జంబూద్వీపే భరతహ్వర్షే భరతఖండే మేరోహో పర్వతే దక్షినే పార్స్వే ఆంధ్ర రాజ్యాం రాయలసీమే చిత్తూరు జిల్లే ....
హమ్మయ్యా! ప్రవర అయ్యింది కాబట్టి ఇంక కథ చెప్పొచ్హుకుంటా. అయినా చిత్తూరు జిల్లా దాకా వచ్హేసాక చిత్తూరు మాండలీకం గురించి రాయక పొతే ఎలాగంటారూ?
ఈ చిత్తూరు లో వృత్తి రీత్యా ఉన్నప్పుడు చిత్తూరు కి సంబంధించిన స్పెషల్ భాష ని గమనించడం జరిగింది. అదే ఈ తపా శీర్షిక!
అంటే 'గ ' భాష అన్నమాట.
హోటెల్ కి వెళితే ఎదో ఇడ్లి ఉందా అని అడగకుండా వీళ్ళు అడిగే తీరు ఎలా అంటారా? - "ఏమిబా ఇడ్లీ గిడ్లీ ఏదైన ఉందా?" అంటారు.
ఆట్లాగే "సాంబార్ గీంబార్" అన్న పదం చాలా తరచుగా వినొచ్హు. నాకు తెలిసనంత వరకు రాయల సీమలో చిత్తూరు లో ఉన్న్న ఈ "గ " భాష చిత్తూరు పరిసర ప్రాంతాలకే పరిమితమనుకుంటా.
ఈ "గ" భాష ఎంత పాపులర్ అంటే ఆస్సాము దేశంలొ పని చెసేటప్పుడు ఓ అస్సామీ కొలీగు - తను బాంక్ లొ చిత్తూరు లొ పని చెసేడటా- నాకున్న చిత్తూరు పరిచయాన్ని తెలుసుకొని "ఏంబా ఇడ్లి గిడ్లీ " అన్నాడు!
వార్నీ ఈ "గ" భాష ఇంత పాపులర్ అన్న మాట అని అప్పుడే తెలిసింది.
ఇంతకీ ఈ టపా గిపా గురించి మీ అభిప్రాయం ఏమిటిబా?
ఛీర్స్
జిలేబి.
http://www.optionsraja.tk
సమస్య - 5006
-
18-1-2025 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కుమతులు మాత్రమె వసింత్రు గుంటూరు పురిన్”
(లేదా...)
“కుమతుల్ మాత్రమె వాసముందురు గదా గుంటూ...
13 hours ago
జిలేబి
ReplyDeleteగిలేబి
తంతే తలేబి
నీ పేరు అలేబి
ఈ ఆట ఆడుకోలేదా మీరు
టపా అదిరింది మరియు గిదరింది
ReplyDeleteఇంకా చెప్పాలంటే మంచిగా గించిగా ఉంది
భాగుంది!
ReplyDelete....... కాని ఇంక ఎక్కువ ఉదహరనలు చెప్తరని వూహించను.
దాదాపు మొత్తం చిత్తూరు జిల్లాలో ఈ భాషుంది.
ReplyDeleteబలె ఉంది బా ఇడ్లీ గిడ్లీ..కాలాస్త్రిలో కూడా ఇదే బాస బా.
ReplyDeleteఇపుడు నా లంచ్ కుడా అదే..ఇడ్లీ గిడ్లీ దాంట్లో సాంబార్ గీంబార్...
చిత్తూరోళ్ల కతా గితా బానే చెప్తాండావు, మందేవూరుబా ఇంతకూ?! :)
ReplyDeleteమాయాబజార్ సూసినావేందబా? వోల్లు కూడా అనెదరు కంబళీ, గింబళీ, తల్పం, గిల్పం ఆని, సూసిరాబా!
ReplyDelete