శ్రీ మాన్ చిన్న జీయర్ గారు ఇవ్వాళ సింగపూరు లో గీతా జయంతి సందర్భం గా "గీతా జయంతి" అని ఎందుకా పేరు వచ్చింది? అసలు గీతా జయంతి అంటే ఏమిటి? అన్నా శీర్షిక పై అనుగ్రహ భాషణం ఇచ్చారు అక్కడ ఉన్న పెరుమాళ్ కోవిల్ లో. ఈ సందర్భం గా ఆయన భాషణం లో గీతా జయంతి గురించిన విశేషాలని ప్రాముఖ్యతని జన బాహుళ్యానికి సులభ రీతిలో అర్థమయ్యే లాగా వివరిస్తూ గీతా ప్రాశస్త్యాన్ని శ్రీ కృష్ణ పరమాత్మ యొక్క గీతా సారాన్ని చక్కటి ఆంగ్ల భాష లో సింగపూరు లోని వివిధ భాషలవారికి అర్థమయ్యేట్టు తన యొక్క పంథాలో విసదీకరించారు. ఈ గీతా జయంతి అని సింగపూరు హిందూ ఎండోమెంటు బోర్డు వాళ్లు జరిపే ౧౨ వ వార్షికోత్సవం లో ఈయన సంభాషణం అందర్నీ చాల ఆకట్టుకుందని అక్కడ వారి అభిప్రాయం వెలిబుచ్చడం స్వామీ వారి దర్శనం చేసుకోవడం వాళ్లు చాల క్రమశిక్షణతో మెలగటం చాల మెప్పైన రీతి గా ఈ కార్యక్రం కొనసాగటం ఆఖరున చిన్న పిల్లకి జీయర్ గారిచే బహుమతి ప్రదానం గావించడం ఈ కార్యక్రమ విశేషాలు. జై శ్రీమన్నారాయణ !
ఛీర్స్
జిలేబి.
Photo & కంటెంట్ Courtesy: వరూధిని from Singapore through MMS
సంతోషం.
ReplyDeleteసన్యసించిన వారిని శ్రీమాన్ అనరు అనుకుంటా. సాధారణంగా గృహస్తులనే బ్రహ్మశ్రీ, శ్రీమాన్ .. ఇలా అంటారు. స్వాములవార్లని పిలిచే బిరుదులు వేరే ఉంటై.