Sunday, March 11, 2012

జ్యోతిష్యం ఒక నమ్మక వాహిని

నమ్మకం అన్నదానికి అర్థం - తార్కికానికి  ఆవల ఒక దాన్ని విశ్వసించడం అనుకో వచ్చు.

ఈ డెఫినిషన్ కింద ఆలోచిస్తే - జ్యోతిష్యం నమ్మే కొద్దీ దాని ప్రభావం మన జీవితాలలో పెరగడం దీన్ని నమ్మే వాళ్ళలో చాల మంది గమనించడం జరగడం సర్వ సాధారణం. - ఇందులో తల మునకలైన వాళ్లకి - ప్రతి విషయం జ్యోతిష్యం అలా చెప్పినందు వల్ల  ఇలా జరగడం అయ్యిందన్న మాట అని సరిపెట్టుకోవడం కాకుంటే దానికి పరిష్కారం చూడాలనుకోవడం లాంటి మరిన్ని "బై ప్రొడుక్ట్స్ " కింద వెళ్ళిపోవడం గమనించ వచ్చు.

సో, దీన్ని పాటిస్తే - ఓ మోస్తరు - అందులో నే మన జీవితం నిబిడీ కృతం అయినట్టు అని పిస్తుంది.

ఉదాహరణకి ప్రతి పనిని మంచి గంటలో నే చెయ్యాలనుకుని - రాహు కాలం అనో కాకుంటే యమ గండం అనో - ఏదో ఒక గుళిక అనో ఎన్నో సార్లు చెయ్యాల్సిన మంచి పని ని కూడా వాయిదా పద్దతుల మీద సాగించే సాదా సీదా జనసాంద్రత మనం గమనించ వచ్చు.

సో, ఒక నమ్మకం మరో నమ్మకానికి - ఆ పై అది మరో నమ్మకానికి - ఇలా విచక్షణా రహితం గా - ఓ లాంటి పరమ పద సోపానం లో పామునోట పడ్డట్టు ఈ ఊబిలో చిక్కు పోతూ - మానవుని కర్మ సిద్ధాంతాన్ని, సంకల్ప బలాన్ని  - మరిచి పోయే టంత గా  "కిక్కు" ఇవ్వ గలడం ఈ జ్యోతిష్యం యొక్క weakness అని చెప్పుకోవచ్చు కూడా.

వాహిని - ఒక ప్రవాహం. అందులో కొట్టుకుపోవచ్చు. ఈతాడ వచ్చు. జలకాలా వాడచ్చు. ఎంత కావాలంటే అన్ని నీళ్ళు ఉపయోగించ వచ్చు. కొంత ఆలోచిస్తే - ఈ జ్యోతిష్యం కూడా ఒక నమ్మక వాహిని అనిపిస్తుంది 

దాన్ని ఎలా ఉపయోగించు కుంటామో అన్న దాన్ని బట్టి- మన ఇచ్ఛా శక్తి కూడా అభివృద్ధి చెందడానికి దోహద కారిగా నా కాకుంటే - మన మూఢ నమ్మకాలకి సోపానం గానా- అన్న దాని బట్టి ఈ శాస్త్రం ఉపయోగం ఉందా లేదా  అనిపిస్తుంది.

మరో విధం గా ఆలోచిస్తే- దీన్ని గురించి - ఈ శాస్త్రం గురించి తెలియక పోతే , పట్టింపులు లేక పోతే - "Ignorance is Bliss"!


చీర్స్
జిలేబి.
(జిలేబీ what are you trying to convey?)

Saturday, March 10, 2012

మధురాపురి నిలయే మణి వలయే - జిలేబీయం



మధురాపురి  నిలయే మణి వలయే - జిలేబీయం




చీర్స్
జిలేబీయం !

Friday, March 9, 2012

జ్యోతిష్యం నమ్మకమా లేక సాయిన్సా లేక కళా?

నమ్మకం
సాయిన్సు
కళ
ఈ మూడు మూడు విధాలు
నమ్మితే సాయిన్సు అక్కరలే
సాయిన్సు అనుకుంటే - నమ్మకాల పని లేదు
కళ - మనోల్లాసం
ఇంతకీ ఈ అంతు పట్టని జ్యోతిష్యం లెక్కల గారిడీయా లేక సాయిన్సా లేక కళా లేక నమ్మకమా?


చేసుకున్న వారికి చేసుకున్నన్త !
నమ్మకం ఉంటె ఫలితం !
శాంతి అన్నిటికి ఉండనే ఉంది !
ఉపశాంతి కూడా ఉంది !
కిటుకు ఎక్కడ ఉంది?
మన ఆలోచనా విధానం లో నా?
కర్మ సిద్ధాంతం లో నా?

లేక - ఈ మధ్య బడా బడా దేశాలు - చేసే తుక్కు టమారం చెత్త చెదారం డంప్ చేస్తున్నట్టు
పాతకాలం లో అర కొర - లెక్కల జ్యోతిష్యం - మన దేశం లో ఇంకా అలాగే నిలిచి పోయిందా?

ఈ జ్యోతిష్యం కూడా బతుకుతోందా కాలం తీరి - దాని కథా కమామీషు ఎవరికీ అర్థం కాక ఏదో నేనూ జాదూగర్ లా ఉన్నా  అన్నట్టు పడి ఉందా మన దేశం లో?

చర్వితచర్వణం!


జిలేబి.

Thursday, March 8, 2012

మహిళా దినోత్సవం !

ల్లి, కొప్పులో,

హిరణ్మయి నడకలో, కా

ళం పగ పడితే,

వణీ లలామ ,

దిక్సూచి కుటుంబానికి,మ

నోహరి మనోహరునికి , వా

త్సల్యమయీ

వందనం !


మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో -

చీర్స్
జిలేబి.

Tuesday, March 6, 2012

జిలేబీ శతకం - 5

శ్రీ శ్యామలీయం వారికి శుభాకాంక్షలతో
జిలేబీ శతకం
శతక కర్త - శ్రీ తాడిగడప శ్యామల రావు గారు
బ్లాగ్ లోకం లో వీరు 'శ్యామలీయ' మై
బుజ్జి పండు తెలుగు చదువు లో దర్శన మిచ్చి న వారు

గమనిక: ఈ రచన సర్వ హక్కులు శ్రీ తాడిగడప శ్యామల రావు గారివి.
జిలేబీ టపా , కామెంటు చెండులు వీటికి ఉత్ప్రేరకాలు మాత్రమే!
ఇవి శ్రీ శ్యామలీయం గారు శ్రీ కష్టే ఫలే శర్మ గారి బ్లాగులోనూ,
మరి ఇతర బ్లాగుల్లోనూ కామెంటు రూపేణా ఇచ్చినవి.

***

రాబోవు కాలం

కం. మునువచ్చు చెవుల కన్నను
వెనుకనె పొడచుకొని వచ్చి పెరిగెడు కొమ్ముల్
మొనదేరి ధృడత నుండవె
మనుమలకే తెలివి హెచ్చు మహిని జిలేబీ


ఉపవాసం

కం. ఆరోగ్య మనుమతించిన
మేరకు నుపవాసదీక్ష మిగులహితంబౌ
తీరికగా నొక దినమున
శ్రీరమణుని గొలువనగును చేరి జిలేబీ.


'దండ' నాధా!

కం. దండను వేసిన చేతులు
దండంబును బెట్టినట్టి తరుణి కరంబుల్
ధండమ్మని చండికవలె
దండంబును తప్పకుండ దాల్చు జిలేబీ

దీవెనలు

కం. చాలవె యితిహాసంబులు
చాలదె మరి భాగవతము జదువగ హితమై
చాలదె పెద్దల దీవన
మేళులు చేకూర్చ మనకు వేగ జిలేబీ

జిలేబీ తెలుగు వ్యాఖ్య !

కం. నలభై పంక్తుల వ్యాసము
సులువుగ నా కర్థమాయె శోధించెడు నా
తల కెక్కక పొగరణచెను
కలనం తమ వ్యాఖ్య తెలుగు ఘనత జిలేబీ.


'టీతింగు' ట్వీటింగు !

కం. తాతకు కలిగే నకటా
టీతింగ్ ప్రోబ్లమ్స్ కొత్త త్రీజీ ఫోన్తో
యాతన పెట్టే టచ్ స్క్రీన్
చేతికి కళ్ళకును పనులు చెప్పె జిలేబీ.

కం. చిన్నప్పుడు పలకయె గద
యున్నది యని తాత మరచి యుండగ నకటా
నాన్నకు హైఫై పలకను
కొన్నాడు ప్రేమమీర కొడుకు జిలేబీ


బాపురే లవకుశ శ్రీ రామ రాజ్యం !

కం. చూడకనే పొగడుటయును
చూడకనే తెగడు టనెడు చోద్యములనగా
నేడుకదా కనిపించెను
వాడలవాడలను బాపు వలన జిలేబీ

కం. నాజూకుగ నను దిట్టిన
నా జుట్టును బట్టుకొన్న నచ్చని దానిన్
తేజోమయమని పొగడుట
నా జన్మకు వీలుపడదు నమ్ము జిలేబీ

కం. నా కేమో లవకుశ యును
మీకు శ్రీరామరాజ్యమే హితమగుచో
నా కెనిమిది వందలు పొదు
పై కనుబడు చుండె నేటి వరకు జిలేబీ
 
 
యా దేవీ సర్వ భూతేషు

కం. అమ్మాయి కథను చదివితి
నమ్మ దయాగుణము దలచి యానందముచే
చిమ్మెను కన్నుల నీరును
నిమ్మహి భగవతికి సాటి యెవరు జిలేబీ.

కం. ముత్తాతగారి ముచ్చట
లిత్తెరగున చదువుచుండ నెటనో మరి నా
చిత్తంబున విభ్రమమగు
నుత్తమమీ సౌఖ్యమనగ నొప్పి జిలేబీ.

కం. ముని మనుమరాలి ముచ్చట
మునుకొని యా మూగతల్లి ముచ్చటగా తం
డ్రిని తాతను ముత్త్తాతను చే
సిన ముచ్చట సంతసింప జేసె జిలేబీ.

కం. సంతోషంబుల నెరుగుట
సంతోషము నాకు నిట్టి సంతోషంబుల్
వింతలె యీ జన్మంబున
నింతకు ముందెరిగి యుందు నేమొ జిలేబీ.

కం. అందరు సంతోషంబున
నుందురు గా కెల్లవేళ నుల్లాసముగన్
చిందులు వేయగ శ్రీలా
నందముగా నందరిండ్ల ననెద జిలేబీ.


కాఫీ కాలం

కం. శివ శివ యనుచును కాఫీ
నెవరైనను చేయునెడల నీశ్వరకృపచే
నవలీలగ నమృతంబగు
చవితో లోకంబు లేల జాలు జిలేబీ.

కం. నీరసపడితే మంచి హు
షారిచ్చే పొగలసెగల చక్కని కాఫీ
సారందీయగ హాయిగ
ఊరికి పను లప్పగించు చుండు జిలేబీ


శతకం లెక్కలు

కం. ఇన్నని నియమము గలదా
యెన్నైనను వ్రాయవచ్చు నేదో శతకం
బన్నప్పు డధిక మైనను
మన్ననలో మార్పురాదు మహిని జిలేబీ


వినమ్రత

కం. బందమొ ముందరి కాళ్ళకు
నందముగా భావమమర నగు పరికరమో
ఛందం బనునది దేవుం
డందించిన శక్త్తి కొలది యగును జిలేబీ.

కం. ఛందములాడించునొ నను
ఛందంబుల తోడ నాడ జాలుదునో నే
నందముగా వ్రాయుదునో
యిందుకు కొరగానొ దేవు డెరుగు జిలేబీ

టపాకీకారణం
జిలేబి