సామర్థ్యాన్ని ఆకాశానికెత్తకుంటే
పోటీ వుండదు.
విలువైనదని అనవసర విలువ చేర్చకుంటే
కొల్ల గొట్టబడదు.
చూడకూడని దాన్ని చూపించకుంటే
మది చంచలత్వమొందదు.
సరియైన నేత అనవసరమైన కోరికల్ని మదిలోనుంచి తొలగిస్తాడు కడుపు నిండేలా చూస్తాడు. దురాశలను త్రుంచి, సంఘజీవుల దారుఢ్యాన్ని పెంపొందిస్తాడు.
జనులు సామాన్యులై అత్యాశ పడకుంటే
తెలివిపరుడు చెలగాటమాడలేడు.
కౌశల్యంతో పని చేయి~
అంతా శ్రేయస్కరమౌతుంది.
దావొ దె జింగ్
లావొ జు
Source-3
Not exalting the talented prevents rivalry.
Not valuing goods that are hard to obtain prevents stealing.
Not displaying desirable things prevents confusion of the heart.
Therefore, the True Person governs by emptying the heart of desire
and filling the belly with food, weakening ambitions and strengthening bones.
If the people are simple and free from desire, then the clever ones never dare to interfere.
Practise action without striving and all will be in order.
స్వేచ్ఛానువాదం
జి లే బి.