బ్లాగ్ శిఖా 'నాని' బ్లాగ్ జిలేబీ అమ్మ వారు తీరిగ్గా లాఫ్ టాప్ ముందు కూర్చుని తన 'రచనా విరహ తాపాన్ని ' చల్లార్చుకుంటూ ఆన్ లైన్ 'చేట' లో రాళ్లేరుకుంటూ, కామెంట్లలో గోళ్ళు గిల్లు కుంటూ కాలం వెళ్ళ బుచ్చు తోంది.
ఆ దారి వెంబడే వెళ్ళే ఓ అమరికను కన్సల్టంటు జిలేబీ బ్లాగ్ పైత్యాన్ని గమనించి,
'జిలేబమ్మా, జిలేబమ్మా' నీకు ఓ ఐడియా ఇస్తాను దాంతో నీ బ్లాగ్ లోక దురద తో బాటు పైసలూ రాలుతాయి' అన్నాడు.
డబ్బెవరకి చేదు అన్న చందాన జిలేబీ ఆశ పడింది.
'ఏమిటోయ్ ' అంది.
'చూడూ, ఆన్ లైన్ చేట లో రాళ్ళేరు కుంటూ వుంటావు గా, దాంతో బాటు, నీకు తెలిసిన బ్లాగ్ గురించి చేట లో రాళ్ళేస్తూ చెప్పు. ఐడియా కి ఓ డాలరు అను నీకు పైసలు రాల్తాయి'
'నిజంగా నే అంటా వా ?'
'అవ్ మల్ల' అమెరికన్ ఎక్సంట్ నించి ఈ మారు ఆ తెలుగోడు ఆదరబాదర ఎక్సంట్ కి వచ్చాడు !
సరే అని జిలేబీ ఆన్ లైన్ చేట లో 'బ్లాగ్ వైద్యులమ్మ జిలేబమ్మ ' మీ సర్వ రోగముల నివారణ కు ఇచ్చట ఉపాయం చెప్ప బడును ' అని బోర్డు బెట్టు కుని నాలుగు రాళ్ళూ వెనకేసుకుంది !
చదువరులారా ! మీకు ఏమైన్నా రోగము ఉందా ! ఆ రోగము తీరి పోవుటకు వెంటనే చక్కని బ్లాగ్ లింకు తెలుప బడును ఇచ్చట ! మీ రోగం హుష్ కాకి! వెంటనే ఓ డాలరు కామెంటు కొట్టుడు ! మీకు వైద్య సలహా ఇవ్వబడును !
ఇట్లు
బ్లాగ్ వైద్యులమ్మ
జిలేబమ్మ !
(దీనికి స్ఫూర్తి చెప్పాలంటారా! ఈ టపా వారికే అంకితం!)