Monday, October 24, 2011

ఓ ఫన్ ఆర్ట్ విత్ జేకే - బ్లాగ్ లోకపు ప్రధమ సర్జరీ - ఎవరి పై ?

జేకే - మీ పేరు ?

వీరి వీరి గుమ్మడి ప౦డు వీరి పేరేమి ? 

ఓ ఫన్ ఆర్ట్ విత్ జేకే
బ్లాగ్ లోకపు ప్రధమ సర్జరీ - ఎవరి పై ? 
 వేచి చూడండి - దీపావళి స్పెషల్
బ్లాగ్ ముఖా ముఖీ - బ్లాగ్ముఖీ !

ఇది ఒక ABN ఆంధ్రా జిలేబి సహ సమర్పణ !

చీర్స్
జిలేబి.

Sunday, October 23, 2011

డైరెక్టర్ జనార్ధన మహర్షి (ధనాధన్) చిత్తూర్లో దేవస్థానం షూటింగ్

ఇద్దరు  కళా అఖండులు - కే విశ్వనాధ్ , ఎస్పీ బాలు ముఖ్యమైన నటులు గా

మా వూరి పొట్టబ్బాయ్ ధనాధన్ అనబడు జనార్ధన మహర్షి  దర్శకత్వం లో - దేవస్తానం అన్న చిత్ర రాజం చిత్తూర్ లో షూటింగ్ ప్రస్తుతం జరుపుకుంటోంది.

ఈ చిత్రం లో ఆమని కూడా నటిస్తోందట !

ఈ పొట్టబ్బాయ్ చాలా పెద్ద వాడే అయ్యాడు సుమీ ! ఏమిటో ఆ కాలపు వెదవాయి అనుకున్నాను సుమీ !



చీర్స్ జిలేబి.

Saturday, October 22, 2011

ఓ "ఫన్ ఆర్ట్ " విత్ జే కే - కౌంట్ డౌన్ బిగిన్స్

ఓ "ఫన్ ఆర్ట్ " విత్ జే కే
బ్లాగ్ లోకపు ప్రప్రథమ వెరైటీ టపా 
దీపావళి స్పెషల్

ఫ్లాష్ ఫ్లాష్
వేచి చూడండీ.
కనీ వినీ ఎరుగని - ఇంతదాకా బ్లాగని వెరైటీ టపా
బ్లాగ్ లోకం లో ప్రప్రథమం !

బ్లాగ్
 లోకపు
పేరు గాంచిన బ్లాగర్ తో
ఓ ఫన్ ఆర్ట్ విత్ జే కే - వెరైటీ షో !
ఇది ఒక ABN ఆంధ్రా జిలేబి దీపావళి స్పెషల్ !

జేకే చేత 'ఓ ఫన్ ' ఆర్ట్ సర్జరీ చేసుకో బోయే వారెవరు ?
జే కే ఎవరు ?
ABN ఎవరు ?
ఎవరా మొదటి బ్లాగర్ ?

కౌంట్ డౌన్ బిగిన్స్  

చీర్స్
జిలేబి.

చకు చకు చమకుల బండి - నమ్మ మెట్రో అండి!

చకు చకు చమకుల బండి
లంఖణాల బండి
పదిహేను రూపాయల బండి
నమ్మ మెట్రో అండి!
చల్ చల్
విద్యుత్ బండి
సైలెంటు బండి
కుదుపులు లేని బండి
మన మెట్రో బండి

జోడురైల్ల బండి
వెళ్ళేది ఆకాశం లో
జూమ్మనేది గగనం లో
చకు చకు చమకుల బడి
మన మెట్రో అండి !

చీర్స్
జిలేబి.

Friday, October 21, 2011

ఓ ఫన్ ఆర్ట్ విత్ JK - బ్లాగ్ లోకపు ప్రప్రథమ వెరైటీ షో - దీపావళి స్పెషల్

ఓ "ఫన్ ఆర్ట్ " విత్ JK 

బ్లాగ్ లోకపు ప్రప్రథమ వెరైటీ షో - దీపావళి స్పెషల్

ఫ్లాష్ ఫ్లాష్

వేచి చూడండీ.

కనీ వినీ ఎరుగని - ఇంతదాకా బ్లాగని వెరైటీ షో !

బ్లాగ్ లోకం లో ప్రప్రథమం !

వెరైటీ షో

ఓ ఫన్ ఆర్ట్ విత్ జే కే - వెరైటీ షో !

ఇది ఒక  ABN ఆంధ్రా జిలేబి దీపావళి స్పెషల్ !

జేకే చేత 'ఓ ఫన్ ' ఆర్ట్ సర్జరీ చేసుకో బోయే వారెవరు ?

జే కే ఎవరు ?
ABN ఎవరు ?
ఎవరా మొదటి వ్యక్తీ  ?

చీర్స్
జిలేబి.

ఇంటర్నెట్ రే డియో - !

ఇంటర్నెట్ రే డియో !

జ్యోతి గారు ఇంటర్నెట్ రే డియో గురించి టపా రాసారు. పై ఇంటర్నెట్ రే డియో WIFI ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. వేలాది ఇంటర్నెట్ రే డియో చానల్స్ వినవచ్చు. ( కంపూటర్ అవసరం లేదు!) అంతే కాకుండా పై రే డియో FM రే డియో లా కూడా పని చేస్తుంది. !


చీర్స్
జిలేబి

ఇంటర్నెట్ రే డియో

Wednesday, October 19, 2011

బ్లాగని బ్లాగిణి బ్లాగరుని గ్రక్కున విడువ వలె

వ్రాసిన చదువని టపా

 కామెంటిన నప్పని కంటెంటు

'సంకలిని ' చేరని

బ్లాగరు - బ్లాగిణి

బ్లాగని బ్లాగిణి బ్లాగరుని

గ్రక్కున విడువ వలె 

గదవే జిలేబి.

చీర్స్
జిలేబి.

Tuesday, October 18, 2011

చౌ చౌ బాత్ -సెట్ దోస -బై టూ కాఫీ - నమ్మ మెట్రో

బెంగుళూరు మహానగర

చౌ చౌ బాత్
సెట్ దోస
బై టూ కాఫీ


 లాంగ్ వైటేడ్
నమ్మ మెట్రో
బరుత్తదంతా స్వల్ప వె కాల దల్లి


సుమ్మనిరుప్పా -
రాజ్య ముందరిగే  హొగిత్తుదాఇయదే
రాజ్య నాయకరు కంబి ఎన్నుత్తదారే !

నమ్మ మెట్రో - బందే బందు
నోడనే బేకు బెంగుళూరు సొగసే సొగసు

చౌ చౌ బాత్ బై టూ కాఫీ  మాడి
చీర్స్ మాడనే బేకు


చౌ చౌ జిలేబి.

Monday, October 17, 2011

మొబైల్ మానవుడు

పూర్వం మానవుని కి
'mob' ఉండేది

ఇప్పటి ప్రతి మానవుడు
తానో 'isle'

ప్చ్. mob పోయింది
ఇప్పటి 'isle' ల్యాండ్ బతుకు కి
మొబైల్  మొలతాడు

ఇరవై ఒకటవ శతాబ్దం లో మానవుని
మొబైల్ బతుకు , mob లేని -isle బతుకు.

చీర్స్
జిలేబి.

Sunday, October 16, 2011

సిగరెట్టు స్పందనల పొగ సవ్వడి - 3- లంగ్స్ ఇన్ లవ్ విత్ పొగ సెగ

చిన్నప్పుడు సాంబ్రాణి
పొగ పెట్టేరు
వః వః అన్నాను
ఉక్కిరి బిక్కిరి అయ్యి
కొద్ది పెద్ద అయ్యేక
వేడి నీటి సెగ
వహ వహ అన్నాను
సెగ పొగ తో

సుకుమారి,  సిగరెట్టు పొగ
తోడయ్యింది పదహారు లో
వావ్ వావ్ అని దీర్ఘ శ్వాస తీసాను
దుడుకు వయసు, సెగ వదలని పొగ
మది ఎద దమ్ముతో వావ్ వావ్ అయ్యింది.

సుకుమారి 'క్వార్టర్ 'అంగి'
సిగరెట్టు మరో 'క్వార్టర్' అంగి
ఉద్యోగం మరో 'క్వార్టర్' అంగి
మిగిలిన నేను 'క్వార్టర్' అంగి

ఇరవైలో పట్టిన స్నేహం
అరవై అయినా పటిష్టం
వైద్యుడు చెప్పేడు ఇంకెన్నో రోజులు
లేవు నీ లంగ్స్ పవర్ అని

ఇన్ని రోజుల లవ్ విత్ లంగ్స్
త్రుటీల్మని 'బాల్చి' తన్ను తుందంటే
పొతే పొయ్యే
కృష్ణ పరత్మాడు చెప్పనే చెప్పాడు -
'ఆత్మ ' కి ఎ పొగ అంటదని
ఈ శరీరం పోయి మరో శరీరం ఫ్రెష్ వస్తుందట !

ఈ మారు విత్ మోర్ లవ్ లంగ్స్ భర్
పీల్చాను -
సుకుమారి , సిగరెట్టు మాయమై
భటుడు ఒకడు కనపడ్డాడు
ఏమిరా అన్నాను
యముండ అన్నాడు

ఏమంటావ్ ?

పై కెళ్లాలి
ఏముందక్కడ ?

నీకు పొగ పెడతారు

హతోస్మి - అంతే కాలం లో కూడా
పొగ తప్పలేదే !
పొతే పొయ్యే -
ఇప్పటికైనా మరో దమ్ము లాగించనా?

(దమ్ము సిగరెట్ రావు స్ఫూర్తి)


చీర్స్
జిలేబి.

Thursday, October 13, 2011

జ్యోతిష్యం తెలిసిన వారికి ఓ ప్రశ్న - జవాబు తెలిస్తే చెప్పండి

జ్యోతిష్యం తెలిసిన వారికి ఓ ప్రశ్న - 

ప్రశ్న

యోగం - శుభ యోగం, సిద్ధ యోగం, అమృత యోగం - ఇట్లాంటి వి గ విభజించి ఉన్నారు. వీటి కి గల వ్యత్యాసం ఏమిటి? ఒక శుభ యోగం సిద్ధ యోగమా లేక అమృత యోగమా ఎట్లా గణించడం? ఎవరికైనా ఖచ్చితం గా తెలిస్తే చెప్పగలరు - దయ చేసి.
మీ
జిలేబి.

సిగరెట్టు స్పందనల పొగ సవ్వడి-2 - పొగాకు ఆత్మ ఘోష !

ఆకులో ఆకునై అణగి మణగి
నా మానాన ఉన్నదానిని
ఏ కొమ్మకో ఆకై  కాలం ఐపోతే రాలి పోయే దానిని

మానవుడు నన్ను తాకాడు
ఓ పాపిరుస్ ( అదీ నా లాగే ఓ చెట్టో కొమ్మో )
లో నన్ను చెర  బట్టాడు
చుట్ట అని పేరు పెట్టాడు

ఇష్టం వచ్చినప్పుడు అగ్గి తో నన్ను గుగ్గిలం చేసాడు
విలాసం గా పై కేగారేసాడు
రజనీ స్టైల్ లో
హీరో ల స్టైల్ లో పొగ వదిలేడు

నేడు దగ్గు తున్నాడు - ఖల్లు ఖల్లు మని
దీనికి కారణం నేనన్నాడు
చీత్కారం వెటకారం

రాముడు తాకితే రాయి అహల్య అయిందట
నన్ను తాకితే ఈ మానవుడు బుగ్గి అయ్యే నని ఏడ్చాడు
ఎవరి ఖర్మ కి ఎవరు బాధ్యులు ?

ఆకులో ఆకునై అణగి మణగి
నా మానాన ఉన్నదానిని
ఏ కొమ్మకో ఆకై కాలం ఐపోతే రాలి పోయే దానిని

చెరపకురా చెడేవు అని రాసుకున్న మానవుడు
అడుసు తొక్క నేల కాళ్ళు కడగనేల ?


చీర్స్
పొగాకు ఆత్మ ఘోష
జిలేబి సహాకార 'బ్లాగ్విత'

Wednesday, October 12, 2011

సిగరెట్టు స్పందనల పొగ సవ్వడి

సిగరెట్టు మీద బాణం
ఎక్కుపెట్టినారే

పొగ తాగనివాడు
దున్న పోతై పుట్టునని
మాస్టారు చెప్పారే

అగ్గి పెట్ట, కుక్క పిల్ల ,సబ్బు బిళ్ళ
కాదేది కవిత కనర్హం అని
సిగరెట్టూ శ్రీ శ్రీ కలిసి
మనకి రుక్కులు అందించారే!

ఔరా , ఈ సిగరెట్టు స్పందనల్
పొగ సవ్వడుల్
కాల గతి లో కథా, కవితలతో దోబుచులాడాయే

ఏమి ఈ దుర్గతి సిగరెట్టు మిత్రమా నీకు
బులుసు గారు సిగారు తో బాణం ఎక్కు పెట్టి ఈ
బ్లాగు సిగారు లోకాన్ని కాపాడ ఓ కామిక్కు రాయ రారే


చీర్స్
జిలేబి.

Tuesday, October 11, 2011

కాల జ్ఞానం -౩ - రుజువులు


ఒక రెండు వారాల  మునుపు తెలుగు యోగి శర్మ గారి కాల జ్ఞానం మూడు వెలువడింది. అందులో ఈ వాక్యం (జరామరణాలు సర్వ సాధారణం - కాని రాసిన కొలది కాలానికే రెండు పెద్ద మనుషుల నిష్క్రమణం శర్మ గారి కాలజ్ఞానానికి ఒక మచ్చు తునక. )


మేధస్సుకు ఔన్నత్యం పైపూతల అదోగమనం


సాహితీవేత్తల కళాకారుల నిష్క్రమణం

1 . జగ్జీత్ సింగ్ - గజల్ కళాకారుని నిష్క్రమణ - భారత దేశ నేపధ్యంలో
2 . ఆపిల్ స్టీవ్ జాబ్స్ - అంతర్జాతీయ నేపధ్యం లో

ఇట్లాంటి వి రాసేటప్పుడు శర్మ గారు కాల జ్ఞానానికి ఒక 'టైం లిమిట్' అందించి ఉంటె - వాటి ఎఫ్ఫెక్ట్ మరీ క్లియర్ గా ఉండేది. ఇది నా అభిప్రాయం మాత్రమె. ఎందుకంటే ఈ పై వాక్యం ఎప్పటికైనా చెల్లుతుంది - జరామరణాలు సర్వ సాధారణమైనవి కాబట్టి.

చీర్స్
జిలేబి.
(శర్మ గారి బ్లాగులో కామెంట్లు కుదరవు. సో  కామెంటా లంటే వేరే మార్గం ఈ టపా )

Friday, October 7, 2011

ఆపిల్ కోరిన ఆది శంకరుడు

ఒక ఆపిల్ భూమ్మీద పడింది
ఒక న్యూటన్ సిద్ధాంతం పుట్టింది.

ఆ ఆపిల్ చెట్టునించి పడింది.

ఒక ఆపిల్ భూమ్మీద పడింది
డిజిటల్ జీవనం కారణమైయింది

ఈ ఆపిల్ మానవ మేధస్సు నించి.

ఆది శంకరుడు ఆశ పడ్డాడు - ఆపిల్ కోసం !

 తార భువి మీంచి ఆకాశానికి ఎగిరింది.
ఆవల తీరం లో మరో ఆపిల్ పుడుతోందేమో ?

స్టీవ్ జాబ్స్ - కి కొత్త జాబ్ దొరికింది.

నివాళులతో

జిలేబి.

 

Saturday, October 1, 2011

ఓటు నోటు లోటు సాపాటు

ఓటుకి నోటు లంకె
బోటుకి లోటుకి లంకె

ఓటు నోటుకి బలి
బోటు లోటుకి బలి

బోటు లేక నది దాట పాటు
ఓటు తప్పిన సాపాటు పాటు

తెలుసుకోవయ్య జిలేబి తియ్యన
ఎక్కువైన నీ లైఫు లేజి

చీర్స్
జిలేబి.


Friday, September 30, 2011

టపా రాసేసాను తన్నుకు చావండి !

ఈ మధ్య కన్యా శుల్కం సినిమా చూడడం, అందులోని పాపులర్ డైలాగు - తాంబూలా లిచ్చేసాను, తన్నుకు చావండి విన్నాక, ఈ  టపా తిట్లు సారీ టైటిల్ !

ఈ మధ్య బ్లాగ్ లోకం వచ్చే టపాలు చూస్తూంటే , ఈ టపా టైటిల్ వాటికి దీటుగా ఉందని నా ప్రగాఢ విశ్వాసం !

ఆ మధ్య బ్లాగ్ లోకం, బజ్జు లోకం కి మధ్య పోటీ పెరిగి పోతోందని , బజ్జు లోకం బ్లాగ్ లోకాన్ని బజ్జో అని పిస్తోందని చదివినట్టు గుర్తు.
 

నేను బ్లాగులు రాయటం మొదలెట్టి గమనించిన ఈ మూడేళ్ళలో జరిగిన మార్పు - మార్పు లేనిది కూడలి.  స్టాండర్డ్ గా ఉందని చెప్పవచ్చు.

హారం పలు విధాల మార్పు లు చేర్పులు చేసుకుంటూ, ఇప్పుడు, తెలుగు సమాహారం నుంచి ప్రొమోషన్ తీసుకుని, భారత భాషా బ్లాగుల సంకలిని ఐ పోయింది.

మరి మిగిలిన జాలం, జల్లెడ ఓ మోస్తరు మేమూ ఉన్నామని పిస్తున్నై.

తెలుగు బ్లాగు నించి పై కి ఎదిగిన హారం , తెలుగు బ్లాగు లకి ముఖ్యమైన లంకె స్థాయినించి, తగ్గిందోమో అని నా ప్రగాఢ విశ్వాసం. ( గరిష్ట లంకెలు కూడలి నించి అని బ్లాగ్ హిట్ విశ్లేషణలు బ్లాగర్ వారి వి చదివికా|)

సో టపా రాసేసాను, తన్నుకు చావండి !

చీర్స్
జిలేబి.

కాలజ్ఞానం - 3 - వ్యాఖ్య - వివరణ

తెలుగు యోగి శర్మ గారి కాలజ్ఞానం మూడు :



మేధస్సుకు ఔన్నత్యం పైపూతల అదోగమనం

సాహితీవేత్తల కళాకారుల నిష్క్రమణం

రాజుకు పట్టిన దోషం రాజ్యాలకేమో గ్రహణం

త్రిమూర్తుల చూపులతో చెదిరిపోయె వీరత్వం

లేత ఆశలను తుంచుతున్న ఉచ్చు.

తండ్రీ కొడుకుల మధ్యన చిచ్చు

తానింతటి భారాన్ని ఎన్నాళ్ళని మోస్తుంది?

చటుక్కున ఒకసారి కళ్ళు తెరిచి మూస్తుంది.


------
నా వ్యాఖ్య :

భారత దేశం మేధస్సు మళ్ళీ భూమండలం లో విఖ్యాతం అవుతుందా?
౨. సాహితీ వేత్తల కళా కారుల నిష్క్రమణం - చాల సర్వ సాధారణమైన విషయం - గొప్పేమీ అనిపించడం లేదు.

రాజు, గ్రహణం, రాజ్యాలు - మళ్ళీ ఐరోపా ఖండాన్ని సూచిస్తోందా ఇది ?
లేక భారత దేశం లో నే మళ్ళీ ప్రోబ్లెంసా ?

తండ్రీ కొడుకుల మధ్య చిచ్చు - ఎ తండ్రీ ఎ తనయుడు ? అరవ దేశపు కరుణా నిధి యా ?


చీర్స్
జిలేబి. 

Wednesday, September 28, 2011

'హార్ట్ ' డిస్క్

ఈ జమానా లో మనం రాసే
పిచ్చి గీతలు
బ్లాగ్ టపాలు
కామెంట్లు
ఈ మెయిల్లు

అన్నీ 'హార్ట్ ' లే ని
డిస్కులకి
ఆహారం


విద్యుత్ తటిల్లతలా
స్పురించే ఐడియా లు
చేతి వాటం గా సాగే
కంపూటర్ కథా కమామీషులు

అన్నీ కాల గతిలో
'హార్ట్' లేని
డిస్కులకి
అంకితం !

ప్చ్ ! ' హార్డ్' ఓవర్ హార్ట్'

'Handed over hearts to hard disks"

చీర్స్
జిలేబి.

Saturday, September 24, 2011

కాల జ్ఞానం - రెండు - వ్యాఖ్య - వివరణ



భయంకర సమఉజ్జీలిద్దరు

ఒకరి కోటలో ఒకరు పాగావేశారు

ఇక మొదలౌతుంది ధ్వంసం

విలాసపు మోజులో పడిన ధర్మం

కళ్ళు మూసుకుని ఊరుకుంటుంది

నాకెందుకులే అంటూ

నాలుగు శక్తులూ వేటాడితే

అల్పుడైన మనిషి బ్రతుకెంత ?


నా వివరణ: ఒకరు అమెరికా మరొకరు ఐరోపా - ఒకర్ని ఒకరు 'మట్టం' తడుతున్నారు. (మట్టం తడటం - మా చిత్తూరోళ్ళ భాష - ఆంగ్లం లో చెప్పాలంటే - pulling the others leg !)

ఇక రెండు ప్రధాన కాన్టినేంట్లు ఇలా చేస్తే ధ్వంసం రాక తప్పుతుందా ?

మిగతావన్నీ - నా కనిపించింది - స్వంత కవిత్వం - కాకుంటే ఏ విధం గా అయినా భాష్యం రాసు కోవచ్చు !

చీర్స్
జిలేబి.