కడప జిల్లా రాయచోటి లో ఉద్యోగా రీత్యా ఉన్నప్పుడు చిత్తూరు కి ప్రతి శనివారం వెళ్ళాలని ప్రయత్నించడం బ్యాచిలర్ డేస్ లో ఓ పిచ్చి ప్రయత్నం మజా. అప్పట్లో శనివారం ౧/౨ డే ఉద్యోగం అయ్యాక ఓ ఒకటిన్నర మధ్యాహ్నం ప్రాంతం లో చిత్తూరికి వెళ్ళే బస్సుని వదిలేస్తే మళ్ళీ ఎ సాయంత్రం వచ్చే బస్సు కోసం వెయిట్ చెయ్యాల్సి వచ్చేది. అట్లాంటి నిరీక్షణం లో ఎ లారీ వచ్చి ప్యాసింజర్ ని ఎక్కిచ్చుకున్తానంటే వెంటనే ఎక్కేసి హాపీ ఆన్ హాపీ ఆఫ్ లాగా చిత్తూరు చేరేవాళ్ళం.
అట్లాంటి ఓ మధ్యాహ్నపు జర్నీ లో ఓ ఆయిల్ టాంకర్ ఎక్కి చేసిన ప్రయాణం లో ఈ టాంకర్ మధ్యే మార్గం లో బ్రేక్ డవున్ అవడం తో హతోస్మి అనుకుంటూ దగ్గిర వున్న ఎ గ్రామం దాకానో నడిచి వెళ్లి కాస్త టీ నీళ్లు పడేసుకుందామని విచారిస్తే దగ్గర్లో ఉన్న గ్రామం శ్రీ మధురాంతకం రాజారం గారి దామల్చెరువు అవడం జరిగింది. సరే అని ఆయన ఇల్లు కనుక్కొని (గ్రామం లో ఇల్లు కనుక్కోవడం అంత సులభమైన పని వేరే ఏది లేదు!) వెళితే ఆయన ఇంట్లో సావకాశం గా పడక్కుర్చిలో కూర్చిని ఉన్నారు.
అప్పటికే సాయం కాలం అవటంతో పలకరింపులోనే "చాలా పొద్దు పోయి వచ్చారు బాగున్నారా" అని ఉభయ కుశలం విచారించి అలా సంభాషణ పిచ్చాపాటి లోకి దిగింది.
వస్తుతః ఈ సంభాషణం లో ఎట్లాంటి ప్రత్యేకతలు లేవు. ఓ ఇద్దరు మనుషులు కలిస్తే పిచ్చాపాటి చేస్తే అందులో ఎట్లాంటి ప్రత్యేకతలు లేక పోయిన కూడా అందులో ఓ విధమైన వ్యక్తిత్వ ప్రకటన ఉంటుంది. అట్లాంటి దే ఈ సంభాషణం కూడా!
మధురాంతకం లాంటి పెద్దలతో పిచ్చాపాటి కూడా ఓ మరిచి పోలేని అనుభవమే. ఎందుకంటే వారి మాటల్లో నిజ జీవితం ప్రతిఫలిస్తుంది వారు పలికే ప్రతి మాట వెనుక జీవితానుభవం ప్రతిభిమ్భిస్తుంది.
జిలేబి.
మధుమేహం ( షుగర్ )
-
*నవంబరు 14 మధుమేహ నివారణా దినోత్సవం సందర్భంగా మధుమేహం గురించి ఓ చిన్న
కధనం...,, *
*మధుమేహం ( షుగర్ ) ఒక వ్యాధి కాదు అనేక వ్యాధుల సమ్మేళనం.మధుమేహవ్యా...
8 hours ago
No comments:
Post a Comment