Wednesday, October 19, 2016

మకుటా రామ - వయాంగ్ కులిత్ - Legacy of Rama's Crown-భాగం - 3



మకుటా రామ - వయాంగ్ కులిత్ - Legacy of Rama's Crown-భాగం - 3
 
 
మూడవ, నాల్గవ  అంకం
 
దుర్యోధనుడు కర్ణుని పంపించి వేసాక తన అంతః పురం వైపు వెళతాడు. ఇక్కడ అంతః పురం వర్ణన అమోఘం గా కొనసాగుతుంది. కొన్ని విశేషాలు - దుర్యోధనుని వేషధారణ వర్ణన , అతని కిరీట వర్ణన వస్త్రముల వర్ణన మొదలైనవి సవివరం గా ఉంది.  ఆ తరువాయి అంతః పుర వర్ణన అందులో ని వజ్ర వైడూర్యాలు కెంపుల తళుక్కులు ; ద్వారపాలకుల పేరులు - సింగారబల, బలోపేత అను యిద్దరు అసుర రూపం లో  (వీరే స్వర్గ ద్వార పాలకులు కూడా నట ) అంతః పురం లో వెళ్ళటం అక్కడ బానువతి (దుర్యోధనుని భార్య) ఎదురు రాటం;  బానువతి సౌందర్య వర్ణన (మన ఆంధ్ర దేశపు కవులు కుచద్వయములను చంద్రుని తోనూ, మామిడి పండ్ల తో నూ పోలిస్తే, వీళ్ళు మృదు నారీకేళం తో పోల్చడం విశేషం :) ఆ పై దుర్యోధనుడు బానువతి, కుమార్తె లెస్మన వతి సంభాషణ ;
 
 
దుర్యోధనుడు బానువతికి రామ మకుటం గురించి చెప్పడం; యిద్దరూ చేరి దైవ ప్రార్థన చేయడం (ఆ మకుటం తమకు దక్కాలని ); ఆ పై భోజన కార్యక్రమం ( దుర్యోధనుని ఇష్టమైన వంట - సంబెల్ కమెంగి కావాలనటం :) -> యిదేదో జావా వాళ్ళ ఇష్టమైన దేమో !)
 
ఐదవ అంకం
 
దుర్యోధనుని భోజన కార్యక్రమం జరుగుతున్నప్పుడు హాస్య ప్రధాన మైన లింబుక , చంగిక ల సరస సంభాషణ ; వంట అంత రసోస్పూరితం గా ఉన్నదని  దాని మీద చెణుకులు గట్రా;
 
భోజన కార్యక్రమం తరువాయి దుర్యోధనుడు ధ్యానానికి వెళతాడు; నవ నాడుల ని స్తంభింప జేస్తూ, పద్మాసనం లో కూర్చొని ధ్యానానికి వెళ్ళినా మనస్సు సంచలనం ఆగ కుండా ఉండటం ; దాన్ని ఆపి ధ్యాన సూక్ష్మా వస్తకి వెళ్ళటా నికి అతడు ప్రయత్నం చెయ్యడం ; ఆ పై శయనాగారం వెళ్ళటం ; ఈ ఘట్టం లో ఒక అమోఘ మైన సులుకోన్ ఉన్నది - ఆధ్యాత్మిక పరమైన విషయం సంబంధించి; యిది పూర్తి గా జావా భాష లో ఉంది. దాని అనువాదం సుమారు గా -> ధ్యానం ద్వారా హృదయం లోని లోతైన శాంతి ని కనుక్కోగలం అన్నది.
 
ఆరవ అంకం
 
దర్బారు హాలు లో  దుశ్శాసనుని వర్ణన; అతని ఇలాకా బంజారుజుంటూ (బంజరు భూమి యా? ) జనుల గురించి వాడి అట్టహాసాల గురించి వర్ణన ; చిత్రాక్ష, చిత్రాక్షి , దుశ్శాసనుల,దుర్మగతి, దుర్యోధన ,అశ్వత్థామ  సంభాషణ; సంగ్కుని రావడం; రాముని మకుటం గురించి చెప్పడం; కర్ణుడు దానికై వెళుతున్న విషయం చెప్పడం; తమ సైన్యాన్ని తయారు చేయమనటం ;
 
అశ్వత్థామ సైనికుల దగ్గర వెళ్లి వాళ్ళని తయారవ డ మని చెప్పడం; యిందులో అశ్వముల ని మూడు విధాలు గా చూసు కునే వారి వర్ణన ఉన్నది - గమేల్- ఆశ్వాలకి అలంకరణ చేసేవాళ్ళు; పెకంతిక్ - అశ్వాల బాగోగుల ను చూసుకునే వాళ్ళు; పనేగర్ - అశ్వాలకి శిక్షణ యిచ్చే వాళ్ళు !
 
అక్షౌహిణి తయారు చేయమనటం (కర్ణుని కి సహాయం గా వెళ్ళ టానికి )
 
హక్సైని అన్న పదం కనబడుతుంది; యిది అక్షౌహిణి - ఒక అక్షౌహిణి - 21,870 పట్టి. ఒక పట్టి - ఐదు సైనికులు; మూడు గుర్రాలు, ఒక రథం, ఒక యేనుగు; (5m+3h+1c+1e= 10 in count) ;
 
ఏడవ అంకం
 
దుర్యోధనుని సేన కర్ణుని సహాయం గా రాముని మకుటం కోసం బయలుదేరటం; ఈ అంకం లో రథము వర్ణన సవివరం గా ఉంది; రథాన్ని దేంతో తయారు చేసారు? దానికి ఉపయోగించిన వస్తువులు ఏమిటి ? అన్న వర్ణన సుదీర్ఘం గా ఉంది; రథానికి పూన్చిన గుర్రాలు ఒకటి మగ గుర్రం ; మరొకటి ఆడ గుర్రం;
 
సేన తో బాటు భాజా బజంత్రీ గా వివిధ వాయిద్యాల వర్ణన ! కళ , సంగ్క, గుర్నంగ్,పుక్సుర్, తోంగ్-తోంగ్, గృత్, టేటేగ్, మగురు, గంగ్స , సౌరన్.
 
సేనావాహిని చీమల దండు లా వెళుతోందని వర్ణన !
 
ఇక ఈ మూడవ అంకం లో ఒక సులుకోన్ ! - దుర్యోధనుడు, బానువతి ఉద్యానవనం లో సేద దీరటం లా యిది, ఆ వన వర్ణన !
 
శార్దూల విక్రీడితం మళ్ళీ (మూడవ అంకం నించి).
 
 
శార్దూలవిక్రీడితము
 
ఖిల్యాన్ సంగ్కరికా తథామనరె పథ్ రేణ్యా బలే కాంచనా !
శోభాభ్రామహెనీంగ్ పవళ్ నటరికం, రుక్ ముత్య హారా రరస్
వైడూర్యామర నీలభప్రణి పగేర్ తుంజుంజ్ఞ మంతెన్ లుమెంగ్
ముంతబ్ హింతెని గాపురణ్య మచవింతెన్ సూర్యకాంత్యోజ్వలా
 
 
Suluk Pathêt Manyura Ageng
 
Kilyan sangka rika tataman arêpat ,rèhnya balé kancana ,
sobha bra mahêning pawal natar ,ikarok mutyahara araras ,
widuriya amaranila ,bapra ni pagêr tunjungnya mantên lumong ,
Muntab intên i gapuranya ,macawintên suryakantha ujwala.
 
To the west was a well-arranged garden complete with a golden pavilion; the sands in the yard, sparkling brightly, were of corals mixed with beautiful pearls; the walls of its fences were of opals and sapphires, the lotuses of luminous emeralds; the gates were inlaid with blazing diamonds, while the head-monster sculptures were of gleaming crystals.
 
Lagu Sardula Wikridita (lampha 19)
From Barata Yudha (Canto V, verse 2), a Kekawin poem in Old Javanese by mpu Sedhah and mpu Punuluh.
Circa 1157, reign of King Jayabaya Kediri.
 
 
(సశేషం)
 

1 comment:

  1. where is ur 4th post ?


    వరూధిని
    మకుటా రామ - వయాంగ్ కులిత్ - Legacy of Rama's Crown-భాగం - 4 -

    ReplyDelete