Sunday, April 28, 2013

పోట్లాడు కుందాం రండి !


ఇదిగో నండీ అయ్యరు  గారు ఇవ్వాళ్టి నించి రోజూ మీతో పోట్లాడ బోతా అల్టిమేటం ఇచ్చా మా అయ్యరు  గారి కి

ఏమోయ్ జిలేబి ఏదో కొత్త గా జెబ్తున్నావ్ ? నలభై ఏళ్ల దాంపత్యం లో మీ బామ్మ చలవ నీతో పోట్లాడని రోజు ఉందా అన్నారు మా అయ్యరు గారు .

పోట్లాడ కుండా నాకు మాటల్రావే మరి ఏం  చెయ్య మంటారు ?

కుమారీ సుకుమారీ అని మీ బామ్మ అంటే ఏమిటో అనుకున్నా ! పెళ్ళైన తరువాయే తెలిసింది ' అழగాన రాక్షసి అని !

పోదురు లెండి ! మీరు మాత్రం ఏమిటి మరి ?

సరెలేవే జిలేబి, ఇంతకీ ఇవ్వాళ్టి  నించి కొత్తగా పోట్లాడ బోతా నన్నావ్ ఎందుకోయ్ మరి ? అడిగారు అయ్యరు గారు

'అదండీ, కష్టే ఫలే శర్మ గారు, 'కోలాటం' బొమ్మ పెట్టి , బెల్లం కొట్టిన రాయిలా ఉండ మాకండీ, కూసింత పెనిమిటి తో మాట్లాడండీ అన్నారండీ ! మాట్లాడండీ అంటే, మనం పోట్లాడడమే కదాండి  ? అందుకే అట్లా చెప్పా '

కోలాటం లో కోలాటం 'శబ్దం' చేసినా దాంట్లో రిథమ్ ఉంటుందోయ్ ! అట్లాగే మన పోట్లాటల్లో కూడా రిథమ్  ఉంటే ఫర్లేదు లే !

అయితే పోట్లాడు కుందాం రండి !!!


చీర్స్
జిలేబి 

Friday, April 26, 2013

కనుకొలకుల లో కన్నీళ్లు

 
కాలాలు ఏమైనా కన్నీళ్ళ కి 
కన్య   కనులే స్థావరమా ?
లేక ఇది ఈ మీనాక్షి 
కోరి తెచ్చుకున్న వరమా ?
 
కాలం మారింది అంటారు 
మరి అబల ఏ కాలం లో 
సబల అవుతుంది ?
 
 

Thursday, April 25, 2013

పిల్ల కాలువ - నది - సంద్రం - ఆకాశం

 
పిల్ల కాలువ పరుగులిడు
తోంది నదిని చేరడానికి 
 
నది ఉరుకులిడు
తోంది సంద్రాన్ని చేరడా నికి 
 
సంద్రం  ఆకసం వైపు
ఆకసాన మేఘం భువి వైపు 
చూస్తోన్నాయి 
 
సన్నాయి రాగం తో గాలి తెమ్మర 
అట్లా వెళుతూ మేఘాన్ని ముద్దాడితే 
 
మేఘమాలిక కుంభ వృష్టి అయి
భువి ని తడిపేసింది 
 
పిల్ల కాలువ నది అయ్యింది 
నది మహా నది అయ్యింది 
 
సంద్రం మహాసముద్ర  మయ్యింది 
 
ఆకసం మళ్ళీ సంద్రాన్ని చూస్తోంది 
 
 
జిలేబి 

Tuesday, April 23, 2013

ఇచ్చట బ్లాగు ట్యూషన్ చెప్ప బడును !

ఆ, పిల్లలూ అందరూ వచ్చారా ?

ఎస్ మేడం !

మొదట మనం బ్లాగు మాతరమ్ తో మన తరగతి ని ప్రారంభిద్దాం !

అందరూ చెప్పండి ...

వందే బ్లాగారం వందే బ్లాగారావు ...

ఆ పిల్లలూ ఇప్పుడు మీ పేర్లు చెప్పండి

నా పేరండీ  నా పేరండీ  ....

హాయ్ ఐ యాం ....

ఏమబ్బాయ్ , అట్లా పనీ పాటా లేక కూర్చున్నావే ? ట్యూషన్ లో చెప్పే పాటా లు సరిగ్గా వింటున్నా వా ?

మేడం, కాలక్షేపం కోసం సరదాగా బ్లాగు ఎట్లా రాయడం అని నేను రాసు కొచ్చే నండీ !
ఎరా అబ్బాయ్, ఈ వ్యాసం ఎక్కడో చదివి నట్టుందే  మరి ?

లేదండీ ఇది నా స్వంతం అండీ

ఏమమ్మాయ్ మధురా బ్లాగ్ క్లాసులో జంతికలు తింటూ కూర్చున్నావ్ ? ఏమైనా కాస్తా రాయ కూడదూ ?

రాసేసా మేడం, జంతికలు మీద వ్యాసం !

ఆ, సరే అబ్బిగా, ఏమిట్రా పక్క వాడి తో బాతా ఖానీ కొడుతూ కూర్చున్నావ్ ?

ఏమీ లేదండీ, నేను జెప్పేది ఎవరైనా వింటారా అని చూస్తున్నా

మా నాన్నే మా నాన్నే

ఏమమ్మాయ్ బ్లాగ్జోతి ఈ మధ్య క్లాసులకి నల్ల పూసవై పోయెవ్ ?

మా ఇంట్లో అమ్మ చివాట్లు పెట్టిందం డీ !

ఆ కిట్టిగా, ఏమిరా రాస్తా రాస్తా ఉండావ్ ?

రాము లోరి మీద ముక్క రాస్తున్న నండీ

ఆ అబ్బాయ్, అట్లా నా వైపు చూసి తెగ నవ్వుతున్నావ్ ?

మేడం, మీరూ నవ్వా లనుకుంటే నవ్వండి !


ఏమమ్మా జిలేబీ ఏమిటి తెగ ఆలోచిస్తా ఉండావ్ ?

మేడం, మీరు ఎప్పుడు రిటైర్ అవుతారో?

ఆ ! ఎందుకే !

నేను కలాసులు తీసుకుందా మని !
వామ్మో వామ్మో ఏమి తెలివే నీకు ! నీ బలాగు బంగారం కాకులెత్తుకు పోనూ ....


చీర్స్
జిల్లాలంగడి జిలేబి !

Monday, April 22, 2013

మీ కామెంటులు చిల్లు కాణీ విలువ చెయ్యవు !

శుభోదయం !

కామెంటు విలువ ఎంత అంటే, చ పో చిల్లు కాణీ కి పనికి రావు అన్నాడో 'అన్నా' నీ మనసు' తెలీని వాళ్ళం అనుకున్న ఓ జ్ఞాత ఐన అజ్ఞాత !

ఆహా, జ్ఞాతల కన్నా ఈ అజ్ఞాత జ్ఞానం ఏమి విలువైన జ్ఞానం అనుకున్నా !

ఇంతకీ మనం రాసే టపాలకి వచ్చే కామెంటు లకి కాపీ రైటు  ఎవరికీ చెందు తాయి ?

టపా లకి కాపీ 'రైతు' ల ము మేమోయీ అని జబ్బలు కొట్టుకుని రాస్తాం!

సరే, మన టపాలు చదివి, మన మీద కూసింత కరుణ జూపి మనకు 'తపోత్సాహాన్ని'  కలిగించి, మళ్ళీ మళ్ళీ మనం టపా వ్యామోహం తో మమేకమ వ డా నికి చేయూత నిచ్చే బంగారు కామెంటు దారుల వాక్యాలకి వ్యాఖ్యలకి కాపీ రైటు ఎవరికీ చెందు తుంది ? మన టపా చదివి అది కొట్టేరు కాబట్టి మనకే చెందు తయా ? లేక వారి కామెంటు లకి కాపీ రైటు  వారికే చెందు తాయా ?

ఏమండీ జిలేబీ గారు మీకు పనీ పాటా లేదా ? పొద్దస్త మానూ కాపీ, కాఫీ ల గురించే రాస్తూం టా రు ? అంటా రా ?

అంతా విష్ణు మాయ ! కూపస్థ మండూకః కథ తెలుసు కదా మీకు ! బావి లో ఉన్న కప్పలం బెక బెక మంటూ వాటి గురించే రాస్తూంటాం , రాస్తూ, టాం టాం అంటూ ఉంటాం ! !

ఇంతకీ ఈ విషయం మీద మీ సదభి ప్రాయములను తెలియ జేయ గలరు !


చీర్స్ 
జిలేబి !
(curiosity killed the cat!)
(I'm not dumb. I just have a command over thoroughly useless information~!)

Thursday, April 18, 2013

పాహి రామప్రభో ! కౌసల్యా సుప్రజా రామా !

కౌసల్యా సుప్రజా రామా ....

కర్తవ్యమ్ దైవమాహ్నికం ....

సుప్రభాత వేళ  మధ్యన తటాలున 'పాహి రామప్రభో ' అన్న బ్లాగార్ద్ర నాదం వినబడ్డది

శ్రీ రాముల వారు ఉలిక్కి పడి నిదుర లేచేరు.  రొటీన్ గా వచ్చే సుప్రభాత సేవ శ్లోకాలకు నిదుర లేవడం స్వామి వారు ఎప్పుడో మానుకునెరు.

కొండ పైన నిదుర పుచ్చడమే చాలా లేటు ఆ పై తన కలియుగ ప్రాణాన్ని  గోవిందా గోవిందా అని పెందరాళే లేపెస్తున్నారాయే.

కానీ ఈ మధ్య రెగ్యులర్ గా వచ్చే బ్లాగార్ధ్రనాదం తో స్వామీ వారు 'సుప్రభాతాన్ని' చూడ గలుగు తున్నారు తనివి తీరా.

కొంత కాలం గా సుప్రభాత సేవ తో బాటు మరో కొత్త ఆర్ద్ర నాదం విన వస్తోంది 'పాహి రామప్రభో' అంటూ .

స్వామి వారు అమ్మవారి వైపు చూసేరు - గాఢం గా నిదుర పోతోంది దేవేరి !

ప్చ్ ఈవిడికున్న సౌకర్యం మనకు లేకుండా పోయిందే అనుకుని స్వామి వారు నిదుర లేచి ల్యాపు టాపు  ఓపెన్ చేసి  ఆ బ్లాగార్ధ్ర నాదాన్ని గమనించేరు .

ఎవడో మానవుడు పాపం పంచ దశ లోకం నించి తన్ను రోజూ పిలుస్తున్నాడు 'పాహి రామప్రభో' అంటూ.

స్వామి వారికి ముచ్చట వేసింది . ఈ మానవుడు పాహి పాహి అంటూ తన మీద ఆధార పడి పోవడం గురించి

ఈ మధ్య కాలం లో ఎవ్వడూ స్వంతం గా తన్ను పాహి పాహి అనటం లెదు. గుళ్ళో కూడా అదేదో 'రికార్డు' లట  కాకుంటే 'డిస్కు' లట  వాటిల్లో సుప్రభాతాన్ని పెట్టి తన నిదుర ని చెడ గొట్టి ఈ కలియుగ మానవులు  గుర్రు పెట్టి నిదుర పోతున్నారు

తనేమన్నా రికార్డు డాన్స రా రికార్డు పెడితే ఆడ టానికి ? కాకుంటే 'డిస్కో శాంతి యా  డిస్కు పెడితే డాన్సా డ టా నికి ?

అట్లాంటి ఈ వెర్రి తలల కాలం లో ఈ బ్లాగ్భక్తుడు రోజూ మనః స్ఫూర్తి గా పద్య మాలికలల్లి తనని 'పాహి' పాహి' అంటు న్నాడు !

రాముల వారికి ముచ్చటే సింది . చూద్దాం ఇంకా ఎంత గాఢం గా పాహి పాహి అంటాడో ఆ పై కరుణి ద్దా మనుకుని    బ్లాగు సైన్ అవుట్ అయి లాపు టాపు  కట్టి బెట్టి మళ్ళీ 'ఆనీదవాతగ్ స్వదయా తదేకం' అయ్యేడు.

సీతమ్మ ముసి ముసి నవ్వులు నవ్వింది . తన్ను ఆ మానవుడు పాహి పాహి అని ఉంటే, ఈ పాటి కి స్వామి వారిని ఇట్లా నిదుర పోనిచ్చేదా ? పట్టు బట్టి  స్వామి వారిని బయలుదేర దీసి  పంచ దశ లోకం వెళ్లి ఆ మానవుని దీవించి రమ్మని చెప్పి ఉండదూ ?

అర్థం చేసుకోరూ !!


శుభోదయం
జిలేబి !

Wednesday, April 17, 2013

బాబ్బాబు, నా టపాలు కాపీ కొట్టండి !


'అదేమిటోయ్ జిలేబీ చాలా విచారం గా ముఖం వేలాడెసి కూర్చున్నావు ల్యాపు టాపు ముందు ?' మా అయ్యరు  గారు పరామర్సించేరు ఆప్యాయంగా . 

కళ్ళ నీళ్ళు పెట్టుకున్నా.

ఏమిటి జిలేబీ నీ మొగానికి ఏడుపు శోభిల్లదే ! కలకంటి కన్నీరు ఒలికిన ప్రాబ్లం అన్న మాటే మరి ! ఏమి నీ బ్లాగు కష్టాలు అన్నారు మా అయ్యరు గారు.

ఏమండీ నా కష్టాలు అన్నీ బ్లాగు కష్టాలేనా ? అడిగా

కాకుంటే ? నీకు పొద్దస్తమానం ఆ కంప్యూటరు జత జేరే ! వేరే ఎ కష్టాలు నీ కుంటాయి ? రిటార్టు ఇచ్చేరు

హు అన్నా హా అన్నా మళ్ళీ కన్నీటి వరదలు చిందించా

ఏమిటోయ్ విషయం ఈ మారు కొంత సేద దీరేక అడిగేరు మా అయ్యరు  గారు మళ్ళీ.

నా టపాలు ఎవ్వరూ కాపీ కొట్టడం లేదండీ ! అని భోరు మన్నా !

ఓసి పిచ్చి దానా ! నీ టపాలు ఎవ్వరూ కాపీ కొట్టక పొతే సంతోష పడాలి గాని ఇలా భోరు మంటే ఎట్లా గే ?

టపాలు  ఎందుకు కాపీ కొట్టి పెట్టు కుంటా రండీ  ?

'ఆ , ఏముందీ, కూసింత నచ్చితే, బాగుంటే ఆయ్  ఈ టపా, కథ కాస్త బాగుందే  , మన బ్లాగులో దాచేసు కుందాం అని పెట్టేసు కుంటారు '

అంటే ఏమని అర్థం ? నా టపాలు ఎవ్వరికీ నచ్చ లేదన్న మాటే గా ? మళ్ళీ బోరు మన్నా !

'ఓసీ నీ బ్లాగు పిచ్చి కాకులెత్తుకు పొనూ !  ఇవన్నీ చేజేతులారా తెచ్చి పెట్టు కున్న కష్టాలు కావే మరి ! అని మా అయ్యరు  గారు ఓ  జాడూ  జమాయించి 'కాఫీ పెడతా ఓ గ్లాసెడు గొంతులో పోసుకుని మళ్ళీ టపా లల్లెసుకో ' అని 'ప్యారీ బీవీ' కోసం కాఫీ పెట్టడం కోసం కిచెను లో  కెళ్ళేరు 

బ్లాగు భామలు, బ్లాగు భయ్యాలు నా టపాలు కాపే కొట్టి మీ బ్లాగుల్లో 'ప్రచారం' చేసి నా కు గంపెడంత పేరు తెచ్చి పెడుదురూ మరి !!- మా తిరుపతి వేంకటేశు గారికి సిఫార్సు చేసి మీకు పుణ్యం వచ్చేటట్టు చూస్తా !!


(తెలుగు తూలిక డాట్ నెట్ మాలతి గారి టపా కామెంట్లు  చదివేక ! సరదాగా )


చీర్స్
జిలేబి 

Tuesday, April 16, 2013

నది లో చేప పిల్ల - నగరం లో వేపుడు

 
నది పరవళ్ళు తొక్కుతోంది 
చేప పిల్ల కేరింతలు కొడుతోంది 
 
చేప పిల్ల నది ముద్దాట ల తో 
నది చేప పిల్ల సయ్యాట ల తో 
మమేకం తదేకం అద్వైతమ్ 
 
చేప పిల్ల పట్నం పోతా నన్నది 
వద్దే అన్నది నది 
లేదు నే పోయి తీరుతా నన్నది పిల్ల 
చస్తే గాని పోలే వె చెప్పింది నది 
 
అయితే నే చస్తా అన్నది చేప పిల్ల 
నది కంట తడి పెట్టింది 
 
జాలరి గాలం విసిరేడు 
చేప పిల్ల గాల్లోకెగిరి వొడ్డున పడ్డది 
 
గిల గిలా టప టపా వేగిర పడి 
ప్రాణం ఉసూరు మన్నది 
 
బుట్టలో పడి నగరం పోయింది 
నగరం లో వేపుడు అయిపోయింది 
 
 
 
అహం వైశ్వానరోహ !
 
జిలేబి 

Monday, April 15, 2013

సొగసరి అబ్బాయికి కి గడసరి అమ్మాయి జవాబు !

మూడు రాత్రుల ముచ్చట అయ్యింది 
 
సొగసరి అబ్బాయి అన్నాడు 
 
నా హం కర్తా హరిహి కర్తా !
 
గడసరి అమ్మాయి అన్నది కదా 
 
క్రియా సిద్ధిహ్ రసత్వే భవతి !
 
 
శుభోదయం 
 
చీర్స్ 
జిలేబి 

Sunday, April 14, 2013

தமிழ் புத்தாண்டு நல் வாழ்த்துக்கள் !

 
తెలుగు బ్లాగ్ లోకం లో 
 
 ' అనైవరుక్కుం' ,
 
வாசகர் கள்  அனைவருக்கும்,
 
 தமிழ்  புத்தாண்டு
 
 நல் வாழ்த்துக்கள் !
 
 
చీర్స్ 
 
జిలేబి !