కథన కుతూహలం ! ఈ మధ్య ఓ సందేహం వచ్చింది. ఒక భాషలోకి పదాలు ఎలా వస్తాయీ అని. ఉదాహరణకి తెలుగులో ఇన్ని పదాలు ఉన్నాయి గా ఇవి తెలుగు భాష మాట్లాడేవాల్లలో ఎలా ప్రాచుర్యం లోకి వచ్చి ఉంటాయీ? ఎప్పుడైనా ఆలోచించి చూసారా? నాకైతే చాలా ఆశ్చర్యమే ఈ విషయం పైన!
ఈ మధ్య కొన్ని రోజుల క్రితం అసలు నెనర్లు అన్నది తెలుగు పదమేనా అన్న సందేహం వేలిబుచ్చినప్పుడు చాలా మంది బ్లాగోదరులు మంచి గా వివరణ ఇవ్వడం నాకు చాలా సంతోషాన్ని కలుగ జేసింది.
ఈ మధ్య ప్రింట్ మీడియా లో "సత్యం లెక్కలు" అన్న పదం "గోల్మాల్" అన్న అర్థం లో వాడుకలో వచ్చింది సత్యం ఎపిసోడ్ తరువాయి. సో ఈ పదం ఈలాగే ఉపయోగిస్తుంటే కొన్ని సంవత్సరాల తరువాయి నిఘంటువులలో ఈ పదం కూడా ఎక్కి ఆ తరం వాళ్ళకి ఈ పదం యొక్క అర్థం వివరించ బడ వచ్చునని అనుకుంటా!
ఈ టపా గురించి ఈ సబ్జెక్టు గురించి మీ వ్యాఖ్యలని తెలియ జేయ్యగలరు సుమా! మీరేమంటారు?
మీ బ్లాగేశ్వరి
జిలేబి.
సమస్య - 5006
-
18-1-2025 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కుమతులు మాత్రమె వసింత్రు గుంటూరు పురిన్”
(లేదా...)
“కుమతుల్ మాత్రమె వాసముందురు గదా గుంటూ...
13 hours ago
ఇక్కడ మనం ఉన్న మంచి పదాలను మానేసి పనిగట్టుకుని కొత్తపదాలను సృష్టించక్కర్లేదు . ఇంగ్లీషులో ఉన్న చాలా పదాలు ఇతర భాషలనుంచి యదావిధిగా తీసుకున్నవే . అలాగే కొన్ని ఇంగ్లీషు పదాలను తెలుగులో కలుపుకుని వాటిని ఉపయోగించుకోవడంలో తప్పు లేదు . బస్ ని బస్ అని తెలుగులో అంటే బాగుంటుంది గాని చతుర్ధచక్ర ధూమ వాహనం అని అంటే ఎలాఉంటుంది ?
ReplyDeleteఎక్కడో విన్నాను, వివిధ భాషలు మాట్లాడే వారిని కొందరిని ఒక గదిలో వుంచితే సుమారు నెలలోగా మరొక క్రొత్త భాష పుడుతుందట. అలాగే మా అమ్మాయి హిందీని పలకలేక తనకలవాటైన indian spanish అనో indish అనో గుర్తుపెట్టుకుంటుంది.
ReplyDeleteమేము ఆస్ట్రేలియా లో వుండగా ఒక మిత్రురాలు, శ్రీలంక తమిళులు, మన మలయాళీ సినిమాలెక్కువ చూసేవారు. వారి భాషలో మలయాళీ పదాలు ఎక్కువట. ఇక ఇక్కడ అమెరికాలో వర్క్ ప్లేసుల్లో "never ending సాగా, యోగి, గురు, మంత్ర, సేజ్" వంటి పదాల వాడకం కూడా కనిపిస్తుంది.
పోతే ఇక అసలు సంగతి వదిలి ప్రక్క దారి పడితే,
ఏ మాటకామాటే చెప్పు కోవాలి మన తెలుగు సినిమా పాటలు వినటం వలన నా కూతురికి తెలుగు అచ్చులు వాటి పద ప్రయోగం ఎంత బాగా మరెంత త్వరగా వచ్చేసాయోను. నేను పెట్టిన పరీక్ష ఇట్టే నెగ్గిపోయింది. ఆగండాగండి అక్కడికే వస్తున్నాను - ‘అ అంటె అమలపురం, ఆ అంటే ఆహాపురం…” పాట వల్లె వేసి వేసి రాటు తేలిపోయింది. ఇపుడిక సాహిత్యం+వాయిద్యం కలిపిన శబ్ధ ప్రయోగాల్ల్లోకి దిగిపోయింది. “వరె కొడ్రా, జర ఝద్రో” ఇలా చాలా కొంగ్రొత్త పదాలు కనిపెట్టేసాననుకుంటుంది. ఆ విషయమై నాకో నిర్వాణసోపానం కూడ చూపెట్టింది. “అమ్మ! ఇలా create చేస్తేనే language పెద్దదౌతుంది” అని. దాని ఉవాచలు విని విని నేనూ “వాటలు” [ఇది నేను కనిపెట్టిన పదం - వాయిద్యాలు పాడేటి పాటలన్న మాట] వినటం మొదలుపెట్టాను. మీకు ఉత్సుకత వుంటే మా ఇంటికి రండి. “వినటం” పాఠాలు చెప్తాను ;)
ధర్మవడ్డీ లాగా "సత్యం లెక్కల"న్నమాట! బావుంది.
ReplyDelete