Tuesday, September 9, 2014

కాపీ కొట్టడం ఒక కళ - ఆ కళ ని కాపాడు కుందాం రండి !

కాపీ కొట్టడం ఒక కళ - ఆ కళ ని కాపాడు కుందాం రండి !
 
(కాపీ కొట్టడమన్నది అతి ప్రాచీన మైన కళ!)
 
మొదటి మారు కాపీ కొట్టడం ఎప్పుడు నేర్చు కున్నాం ?
చూచి రాత తో కాదూ !!

=========

బాబ్బాబు నా టపాలు కాపీ కొట్టండి !

'అదేమిటోయ్ జిలేబీ చాలా విచారం గా ముఖం వేలాడెసి కూర్చున్నావు ల్యాపు టాపు ముందు ?' మా అయ్యరు  గారు పరామర్సించేరు ఆప్యాయంగా .

కళ్ళ నీళ్ళు పెట్టుకున్నా.

ఏమిటి జిలేబీ నీ మొగానికి ఏడుపు శోభిల్లదే ! కలకంటి కన్నీరు ఒలికిన ప్రాబ్లం అన్న మాటే మరి ! ఏమి నీ బ్లాగు కష్టాలు అన్నారు మా అయ్యరు గారు.

ఏమండీ నా కష్టాలు అన్నీ బ్లాగు కష్టాలేనా ? అడిగా

కాకుంటే ? నీకు పొద్దస్తమానం ఆ కంప్యూటరు జత జేరే ! వేరే ఎ కష్టాలు నీ కుంటాయి ? రిటార్టు ఇచ్చేరు

హు అన్నా హా అన్నా మళ్ళీ కన్నీటి వరదలు చిందించా

ఏమిటోయ్ విషయం ఈ మారు కొంత సేద దీరేక అడిగేరు మా అయ్యరు  గారు మళ్ళీ.

నా టపాలు ఎవ్వరూ కాపీ కొట్టడం లేదండీ ! అని భోరు మన్నా !

ఓసి పిచ్చి దానా ! నీ టపాలు ఎవ్వరూ కాపీ కొట్టక పొతే సంతోష పడాలి గాని ఇలా భోరు మంటే ఎట్లా గే ?

టపాలు  ఎందుకు కాపీ కొట్టి పెట్టు కుంటా రండీ  ?

'ఆ , ఏముందీ, కూసింత నచ్చితే, బాగుంటే ఆయ్  ఈ టపా, కథ కాస్త బాగుందే  , మన బ్లాగులో దాచేసు కుందాం అని పెట్టేసు కుంటారు '

అంటే ఏమని అర్థం ? నా టపాలు ఎవ్వరికీ నచ్చ లేదన్న మాటే గా ? మళ్ళీ బోరు మన్నా !

'ఓసీ నీ బ్లాగు పిచ్చి కాకులెత్తుకు పొనూ !  ఇవన్నీ చేజేతులారా తెచ్చి పెట్టు కున్న కష్టాలు కావే మరి ! అని మా అయ్యరు  గారు ఓ  జాడూ  జమాయించి 'కాఫీ పెడతా ఓ గ్లాసెడు గొంతులో పోసుకుని మళ్ళీ టపా లల్లెసుకో ' అని 'ప్యారీ బీవీ' కోసం కాఫీ పెట్టడం కోసం కిచెను లో  కెళ్ళేరు 

బ్లాగు భామలు, బ్లాగు భయ్యాలు నా టపాలు కాపే కొట్టి మీ బ్లాగుల్లో 'ప్రచారం' చేసి నా కు గంపెడంత పేరు తెచ్చి పెడుదురూ మరి !!- మా తిరుపతి వేంకటేశు గారికి సిఫార్సు చేసి మీకు పుణ్యం వచ్చేటట్టు చూస్తా !!


(తెలుగు తూలిక డాట్ నెట్ మాలతి గారి టపా కామెంట్లు  చదివేక ! సరదాగా )


చీర్స్
జిలేబి

============

తాళాలు విరగ్గొట్టండి - సవాలే సవాల్ !

మా తాతయ్య కాలం లో (ఇప్పుడు మేమూ ఆ కాలానికే వచ్చేసాం అది వేరే విషయం!) మా ఇంట్లో గూట్లో ఓ పెట్టె ఉండేది. గూట్లో పెట్టేమిటీ అంటారా సవివరం గా చెబ్తాను.

మా నడిమింటి హాల్లో నించి మిద్ద పైకి వెళ్ళడానికి మెట్లు ఉండేవి. వాటి కింద ఓ పాటి గూటి లా ఓ ప్రదేశం ఉండేది. ఆ గూట్లో ఓ పురాతన చెక్క పెట్ట మా తాత గారిది ఉండేది. దాంట్లో వారేమో వారు కొన్న కొత్త కొత్త ఆ కాలపు (అంటే బ్రిటిషు కాలపు అన్న మాట ) గడియారాలు ఎలెక్ట్రిక్ సామాన్లు అట్టి పెట్టె వారు. ఆ పెట్టె కో తాళం కూడా భద్రం గా వేసి పెట్టె వారన్న మాట .

మా ఇంటి కాంతా జనావళికి వాటి మీద ఓ గుర్రు వుండేది. ఆ పెట్టెలో ఉజ్జాయింపుగా ఏమి ఉంటుందో తెలుసు గాని, మా తాతయ్య గారు ఆ పెట్టె ని తెరిచి మాకు చూపించనే చూపించరు. అందువల్ల వచ్చిన గుర్రు అన్న మాట అది.

ఇక తాతయ్య గారైతే అప్పుడప్పుడు మమ్మల్ని బయటకెళ్ళి ఆడుకొండ్రా బడుద్దాయిలూ అని గెంటేసి ఆ పెట్టె ని అప్పుడప్పుడు తెరిచి చూడడమూ, ఆ పై ఆ పెట్టి కి గోళ్ళం పెట్టి తాళం వెయ్యడమూనూ జరుగు తూండేది తప్పించి మేము ఎప్పుడూ ఆ పెట్టె లో ఏముందో (అంటే పూర్తి గా అన్న మాట) చూసిన ది లేదు !

కాక పోతే ఆ పెట్టె ఆయన అంత బద్రం గా తాళం పెట్టడం మాకు  ఉత్సుకతని కలిగించేది. ఆ పెట్టె తాళం ఎలా పగల గొట్టాలబ్బ అని అన్న మాట.

ఇక మా కాలానికి వస్తే మా అబ్బాయి మా మనవడు కంప్యూటరు ఎక్కువ గా ఉపయోగించకుండా ఉండడానికి తాళాలు పెట్టడం మొదలెట్టాడు. మనవడు కూడా తాడి తన్నే వాడి తల తన్నాలన్నట్లు వాళ్ళ నాన్న పెట్టిన తాళాలని విడగొట్టడం అన్న ఉద్యమం మొదలెట్టి అందులో నిష్ణాతుడై ఓ మారు వాళ్ళ నాన్నకే ఎదురు ఫిట్టింగులు ఇచ్చాడు అంటే , తనే ఒక తాళం పెట్టే డన్న మాట.

ఈ విషయం లో వాడి కెందుకో ఈ బామ్మ అంటే మమకారం. తాళం పెట్టినా బామ్మా , నీకు మాత్రం తాళం రహస్యం చెబ్తా నాన్నారికి తెలియనివ్వకు,  నీకు కంప్యూటరు ఎప్పుడు ఉపయోగించాలో అప్పుడు తాళం తీసి  ఉపయోగించుకో. ఆ తరువాత ఆఫ్ చేసెయ్యి. ఈ తాళం చెవి మాత్రం నాన్నారి చెవి కి పోనివ్వకు అని చెప్పేడు.

నాకాశ్చర్యం వేసింది. మా కాలం లో తాత వాళ్ళ తాళం ఎలా విరగ్గోట్టాలా అని మేం ఆలోచించే వాళ్ళం. ఇప్పటి తరం లో నాన్నారి తాళం ఎలా విరగ్గోట్టాలా అని వీళ్ళు షెర్లాక్ హోమ్స్ మొదలెట్టారు సుమా అని.

మొత్తం మీద ఈ కాలపు కుర్ర కుంకాల తో మంచి గా ఉండటం మనకే మేలు అన్న ఓ ఫైనల్ నమ్మకానికి వచ్చేసాను నేనైతే. మనం ఎంత  బుర్ర లేని మట్టి   బుర్రలని వాళ్లకు నమ్మకం వస్తే వాళ్ళు మనకు అన్ని తెకినీకులు సులభం గా అర్థం అయ్యే లా చెప్పేస్తారని నా కనిపించింది.

హన్నా, భావి తరం భాగ్య విధాతల్లారా, ఈ బామ్మ మీద మీరు దయ బెట్టి ఈలాంటి తెకినీకులు నేర్పిస్తూ ఉండండి, రాబోయే కాలం లో (పుట్టీ గిట్టీ పుడితే ) మీ ఋణానుబంధం తప్పక తీర్చేసు కుంటాను. అప్పటికి మీకన్నా నాకే ఎక్కువ తెలిసి ఉంటుంది కదా !

(Hopefully always the future generation is brighter than the past !!)

(future)
జీనియస్
జిలేబి.
 
===================
 
బ్లాగు బ్లాగు కీ పోయేను రాధా హరే
కూసింత మేటరు కొట్టు కొచ్చు కున్నాను కృష్ణా హరే !


అని ఆడుతూ పాడుతూ మేటర్లు బ్లాగుల నించి కొట్టేసుకుని పత్రికల లో అచ్చేసుకుని హాయి హాయి గా కాలం గడిపేసు కుంటున్న ఓ జిలేబీ కి ఉద్యోగం పోయే రోజులు దాపురిస్తున్నట్టు ఉన్నాయి.

ISA (Internal Sourcing Agent!) ఫర్ MSA (Matter Snuffing Agency) లో పని చేస్తున్న ఓ జిలేబీ కి తెల్లారి తెల్లారి లేస్తూనే బ్లాగు బ్లాగు కీ వెళ్లి మేటరు కొట్టేసుకుని వాటిని సీక్రెట్ గా పత్రికలకి కాణీ కి పరక కి అమ్మేసుకుని అవ్వాల్టి హా 'రమ్ము' హాయి హాయి అని పొంగి  పోతూన్న తరుణం లో ఓ ఇంటి ఇల్లాలు ముచ్చట తో గడ్డు రోజులు వచ్చేయి.

తాళాలు పెట్టండీ అన్న బ్లాగ్ నినాదం తో 'ఉత్తిష్ఠ , జాగృత, ప్రాప్యవరాన్.." అన్నట్టు ఉత్తేజం చెందిన వాళ్ళయ్యారు అప్పటి దాక ఉన్న పంచ దశ లోక వాసులు.

అంతటి తో బ్లాగులకి తాళాలు పడ్డాయి. !

స్నఫ్ఫింగ్ చేస్తూన్న జిలేబి కి కాపీ కి మేటరూ పోయే , కాఫీ కి కూడా కరువోచ్చే !

ఏమి చేతుమురో రాధా హరే,
నీవే దిక్కయ్య కృష్ణా హరే

అని పాడేసుకుంటూ ఇవ్వాల్టి జిలేబీ 'అప్రస్తుత ' ప్రసంగం ఇంతటి తో సమాప్తం !


చీర్స్
జిలేబి.
 
================
 
వామ్మో వామ్మో ఎంత కాపీ ఎంత కాపీ ! 

కాపీ క్యాటులు వారి కవాతులు.

అదేమీ చోద్యమో గాని, చౌర్యమో గాని

మక్కీకి మక్కీ మన టపాలని బ్లాగులని దిన పత్రిక వాళ్ళూ, వారపత్రిక వాళ్ళూ కాఫీ లాగిస్తూ కాపీలు కొట్టేస్తూ కవాతులు చేస్తున్నారట !

ఈ విషయాలు తెలీకుండానే నేను టపాలు గట్రా ఇన్ని రాసేసానే మరి.

నా టపాలన్నీ ఎక్కడెక్కడ తేలు తున్నాయో ! ఎవరైనా కాస్త తెలిస్తే  చెబ్దురూ !

ఈ గుళ్ళకి వెళ్లి నప్పుడు మనకు కలిగే నిత్యానుభవం ఇక్కడ గుర్తు తెచ్చు కోవాలి.

మనం భక్తీ గా స్వామీ వారీ ప్రసాదం అని ఎ అరటి పండో, లేకుంటే మరోదే టో చేతిలో పట్టు కుని కొంత సావకాశం గా ఆరగిద్దామని ఉంటాం, అప్పుడే, మన కోతీ వారు వచ్చి చలాగ్గా మన చేతిలోని పండు ని లాగేసు కుని చక్కా పోతారు !

ఇక మనం ఎం చేస్తాం ! స్వామీ వారు మనకు ఇంతే అనుగ్రహించారు అనుకోవాల్సిందే !

అట్లాగే కదా మన బ్లాగు వాళ్ళ గతి కూడా అయి పోయింది. !

మనం ఎ అర్ధ రాత్రో తెల్లారి జామో ఓపిగ్గా కూర్చొని, ఎ లేఖిని తొ టో కనా కష్టాలు పడి టైపాటు చేసి వామ్మా ఒక్క టపా రాసేను అని సంతోష పడి పొతే , ఈ పత్రికల వాళ్ళు వచ్చి దాన్ని పట్టేసుకుని, కొట్టేసుకుని వాళ్ళ పేపర్లో వేసేసు కుని (అంతా 'ఖూనీ') మనకు తెలీనివ్వ కుండా గప్పు చిప్పుగా కాపీ కొట్టేసుకుని ....

కాబట్టి మనం ఏమి చేయ్యవలె. ? అరవం లో ఒక సామెత ఉంది. ఈ అడిచ్చా కాపీ అని. అంటే ఎదుటి వాడు రాసేటప్పుడు ఒక ఈ గ వచ్చి వాలితే దానినీ కొట్టి రాస్తే, మనమూ ఒక ఈగని కొట్టి రాస్తామన్న మాట. అట్లాగా, మనం రాసేటపుడు సీక్రెట్ గా ఓ ఈగని కొట్టి రాసామంటే వాళ్ళూ కూడా ఒక ఈగని కొట్టి రాసి , మనకు దొరికి పోతారు సుమా !

 వావ్ నాకూ మాంచి ఐడియా వచ్చేసిందోచ్ !

Sunday, September 7, 2014

ఇచ్చట జిలేబీలు అమ్మకానికి గలవు !

ఇచ్చట జిలేబీలు అమ్మకానికి గలవు !

ఏమిటోయ్ జిలేబి ,మరీ చిట చిట లాడి పోతున్నావు అయ్యరు గారు నిమ్మళం గా అడిగేరు .

నా ముక్కు పుటాలు అదిరేయి . భూదేవి భయపడి కందింది కాలి అందెల జోరుకి .

వామ్మో జిలేబి ఇది నువ్వే నా ? ! ఇంత గా ఆకాశానికి ఎగిరెగిరి పడి నీ కోపాన్ని ప్రదర్శిస్తున్నావ్ ! అయ్యరు గారు హాశ్చర్య పడి పోయేరు .

కాదా మరి కాదా మరి అన్నా హుంకరిస్తో .

ఏమిటోయ్ నీ బాధా  ! అడిగేరు  అయ్యరు గారు .

నా బ్లాగు టపాలని కాపీ కొట్టే స్తున్నారు జనాలు . నా జ్ఞాన సంపద ని కాపీ రైటు లేకుండా లెఫ్టు రైటు కాపీ కొట్టేస్తూ నా పేరు కూడా ఉదహరించ కుండా అంతా తమదే నన్నట్టు రాసేసు కుంటున్నారు మళ్ళీ ఇంతెత్తు కి ఎగిరా .

ఏమన్నావ్ నీ జ్ఞాన సంపదా ? అడిగేరు అయ్యరు గారు

అవును నా జ్ఞాన సంపద, నా విజ్ఞానం, నా అనుభవ సారం అంతా కలబోసి నేను టపాల ని పుష్పమాల గా కూరుతూంటే , జనాలు విచ్చల విడి గా పుష్పాపచయం చేస్తున్నారు .

పుష్పాపచయం ! మంచి పదమే వాడేవు జిలేబి !! పుష్పాపచయం కాకుంటే, పుష్పం మరో రోజులోపు నేల పాలు! అయ్యరు గారు ఫక్కున నవ్వేరు!

నీ జ్ఞాన సంపద ? నీ విజ్ఞానం ? అవన్నీ నీ కెవరు ఇచ్చేరు జిలేబి ? అయ్యరు గారు అడిగేరు 

ఎవరిచ్చేరు అంటే ? ఎవరివ్వడం ఏమిటి ? అవి నావే అవి నావే అన్నారెండో మారు నావే అన్నప్పుడు నా కెందుకో మరి సందేహం వచ్చింది . నావ నావ ఈ శబ్దం దేన్నో సూచిస్తోందే ? ఏమిటది చెప్మా అన్న ఆలోచనలో పడ్డా .

'ఏదో ఆలోచనలో పడ్డట్టు ఉన్నావే జిలేబి ? అయ్యరు గారు బాణం ఎక్కు పెట్టేరు .

అంటే , నావే కదా ఈ జ్ఞాన సంపద ?

'నావే' మరి ! అయ్యరు గారు నావని నొక్కి వక్కాణించేరు .

ఈ జ్ఞానం ఎవరిచ్చేరు నీకు జిలేబి ?

మళ్ళీ ఆలోచనలో పడ్డా .

ఈ జ్ఞానం నీకు కాకుంటే వేరే ఎవరికైనా దక్కే అవకాశం ఉందంటా వా ?

ఏమో ఈ మారు కొంత లో వాయిస్ అయ్యింది నాది .

ప్రకృతి నీ ద్వారా కాకుంటే మరో ఎవరి ద్వారో ఈ జ్ఞానాన్ని పంచి పెట్టేది కాదా ?

కాదని చెప్పటానికి ఎందుకో సందేహం వచ్చింది .
 
సమోహం సర్వ భూతేషు ! అన్నాడు పై వాడు .

మా కాలం లో రైట్ హాన్రబాల్ శ్రీనివాస అయ్యరు గారి ప్రసంగాలు , లెక్చర్లు చదివే వాళ్ళం. ఆహా ఏమి వీరి అంగ్ల పాటవం ! ఏమి వీరి జ్ఞాన సంపద అనుకుని అబ్బుర పడే వారం . ఈ కాలం లో ఈ రైట్ హానరబెల్ శ్రీనివాస అయ్యరు గారి గురించి వారి రచనల గురించి ఎవరి కైనా చెబ్తే , ఆ ఎవరాయన అని అడగరా ?

అడుగుతారు అన్నట్టు తలూపా . నేనే మరిచి పోయా అట్లాంటి మేధావుల గురించి .

అంటే కాల వాహిని లో మనం వ్రాసేవి, వెలుబరచేవి ఆ కాలానికి, మరీ మించి పోతే  మరో ఒక తరానికి రంజు గా ఉండ వచ్చు. ఆ పాటి దానికి నా జ్ఞానం నా సంపదా అంటూ , తెలిసిన వాటిని కూడా (ఆ తెలియబరచిన వాడెవ్వడు?) మనం చెప్పడం మానేయటం సబబేనా ? అయ్యరు గారి పృచ్చ !

ఈ అయ్యరు గారి వైపు సూటి గా చూసా . చాలా సహజం గా ఏమీ తెలియని భోళా మనిషి గా కని పిస్తాడు గాని, ఇట్లాటి 'విష్ణు మాయ ' లో పడి పోయినప్పుడు మాత్రం విచిత్రం గా ప్రశ్న లతో నే కొంత కనువిప్పు కలిగిస్తాడు సుమీ అనుకో కుండా ఉండ లేక పోయా !

అంతే నంటారా ?

"కాదా మరి ? నీకు తెలిసింది నువ్వు తెలియ బరచు. ఎవరో ఎదో కాపీ కొట్టే స్తున్నారని నువ్వు చెప్పటం ఆప మాకు !
నువ్వు కాకుంటే మరొక్కరెవ్వరినో ప్రకృతి వరిస్తుంది. "

తలూపా. తల నాదేనా మరి మళ్ళీ సందేహం !!

'some' దేహం ఇచ్చిన ఆ సమ 'దేహుడు' ఈ మెదడు నిచ్చి చాలా తప్పు చేసేడు సుమీ అనుకో కుండా ఉండ లేక పోయా !!

చీర్స్
జిలేబి
(శ్రీ కష్టే ఫలే శర్మ గారి -  బ్లాగు అమ్మకానికి గలదు టపా చదివేక!)
 

Saturday, September 6, 2014

బాపు జాతకం - ఒక పరిశీలన

 
బాపు జాతకం - ఒక పరిశీలన
 
ఈ టపా ఇక్కడ లేదు !
 
ఎప్పుడు వచ్చునో తెలియదు
 
వచ్చినప్పుడు చదువు కొనుడు
 
జిలేబి
 
(ఇంకా ఈ టపా రాలేదిమిటి చెప్మా ??)
 
 

Thursday, September 4, 2014

నేటి సమస్యా 'నివారణ !- దమ్ముతో డ్రమ్ము వాయించిన ట్రిలియన్లు దక్కున్!


బ్లాగ్ మిత్రుల్లారా
 
నేటి సమస్యా 'నివారణ !- దమ్ముతో డ్రమ్ము వాయించిన ట్రిలియన్లు దక్కున్!


ఫోటో కర్టసీ గూగులాయ నమః !
 
చీర్స్
శుభోదయం
జిలేబి

Tuesday, September 2, 2014

బాపు గారికి నివాళి- శ్రీ కేశవ్ గారి చిత్రం

 
బాపు గారికి నివాళి
 
 ది హిందూ ఆర్టిస్ట్ శ్రీ కేశవ్ గారి చిత్ర నివాళి
 

Courtesy--> kamadenu.blogspot.com
by Shri Keshav of The Hindu
 
జిలేబి

 

Saturday, August 30, 2014

ఇక మీదట నేను దేవుణ్ణి నమ్ముతాను !!


దేవా కన రావా కరుణించి ... " ఓ కొత్త భక్తుడు ప్రార్థించడం మొదలెట్టాడు.

పైనున్న కనులు కనబడని, చెవులు వినిపించని దేవునికి హటాత్తు గా కళ్ళు కనిపించి, చెవులు వినిపించడం మొద లెట్టింది . హటాత్తు గా అనడం తప్పు. ఈ మానవ మాత్రుల తో 'లావాదేవీ లు మాట్లాడి మాట్లాడి ,దేవుడు కూడా బిజినెస్స్ అంటే ఏమిటో ఓ మోస్తరు అర్థం చేసుకున్నాడు . బిజినెస్స్ కి కావాల్సింది న్యూ బిజినెస్స్ అన్న సూత్రం అన్నది గ్రహించేడు . అంటే, తన బిజినెస్స్ బాగా నడవాలంటే , ఆల్వేస్ కొత్త బిజినెస్స్ ఉండా లన్నది ప్రాథమిక మౌళిక సూత్రం .

అందుకే కొత్త భక్తుడు ఎవడైనా కొంత గీ పెట్టినా చాలు - వెంటనే తన్ని కలవడానికి, తనతో భేటి ఇవ్వడానికి , అతను చెప్పే మాటలు విని వెంటనే వాడికి ఓ సౌలభ్యమైన 'సొల్యూషన్' ఇవ్వడానికి పై నున్న భగవంతుడు వెంటనే ఆతురత చూపిస్తాడు . అదే పాత భక్తుడైతే వాడు అరిచి గీ పెట్టినా అస్సలు పట్టించు కోడు - అట్లాస్ట్ దేవేరి ఏమైనా రెకమెండు చేస్తే , అప్పుడు పోనీ లే అని కొంత కరుణి స్తాడు !

తన ద్వార పాలకుణ్ణి పిలచి ఆ కొత్త భక్తుడి మొరని వినడానికి ఉద్యుక్తు డయ్యాడు 

నీ పేరేమి నాయనా ! కరుణాంత రంగుడై అడిగాడు భగమంతుడు!

కొత్త భక్తుడు పేరు చెప్పాడు !

అరె, నా అవతారాల లో రెండు పేర్లు కలిపి పెట్తుకున్నావే ! మెచ్చు కోలు గా చూసేడు భగవంతుడు  . ఈ బిజినెస్స్ టెక్నిక్ కూడా భగవంతుడు ఈ  మానవ మాత్రుల వద్దనించే నేర్చుకున్నాడు - ఏదైనా సరే మొదటి అప్ప్రీ షిఎట్ చేయాలి ! కొంత పెప్పర్ కలిపి అనినా సరే యు ఆర్ హేండ్ సామ్ యు నో అనాలి !

కొత్త భక్తుడు చెప్పాడు - అది మా పేరెంట్స్ నాకు తగలెట్టిన పేరు - అసహ్యం గా ముఖం తిప్పేడు .

భగవంతుడు గతుక్కు మన్నాడు ! వీణ్ణి వదిలించు కోవటం బెటరు అనుకుని

భక్తా నీ కోరిక ఏమి ? అడిగాడు

దేవా, నేను దయ్యాల్ని నమ్మి కథలు గట్రా రాసేను . మొదట్లో సూపెర్ డూపెర్ అయ్యేయి అవి . ఆ పై అంతా ఫ్లాప్ షో ఐ పోయేయి . వీటికి కారణం నేను దెయ్యాల్ని నమ్మటం వల్లే నని నమ్మి , ఇక మీదట మారాలి అనుకుని నిన్ను నమ్మడం మొదలెట్టా చెప్పాడు భక్తుడు -- "నా కథలు, బ్లాగులు గట్రా సక్సెస్ అయ్యే మార్గం చెప్పు .

మళ్ళీ లావాదేవీయేనా భగవంతుడు దీర్ఘం గా ఆలోచించి చెప్పేడు -


భక్తా ! నీ మార్పు కి సంత సించి నాడను !

నీకూ దెయ్యాలకి ప్రారబ్ధ కర్మ అవశేషం ఇంకా తీరలేదు కాబట్టి నువ్వు దెయ్యాల గురించి ఇంకా ఇంకా రాస్తూనే ఉంటావు కాని ఇప్పుడు నన్ను నమ్మాలని వచ్చేవు కాబట్టి చెబుతా - ఇక మీదట దేవుణ్ణి నమ్మిన దెయ్యాల గురించి కథలు, బ్లాగు లు టపాలు గెలుకు అవి సూపేరు డూపెరు అవుతాయి

ధన్యోస్మి ధన్యోస్మి స్వామీ ! చెప్పేడు కొత్త భక్తుడు సంతోషం తో !


చీర్స్
జిలేబి



 

Friday, August 29, 2014

గణపతి జిలేబీయం !

సమో అహం సర్వ భూతేషు ...
 
గణేశ చతుర్థి శుభాకాంక్షలతో
 
ఇవ్వాళ గణేశ చతుర్థి కాబట్టి రేపు బ్లాగు కి సెలవు !!
(న్యూసు పేపరోళ్ళం !)
 
జిలేబి

 
(ఫోటో కర్టసీ గూగులాయ నమః!)
 

Tuesday, August 26, 2014

జిలేబి జాకెట్ ఛాలెంజ్ !

జిలేబి జాకెట్ ఛాలెంజ్ !

ఈ మధ్య ఐసు బకెట్ ఛాలెంజ్ అని ఎవరో అంటే , మరోక్కరు లోకలైజేడ్ వెర్షన్ రైజ్ బకెట్ ఛాలెంజ్ అంటే , మనం కూడా ఒక జిలేబి బకెట్ ఛాలెంజ్ అని ఛాలెంజ్ విసరోచ్చు కదా అని హెడ్డింగ్ పెడితే అప్పు తచ్చై అది జిలేబి జాకెట్ ఛాలెంజ్ అయి కూర్చోంది .

బకెట్ ఐతే నేమి, జాకెట్ ఐతే నేమి శ్రీ శ్రీ లాంటి కవులకి అగ్గి పుల్ల సబ్బు బిళ్ళ, కవితా వస్తు వైతే, సినీ 'కావు' కావు లకి కిటికీ లు పెట్టిన జాకెట్టు కిత కిత లు పెట్టె 'ఐటము సాంగోప సాంగము లైతే , మరి మనకు మాత్రం జిలేబి జాకెట్ ఛాలెంజ్ అన్న హెడ్డింగు ఎందుకు పనికి రాదు అనుకుని 'పని లేక' కాస్త 'కష్టే' పడి కామెంటు ఫలముల కోసం ఒక టపా కొట్టి చూద్దారి అనుకుని ఈ టపా మొదలెట్టా !!

ఇంతకీ ఈ జిలేబి బకెట్ ఛాలెంజ్ ఏమిటి ?

బ్లాగు లోకానికి తిలోదకాలిచ్చిన బ్లాగోదరుల్లారా, బ్లాగోన్మణీయు లారా , ఇదే జిలేబి బకెట్ ఛాలెంజ్  ! మీరందరూ మళ్ళీ బ్లాగు లోకాని రండి ! ఇదే ఈ బకెట్ ఛాలెంజ్ !! ఈ టపాలకి (నా ఒక్క టపా కి మాత్రమె కాదు ) ఈ 'ఈ' లోకపు , పంచ దశ లోకపు టపాలకి లైకులు కొట్టి బకెట్ ఛాలెంజ్ విసరండి !!

రండి ,అ బకెట్ల కొలది కామెంట్ల తో ఛాలెంజ్ లు విసురుకుని బ్లాగు లోకాన్ని  మళ్ళీ మక్కలిరగ దీద్దాం !!

శుభోదయం
చీర్స్
జిలేబి
జాకెట్ అని రాసానా అది క్లిక్కుల కోసం -- అప్పు తచ్చు ! బకెట్ ఛాలెంజ్ అన్న మాట !

Saturday, August 23, 2014

జిలేబి (ల) సింగపూరు విజయం!!


జిలేబి (ల) సింగపూరు విజయం!!

ఇదిగో జిలేబి సుష్మా మేడం ఫోను నీకు పెందరాళే ఫోను !

జిలేబి జి, కల్ హీ నికల్ చల్నా సింగపూర్ ఆ వైపు నించి మేడం గారి హుకుం !!

మరో రెండు గంటల్లో మరో ఫోను

మమతా దీది ఆన్ లైన్ లో ఉన్నారు -- ఈ మారు అయ్యరు గారు కొద్దిగా సందేహిస్తూ ఫోనిచ్చేరు 

"మోయ్ సింగపూర్ జాబో లాగే, అప్నోర్ పేక్ రెడీ కొరో '

మరో నాలుగు గంటల్లో మరో ఫోను

జిలేబి నువ్వేమన్నా మరీ అంత గొప్ప ఫిగర్ వా ? కేసీఆర్ ఆన్ లైన్ అయ్యరు గారు అబ్బుర పడేరు !

జిలేబి గారు, జర ఈ వారం లో సింగ పూరు కెళ్లాల . కూసింత మీరూ సాయం పడుదురూ ... అసలే అరవ మేళం అక్కడ కొంత మాట సాయం ఉంటాది '

బాల్చీ తంతే నెక్స్ట్ ఫ్లైటు లో మేడం సుష్మాజీ గారితో సింగపూరు లో పడ్డది జిలేబి !!
ఏమిటో మరి ఈ మధ్య వరస బెట్టి అందరూ సింగపూరు పయనం కట్టె స్తున్నారు !!

మన 'ఆచంద్ర తారార్కం' వారు  ఆంధ్ర దేశాన్ని సింగపూరు లా చేసేస్తా మన్నారు !!

అదేమీ సింగపూరు మాయయో అనుకుని జూస్తే 'సింగపూరు' సింగారి పాట గుర్తు కొచ్చింది

ఇక మిగిలింది సుష్మా గారి వెనకాల్నే మన మోడీ గారు 'సింగా పోరు' వెళ్ళడమే మరి !!

శుభోదయం
జిలేబి

Thursday, August 14, 2014

ఇక మీదట జిలేబిలు చుట్టటం ఆపేయ దలచు కున్నా !


ఇక మీదట జిలేబిలు చుట్టటం ఆపేయ దలచు కున్నా 

చాలా సీరియస్ గా ఆలోచించి ఇక మీదట జిలేబీలు వేయటం ఆపేయ దలచుకున్నా !

బ్లాగుల టపాలు గెలకటం జిలేబీ లు వేయటం రెండు వేల ఎనిమిదవ సంవత్సరం లో మొదలయ్యింది . అంటే ఇప్పటి దాకా దాదాపు ఆరు సంవత్సరాలు గా వేస్తున్నా .

ఈ ఆరు సంవత్సరాల లో అప్పుడప్పడు జిలేబీ లు హాట్ హాట్ అయ్యేయి . కొన్ని సమయాల్లో 'పులిసేయి' . కొన్ని సమయాల్లో జిలేబి లు బూమ్ రాంగ్ అయి మీద పడ్డేయి

ఇవన్నీ చూసుకుంటూ , ఆ పై కూడా రాయకుండా ఉండకుండా జిలేబీ లు 'ఘీ'మ్ కరించ కుండా ఉండ లేక పోయా .

ముదుసలి కాలం లో ఓయ్ జిలేబి నీకు ఇది ఏమి ఈ ఆరాటం, యంగ్ జనరేషన్ తో పోటీ పడుతో కామెంట్ల పంటలు పండిచడం నీకు తరమా అని మా అయ్యరు గారు అప్పుడప్పుడు అనడం కూడా పరిపాటి అయి పోయే

అందుకే చాలా సీరియస్సు గా ఆలోచించి ఇక మీదట జిలేబీ లు వేయకుండా  ఉండాలని టపాల కి స్వస్తి వాచకం పలికి రిటైర్ అయి పోవాలని అనుకుంటున్నా .

ఇక ఈ టపా వీక్షకులు కాదూ కూడదూ అంటే ప్చ్ ప్చ్ అని రెండు రోజుల్లో మరో మారు టపా పునః 'ఘీం' కీ కరణం కావించక తప్పదని కూడా అనుకుంటున్నా  !!

కాబట్టి అరివీర బ్లాగు వీరుల్లారా , వీర నారీ మణుల్లారా ! ఇదియే 'బ్లేడు' జిలేబి వేయు ఆఖరి జిలేబి !!

చీర్స్
జిలేబి

(బ్లాగు లోకం లో ఇది ఒక సదాచారం - అప్పుడప్పుడు ఇట్లా 'అస్త్ర సన్యాసం' చేస్తున్నా అని టపా రాయటం ఇది ఒక ఆచారం/పరిపాటి . కాబట్టి నేను కూడా ఈ ఆచారాన్ని, సదాచారాన్ని పరిపాటి ని మన్నించి ఈ టపా వేయటం జరిగినది ! కాబట్టి బ్లాగోదరుల్లారా ఈ టపా సీరియస్సు ని మీరు గమనించగలరని నా అఖండ విశ్వాసం ! --దురదస్య దురదః జిలేబి నామ్యా దురద గొంటాకుహ !!)

Wednesday, August 13, 2014

"ఈ ఒక్క జన్మ చాలు" అనబడు - యాదృచ్చిక జిలేబి ఆత్మ ఘోష !

 
"ఈ ఒక్క జన్మ చాలు" అనబడు - "యాదృచ్చిక జిలేబి" ఆత్మ ఘోష !

ఏమోయ్ జిలేబి బర బరా గీకి పారేస్తున్నావ్ అదీ చెమటలు కారి పోతున్నాయి . అడిగేరు మా అయ్యరు గారు .

హు అన్నా హా అన్నా !

అదేమండి అయ్యర్ వాళ్ ! పోయే కాలం వచ్చేసింది ఇక అందుకే నా ఆత్మ కథ ని రాసి దేశం మీద తోలేసి, తాంబూలా లిచ్చేసా తన్నుకు చావండి లెవెల్ లో నా ఆత్మ కథ రాసి పడేస్తున్నా చెప్పా మా అయ్యరు గారికి

ఎందుకోయ్ జనాల మీద అంత కోపం నీకు

హు అన్నా హా అన్నా !

కాకుంటే మరి, నా లైఫు లో ఇట్లాంటి దేశం లో పుట్టి నేనింత జబరదస్త్ గా దేశానికి సేవ జేస్తే అసలు దేశం నా కేమిచ్చింది హుంకరించా

అందుకని?

అందుకే , 'ఈ ఒక్క జన్మ చాలు ' అన్న నా ఆత్మ కథా ఘోషని దేశం మీదకి తోల బోతున్నా ! చెప్పా

నువ్వు చచ్చేది కాక ఆ పుస్తకాన్ని పబ్లిష్ జేసి ఎన్ని చెట్లని చంప బోతున్నావో మరి - మా అయ్యరు గారు నిట్టూర్చేరు .

చెట్ల ని మాత్రమె కాదండోయ్, నా జీవిత పథం లో వచ్చిన ప్రతి ఒక్కరి భాగోతం బట్ట బయలు జేస్తా . నా ఆత్మ ఘోష కి నేనే హీరోయిన్ కాబట్టి ఆ కథ లో ఒక్కరే సిన్సియర్ ఐన వారు - అది నేనే నేనే నేనే . మిగిలిన వాళ్ళంతా నా ఘోషకి హాం ఫట్ అవ్వాల్సిందే !

ఇంతకీ నా గురించి ఏమి రాస్తున్నావే జిలేబి ?

మీ గురించా ! మీరు నన్ను జిలేబి ని జేసినారని వాపోతా చెప్పా మరో వంద పేజీల ఘోష ని రాసి పడేసి కుదేసి !


శుభోదయం
జిలేబి
దేశం లో ఇప్పుడు ఆత్మ ఘోష ల కాలం - ప్రతి ఒక్కరు ఘోషిస్తున్నారు - ఇక నేను కూడా 'ఘోషా' యిస్తా !!

 

Monday, August 11, 2014

బ్లాగ్జోతిష్య శర్మ గారి కసౌటీ కి - మరో ఫ్లైటు కూలె !

బ్లాగ్జోతిష్య శర్మ గారి కసౌటీ కి  - మరో ఫ్లైటు కూలె !

అది ఏమి మాయయో అంతా విష్ణు మాయ గా ఉన్నది
మా అయ్యవారు 'ప్రేడిక్ట్' చెయ్యటం వల్ల ఫ్లైటులు పెడేలు మని కూలుతున్నాయా 
లేక ఫ్లైటు లు కూలేక మా అయ్యవారు దానికి 'భాష్యం ' రాస్తున్నారా అన్నంత గా
ఒకటి నొకటి ముడేసు కుని మోదేసు కుంటున్నాయి

దీనికి తోడు నక్షత్ర కన్యల రేడు చంద్రుడు కూడాను ! !

ప్చ్ ! ఈ సమీకరణానికి తెర ఎప్పుడో మరి


 
జిలేబి 

Tuesday, August 5, 2014

డొల్ల వేణువు !

డొల్ల వేణువు !
 
వేణువు డొల్ల 
డొల్ల వేణువు 
 
 
 
శుభోదయం 
జిలేబి 

Saturday, August 2, 2014

'ఆంధ్రాయిణి'- Meet Zilebi on Android!

 
'ఆంధ్రాయిణి'- Meet Zilebi on Android!

ఏమోయ్ మనవడా , ఈ మధ్య 'ఆంధ్రాయిణి' మరీ పాపులర్ అయి పోతోంది గదా , నా బ్లాగు కూడా కూసింత
ఆంధ్రాయిణి లో పెట్టించ కూడ దంటే, అదేమీ అంత పెద్ద విషయం కాదే బామ్మా అంటూ మా మనవడు ఇప్పుడు
నా వరూధిని బ్లాగుని 'ఆంధ్రాయిణి' గా ఆవిష్కరించేడు !!

సో, బాలాగు, సోదరీ సోదర మణీ మాన్యులారా !

స్వాగతం సుస్వాగతం -- జిలేబి ఆన్ ఆన్ద్రాయిడ్ !!

ఏమోయ్ మరి ఎట్లా గూగుల్ ప్లే నించి డౌన్లోడ్ చేసు కోవచ్చా అంటే, కూసింత ఖర్చు అవుతుందే అన్నాడు !

వద్దులేరా అబ్బి , ఏదన్నా ఫ్రీ గా ఉంటె జెప్పు అన్నా

సర్లే ఈ లింకు లో నించి ఏ పి కే డౌన్లోడ్ చేసుకుని నీ 'సమసంఘ' గాలాక్షీ కి పెట్టిస్తా - ఏ పి కే ఫైలు ని ఇన్స్టాల్ చేసు కుంటే ఇక జిలేబి హాట్ ఆంధ్రా యిడ్ అప్లికేషన్ తయార్ !!

ఇడ్లీ వడా బక్కెట్టు సాంబారు తో బాటు జిలేబి ఇక అంధ్రాయిణి కూడాన్ను !!


http://www.appsgeyser.com/getwidget/Varudhini/




చీర్స్
 

Monday, July 28, 2014

ఇవ్వాళ వర్జ్యం కాబట్టి ఫ్లైటు డిలే !!

ఇవ్వాళ వర్జ్యం కాబట్టి ఫ్లైటు డిలే !!

ఏమమ్మాయి  ఫ్లైటు డిలే  ? అడిగా ఫ్లైటు ఎక్కి ఎంతకీ బయలు దేరక పోతే

వర్జ్యం ఉందండి కాబట్టి ఫ్లైటు లేటు గా బయలు దేరుతుంది చెప్పిందా చూడ చక్కని సుందరాంగి కాని ఫ్లైటు సుందరి .

ఆ అన్నా ఇదేప్పటి నించి వర్జ్యం గట్రా చూడ్డం మొదలెట్టేరు మీరు ?

ఈ మధ్య వరసబెట్టి ఫ్లైటు లు కూలు తూంటే మా ఎయిర్ లైన్ వారు ఆ స్ట్రో కన్సేల్టే షన్ కొత్త గా మొదలెట్టే రండీ ... ఆ పధ్ధతి ప్రకారం బయలు దేరే ముందు వర్జ్యం గట్రా కాలం చూసు కుని ఫ్లైటు ని ఆకాశం లో కి లేపమని మా మేనేజు మెంటు ఉత్తర్వు ' చెప్పిందా ఎయిర్ హోస్టెస్ .

మరో కొత్త తరానికి కొత్త పునాది కి నాంది !

చీర్స్
జిలేబి

 

Friday, July 18, 2014

ఇక మీదట నేను 'ట్వీటర్' తో నే బ్లాగాడుతా !! - @జిలేబిహాట్ !

ఇక మీదట నేను 'ట్వీటర్' తో నే బ్లాగాడుతా !! - @జిలేబిహాట్ !

ఈ మధ్య 'పే' పరులు - అనబడు 'పేపర్లు' చూస్తోంటే అసలు పేపర్లు చదవాలా లేక వాళ్ళ వాళ్ళ ట్వీ ట్ల కి తీత లకి సబ్ స్క్రైబ్ చేస్తే పోలా అని పిస్తోంది !!

ఇంత కు ముందు జమానా లో మా మీడియా విలేకరి పాపం ఉరుగులు పరుగులు పెట్టి సమాచారం సంపా దించే వారు !! ఆ తరువాత వాటిని కష్టపడి టెలెక్స్ ల తో కుస్తీ పడి , ఫోన్ల తో బెజారుపడి ఎట్లాగో అట్లా న్యూసు రూమ్ కి అందించే వారు !

ఈ మధ్య ఎలెక్ట్రానిక్ మీడియా పుణ్య మా అని , ఎస్ ఎం ఎస్ లు, ఈ మైళ్ళు గట్రా లతో స్వంత న్యూస్ లనో కాకుంటే బారోడ్ న్యూస్ లనో తమ తమ పేపర్లకి 'టం' టం' చెయ్యటం సర్వ సాధారణం !!

ఇక ఇప్పుడు నడుస్తున్న మోడీ గారి జమానాలో ఏమన్నా సరే, న్యూస్ అంటే ట్వీ ట రీ దేవి కరుణా కటాక్షములే అన్న స్థాయి కి వచ్చేసింది !

ఇక మా హిందూ వారైతే పోద్దస్తమాను , మోడీ ఇట్లా ట్వీ టెన్ గట్లా ట్వీ టెన్ అంటూ ఊదర గొట్టడం (వేరే పేపర్లు నేను చదవను గాక చదవను అయినా ఊహించ గలుగుతా - మా మీడియా గురించి మాకు తెలీదా మరి -- వాళ్ళు అంతే నని కీబోర్డు నొక్కి 'ట్వీ టి త్వీటి మరీ వక్కాణించ గలను !) మొదలెట్టేరు !

ఇక న్యూస్ పేపర్లు , మీడియా వాళ్లకి మసాలా ట్వీ ట్ల తిట్ల లో నే ఉందని తెలిసి పోతోంటే నేను మాత్రం ఎందుకు ట్వీ ట కూడదు @జిలేబిహాట్ అంటూ సెటిల్ అయి 'ట్వీటీ స్వీట్ తార' అయి , రాబోయే కాలం లో బ్లాగులు కూడా ట్వీ ట ర్నిం చె చేయ దలచుకున్నా !!

అంతే కాదు ఈ పొద్దున మా అయ్యరు గారికి కాఫీ పెట్టి వారికే ఒక ట్వీ టు పెట్టా - యువర్ కాఫీ ఈజ్ రెడి డియర్ అంటూ !!

జిలేబి యా మజాకా మరి !!

ఫాల్లో మీ @జిలేబిహాట్ !!

చీర్స్
@zilebihot

Saturday, July 12, 2014

దేముడి కాలి బంతి !

దేముడి కాలి బంతి !
 
 
'పోపుల'
ప్రార్థనలకి
దేముడి
కాలి బంతి
సవాలు !!
 
చీర్స్
జిలేబి
జర్మనీ అర్జంటీనా
కాలి బంతి ఆట
కి స్వాగతం !!
 

Saturday, July 5, 2014

గోల్కొండ కి దారెటు ?


నాంపల్లి స్టేషను కాడా
రాజాలింగో .. రాజాలింగా !
ఈ గోల్కొండకి దారెటు ?
చీర్స్
జిలేబి
 
 
(పన్ ఇంటేన్దేడ్ - నో సీరియస్నెస్  ప్లీజ్!!
ఫోటో కర్టసీ : గూగ్లాయ నమః !)

Thursday, July 3, 2014

సదా పాలయ సారసాక్షి -'మోహన' జిలేబీయం !


సదా పాలయ సారసాక్షి -'మోహన' జిలేబీయం !
 
Enjoy మోహన  రాగం !
Sadaa Paalaya Saarasaakshi
Lyrics GN Balasubrahmanyam 
From the movie Mr Fraud
 
 
 
చీర్స్
జిలేబి

Monday, June 30, 2014

ప్రతికూల గ్రహ టెర్రరిస్టులు !!

ప్రతికూల గ్రహ టెర్రరిస్టులు !!  

ఏమోయ్ జిలేబి నీ కు గ్రహాలన్నీ ప్రతి కూలం గా ఉన్నాయ్ మరి !!

మండి పోయింది !

ఏమో మరి ఈ ప్రతికూల గ్రహ 'టెర్రరిస్టుల' నించి మనకు ఎట్లా విముక్తి మరి ??

టెర్రరిజం ఎక్కువైతే ఎన్కౌంటర్ చేసేస్తారు పోలీసోళ్ళు .

మరి అట్లాంటి ఫీచర్ మన లాంటి సాదా సీదా జనాలకి ప్రతికూలం గా పని జేసే ఈ 'గ్రహాల' ని ఎన్కౌంటర్ చేయడానికి లేదాయే మరి !

ఏమిటో అంతా విష్ణు మాయ !!

నో చీర్స్
జిలేబి

(ఆలోచనా తరంగాలు - బ్లాక్ సాటర్ డే చదివాక !)