అరణ్య ప్రాంతం లో కుంతరుంగు పర్వత శ్రేణి లో శ్వేల గిరి (శ్వేత గిరి? ) ముని వాటిక లో కేశవ సిద్ధి మౌని రాముని మకుటాన్ని ఈ తరానికి చేర్చటానికి వేచి ఉన్నాడు.

కర్ణుడు వెళ్లి ఆ వరాన్ని పొంది రావాలి. కర్ణుడు తాను దుర్యోధనుడి సేవకుడనై ఆ కార్యాన్ని సాధించు కొని వస్తా నంటాడు.

ఈ మొదటి అంకం లో వచ్చిన ఒక సులుకోన్ (శ్లోకం ) -  బానువతి - దుర్యోధనులు వనం లో సేద దీరుతున్నా రన్న అర్థం లో ఉన్నది . (కథకి సులుకోన్ కి సంబంధం ఉండదు).

ఛందం - శార్దూల విక్రీడితం - సంస్కృత + పురాతన జావా కలయిక; కొన్ని పదాలు అర్థ మవుతాయి ; కొన్ని కాలేదు; చదివింది ఆంగ్లం లో ; కాబట్టి ఛందస్సు సాఫ్ట్వేర్ ని బట్టి  పరిష్కరించింది (తప్పొప్పులు ఉండ వచ్చు );

ఇది భారత యుద్ధ అన్న జావా భారత కథ - Canto V, Verse 1- (1157- CE of King Jayabaya Kediri కాలం నాటిదట ఈ భారత యుద్ధ అన్న గ్రంథం ) నించి సంగ్రహింప బడినది.


శార్దూల విక్రీడితం (లంపా 19 )

లెంగ్ లెంగ్ రమ్యనికం శశాంక కుమెనీర్మంగ్రెంఘరూమింగ్పురీ !
మంగ్కిన్ తన్ పసిరింఘ్ హలేప్ని కయుమా మస్ లిర్ మురుబ్ యింగ్లఘిత్
తేక్వన్ సర్వ మణీక్ తవింజ్ఞ సినవుంగ్సాక్షాత్సెకార్సీనుజీ
ఉంగ్యాన్ బానువతీ వనాంరె మలెగెన్ లన్ నాథ దుర్యోధనా !
 


ఆంగ్లం లో చదివినది - మీకు వేరే ఏదయినా స్ఫురిస్తే తెలియ జేయ గలరు !


Leng-leng ramya ningkang sasangka kumenyar mangrengga ruming puri
Mangkin tanpa siring halep nikang umah mas lir murub ing langit
Tekwan sarvwa manik tawingenya sinawung saksat sekar sinuji ;
Unggyan Banuwati, ywan amrem alengen, lan Nata Duryudana

Lagu Sardoola Wikridhita (lampha 19) form
From Baratayuda (canto V, verse1), a kekawin poem in Old Jawanese by mpu Sedhah and mpu Panuluh
circa 1157, era of King Jayabaya Kediri.

Meaning- The moon's enchanting radiance so enhanced the splendor of the palace, that the golden pavilion which seemed to flare into the sky was now quite beyond compare. Its walls, moreover, were formed of various jewels strung together like embroidered flowers.  It was here that Banuwati and King Duryudana lay sleeping, enraptured by love.


(సశేషం) 

2 comments:

  1. ఏమిటి, మీరేనా? వావ్. కానీయండి.

    ReplyDelete