మత్తేభము
కలడాతండట! కాని కన్నులకు శ్రీకష్టేఫలీ గాన రా
డిలలో దుర్భిణి వేసి చూసినను తర్ఫీదెంతయున్నన్ సుమా
అలయై వెల్గు జిలేబి యై హృదయమందాతండు సూర్యోజ్వలా
వలయంబై యణుమాత్రమై ఋతముగా భాసిల్లు సత్యంబిదే
***
శార్దూలము
శ్రీకష్టేఫలి పల్కె క్షేత్రి యొకడే! సేవింప సేవింపగా
మీకిష్టంబగు రీతి తానగుపడున్ మీనంబుగా వృత్తమై
తా, కోలంబుగ నారసింహముగ తత్త్వంబాతడై వామనుం
డై కోదండపు ధీరులై హలధరుండై కృష్ణుడై కల్కియై!
***
సీసము
కలడాతడంట నాకమున నిచ్చోటను
హృదయపు కుహురంబు ఋతముగ తల
మంట! వెతుకు చుండె మనుజుడిలని జిలే
బి యగుచు మరి నాడు విధిగ నిపుడు
కాన రాడేలనో! కష్టే ఫలమవడే!
ప్రేమ పొంగి పొరలె పేర్మి గాన
నెల్లపుడును మది నిండుగ కన్నయ్య
రూప మై వెలుగు స్వరూపముగన!
బ్లాగు లోకపు భాస్కరు పల్కులు మన
కనుదినము వచ్చె ముంగిట యనవరతము
మధుర వచనములివి మన మాచన వరు
పల్కు ననతేనియలుగాను భాగ్య మిదియె !
కష్టేఫలి వారి పూర్తి పుస్తకము - మాతా నాస్తి పితా నాస్తి
డౌన్ లోడ్ లింకు
జిలేబి