సమస్య - 5006
-
18-1-2025 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కుమతులు మాత్రమె వసింత్రు గుంటూరు పురిన్”
(లేదా...)
“కుమతుల్ మాత్రమె వాసముందురు గదా గుంటూ...
13 hours ago
Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
చాలా తక్కువ పరిమితిలో జరిగిన సైనిక చర్య. ఐనా ప్రాధాన్యం సంతరించుకుంది. కారణాలు, పాక్ కు భారత విదేశీ వ్యవహారాలలో మార్పొ౦చ్చిందని చెప్పడం. దాని మూలంగా పాక్ గంగవెఱ్ఱులెత్తి ప్రపంచ దేశాల దగ్గరకు మద్దతుకోసం పరుగులు పెట్టడం, పాక్ కు ఆర్ధిక దిగ్బంధం ఎలా ఉంటుందో చెప్పడం, నీటి రూపంలో.ఇక ముందు కూడా ఇటువంటివి జరుగుతాయనే హెచ్చరిక ఇవ్వడం, అన్యాపదేశంగా. ప్రపంచ దేశాలలో పాక్ పట్ల ఏకాభిప్రాయం తీసుకురావడం.పొరుగుదేశాలలో పాక్ కి ఉన్న విలువేంటో తెలియజేయడం. సార్క్ దేశాల సదస్సుకు రామని మిగిలినదేశాలు చెప్పడం, ఇది పెద్ద చెంపపెట్టు. చాలా ముఖ్యమైనది చైనా వ్యవహారం. బలూచ్ లో జరుగుతున్న హననాన్ని ప్రచారం చేయడం. బలూచ్ వారికి మద్దతివ్వడం మూలంగా ప్రస్థుతానికైనా చైనా తన అరేబియాకు నిర్మిస్తున్న రోడ్ గురించి పునరాలోచనలో పడటం. ఇక్కడ పని చేసే ఒక చైనీయునికి ఇద్దర్ని కాపలా పెట్టాల్సి వస్తోందట. ఇక వియత్నాం తో భారత్ స్నేహం మూలంగానూ, బలూచ్ మూలంగానూ చైనా పాక్ కి దూరంగా ఉండిపోయింది. స్వప్రయోజనాలే ఏ దేశానికైనా ముఖ్యం. చైనా ను సమస్యకు దూరంగా ఉంచగలగడం పెద్ద విజయం, ఇదంతా దౌత్య విజయం. ఇక మామూలుగా పాక్ కివంత పాడే అమెరికాను దూరం చేయగలగడం మరో విజయం. ఇన్నిటి సందర్భంలో సైనికుల వీరత్వం బాగా రాణించింది. పాక్ కి మానసికంగా పెద్ద దెబ్బ తగిలింది. భారత విదేశాంగ నీతికి జవానుల ధైర్య సాహసాలకు జేజే లు.
ReplyDeleteబయట శత్రువులను సైనికులు చూసుకోగలరు, అంతః శత్రువులతోనే చాలా ఇబ్బందులొస్తాయి, తస్మాత్ జాగ్రత!