Saturday, October 17, 2009

హృదయ స్పందనల చిరు సవ్వడి

ఎవ్వరూ లేనప్పుడు కిటికీ దేన్ని చూస్తుంది?
ఎవ్వరూ భాజాయించనప్పుడు ధమరుకం ఏ నాదాన్ని వినిపిస్తుంది?
ఎవ్వరూ విననప్పుడు మురళీ ఏ గానాన్ని ఆలపిస్తుంది?
ఎవ్వరూ చూడనప్పుడు కళ్లు వేటిని చూస్తాయి?
హృదయ కవాటాలని తెరచి వినగలిగితే ....
స్పందనల చిరు సవ్వడి వీటన్నిటికి అతీతంగా
ఉన్న ఆ ఆంతర్యామిని సాక్షాత్కరిస్తుందా?
ఆనందో బ్రహ్మ!

దీపావళి శుభాకాంక్షలతో
జిలేబి.

Friday, October 16, 2009

నవ్వులాట

ఆహా నా నవ్వులాట
ఆహా నా నవ్వులాట
నీకు నాకు నవ్వు అంట తాం తాం తాం
నవ్వు నాలుగివిధాల ఆరోగ్యమంటా
నవ్వితే రత్నాలు రాలుతాయంట
నవ్వే నాకు శోభ యంటా
అందుకే .....
నవ్వో నమః!

ఛీర్స్
జిలేబి.

Thursday, October 15, 2009

ఆంధ్రా 'మృతం'?

ఆంధ్రుల చరితం అతిరస భరితం
ఆంధ్రుల సంస్కృతి అమోఘ కావ్యం
ఆంధ్రుల మేధస్సు వర్ణనాతీతం
ఆంధ్రుల వంటకం షడ్రసో పేతం
ఆంధ్రుల కీర్తి అతిరధ మహారధుల సమ్మేళనం
ఆంధ్రుల కావ్యం కమనీయం
ఆంధ్రుల సౌర్యం అసామాన్యం
మరి ఆంధ్రుల రాజకీయం......??????

ఛీర్స్
జిలేబి

Tuesday, October 13, 2009

ఆలోచనా తరంగాలు

తిరంగం తరంగం లా వయ్యారాలు పోతూంటే
మది మనోల్లాసంగా మురిసిపోతూంటే
పై ఎద పై పై ఎగసి పడుతూంటే
ఆలోచనా తరంగాలు చక్కిలి గింతలు పెడుతూంటే
మనసా ఎందుకే మౌనం

ఛీర్స్
జిలేబి.

Monday, October 12, 2009

భావ నిక్షిప్తం

గుండలోని మాట గొంతుకలో కొట్లాడుతుంటే
మదిలోని సవ్వడి మరువనీయ కుండా ఆరాట పెడ్తూంటే
హృదయం తనని మరవ లేక తానే తనలో మమేకం కాలేక పోతూంటే
భావం ఆర్ణవమై సంధ్యలో కరిగిపోతూ
నాతో చెలిమి చెయ్యమని
నా మనసే భావమై నాలో నిక్షిప్తం!
అంతా గుప్చుప్!

జిలేబి.

Sunday, October 11, 2009

మురళీ గానం

మురళీ గానం
మధురం
తియ్యదనం కలబోసిన దంటా
ఆ కాలం లో నే నుండి ఆ గానాన్ని
ఆలకించి ఉంటే అవునో కాదో చెప్పే దాన్ని
కాని ఆ మురళీ గానం తానెప్పుడు మధురమే
అని నిరుపించుకోవడానికి
ప్రతి కాలం లో ను ఒక్కో మానీషి లో ప్రతిధ్వనిస్తూనే ఉంది
వినడానికి మన చెవులు హృదయ ద్వారాలని తెరిచి వుంచితే!

ఛీర్స్
జిలేబి.

Saturday, October 10, 2009

కలల ప్రపంచం

కలల ప్రపంచం
నీది నాది అన్నా ఈ ప్రపంచం
అందరిది ఈ ప్రపంచం అయినప్పుడు
కలలు కనే నా నేస్తం కలల ప్రపంచం
ఎప్పుడు సాకారం ?

పిన్న పెద్ద అన్నా తమ్ముడు అక్క చెల్లి
బంధుత్వం బాదరాయణం
ఓ అరవై లేక డెబ్భై ఏళ్ళు
జీవితం
పరమం పురుషార్థం
ఆనందో బ్రహ్మ!

ఛీర్స్
జిలేబి.

Wednesday, September 30, 2009

కాదేది కవిత కనర్హం

ఈ మధ్య శ్రీ శ్రీ గారి రచనల్ని తిరగేస్తుంటే వారి కుక్కపిల్ల, సబ్బు బిళ్ళ ,అగ్గి పుల్ల గుర్తు కొచ్చేయి. కాదేది కవిత కనర్హం లా కాదేది బ్లాగ్లోకానికి అనర్హం అన్నా తప్పులేదు లా ఉన్నది. ఈ ఇరవై ఒక్క శతాబ్దం లో బ్లాగులు నాటి పత్రికల్ని తలదన్నెట్టు వేర్వేరు సబ్జెక్టు లతో కొత్త కొత్త హంగులతో వస్తున్నై. ఆ కాలంలో ఎ ఆంద్ర పత్రిక లేక ప్రభ లోనో ఓ చిఇన్ని "మీ ఉత్తరం" లో మన పేరు కనిపిస్తే అదే పదివేలన్న సంతోషం తో మురసి పోయే వారం! ఇక మన కథ అచ్చు ఐతే చెప్పనవసరమే లేదు! కాలరేగారేసుకొని ఓ గడ్డం పెంచేసుకుని గొప్ప కథకులమై పోయేమన్నఆలోచనలో విహంగమై విహరించే వాళ్ళం! మరి ఇప్పుడు ఎవరి కి ఏది తోస్తే వాళ్లు అది వ్యక్తీ కరించవచ్చు! దాన్ని చదివి కామెంటడానికి జనాభా ఖచ్చితంగా ఉంటున్న్దన్న భరోసా ఎల్లప్పుడూ ఉండనే ఉన్నది!
బ్లాగోన్నమః!

ఛీర్స్
జిలేబి.

Tuesday, September 15, 2009

ఓబన్న ఓనమాలు

ఓబన్న గారు అమెరికా దేశాధ్యక్షులు ఈ మధ్య ఓ వారం మునుపు స్కూల్ పిల్లల్ని ఉద్దేశించి వాళ్ళని ఉత్తేజ పరిచేలా వాక్రుచ్చేరు. వారి మాట ప్రకారం గా మనం జీవితం లో ఎట్లాంటి ఉద్యోగం లో కి వెళ్ళాలన్న మంచి చదువు ఉండాలన్నారు. అలా అంటూ అందులో రాజకీయ నాయకునికి ఎలాంటి చదువు కావాలో చెప్పలేదు! దీని ప్రకారం చూస్తే రాజయకీయనికి చదువుకి చుక్కెదురు అమెరికాలో కూడా అనుకోవాలేమో ? ఓబన్న చెప్పిన వేదం ఆంగ్లం లో ఇక్కడ ఇచ్చాను!


"And no matter what you want to do with your life – I guarantee that you’ll need an education to do it. You want to be a doctor, or a teacher, or a police officer? You want to be a nurse or an architect, a lawyer or a member of our military? You’re going to need a good education for every single one of those careers. You can’t drop out of school and just drop into a good job. You’ve got to work for it and train for it and learn for it"

ఛీర్స్
జిలేబి.

Saturday, September 5, 2009

ఎంతెంత దూరం?

చిన్న పిల్లల ఆటలలో ఓ చిన్ని ఆట - కళ్ళకు గంతలు కట్టు కుని "ఎంతెంత దూరం?" అంటూ ముందు వెళ్తున్న చిన్నారి పాపో బాబో అంటుంటే వెనుక వస్తున్నపాప "చాలా చాలా దూరం" అంటూ గెంతుతూ వెళ్ళడం చిన్ని ప్రదేశాలలో గమనించవచ్చు. కాని వాళ్లు ఆటలాడుతున్న ప్రదేశం మాత్రం చిన్ని ప్రదేశమే!

కీర్తి శేషులు శ్రీ వై ఎస్ ఆర్ ఆఖరుగా పలికిన వాక్యం " చిత్తూరికి ఫ్లైట్ ఎంత సేపట్లో వెళుతుంది" అని పైలట్ ని అడిగారని ది హిందూ వారు కోట్ చేసారు.

చిత్తూరు అన్నపదం "సత్పురమ్" అన్న పదం నుంచి వచ్చినట్టుగా నానుడి. కాబట్టి శ్రీ వై ఎస్ ఆర్ గారి ఆఖరి వ్యాఖ్యని "సత్పురమ్ వెళ్లడానికి ఎంతసేపు?" అని అడిగ్నట్టుగా అనుకుంటే జవాబు ఆయన జీవిత ఆఖరి ఘడియలే అని పిస్తుంది. సత్పురమ్ అంటే శ్రీ మన్నారయణుని నివాసం.

శ్రీ వై ఎస్ ఆర్ కుటుంబసభ్యులకి ఒదార్పులతో
జిలేబి.

Saturday, August 29, 2009

అడమానం తాకట్టు ఆమ్యామ్య

ఈ మధ్య పేపర్లు చదువుతూంటే శ్రీ శ్రీ గారిలా ఈ పేపరు తిరగేసినా ఏమున్నది గర్వ కారణం - అడమానం తాకట్టు ఆమ్యామ్య అనాలనిపిస్తుంది.

ఛీర్స్
జిలేబి.

Friday, August 28, 2009

వెంకన్నాస్ గోల్డ్ !

మెకన్నాస్ గోల్డ్ చిత్రంలో పొలోమని గోల్డ్ రష్ కోసం రోగ్ కారెక్టర్లు తో బాటు ఓ ఫాదరీ కూడా ఉంటాడు. ఆయన్ని మీరెందుకు గోల్డ్ కోసం పరుగులాట అంటే ఆ డబ్బులతో పెద్ద చర్చి కట్టిస్తాని చెబ్తాడు జవాబుగా!
ఈ బ్లాగులో కొంత కాలం క్రితం ఏడుకొండలవాడి బంగారం గోవిందా గోవిందా వ్రాసాక ఈ మధ్య పేపర్లో తిరుపతి దేవాలయం పూజార్లు వారు స్వామీ వారి బంగారు నగల్ని అడమానం పెట్టి జీవిత సాగరాన్ని నడపుతున్న వైనం చదివాక నిజం గా చాల బాధ వేసింది. వెంకన్నన్ను నమ్ముకుని రాముల వారిని నమ్ముకుని ఇట్లాంటి పరిస్తుతులలో సాంప్రదాయ బద్ధం గా బ్రతకవలసిన పంతులవారు జీవితాని సాగించడానికి బంగారాన్ని అడమానం పెట్టి నెగ్గుకు రావడం అఆలోచింప దాగిన విషయం. స్వామీ వారి ఆదాయం కోట్లు! వారి పూజారి వారి జీతాలు అంత అంత మాత్రమే! స్వామీ వారి ఆదాయాన్ని కార్పొరేట్ తీరులో గణిస్తూ వారి వద్ద పనిచేసే పూజార్లు వారి జీతాలు ఇంతే ఉంటే ఇక ఇట్లాంటి దురవస్త రాక మానుతుందా అనిపిస్తుంది! వెంకన్న వారు కల్యాణం చేసుకోవడానికి కుబెర్లు వారి దగ్గిరి బకాయి పడ్డా రట ఆ కాలం లో! ఇప్పుడు వారి సేవకులు అడమానం దుకాణానికి బకాయ్! ధర్మో రక్షతి రక్షితః!
ఛీర్స్
జిలేబి.

Saturday, August 22, 2009

సెవెన్ ఇయర్స్ ఇన్ టిబెట్

ఈ మధ్య బ్రాడ్ పిట్ చిత్రం సెవెన్ ఇయర్స్ ఇన్ టిబెట్ చూసాను. ఈ చిత్రం గురించి చెప్పాలనుకుని ఈ టపా. దీంట్లో విశేషం ఏమిటంటే ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసింది ఫ్రెంచ్ డైరెక్టర్. కథ ఒక ఆస్ట్రియన్ జర్మన్ మౌంటైన్ క్లిమ్బెర్ చుట్టూ తిరుగుతుంది. ఈ ఆస్ట్రియన్ తన జీవితంలో చిన్నప్పటి దలైలామా ని కలుసుకోవడం ఈ కథలో ముఖ్య వస్తువు. ఇది నిజంగా జరిగిన కథ అని దాన్ని జర్మన్ రచయితా రాసాడని విన్నాను. ఈ చిత్రాన్ని చిత్రీకరించడానికి భారత ప్రభుత్వం ఇండియా లో చిత్రీకరించడానికి అనుమతి ఇవ్వక పోవడం తో వీళ్ళు ఈ చిత్రాన్ని సెట్స్ వేసి వేరే దేశంలో తీసారు!

ఒక అద్భుత కథా కావ్యం!
చూడ దలిస్తే ఈ క్రింది లింకు ద్వారా చూడొచ్చు.


http://www.veoh.com/search/videos/q/seven+years+in+tibet#watch%3Dv18604085anyWhqSP

ఛీర్స్
జిలేబి.

Sunday, August 16, 2009

అజ్ఞాత టపాలు కామెంట్లు

ఈ మధ్య ఒక బ్లాగోదరుడు/బ్లాగోదరి కమేంట దానికి అందరికి సమాన హక్కులు ఉండాలి అని వాపోయారు! అంటే ప్రతి ఒక్కరు గూగుల్ లాంటి ఐడీ లతో లాగిన్ అయ్యి పోస్ట్ లకి కామెంట్ రాయాలని ఓ మోస్తరు అందరు బ్లాగు దార్లు సెట్టింగ్స్ పెట్టడంతో స్వేచ్ఛా విహన్గాలైన అజ్ఞాతలకి కామెంట్ ఇవ్వడానికి వీలు లేకుండా పోతోందని వారి కంట తడి కాకుంటే కంఠ శోష! ఈ కామెంట్ చదివాక అయ్యో పాపం అని పించింది. ఎందుకంటే మన భారతదేశంలో ప్రతి ఒక్కరి కి తమ అభిప్రాయాలు తెలుపడానికి హక్కులున్నాయీ! మరి ఇలా లాగిన్ అయి కామెంట్ ఇవ్వడమంటే ఆలాంటి స్వేచా కామెంట్ దార్లకి చెయ్యి కట్టేసినట్టే! అంతే గాకుండా ఓ లాంటి అసౌకర్యం కూడా! ఈ విషయం గా కూడలి గాని హారం గాని ఏదైనా ఓ కొత్త టెక్నిక్ కనుక్కుంటే బాగుణ్ణు! ఈ లాంటి వారు ఆ టెక్నిక్ ఉపయోగించి స్వేచ్ఛా కామెంట్ చెయ్య దాని కి సావకాశం కల్పించిన వారవుతారు! అంతే గాకుండా అజ్ఞాతలకి కూడా సులభతరం గా ఉంటుంది!

ఛీర్స్
జిలేబి
స్వేచ్ఛా విహంగం అని ఆ టెక్నిక్ కి పేరు పెట్ట వచ్చని నా అభిప్రాయం! మీరే మంటారు?

Tuesday, August 4, 2009

ఏడు కొండలవాడా వెంకటరమణ బంగారం గోవింద గోవింద?

ఇవ్వాళ హిందూ దిన పత్రిక లో ఆంధ్ర ప్రదేశ్ హై కోర్ట్ వారి ఆదేశం - తీ తీ దే వారికి - స్వామీ వారి బంగారం లిస్టు సమర్పించందహోయీ అన్న వార్త చదివాక - అందులోని ముఖ్య అంశం గా ఈ బంగారు నగలు లాకర్ లో సింగెల్ కీ సిస్టం ద్వారా ఉన్నట్టు వినికిడి. అంటే ఆ ఒక వ్యక్తి పరం లో ఉన్న నగలకి గ్యారంటీ ఏమిటన్న ప్రశ్న ఉదయిస్తుంది! సాదా సీదా బ్యాంకు లాకర్ లకే రెండు కీ లతో ఆపరేట్ చేస్తారు ! ఇంక కోటానుకోట్ల విలువ గల స్వామీ బంగారు నగల బాగోతం ఒక్క మనిషి ద్వారా నిర్వహణ అంటే ఇది నిజం గా ఆశ్చర్యం అని పిస్తోంది ఇప్పటిదాకా ఎలాంటి కుంభకోణాలు లేకుంటే ! మనిషన్నాక సందేహం మొదట్లోనే ఉంటుంది కదదండి మరి! అయిన తీ తీ దే వారు ఇన్ని సంవత్సరాల బట్టి ఈ విషయాన్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు ? ఈ లాంటి సందేహాలకి తావు ఇవ్వడం సబబేనా? ప్రజల బంగారం (అంతా స్వామీ వారిదే అనుకోండి) ఇట్లా స్వామీ వారికి వారి వారి మొక్కులతో ఇవ్వ బడ్డ బంగారం నిజం గా స్వామీ వారి దగ్గిరే అంటే తీ తీ దే వారి దగ్గిరే ఉందా?????? లేకుంటే ------ అంతా విష్ణు మాయ కాకుంటే కలికాలం మహిమ అనుకోవాలి!

ఈ టపాలు కి ఈ క్రింద ఇవ్వ బడ్డ హిందూ వారి వార్త చదివాక వచ్చిన నా సందేహాలు అప్రతిహమగు గాక!

http://www.hindu.com/2009/08/04/stories/2009080455500100.htm

జిలేబి

Monday, August 3, 2009

హాలికులు కుశలమా?

చిత్తూరు జిల్లా ప్రముఖ రచయితలలో పేరెన్నికగన్న శ్రీ మధురాంతకం రాజారాం గారి గురించి ప్రత్యేకం గా చెప్పవలస్సిన అవసరం ఎప్పుడు ఉందనే చెప్పాలి. ఈ మధ్య పులికంటి వారి జన్మ దిన సందర్భం గా వారి ఫోటో చూసాక మధురాంతకం రాజారాం గారు గుర్తుకి రావటం తో వారి పై చేసిన గూగుల్ సెర్చ్ లో శ్రీ రాజారాం గారి " హాలికులు కుశలమా" కథానిక గుచ్ఛం కంట పడింది. ఈ పుస్తకాన్ని ఈ క్రింది లింక్ ద్వారా పీ డీ ఎఫ్ఫ్ రూపేణడౌన్లోడ్ చేసికొని చదువుకోవచ్చు. వారి పేరిన్నికగన్న ఎన్నో కథలు ఇందులో ఉన్నాయి!
లింక్:
http://www.archive.org/details/halikulukushalam019993mbp

ఛీర్స్
జిలేబి.

Sunday, August 2, 2009

తెలుగు కామెడి - ఆరవ కామెడి

ఆరవ దేశానికి బోర్డర్ లో ఉండటం వల్ల చిత్తూరోల్లకి ఆరవ కామెడి తో మంచి పరిచయం కొంచం ఎక్కువే. నిజం చెప్పాలంటే అరవం వాళ్ల కామెడి ఓ మోస్తరు ఫాస్ట్ కామెడియే. తెలుగు లో అంత ఫాస్ట్ గా కామెడి సఫలం కాదేమో అనిపిస్తుంది. జంధ్యాలగారు కొంత ఈ ఫాస్ట్ కామెడి కి బ్రహ్మానందం గారి తో ప్రయత్నించి చూసారు. కాని అంత క్లిక్ అయినట్టు అనిపించదు. భాష సౌలభ్యం కాదేమో అని కూడా అనిపిస్తుంది.

అరవం భాష సౌలభ్యం అనుకుంట లేకుంటే కామెడి డ్రామాలు తెలుగు కంటే అరవం లో నే ఎక్కువగా రావడం కూడా కావచ్చు. ఉదాహరణకి క్రేజీ మోహన్ , ఎస్.వి. శేకర్ లాంటి కామెడి కింగ్ లు ఆరవ సామ్రాజ్యాన్ని కామెడి ద్రామలతో , పన్ లతో మరీ ఎక్కువగా ప్రాచుర్యం లో ఉంచడం కూడా కారణమై ఉండవచ్చు. మద్రాసు నగరం లో ఈ మధ్య "చాకొలేట్ కృష్ణ" ఆన్నపేరుతొ క్రేజీ మోహన్ సీరియల్ చాల రోజులుగా నడుస్తోంది డ్రామా థియేటర్ ల లో!

జిలేబి.

Monday, July 27, 2009

దక్ష యజ్ఞం చిత్రం గురించి తెలుప గలరా?

ఈ మధ్య దక్ష యజ్ఞం కొన్ని సీన్స్ యు ట్యూబ్ లో చూసాను. అందులో నందీశ్వరుని గా నటించిన నటుడు ఎవరని తెలుసా మీ కెవరికైనా? రేలంగి లా ఉన్నట్టుంది కాని కచ్చితం గా తెలియ లేదు. ఎవరైనా తెలిసి ఉంటే చెప్పా గలరు. లేక వీరు మాధవ పెద్ది సత్యం గారా ?

ఛీర్స్
జిలేబి.

Thursday, July 23, 2009

సంపూర్ణ సూర్య గ్రహణం - సంపూర్ణం !

సంపూర్ణ సూర్య గ్రహణం వస్తోంది వస్తోంది అని ఎదురు చూసిన ఆ గడియలు వచ్చి వెళ్లి పోయాయి. ఈ సంపూర్ణ గ్రహణం మళ్ళీ మరు జన్మలో చూడొచ్చు అని ఆశా పూర్వకం గా అనుకోవచ్చు. అందరూ ఈ జన్మలో ఇదే ఆఖరి సారి ఇది చూడగలగడం అనటం తో బోరు కొట్టి కొత్త విధంగా ఆలోచిస్తే మరుజన్మలో చూడచ్చోచ్ అని సంబర పడి పోయాను. ఈ మాటే మా వాళ్ళతో అంటే నీది మరీ చోద్యమే ! నువ్వు మరు జన్మలో వస్తావని గ్యారంటీ ఏమిటి? వచ్చావే పో లాస్ట్ జన్మలో చూసవన్న గ్య్నాపకం ఉంటుందా అన్నారు! ఇప్పుడు మాత్రం ఉండిందా? మరు జన్మ ఉందనుకుంటే లాస్ట్ జన్మలో కూడా ఇది చూసినట్టే కదా మరి అని వితండవాదం లేవ దీశాను. అంతా విష్ణు మాయ గాకుంటే ప్రతి రోజు సూరీడు పన్నెండు గంటలు కనబడకుండా పోతాడు అదంతా విచిత్రం గా అని పించలేదు - ఓ ఆరు నిముషాలు గాయబ్ అయి పొతే ప్రపంచం ముక్కు మీద నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని చూస్తుంది! ఈ పాటి దానికి ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్స్తారో మరీ విడ్డూరమే !

ఛీర్స్
జిలేబి.

Sunday, July 19, 2009

వరూధిని మళ్ళీ వచ్చేసిందోచ్!

ఆ మధ్య అస్త్ర సన్యాసం చెయ్యాలనుకుని ఇక బ్లాగకూడదనే నిర్ణయానికి రావడంమున్ను బ్లాగు కి మూత పెట్ట దమ్మున్ను జరిగింది. ఆ తరువాయి ఓన్లీ బ్లాగు రీడింగ్ మాత్రమె. ఓ మూణ్ణెల్ల తరువాయి మళ్ళీ బ్లాగు ఓపెన్ చేద్దామనే ఆలోచనే ఈ బ్లాగు రీ-ఓపెన్ సెరేమోనీ! మళ్ళీ పోస్ట్ చేద్దామనే ఉద్దేశం ! చూద్దాం ఏమి జరుగుతుందో! అంటా విష్ణు మాయయే కదండీ మరీను!

జిలేబి.