Monday, August 14, 2017

కన్నయ్య మళ్ళీ పుట్టాడు !

 
కన్నయ్య మళ్ళీ పుట్టాడు !
 

కన్నయ్యా మళ్ళీ పుట్టవా అంటూ మిల్లీనియా ల తరబడి జనాలు మొత్తేసు కుంటూ ఉంటే, శ్రీ నాథుండు, సిరి వైపు చూసి , దేవీ , జనాలు మళ్ళీ రా రా కన్నయ్యా అంటూ గగ్గోలు పెట్టేస్తూ ఉన్నారు. వెళ్లి రానా ? అడిగాడు గోముగా .

అమ్మవారు కూడా ఇట్లా ఎట్లా వత్సరాల తరబడి స్వామి వారి కాళ్ళు అదుముతూ కూర్చోవడం అనుకుంటూ 'వెళ్లి రండి స్వామీ, అక్కడే ఉండాలని మాత్రం అనుకోకండే ; మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ నేనూ రావాల్సి ఉంటుంది' అని డామ్మని వారి కాలు అదమడం వదిలి పెట్టింది హమ్మయ్య భారం తప్పింది ; చేతులకి అనుకుంటూ.

ఆ అదాటు కి స్వామి వారు జొయ్యని  'ఆంధ్ర దేశంలో 'ఆర్తి' తో పిలిచిన కష్టమున , శ్రమ దానమ్ముల చేసేసు కుంటున్న ఓ భక్తాగ్రేసాంబర మణి యింటి ముందు దిగ బడ్డాడు.

యింటి లోపలికి రా రా అంటూ పిలుస్తోన్న చిన్ని చిన్ని పాదాలు కనబడ్డాయి.


                                                    చిత్రం -  Shree Keshav of The Hindu Fame

తన పాదాల వైపో మారు చూసుకున్నాడు స్వామి . అన్ని భువనాల్నీ మూడు అడుగుల తో లెక్క పెట్టేసు కున్న పాదాల తో ఈ చిన్ని పాదాల్ని ఎట్లా సమీకృతం చేయాలో అనుకుంటూ తలగోక్కుని ముక్కు గోక్కో పోయాడు.

ముక్కు మీద ఏదో తగిలింది. ఏమయ్యుంటుందో అనుకుంటూ తడిమి చూసాడు.

లోచనా ! కమల లోచనా అంటూ ఉంటారు ; ఇదే కామోసు లోచనాలు ఆనుకుంటూ ఉసూరు మనుకున్నాడు.

పై లోకం లో నించి ఎట్లాంటి కళ్ళద్దాలూ లేకుండా చూసేసు కుంటూ వచ్చేసాడు. ఇక్కడ దిగ బడగానే కళ్ళద్దాలు కావాల్సి వచ్చె అనుకుంటూ .

అంతలో - "కన్నయ్యా ! మళ్ళీ పుట్టవా ! రారా ! సంపాదనకే సమయం సరిపోతూ ఉంది. పుట్టినప్పటినుంచి పాలకేడిచి, ఆ తరవాత మురిపాలకేడ్చి బతకంతా ఏడుపయిపోయింది" అంటూ ఓ ఆర్తి లోపలి నించి వినబడింది.

ఓహో ! ఈ లాంటి నినాదేలన్న మాట అక్కడ నాకు వినిపిస్తా ఉండేది అనుకుంటూ స్వామి వారు, బహు సంతోష పడి పోయి -

భక్తా ! వచ్చితిని యిదిగో అంటూ దీక్షను బూనిన యా దీక్షితుని ముందు కనబడ్డాడు.

ఎవరయ్యా నీవు అడిగాడా ఆసామి.

శ్రీ కన్నయ్య వారికి దుఃఖం తన్ను కొచ్చే సింది. 'హే కృష్ణా ! ముకుందా !' అంటూ , జయ కృష్ణా ముకుందా మురారే అంటూ వెంటనే పాట అందేసుకుని పరవశించి పోతాడనుకున్న అంబరమణి ఇట్లా తనను తుస్సు మనిపిస్తా డను కోలే స్వామి వారు.

దీక్షితా ! నేనయ్యా ! కన్నయ్య ను అన్నాడు స్వామి.

సందేహం తో చూసాడు భక్తుడు. 'ఆధార్ ?" అడిగాడు.

ఆధార్? అంటే బిక్క పోయాడు స్వామి .

సరే కన్నయ్య వేషం తో వచ్చావు కదా. ఆధార్ డీటెయిల్ ఉందా ? అని అడిగా .



అవ్ :)

సరే ఏమిటి చత్వారమా ? కళ్ళద్దాలు ? మళ్ళీ సందేహం భక్తుడికి.

కాదోయ్ ! అదేంటో మీ లోకం లోకి దిగ బడగానే ఇది అదే వచ్చేసింది.

జలధరదేహు నాజాను చతుర్భాహు అని విన్నా . నీగురించి. ఇట్లా పొట్టిగా, బుడుంకాయ లా , జలధర దేహం లేకుండా , ధూళి మట్టి కొట్టు కున్న దేహం తో ఉన్నా వేమి టయ్యా ? మళ్ళీ సందేహం.

ప్చ్ ఏమంటావు భక్తా ! మీ హై వే మహాత్మ్యం ఇది. దుమ్ము కొట్టు కు పోయిన తన శరీరం వైపో మారు చూసు కున్నాడు స్వామి. వచ్చే దారిలో అమరావతి కనబడింది; ఆశ గా దిగా. చూస్తే  మన్నూ మషాలం అంటేసు కుందయ్యా !

"అయినా, ఏ మాట కామాటే చెప్పు కోవాలయ్యా దీక్షితా ! కలియుగం లో భక్తి మా బాగా ఉందయ్యా ! ప్రతి ఒక్కడూ నన్ను చూసి "నమో ! నమో ! నమో"  అంటూ బోతా ఉండారు. ఆహా భక్తి ప్రపత్తులంటే ఇట్లా ఉండాలి గదా!  నా యుగం లో కూడా అట్లా జనాలు లేక పోయేరయ్యా !" స్వామి వారు తాదాత్మ్యం తో కళ్ళు మూసు కున్నారు .

స్వామీ మీరు మరీ వెర్రి వెంగళాయి అని అసలు విషయం చెబ్దా మని నోటి దాక వచ్చేసిన మాటల్ని గబుక్కున మింగే సుకున్నాడు అంబర మణి - చెబ్తే భాజాస్ఫాలన మాచరించి భాజ్పా జనాలు ఎక్కడ మీద పడి పోతారో అనుకుంటూ :)


మరి స్వామీ , ఆ గెడ్డెం, మీసాలు ?

వచ్చే దారిలో వాల్ పోస్టర్లు చూసానయ్యా . మీ సినిమా హీరోలంతా ఎంచక్కా గెడ్డాలు మీసాల తో కనబడ్డారు. ఓహో ! ఈ కలియుగపు అలంకారాలు ఇవే కామోసు అనుకున్నా. అంతే అవే వచ్చేసాయి. సంకల్ప బలం గదా !

ఓహ్ ! జే, జే అయి పోయా రన్న మాట !

జే ,జే ఏమిటోయ్ ?

జుట్టాడు జగన్నాధుడై పోయారన్న మాట :)  

అదేమిటోయ్ ?

అదంతే  లెండి.  ఇంతకీ , స్వామీ ! నిజ్జంగా నీవు నీవేనా ?


నీవే నేనుగ, నేనే నీవుగ భావించిన శుభ పక్షం వోయ్,  ఈరోజు. అట్లా కుటిల తర్కం తో 'నిజ్జంగా' అంటూ సందియ మేలా భక్తా ?

భక్తుని కి కొంత ఆశ, చిగురించింది.

ఇంత అందంగా వేదాంతమ్ చెబ్తున్నా డంటే ఈయన శ్యామలుడే అనుకున్నాడు.

అయినా , మరికొంత పరీక్షించాలి.

స్వామి వారు పరీక్షితుడికే ప్రాణ దాత  గదా మరి అనుకుంటూ ,

స్వామీ, వెన్న తింటా రా ? అన్నాడు ఆప్యాయం గా.

స్వామి వారికి నోరూరింది.

చాలా కాలమయ్యింది. వెన్ననారగించి. ఆహా ! బృందావనం ! ఆహా యశోదమ్మ తల్లి. అంటూ ఫ్లాష్ బాక్ గుర్తు కొచ్చే సింది.

అదేంటో , వైకుంఠం లో లక్ష్మి బువ్వ గురించి న ఊసే ఎత్తదు. ఎప్పుడు చూసినా అట్లా కాళ్ళు అదుముతూ నే కూర్చొని ఉంటుంది అనుకుంటూం టే, భక్తుడు,

స్వామీ వెన్న అన్నాడు.

మా రేపల్లె దా ? స్వామి వారి ముఖం చాంతాడంత అయ్యింది.

కాదు సామీ చైనా మాల్ ;

ఓహో చీని చీనాంబర మా ?

అవునండి.

స్వామి వారు వెన్న నోట్లో పెట్టాడు. డామ్మని నీల్గుడు చెంది క్రింద పడ్డాడు.

స్వామీ స్వామీ అంటూ భక్తుడు నీళ్ళు చల్లి స్వామి వారిని లేపడానికి బదులుగా 108 నెంబరు డయల్ చెయ్యడం మొదలెట్టాడు :)


Chocolate Krishna Copy Right - Crazy Creations


శ్రీ కృష్ణాష్టమి సదర్భం గా
అందరికి ఆ కన్నడి
ఆశీస్సులు ఉండాలని
కోరుకుంటూ ....
 
శ్రీ కృష్ణం వందే జగద్గురుమ్!
 
జిలేబి
 

Thursday, May 25, 2017

కష్టే ఫలి వారికి - వెడ్డింగ్ డే గ్రీటింగ్స్ !


 
కష్టే ఫలి వారికి - వెడ్డింగ్ డే గ్రీటింగ్స్ !
 

 
 
ధామ మది మమతలబడి తమ్మికంటి
సుమతి యిల్లాలి చలువగా శుభము బడసె
గోదమాయమ్మ కరుణమ్మ గోము గాంచి
మాచనార్యుల చల్లగ మాలిమి గను !
 
 
 
చీర్స్
జిలేబి

Saturday, May 20, 2017

కనకన లాడెను లతాంగి కామెంటులటన్ !



 
కనకన లాడెను లతాంగి కామెంటులటన్ !
 

ధనజాతకమునకు జిలే
బి, నవనవ యనియటు కాసు బిరబిర వచ్చున్ !
గనవమ్మా నీవున్నటు
కనకన లాడెను లతాంగి కామెంటులటన్ !
 
 
జిలేబి




Saturday, May 13, 2017

సామాజిక స్పృహ లేని చిత్రం - బాహుబలి - 2


సామాజిక స్పృహ లేని చిత్రం - బాహుబలి - 2


ఈ మధ్య ఆహా ఓహో సాహోరే అంటున్న మహా చిత్ర రాజం - బాహుబలి !

జిలేబి కూడా సాహోరే అంటూ శార్దూలాల పొగిడేసిన చిత్రం - చిత్ర రాజ మౌళి :) - బాహుబలి !



సిన్మా చూసాక అనిపించినది సామాజిక స్పృహ లేని ఓ మా బోరింగు చిత్రం . ఈ చిత్రం ఫీవర్ తగ్గాక చూద్డా మని వెయిట్ చేయాల్సిన పని లేదు . చూడక పోయినా జీవితంలో లాస్ ఏమీ లేదు

భారతం లో ఏముంది బొంకు తప్పా అన్నట్టు ఈ బాహుబలి లో ఏముంది సినిమాటిక్ ట్రిక్కులు తప్పా అనాలి అంతే.

ఇద్దరు అన్నదమ్ముల మధ్య పోట్లాట వీరాంగనలు , వీరులు బ్లా బ్లా బ్లా అంతే.

ట్రిక్కులు డిజిటల్ మాజిక్కులు దీనివల్ల జన సామాన్యానికి ఒరిగే స్పృహ ఏమిటి ?

జన బాహుళ్యానికి కలిగే మేలు ఏమిటి అన్నది ఆలోచిస్తే పూజ్యం అంతే.

సో , బాహుబలి మరో బాగు బలి .

బాక్సాఫీసు హిట్టు ; ఓకే; దాని వల్ల జనానికి బొక్క అంతే :) ఆస్కార్లు నంది అవార్డ్లు గట్టా వస్తే ఇండియా గ్రేట్ ; తెలుగోడు గ్రేట్ అనేద్దాం ; అప్పటి దాకా


జిలేబి
సైనింగ్ ఆఫ్
బీ లేజీ.

Thursday, May 4, 2017

తేటగీతి - హైకూలు - ఒక పరిశీలన


తేటగీతి - హైకూలు - ఒక పరిశీలన



ఆ మధ్య శంకరాభరణం లో శ్రీ జీ పీ యెస్ గారు ఎందుకో హైకూ ల ప్రస్తావన తెచ్చారు ; అబ్బా తెలుగు ఛందస్సు లో లేనివి ఏమైనా ఉంటాయా అనుకున్నా.

సరే ఈ హైకూలేమిటో అని గూగులిస్తే మొత్తం మీద తేలిందేమి టంటే అదీ ఓ మోస్తరు చందమే :)

మరీ చాలా సరళమైనది తేట గీతి లో ఒక వాక్యాన్ని విడ గొట్టితే మూడు పాదాలు గా హైకూ రెడీ అని పించింది.

(కొంత భావగర్భితం గా ఉండాలి - 'ఎంత ఎక్కువ కన్ఫ్యూషన్ ఉండి, ఎంత ఎక్కువ పరేషాన్ చేస్తే అంత మంచి హైకూ :) జేకే :)-

చదివిన ప్రతి వారి కీ వేరే వేరే భావాలు అర్థం అయితే మరీ మంచిది (జిలేబి మాటల్లా అన్న మాట :)

సరే
ఇప్పుడు తేట గీతి ఏమిటి ? హైకూ ఏమిటి అన్నది చూద్దాం

తేటగీతి  - ఒక సూర్య రెండు ఇంద్ర రెండు సూర్య గణాలు (మూడు , నాలుగు,నాలుగు,మూడు మూడు మాత్రలు సరళం గా అర్థం చేసు కోవటానికి.  -

3+4+4+3+3 = 17

తేటగీతి
పద్య లక్షణములు:
  1. 4 పాదములు ఉండును.
  2. ప్రాస నియమం లేదు
  3. ప్రతి పాదమునందు 4 వ గణము యొక్క మొదటి అక్షరము యతి స్థానము
  4. ప్రతి పాదమునందు ఒక సూర్య , రెండు ఇంద్ర , రెండు సూర్య గణములుండును.

హైకూ ? - వికి పీడియా ప్రకారం ->  గమనిస్తే పది హేడు అక్షరాలు (వారి ప్రకారం)

3+4+4+3+3 = 17 = 5+7+5 = 17

The best-known Japanese haiku[15] is Bashō's "old pond":
古池や蛙飛び込む水の音
ふるいけやかわずとびこむみずのおと (transliterated into 17 hiragana)
furu ike ya kawazu tobikomu mizu no oto (transliterated into rōmaji)
This separates into on as:
fu-ru-i-ke ya (5)
ka-wa-zu to-bi-ko-mu (7)
mi-zu-no-o-to (5)
Translated:[16]
old pond
frog leaps in
water's sound
ఇప్పుడు ఒక తేట గీతి రాసి దాన్ని విడగొడితే హైకూ ఎట్లా వస్తుందో చూద్దాం : )

 (జిలేబి కి అన్నీ విడ గొడితే గాని అర్థం కాదు మరి :)

తేటగీతి

రోడ్డును డివైడు చేస్తోంది రొష్టు గీర
బొడ్డు అందాన్ని తిరగేసె బోడి గుండు
మెట్ల పైనించి బొమ్మలమ్మి తిరిగింది
గిట్ల రాయి హైకూలను జిగి జిలేబి‌

హైకూలు :)



రోడ్డును
డివైడు
చేస్తోంది
రొష్టు గీర

**
బొడ్డు
అందాన్ని
తిరగేసె
బోడి గుండు

**
మెట్ల
పైనించి
బొమ్మలమ్మి
తిరిగింది

*"
గిట్ల
రాయి
హైకూలను
జిగి జిలేబి‌
**

చీర్స్
జిలేబి
నారదాయ నమః !

 

Wednesday, May 3, 2017

కంద గర్భిత శార్దూల విక్రీడితము - ఒక పరిశీలన



కంద గర్భిత శార్దూల విక్రీడితము - ఒక పరిశీలన


ఈ మధ్య చిత్రకవితా ప్రపంచం వారి బ్లాగులో చదివిన కంద గర్భిత శార్దూల విక్రీడితమ్ (శార్దూల పద్యం లో కంద పద్యం యిమిడి ఉండటం) ఉదాహరణ చదివాక కొంత జోష్ కలిగింది; ఎట్లాగూ శార్దూలం కందం సమాంతరంగా ఔత్సాహికంగా సాధన (అనుకుంటా :)) చేస్తున్నాం కాబట్టి రెండింటిని కలిపి గట్టి కావేటి రంగా అందా మనుకుని మొదలెడితే కొన్ని జిలేబులు తయారైనాయి. వాటినన్నిటి ని  ఒక్క చోట పెడదామనే చిరు ప్రయత్నం.


శార్దూలం లో కందం ఇమడాలంటే -

మొదటి, మూడవ  పద్య పాదం లోని మొదటి అక్షరం నించి మొదటి మూడవ పాదం కందం వస్తుంది.
రెండు, నాలుగు పద్య పాదం లోని రెండవ అక్షరం నించి రెండు మూడు పాదం కందం వస్తుంది  (గుడ్డి గుర్తు :))

ఉదాహరణ

ఏలన్ బో రుచిరమ్ములౌ పురమునన్నేలన్ భళారే యనన్
గీ లాలమ్ములజూడనేల ! లవ యగ్గింపుల్లటన్ గానకన్
నేలన్ కాలటు జారనౌ పడతుల్ నేజెల్ల! నవ్వుల్ గనన్
బో,లాలిత్యముగా లివన్ బలములున్ బోయెన్ రొ దుర్యోధనా!

---

ఏలన్ బో రుచిరమ్ముల
లాలమ్ములజూడనేల ! లవ యగ్గింపుల్ !
నేలన్ కాలటు జారన
లాలిత్యముగా లివన్ బలములున్ బోయెన్


చీర్స్
జిలేబి


 

Monday, May 1, 2017

మనసా మాలిని మాట లాడ రమణీ మత్తేభ పద్యమ్మగున్ !



మనసా మాలిని మాట లాడ రమణీ  మత్తేభ పద్యమ్మగున్ !



చినుకుల్ నాలుగు లెక్క లార్చికురియన్ చివ్వంచు విద్యుత్తు బో
వనటన్ మామిడి కాయ లెల్ల పడెనౌ వారమ్ములో మూడు‌ నా
ళ్ళనగన్! మానవు డేమి జేయ గలడౌ లావుల్ విభూతుల్ హరీ

వనముల్ బోయెను గాలి వాటు నటనౌ వార్ధక్య కాలమ్మునన్


శుభోదయం
జిలేబి

Thursday, April 13, 2017

మమతల బడి


మమతల బడి
 

ఫోటో కర్టసి -> మమతలబడి వారిది
 
 
సీ. ఇంటిని కట్టిజూచితి జిలేబి మనసు
యుల్లాసము గొనుచు యురికెనమ్మ !
పనులెన్ని యున్నను పరదేవత చమకు
ల కుదిరె చకచక లక్షణముగ
శకునము జూచితి సక్యము గానైన
వరకు, తా పైనెల్ల వరము లిచ్చె
మాయమ్మ దుర్గమ్మ మంచిగాను వినవే
మనసార సాగిన మధుర కథను !
 
 
తే. ధామ మది మమతలబడి తమ్మికంటి
సుమతి యిల్లాలి చలువగా శుభము బడసె
గోద మాయమ్మ కరుణమ్మ గోము గాను
జూసె, చల్లగాను నిలిపె జూడ మమ్ము !
 
శుభోదయం
జిలేబి

Saturday, April 8, 2017

దేర్ దేర్ షీ గోస్ ! జిలేబి దైనేమ్ లేడీ :)


 
 
దేర్ దేర్ షీ గోస్ ! జిలేబి దైనేమ్ లేడీ :)


హి దటీజ్ ది లేడి ! యూనో!
హి దేర్ షి గోస్!యట్ట లేడి! హీ దట్జ్ హర్ ! ఐ
సీ ! దేర్ ద డెవిల్ గోస్ ఓహ్ !
దేర్ దేర్ షీ గోస్ ! జిలేబి దైనేమ్ లేడీ :)
 
కందోదయం :)
జిలేబి     
 
ప్రాస యతులు మన కేల
న్నా! సరసపు పలుకుల మజ, నలుగురి తోనన్
కూసింత చతికిలబడుచు
యాసల సయ్యాటలన పయనమును జేయన్ !

Wednesday, April 5, 2017

శ్రీ రామ నవమి శుభాకాంక్షలు !


వీక్షకులకందరికీ
 
శ్రీ రామ నవమి శుభాకాంక్షలు !
 
జై శ్రీ రామ్ !
 


శుభోదయం
జిలేబి