Saturday, January 17, 2009

శ్రీ మధురాంతకం రాజారాం గారి జ్ఞాపకాలు - ముచ్చటగా మూడో సారి

కడప జిల్లా రాయచోటి లో ఉద్యోగా రీత్యా ఉన్నప్పుడు చిత్తూరు కి ప్రతి శనివారం వెళ్ళాలని ప్రయత్నించడం బ్యాచిలర్ డేస్ లో ఓ పిచ్చి ప్రయత్నం మజా. అప్పట్లో శనివారం ౧/౨ డే ఉద్యోగం అయ్యాక ఓ ఒకటిన్నర మధ్యాహ్నం ప్రాంతం లో చిత్తూరికి వెళ్ళే బస్సుని వదిలేస్తే మళ్ళీ ఎ సాయంత్రం వచ్చే బస్సు కోసం వెయిట్ చెయ్యాల్సి వచ్చేది. అట్లాంటి నిరీక్షణం లో ఎ లారీ వచ్చి ప్యాసింజర్ ని ఎక్కిచ్చుకున్తానంటే వెంటనే ఎక్కేసి హాపీ ఆన్ హాపీ ఆఫ్ లాగా చిత్తూరు చేరేవాళ్ళం.

అట్లాంటి ఓ మధ్యాహ్నపు జర్నీ లో ఓ ఆయిల్ టాంకర్ ఎక్కి చేసిన ప్రయాణం లో ఈ టాంకర్ మధ్యే మార్గం లో బ్రేక్ డవున్ అవడం తో హతోస్మి అనుకుంటూ దగ్గిర వున్న ఎ గ్రామం దాకానో నడిచి వెళ్లి కాస్త టీ నీళ్లు పడేసుకుందామని విచారిస్తే దగ్గర్లో ఉన్న గ్రామం శ్రీ మధురాంతకం రాజారం గారి దామల్చెరువు అవడం జరిగింది. సరే అని ఆయన ఇల్లు కనుక్కొని (గ్రామం లో ఇల్లు కనుక్కోవడం అంత సులభమైన పని వేరే ఏది లేదు!) వెళితే ఆయన ఇంట్లో సావకాశం గా పడక్కుర్చిలో కూర్చిని ఉన్నారు.

అప్పటికే సాయం కాలం అవటంతో పలకరింపులోనే "చాలా పొద్దు పోయి వచ్చారు బాగున్నారా" అని ఉభయ కుశలం విచారించి అలా సంభాషణ పిచ్చాపాటి లోకి దిగింది.

వస్తుతః ఈ సంభాషణం లో ఎట్లాంటి ప్రత్యేకతలు లేవు. ఓ ఇద్దరు మనుషులు కలిస్తే పిచ్చాపాటి చేస్తే అందులో ఎట్లాంటి ప్రత్యేకతలు లేక పోయిన కూడా అందులో ఓ విధమైన వ్యక్తిత్వ ప్రకటన ఉంటుంది. అట్లాంటి దే ఈ సంభాషణం కూడా!

మధురాంతకం లాంటి పెద్దలతో పిచ్చాపాటి కూడా ఓ మరిచి పోలేని అనుభవమే. ఎందుకంటే వారి మాటల్లో నిజ జీవితం ప్రతిఫలిస్తుంది వారు పలికే ప్రతి మాట వెనుక జీవితానుభవం ప్రతిభిమ్భిస్తుంది.

జిలేబి.

సంక్రాంతి శుభాకాంక్షలు

సంక్రాంతి వనం లో క్రాంతి సుమ పథం లో తియ్యగా సాగే సుభ లక్షణ సమీరంలో భాసించాలి మీ జీవతం కాంతులతో సుఖ శాంతులతో ...

జిలేబి.

Sunday, January 11, 2009

నాకు నచ్చిన పద్యం - దాశరథీ శతకం నుంచి

భండన భీముడార్థజన భాందవుడుజ్వల బాణ తూణ కో
దండ కళాప్రచండ భుజ తాండవ కీర్తికిన్ రామమూర్తికిన్
రెండవ సాటి దైవమిక లేదనుచున్ గడ గట్టి భెరికా డాండ
డడాండ డాండ నినదంబు నిండ మత్త
వేదండము నెక్కి చాటెదన్ దాశరథీ కరుణాపయోనిధి!


ఈ పద్యం లో ఉన్న జోష్ రియల్లీ సూపర్బ్. - డాండ డడాండ డాండ అన్న పదమొక్కటే చాలు చేణుక్కు మనడానికి


భావార్థం: ఈ పద్యం శ్రీ రామచంద్రుని గురించి. శ్రీ రాముడు బలంలో భీముడంతటి వారట. ఆర్త జన భాన్దవుడు. ఉజ్వల బాణ తూణ కళా కోదండ ప్రచండులు. అట్లాంటి శ్రీ రామచంద్ర ప్రభువుల భుజ తాండవ కీర్తిని మత్త ఏనుగు నెక్కి డంకా భజాయించి అట్లాంటి స్వామీ కి రెండవ సాటి దైవం ఇక ఎవ్వరు లేదని చాటి చెబ్తారట దాసరథి వారు!

జిలేబి.

Saturday, January 10, 2009

హాస్య దర్బార్ - సత్య ప్రసాద్ అరిపిరాల గారి ఈ బుక్


భేషైన పసందైన హాస్య రస ప్రధానం గా అరిపిరాల సత్య ప్రసాద్ గారు వ్రాసిన హాస్య దర్బార్ ఈ పుస్తకాన్ని ఇక్కడ పొందుపరచిన లింకు ద్వారా డవున్ లోడ్ చేసుకోవచ్చు. ఈ ఈ పుస్తకం పీడీఫ్ ఫార్మేటు లో అందంగా ముద్రించబడి ఉంది.



జిలేబి.

Friday, January 9, 2009

సత్యం రాజు & శివాజీ ది బాస్ ఒకరేనా?

శివాజీ ది బాస్ చిత్ర రాజం లో నల్ల డబ్బుని శ్రీమాన్ రజని కాంత్ గారు డాలర్లు గా కాన్వేర్ట్ చేసి జూమ్మన్ని భారత దేశాన్ని మార్చే ప్రనాలికని ప్రతిపాదించారు. శ్రీ రామచంద్రుడు సత్య వాక్పరిపాలయనే జీవిత ధ్యేయమని తండ్రి దశరథుడు చూపించనా మార్గం లో అడవి కి వెళ్ళారు.

మన కలియుగం లో జామ్బూద్వీపం లో భారత వర్షం లో భారత ఖండంలో ఆంద్ర రాజ్యం లో రాముని పేరుగల రాజు గారు లేని డబ్బుని ఉన్నట్టు గా నిలబెట్టి యాభై వేలమంది యువతకి ఉద్యోగం కల్పించి అరవై ఐదు దేశాల్లో భారతకీర్తిని తెలుగు తేజాన్ని చాటించి విష్ణు మాయ చేసారు.

శ్రీమాన్ శివాజీ ది బాస్ గారి చిత్రరాజం వౌ అంటూ జూమ్మంటూ బాక్సాఫీస్ బద్దలు కొట్టింది- చిత్రం లో శివాజీ గారు చెరసాల కి వెళితే దారిలో కోట్లాది జనం ఆయన కోసం నిరీక్షణ. శ్రీ రామచంద్రుడు సత్య వాక్పరిపలన కోసం అడవి కి వెళితే దేశం ప్రజానీకం కన్నీరు కార్చింది.

ఈ తెలుగు తేజం లేని డబ్బుతో ఒక కార్పొరేట్ సామ్రాజ్యాని ఇరవై సంవత్సరాలు గా నిలబెట్టిన వైనం దీని పర్యవసానం వేచి చూడ వలసినదే మరి.

జిలేబి.

Tuesday, January 6, 2009

కాల వాహిని అలల వాలున సాగి పోవుట సులభ తరమే ....

ఈ మధ్య భూప్రపంచానికి కడు గడ్డు కాలం వచ్చినట్టుంది. క్రితం సంవత్సరం నుంచి అన్నీ ఒక దాన్ని మించి మరో మాంద్యం కబుర్లే - ఎ పత్రిక తిరగేసిన ప్రతి దేశం లోను ఏదో ఒక ప్రాబ్లం కనబడుతూనే ఉంది.
కలి కాలం వైపరీత్యాలు మన మున్న జామానాలోనే అన్ని ప్రాబ్లం రావాలని అంటారా?
అంతా విష్ణు మాయ గాకుంటే మరేమీ చోద్యం అంటారు?

ఎంతైనా కాల వాహిని అలల వాలున సాగి పోవటం సులభ తరమే. కాని ఇప్పుడున్న పరిస్తుతల్లో ఇది కూడా కష్టమే అని పిస్తోంది.
వీటన్నిటికి త్వరలోనే ఓ భంసు తేరా బడి శుభమైన కాలం ఆసంన్మవుతుందని ఆశిద్దాం!

జిలేబి.

Monday, January 5, 2009

ఏమండోయ్ శ్రీమతి గారు

ఏమండోయ్ శ్రీమతి గారు అన్న వాక్యాన్ని కీర్తి శేషులు శ్రీ శోభన్ బాబు గారు తన చిత్రాలలో సొగసుగా పలికినంత ఇంకెవరు చెప్పగలరా అంటే నా వరకైతే మరి ఎ నటుడు ఆ సంపూర్ణత్వాన్ని ఆపాదించలేక పోయాడనే చెప్పొచ్చు.

ఒక్కో నటుడికి(నటి కి) ఓ సొగసైన పద్దతి డైలాగ్ డెలివరీ ఉంటుంది. వీళ్ళని అబ్సర్వ్ చేస్తే దీని మీదే ఓ థీసిస్ రాయొచ్చు !

మీరేమంటారు?

జిలేబి.

Friday, January 2, 2009

సింగపూరు బుద్ధుడు


ఆ మధ్య సింగపూరు వెళ్ళినప్పుడు తీసిన బుద్దుని ఫోటో. ప్రసన్న వదనం ధ్యాయేత్.
జిలేబి.

Thursday, January 1, 2009

నూతన సంవత్సర శుభాకాంక్షలు

దేనికైనా నాకు టైం లేనే లేదండి అనే మనలాంటి ఎందరికో కోసం నూతన సంవత్సరం టైం అంటూ నేనున్నాను ఓ 365 రోజులు తీసుకోవోయీ అంటూ స్నేహ నేస్తం చాపుతూ మనల్ని భవిష్యత్తులోకి రమ్మంటూ ఆహ్వానిస్తోంది.

రండి పాత సంవత్సారానికి బాయ్ బాయ్ చెబ్తూ నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతాం. అంతే కాదు - మంచి విషయాలికి మనకి ఈ నూతన సంవత్సరం లో ఎప్పుడు సమయం ఉందని నిరుపిస్తాం.

జిలేబి.

Tuesday, December 30, 2008

మా తాత గారి వేమన శతకం

రాయ చోటి లో ఉద్యోగ రీత్యా ఉన్నప్పుడు మా కొలీగ్ ఒకరు కడప జిల్లా వేంపల్లె వాస్తవ్యులు నాతొ బాటు పని చేసే వారు. వారు పిలవడం తో ఓ మారు వారి గ్రామం వేంపల్లె కి వెళ్ళడం తటస్చింది. రాయచోటి నించి రాజంపేట వెళ్ళే మార్గం లో ఈ వేంపల్లె గ్రామం. దగ్గిరలోనే ఓ నది. పేరు పాపాగ్నిమేము వెళ్ళినది మంచి ఎండా కాలంలో. దీని దరిపుల్లోనే గండి వీరాంజనేయ దేవస్థానం కూడా ఉంది. ఈ వేంపల్లె గ్రామలో నేను మొట్ట మొదటి సారి Stalactites and stalagmites చూడటం జరిగింది. వేమన గారి ఊరు ఈ వేంపల్లె నా అని అడిగితె కడప జిల్లా ప్రాచుర్యం వేంపల్లె ప్రాచుర్యం వేమన గారు అక్కడే పుట్టారని కథా కమామీషు గా పిచ్చా పాటి గా చర్చిండం జరిగింది.
ఈ నేపధ్యం లో మా తాతగారు తన స్వహస్తం తో వేమన శతకం లో రాసుకున్న ఈ క్రింది పద్యం ప్రస్తావిస్తే నాకు తన్నులు తప్పడమే నేను చేసుకున్న పుణ్యం. చెప్పింది కూడా శుద్ధ బ్రాహ్మణ పరివారం నడి ఇంట్లో- అదీను ఆ నడి మద్యాహ్నం వారు బ్రహ్మాండం గా పెట్టిన భోజనం శుభ్రం గా లాగించిన తరువాత.
వేమన తన కాలానికి నాకు అర్థమైనంతవరకు ఓ revolutionary.

ఈ పద్యం నిజంగా మా తాతగారు స్వహస్తాలతో రాసుకున్నది. అంటే ఓ 60 లేక 70 సంవత్సరాల క్రిందట ఉండవచ్చు. ఇది వారి కాలపు పేరడీ కూడా అయి ఉండవచ్చు. కాబట్టి దయచేసి నన్ను తప్పుగా అనుకోవద్దు.
పద్యం:
పిండములను జేసి పితరులను తలపోసి
కాకులకు బెట్టు గాదిదలార
పియ్య తినెడు కాకి పితరుడెట్లాయరా
విశ్వదాభి రామ వినుర వేమ.

జిలేబి.

Monday, December 29, 2008

మధురాంతకం రాజారాం గారి జ్ఞాపకాలు - 2


శ్రీ మధురాంతకం గార్ని రెండవ సారి కలవటం చిత్తూరు లో శ్రీజయరాం గారి ఇంట్లో. శ్రీ జయరాం గారు వృత్తి రీత్యా ఉపాధ్యాయులు - సంగీతం మాస్టారు (or P.E.T మాస్టరు నాట్ sure ) అనుకుంటా. శ్రీ జయరాం గారు ఆర్ట్ లవర్స్ సెక్రటరీ గా చిత్తూరు జిల్లాలో మాత్రమె గాదు ఆంధ్రా మొత్తం లో నాటక రంగం వాళ్ళకి సుపరిచితులు. ఓ మారు ఇంట్లో ఉంటే నా మిత్రుడు వచ్చి శ్రీ రాజారాం గారు వచ్చారు నిన్ను రమ్మన్నారని చెప్పడం తో శ్రీ జయరాం గారి ఇంటికి వెళ్లాను. శ్రీ రాజారాం గారు మండువాలో కూర్చుని వున్నారు. "మీ కథల్రాయడం ఎలా సాగుతోంది" అని అడిగితే "సర్ ఈ మధ్య ఉద్యోగం లో చేరాక ఉష్ కాకి అయిపొయింది కథల్రాయడం " అనటం తో ఆయన నవ్వి "కథకి వస్తువు గా ఓ వ్యక్తి జీవితాన్ని మధిస్తే ఓ కథ పుట్టొచ్చు" అన్నారు - ఈ వాక్యం అప్పుడు సరిగా అర్థం కాలేదు గాని ఆ తరువాత ఆయన కథల్ని తిరగేస్తే ఆయన ప్రతి కథలోను ఈ విషయాన్ని గమనించడం జరిగింది. పెద్దవాళ్ళ మాట పెన్నిటి మూటయే గదా!
జిలేబి.

Sunday, December 28, 2008

కృష్ణా తీరం

రాయలసీమ వాళ్ళకి కృష్ణా తీరం అంటే ఓ పాటి ఉత్సుకత తప్పకుండ ఉంటుందనుకుంటా. రాయలసీమలో నీళ్ళకి ఎప్పుడు ఇరకాటమే. అట్లాంటిది కృష్ణా తీరం గురించి చదివినప్పుడు , ఆ కృష్ణా నీళ్ళ గురించి విన్నప్పుడు చిన్నప్పట్లో నిజంగా నాకైతే ఓ మారైనా కృష్ణా తీరం చూడాలని బలీయమైన కోరిక ఉండేది. అంతే కాకుండా మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి "కృష్ణా తీరం" పుస్తకం చదివాక ఈ కృష్ణా నది ని ఓ మారిన దర్శించాలని కోరిక ఎక్కువైంది
జీవితపు కాల వాహిని లో ఉద్యోగ పయనం చేసేటప్పుడు మొట్టమొదటిసారి కృష్ణ సందర్శనం విజయవాడని కోరమండల్ ఎక్ష్ప్రెస్స్ ట్రైన్ లో క్రాస్ చేసినప్పుడు లభ్యమైంది. అదే మొదటిసారి కృష్ణ ని చూడడం. చూసాక అనిపించింది - బిర బిర కృష్ణమ్మా అని మన గేయకారులు శంకరంబాడి సుందరాచారి గారు ఊరికే అనలేదు అని. ఎంతైనా కృష్ణా దర్సనం మదిలో నిలచిపోయే ఓ తియ్యటి అనుభవం.

జిలేబి.

Saturday, December 27, 2008

కాణిపాకం వరసిద్ది వినాయక దేవాలయం


చిత్తూరు జిల్లా లో తిరుమల తరువాత ప్రసిద్దమైన కాణిపాకం వరసిద్ధి వినాయక దేవాలయం ఈ మధ్య కాలం లో చాలా ప్రాచుర్యం పొందింది. పురాతనంగా జిల్లా వరకు వ్యాపించిన ఈ దేవాలయపు ప్రాచుర్యం తిరుమల కి దూర దూర తీరలనుండి వచ్చే భక్తుల ద్వారా ఇంకా చాలా మంది భక్తులకు తేలిసి రావడం జరగడం ద్వారా నోటి మాట ద్వారా, తిరుమల తిరుపతి దేవస్థానం వారి ద్వారా ఇంకా ఎక్కువ మంది జానాభా కి తెలిసి వచ్చింది. అట్లాంటి దేవాలయం వెళ్ళే దారి ఫోటో ఓ మారు ఈ గ్రామం గుండా బసులో పయనించి నప్పుడు తీసింది ఇక్కడ పొందు పరిచాను.

జిలేబి.


మధురాంతకం రాజారాం గారి జ్ఞాపకాలు

కీర్తి శేషులు శ్రీ మధురాంతకం రాజారాం గారిని మొట్ట మొదటి సారి కలిసింది ౧౯౮౫ లో చిత్తూరు జిల్లా రచయితల సంఘం శ్రీ కాళహస్తి లో జరిపిన రచయితల కి ట్రైనింగ్ సెషన్ అప్పుడు. ఆయన కథల్ని అంతకు మునుపు చదివి ఉన్నా వ్యక్తీగా ఓ రచయితని కలవడం అన్నది మొట్ట మొదటి సారి అప్పుడే. అంతకు మునుపు కథల్రాయడం ఎలా అన్న పుస్తకం చదివి బర బర మా కాలేజి కథ ఒకటి రాసి ఆంద్ర పత్రిక వాళ్ళకి పంపిస్తే అది అచ్చైపోయి నేను చాలా సంతోష పడిపోయి వావ్ రచయితనైపోయానోచ్ అని ఆనందపడి పోయిన రోజులవి. అలాంటి సమయం లో జీవనదిలాంటి ౫౦ పై పడ్డ వయసులో ఉన్న శ్రీ రాజారాం గార్ని కలవడం ఓ డిఫరెంట్ ఫీలింగ్.

జిలేబి.

Friday, December 26, 2008

అంతా విష్ణు మాయ

అంతా విష్ణు మాయా అని ఊరికే అనలేదు పెద్దలు. ఈ మధ్యా మన భూప్రపంచంలో జరుగుతున్న రోజు వారి మార్కెట్ సమాచారాలు అన్నీ చూస్తుంటే నిజంగా మనం ఆర్ధిక మాంద్యం లో కూరుకు పోయామనే ఆలోచన తప్పక కలుగుతుంది. వీటన్నిటిని అధిగమించి మనం ముందుకు పోవడానికి ఇంకా ఎంత కాలం పడుతుందో ?
ఇవన్ని వేరిసి విష్ణు మాయే మరి.

జిలేబి.

Wednesday, December 24, 2008

సింగపూర్ flyer

ఈ మధ్య సింగపూర్ వెళ్ళినప్పుడు సింగపూర్ ఫ్ల్యెర్ ఫోటో షాట్ ఇది. చిరంజీవి పాత మూవీ లో చూసిన సింగపూర్ ఈ మధ్య వెళ్లి చూసిన సింగపూర్ బోల్డంత వ్యతాసం! ప్రజా శక్తీ పాజిటివ్ గా ఎలా ఉపయోగించ వచ్చు అనడానికి సింగపూర్ ఒక ప్రత్యక్ష ఉదాహరణ. రాజకీయం సాంఘిక చైతన్యం ఫైనాన్స్ అన్నీ కలిసి ధీటైన రామ రాజ్యం కావాలనుకున్న నిజమైన మానవీకం సింగపూర్ నించి చాలా నేర్చుకోవచ్చు.

జిలేబి.

Saturday, December 20, 2008

కాంతం కనకం కర్పూరం

కాంతం కనకం కర్పూరం

కర్పూరం తానూ కరిగిపోతూ ప్రపంచానికి వెలుగునిస్తుంది. కనకం తానూ కరగదు తనని సొంతం చేసుకున్నవాల్లని కరిగించదు.
మరిక కాంతం మాట ఏమిటి ?

కాంతం కనకము కర్పూరం కూడాను. కాంతం కర్పూరం లా తానూ కరిగిపోతుంది. భామతి కథ చదివారా ఎప్పుడైనా? కాంతం కర్పూరం అనడానికి భామతి ఉదాహరణ. కనకం లాంటి కాంతాలు లేకుండా పోలేదు.
మరి కాంతం లాంటి కాంతం ఉన్నారా?

జిలేబి.

Wednesday, December 17, 2008

రైలు ప్రయాణం

రైలు ప్రయాణం
రైలు ప్రయాణం అంటేనే చిన్న పిల్లలకి విపరీతమైన ఆనందం. చిన్ననాటి ఆనందాలలో రైలు ప్రయాణం ఓ మరిచి పోలేని అనుభూతి. అసలు జస్ట్ రైల్వే స్టేషన్ కి వెళ్ళటమే ఒక ఖుషి. ఏమంటారు? ఎందుకంటే చిన్న చిన్న వూళ్ళలో ఓ రోజు కి ఓ రైలు ఇటు రావడం అటు పోవడం ఉంటే అదే పెద్ద విషయం. రైలు కూత వినటానికి స్టేషన్ కి వెళ్లి రైలు చూసి వస్తే అబ్బో ఆ అమ్మాయి ని గానివన్నండి లేక అబ్బోడిని గాని అసలు నిలబెట్టి మాటలాడిస్తే రైలు కబుర్లు కోకొల్లలు. ఏరా అబ్బాయి రైలు ఎలా కూత పెట్టిందిరా అంటే వాడు నోటి పై చెయ్యి సాఫీ గా పెట్టి కూ అంటే కూత పెట్టదంటే మనం చెవులు ముసుకోవలిసిందే మరి!
జిలేబి.

Tuesday, December 16, 2008

మా ఊరి కథ

మా ఊరి కథ అంటేనే అందిరికి ఓ లాంటి ఉత్సాహం వస్తుంది. ఎందుకంటే ఎవరికైనా సొంత ఊరు అంటే ప్రాణం కాబట్టి. మనం పుట్టి పెరిగిన ఊరు మరిచి పోలేని మధురానుభూతులని మదిలో పదిల పరుస్తుంది. అందుకే మా వూరు అంటే ఎవరికైనా ఓ లాంటి ఉత్సుకత. ముఖ్యంగా చెప్పాలంటే ఓ యాభై అరవై వయసు పైబడిన వాళ్ళని ఓ మారు కదిలిస్తే అబ్బో మా ఊరి కథలు కొకల్లలు.

జిలేబి.

Monday, December 15, 2008

అమ్మా ఆవు ఇల్లు ఈగ

అమ్మా ఆవు ఇల్లు ఈగ

మనం చిన్నప్పుడు నేర్చుకున్న అమ్మా ఆవు ఇల్లు ఈగ మరిచిపోలేని పదాలు. ఇవి చిన్ని పదాలైనా చిన్నప్పుడే నేర్చుకున్నాం కాబట్టి వీటితొ బాటు చిన్న నాటి గ్నాపకాలు కూడా మన మనసులో పదిలంగా నిలిచి ఉండటం వల్ల వీటికి ఇంకా సుస్థిరమైన స్థానం మన హృదయాలలో నెలకొని ఉండటం గమనించవచ్చు. అందుకే చిన్ని నాటి గ్నాపకాలు మనల్ని అప్పుడప్పుడు పిల్లగాలిలా స్పృశిస్తూ మనసులకి సేదనందిస్తూ తీపి గుర్తులుగా మిగిలిపోతాయి. ఎంతైనా చేతవెన్నముద్ద చెంగల్వ పూదందయే కదా!


జిలేబి