నేనిప్పుడు భవిష్యత్తుని చదవగలను - చూడ గలను - జిలేబి భవిష్యపురాణం :)
శిష్యా !
గురూ
ఇవ్వాళ్టి న్యూస్ పేపర్లన్నీ వచ్చేయా ? న్యూస్ ఛానల్ అన్నీ సమీక్షించావా ?
చేసేసాను గురూ !
లేక్ఖెంత ?
జపానులో పెను తుఫాను - మూడు శాల్తీలు లేచి పోయేయి
హు; శని మూడో గళ్ళ లో ఉన్నాడు .
సౌదీ లో వందమంది క్రేను క్రింద నుజ్జ్జు
సహస్రాణాం మయా సృష్ట్యాం రాసుకో . రాహువు కేతుని చూస్తున్నాడు .
ఇంకా ?
అమెరికా లో స్కూలు బస్సు ఆక్సిడెంటు - ఇద్దరు పిల్లలు
బాలార్కుని మార్కు ఇది రాసేసుకో .
ఇండో నేషియా లో ఖాండవ దహనం గురువర్యా
రాసుకో - అగ్ని దేవుడు నెయ్యి కోసం చూస్తున్నాడు .
లెక్ఖ లయ్యేయా ?
ఓ లెక్ఖ బకాయి గురూ !
ఏమిటోయ్ ?
అమెరికా వాడు వడ్డీ రేటు పెంచు దామా వద్దా అని ఆలోచిస్తున్నాడట ....
హు హు హు ! వాడి శ్రాద్ధం దరి దాపుల్లో కి వచ్చేస్తోంది - అమెరికా ఎంబసీ వాడు తనకు వీసా ఇవ్వక పోవడం గుర్తు కొచ్చే స్వామీ వారికి - రాసుకో - మిధునం లో మిడి మిడి పాటు తప్పదు . ధనుస్సు లో శని ప్రవేశిస్తున్నాడు . అయ్యిందా లెక్ఖ ?
ఓ మోస్తరు అయినట్టే గురువు గారు !
ఓకే ! వీటన్నిటిని మన రీసెర్చ్ విభాగానికి పంపి తీక్షణం గా గ్రహ గతుల్ని వీటి కనుగుణం గా సంశోధించు !
అట్లాగే గురువరా !
రాబోయే కాలం లో ఏమి జరుగును గురువరా ? ఎనీ క్లూ ?
బిడ్డా ! రాబోయే కాల రహస్యం శ్రీవిద్యా రహస్యం ! అది అందరికి చెప్ప బడదు ! కాలం దాట గానే పేపర్లో వచ్చె అన్ని బ్యాడ్ న్యూస్ లు సంకలనం చేసుకుని రా నా దగ్గిరికి వాటన్ని టికీ మూలాలను గ్రహ గతులనించి నీకు లాగి చూపిస్తా :)
గ్రహ గతులు అన్నింటి నీ నిర్దారిస్తాయ్ అవన్నీ నీకు అర్థం కావడానికి ఇంకా చాలా కాలం పడుతుంది - మొన్న అమావాస్య వచ్చింది చంద్రుణ్ణి చూసేవా ?
చంద్రుడు ఒట్టేసి కనబళ్ళేదు గురూ :)
శిష్యా ! నాకు నువ్వు తగిన పరమానందయ్య శిష్యుడవే !
జై బోలో గురు మహారాజ్ కీ ! జై జై జై! విజయీ భవ ! రాబోయే సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఏమి జరుగును గురు మహారాజ్ !
గుండు గురువు బవిరి గడ్డం తడివేరు ! - ఇరవై తొమ్మిదో తేది చెబ్తా నీకు ఆ రహస్యం :)
చీర్స్
జిలేబి