మకుటా రామ - వయాంగ్ కులిత్ - Legacy of Rama's Crown-భాగం - 4
ఎనిమిదవ అంకం :
దుర్యాపుర అరణ్య ప్రాంతం లో శ్వేలగిరి పర్వత శ్రేణులలో కుతారుంగు ప్రదేశం - తపస్వి కేశవ సిద్ధి ఆశ్రమ వాటిక;
కేశవ సిద్ధి తన శిష్యులైన , వాయు పరంపర లోని వారైన, అనోమాన్(హనుమంతుడు), మహంబిర (గరుడుడు), జాజల్వ్రేక (అసురుడు) సితుబంద (ఏనుగు) లతో.
కేశవ సిద్ధి హనుమంతుల మధ్య సుదీర్ఘ సంభాషణ - కేశవ సిద్ధి బోధన - యేది ధర్మం ; యేది న్యాయం; మానవుని జీవితం లో మూడు ఘట్టాలు - ఒకటి జీవం; రెండు జీవమెందుకన్న జ్ఞాన పూర్ణత; మూడు ఆ పరిపూర్ణత్వాన్ని పొందడం; ప్రకృతి జీవాన్ని పెంపొందిస్తుంది అది యుపయోగ కర మైనదైతే; కాదంటే అది పృకృతి లో కలిసి పోతుంది మరో రూప మవటానికి (పనికి వచ్చేలా)-> (పునరపి జటరే శయనం); నేల కూలిన చెట్టు, ప్రాణి, మరో చెట్టు కో, ప్రాణి కో జీవ మవుతుంది;
కేశవ సిద్ధి, అతి త్వరలో దేవత ల ద్వారా ఈ తరానికి అందించ బోయే రామ మకుటం గురించి హనుమంతుని కి చెప్పి , అతనికి దానికి సరితూగు మనిషి ఎవరైనా వస్తారేమో వాళ్ళని జాగ్రత్త గా గమనించ మని బాధ్యత అప్ప గిస్తాడు.
తొమ్మిది,పదవ అంకం :
కుతరుంగు వాటిక లో కర్ణ, దుర్శాసన,హస్తిన సేన ప్రవేశం. హనుమంతునితో సంభాషణ. హనుమంతుడు కేశవ సిద్ధి శిష్యుడని చెప్పటం; కర్ణుడు కేశవ సిద్ధి ని కలవాలని, రాముని మకుటానికై తా వచ్చా నని చెప్పి కలవాలని చెప్పటం; దానికి హనుమంతుడు కేశవ సిద్ధి ప్రస్తుతానికి ధ్యానం లో ఉన్నారని కలవడానికి వీలు లేదనటం; దీని మీద కర్ణుడి ఆగ్రహం; తానెవరో తెలిసే హనుమంతుడు యిట్లా మాట్లాడ తాడా అనటం ;
దీంతో కర్ణ,దుశ్శాసన, కార్తమరామ, హస్తిన సేనా హనుమంతుని తో యుద్ధానికి తలపడటం; కర్ణుడి కరవాలం, కుంతదుర్వాస అస్త్రం, ఆ పై అతని ఆఖరి మహా అస్త్రమైన విజయధను ప్రయోగించటం; హనుమంతుడు అవలీల గా విజయధను ని కూడా పట్టి వశం చేసుకోవడం జరుగు తుంది; దీంతో కర్ణుడు అతని సేనలు నిర్వీర్యులవు తారు.
ఇక్కడి నించి కథ, రామాయణ కాలపు విభీషణుడు చంద్రమణిక పర్వత ప్రాంతం లో తపస్సు చేసుకుంటున్న వన వాటిక కు వెళుతుంది.
పదకొండవ అంకం :
విభీషణుడు తపోవంతుడై చంద్రమణిక పర్వత ప్రాంతం లో ఉంటాడు;
విభీషణుడి తపో శక్తి వర్ణన; విశేషం గా కనిపించినది ప్రతి గురువారం రాత్రి అతని ప్రతి అణువు నించి వింత కాంతి రాత్రంతా వెదజల్లుతూ ఉండటం గురించి వర్ణన!
భీషవర్ణ, (విభీషణుడి కొడుకు) తండ్రి ని కలవడానికి రావడం; లంక బాగోగులు విచారణ; భీష వర్ణుడు కోరిక పై విభీషణుడి తత్వ బోధ. జీవితం లో కాలసినవి ముఖ్య మైనవి, నియమ నిబద్ధత, నిష్ట తో చదువుల ని గరపడం; మన ప్రవర్తన; అక్కడి నించి వాటిని ఎట్లా మనిషి పెంపొందించు కోవాలో చెప్పడం.
ఆ పై విభీషణుడు తన కంతిమ కాలమాసన్న మయ్యిందని చెప్పడం; శోక తప్తుడై భీష వర్ణుని నిష్క్రమణ. విభీషణుడు ధ్యానముద్ర లో కి వెళ్ళటం ; అతని నించి వెలువడిన తేజో పుంజం వేరు లోకాలని తాకి మరో లోకం లో ఉన్న కుంభకర్ణుడు (ఇతను అటు స్వర్గానికి పోకుండా , యిటు భువిలో నూ లేకుండా ఊగిస లాడుతూ అదే తానున్న లోకమే స్వర్గమన్న భ్రాంతి లో ఉన్నవాడు) ఆ కాంతి పుంజానికి ఆకర్షితుడై రావటం; విభీషణుని కలవటం; విభీషణుడు అతనికి మంచి మాటలు చెబుతూ - మనిషి జీవిత లక్ష్యం పరంధాముని చేరటం; స్వర్గాన్ని అధిరోహించటం అని చెప్పి , ఇప్పటి కాలం లో విష్ణు మూర్తి మళ్ళీ అవతారం దాల్చాడని అతనిని కలిసి విముక్తి ని కోరమని చెబుతాడు. కుంభకర్ణుడి నిష్క్రమణ.
మళ్ళీ ధ్యానం లోకి వెళ్ళిన విభీషణుడు; అతని నించి కామ క్రోధ మద లోభమాత్సర్యాలు వెలుపలికి తోసి వేయ బడటం; వాటికి విభీషణుడు ఉపదేశం ( వేరే ఎక్కడైనా స్థలం చూసు కోమని చెబ్తాడు - తను పై లోకాలకి వెళుతూ );
విభీషణుడి స్వర్గా రోహణ ;
ఇక్కడి నించి కథ మారి బాదరాయుణుడి ఆశ్రమ వాటిక కి వెళుతుంది.
ఈ పదవ అంకం లో విభీషణుడు కుంభ కర్ణుడి కి చేసే అద్భుత ఉపదేశ సారాంశం -
Tan samar pamoring Sukma,
sinukma ya winahya ing ngasepi,
sinimpen telenging kalbu,
Pambukaning wahana,
tarlen saking liyep layaping ngaluyup,
pindha pesating supena,
sumusuping rasa jati.
sinukma ya winahya ing ngasepi,
sinimpen telenging kalbu,
Pambukaning wahana,
tarlen saking liyep layaping ngaluyup,
pindha pesating supena,
sumusuping rasa jati.
sekar macapat Pangkur form - From Serat Wedhatama (Canto 1-verse 13) a macapat poem from Mangkunagara IV - mid to late 1800, Surakarta.
Unafraid of a bleeding of the soul,
Practiced in times of deep inner peace
cherished deep in one's heart
An opening of the doorway,
Mixed awareness and other-worldness,
Transformed into the realm of dreams,
Enveloped in eternal truth.
(One should not be afraid to achieve transformation through meditation).
మరో కణిక !
(పంచ పాదు లైన వాటి గురించి )
చందం - జగతి ఛందస్సు - కుసుమ విచిత్ర అంటున్నారు. కాని చంద్రవర్త్మ కి దరిదాపుల్లో ఉంది .
చంద్రవర్త్మ - ఏమైనా సరిజేస్తే కుసుమ విచిత్ర అవుతుందా ?
భూత, పాండవ తతాగ తివిషయా
యింద్రి యక్ష సర మారుత పవనా
బాణ మార్గన, సమీరణ వరయంగ్
పంచ వాయువిసి కంగుళియ లిమా
యింద్రి యక్ష సర మారుత పవనా
బాణ మార్గన, సమీరణ వరయంగ్
పంచ వాయువిసి కంగుళియ లిమా
Buta Pandawa tata gati wisaya ,
indriyaksa sara maruta ,
pawana bana margana ,
samirana lan warayang ,
panca bayu wisikan gulingan lima.
indriyaksa sara maruta ,
pawana bana margana ,
samirana lan warayang ,
panca bayu wisikan gulingan lima.
From Chandrasengkala -> (Canto I, Verse 5) , a sekar ageng poem in a collection edited by Bratakesava. 1928. Surakarta.
This is a compilation of chronograms for the number five. It is a list of phrases that represent the eliment of 5. Each phrase is a reference to the number five.
Panca Buta ; Pancha Pandava; Pancha vishaya ? ; Pancha Indriya; Pancha Yaskhasa (Panchaakshari Mantra?); Pancha Marutha Pavana? ; Pancha Bana; Pancha Sameerana (Pancha Vaayu?) ; varayung , gulingan, lima represent again number 5 ?
(సశేషం)
No comments:
Post a Comment