Wednesday, July 31, 2013

లంగా రవిక కోక

 
తే నా లంగా అని
తెలంగాణా లగేసు కుంటే
కోక నాది అని
కోన సీమ కోరితే
రవిక నాదని
రాయలసీమ రంకాడితే
తెలుగు తల్లి నగ్నం గా 
 బిక్కు మొహం పెట్టి చూస్తోంది
 
 
మా తెలుగు తల్లికి 

ముళ్ళ పూదండ 

సంతాప 

నివాళి 

జిలేబి 
-

Saturday, July 27, 2013

'పని లేక' బాతాఖానీ కబుర్లు !

ఈ మధ్య మరీ బొత్తి గా పని లేక పోవడం తో అట్లా ఏదో కొంత ఓ శీర్షిక పెట్టి టైపాటు ఎలా సాగితే అలా టపా యించి బ్లాగరు చదువరులను కొంత బోరు కొట్టిద్దామని , ప్రణాళిక వేసేసు కున్నా !

బాతాఖానీ బాతాఖానీ అంటారు గదా మరి బాతా ఖానీ అంటే ఖచ్చితమైన అర్థం ఏమబ్బా అని ఆంద్ర భారతి డాట్ కామ్ వారి నిఘంటువు లో జూస్తే, ఉబుసుపోక కబుర్లు, వదురు బోతు పిచ్చాపాటి, ఇష్టాగోష్టి, పుక్కిటి పురాణం , ఊక కబుర్లు , వాగుట (!) అనే 'ప్రతి పదార్థాలు' కనిపించేయి .

ఇందులో మరీ పిచ్చా పాటి కొంత మరీ బాగుంటే పిచ్చా పాటి అన్న పేరు ఎట్లా వచ్చి ఉంటుందబ్బా అని ఆలోచించా !

అంత లో టప్ మని కరెంటు వాడు టైము చూసి కరెంటు పీకేసాడు ! అర్రెర్రె మనకి మరో కాలక్షేపం కబుర్లు కూడా తొదాయెనె ఈ శుభ సూచకం తో అనుకున్నా !

కరెంటు పోతే మనకి కాలూ చెయ్యి ఆడవు ! చూడ్డానికి టీవీ లేదు గాలాడ్డానికి ఫంఖా లేదు !

ఉక్క పోస్తే విసన కర్ర పట్టుకుని మా అయ్యరు గారికి విసురుతూ, నాకూ విసురుకుంటూ పని లేక అట్లా పుక్కటి పురాణం మొదలెట్టా

ఏమోయ్ జిలేబీ మరీ తీరుపాటు గా ఉన్నావ్ అన్నారు అయ్యరు గారు నవ్వుతూ

అబ్బే, కరెంటు లేదు గదా ఇంకేం చెయ్యాలో తోచడం లెదు. సో, కొంత బాతాఖానీ సాగిస్తా మని అన్నా !
సరేలే, 'బైటక్' గానా ' సాగించూ అన్నారు వారు

బైటక్ గానా అన్న పదం బాతాఖానీ అయ్యిందేమో మరి అనుకున్నా ! అదే మాట వారి తో చెబితే , మరి పిచ్చా పాటి ఎట్లా వచ్చి ఉంటుం దంటావ్ అని 'ఉల్టా' ప్రశ్న వేసారు వారు !

గూగులించి క్షణాల్లో తెలుసు కునే కాలం లో ఇట్లా బుర్ర కి పని జెబ్తే ఎట్లా అయ్యరు వాళ్ అన్నా వారికి ఫంకా బజాయిస్తూ .

అబ్బే ఊరికే ఉబుసుపోక అడిగా లే అంతే అన్నారు !

ఇదిగో చూడు జిలేబీ నువ్వు నాతొ ఇట్లా తీరిగ్గా మాట్లాడి ఎన్ని రోజులు అయ్యిందో అని తనే మళ్ళీ చెప్పారు

అంతే కదా , కరెంటు పోతే గాని సిటీ మానవులకి  మానవుల తో మాట్లాడ డానికి టైము దొరకని స్థితి కి వచ్చేసాం మరి ! ముఖ పుస్తకం కామెంటు గట్రా ల లో మునిగి పోయి తేలి పోతున్నా మెమో మరి !

ఇంతకీ నీనేని టపా రాస్తున్నా ?

అర్రెర్రె బాతాఖానీ కదూ ? ఇంతకీ పిచ్చాపాటి అన్న పదం ఎట్లా వచ్చి ఉంటుందబ్బా !?


చీర్స్
జిలేబి

 

Friday, July 26, 2013

నవ్వితే నవ్వండి , ఏడవ దలిస్తే మీ ఇష్టం !

నవ్వితే నవ్వండి , ఏడవ దలిస్తే మీ ఇష్టం !

మన జీవితం లో చాలా విషయాలు ఏక కాలం లో జరుగు తూ ఉంటాయి ! అంటే ఒక్క నిమిషం లో నవ్వు మరో నిమిషం లో ఏడుపు కలగలసి వచ్చే విషయాలు ఎన్నో !

అంటే ఇదే వరుసలో ఉండాలని రూలు లేదు ! ఏడుపు వచ్చి ఆ పై నవ్వు వచ్చే సందర్భాలు కూడా ఎన్ని లేవు ?

మన ఇంటి పెద్ద దిక్కు లాక్కుని లాక్కుని బాల్చీ తన్నితే మొదట ఏడుపు, ఆప్యాయత ఎక్కువై , ఆ పై మనసలులో హాయి ఐన నవ్వు పీడా వదిలిందిరా బాబు పిండం గట్టెక్కింది కొన్నాళ్ళ కి ఆసుపత్రి ముఖం చూడ నక్కర లేదు అన్న ఆనందం

అంతలో నే ఇంట్లో పురుడు పోసుకోవడానికి కోడలో  కూతురో మనవరాలో ...  మరి ఆనందం అనందం ఆయెనే !

ఇక నవ్వు ఏడుపు ల కలగలపు హాస్య రచనల్ని చదవడం లో ఉన్న మజా లో ఉండనే ఉంటాయి !

మన రాజకీయాల పోకడ చూస్తె నవ్వాలో ఏడవాలో తెలీని విషయం ! ఇది మరీ ఘోరం కాదా ! ఏమి చెయ్యాలో తెలీని స్థితి కూడా ఎన్నో మార్లు ఏడవడానికి నవ్వడానికి మధ్య సందిగ్ధావస్థ లో పడేసే ఘట్టాలు

ఆఫీసు లో బాసు నవ్వుతూ మనకి ఫిట్టింగ్ పెడతాడు - జిలేబీ యువర్ సర్వీసెస్ ఆర్ నో మోర్ నీడేడ్ యు హేవ్ డన్ ఎక్సెల్లెంట్లీ సో ఫార్ ' అంటే మనకి ఉద్వాసన వచ్చినట్టే ! ఉద్వాసన వస్తే నవ్వుతూ హ్యాపీ గా వెళ్లి పోవచ్చు అనుకుంటే , అబ్బో, మన కొలీగ్స్ ఏమని అనుకుంటారు అంటూ ఏడుపు

ఇంట్లో పెండ్లాం జిలేబీ ఇవ్వాళ్టి కి టిఫిన్ ఏమి చెయ్యనండీ అంటూ తెల్లారి ముద్దార అడిగితే , అప్పుడే బ్లాగు లో కామెంటు కొడుతూ ఏదో ఒకటి ఏడువు అని అన్య మనస్కం గా అంటే దాని పరిణామం ?

అమాయకపు భర్త ఆరిందా అర్ధాంగి వీళ్ళ జీవితం లో జరిగే ఘట్టాలు ఇతరులకి నవ్వులు తెప్పించేవి పాపం ఆ భర్త గారికేమో ఏడుపు నవ్వు కలగలిపి తెప్పించేవి !


ఇంతకీ నేను ఏమి రాస్తున్నా !

ఏదో ఒక టైటిలు పెట్టి ఇట్లా జిలేబీ 'చుట్ట' కాలుస్తూంటే నవ్వ మంటావా లేక ఏడవ  మం టావా జిల్ జిల్ జిలేబీ అంటే,

నవ్వితే నవ్వండి , ఏడవ దలిస్తే మీ ఇష్టం !


చీర్స్
జిలేబి
 

Thursday, July 25, 2013

కష్టే ఫలే ? కృషి తో నాస్తి దుర్భిక్షం ?

కష్టే ఫలే ? కృషి తో నాస్తి దుర్భిక్షం ?

కొందరి జీవితాల్ని గమనిస్తే విచిత్రం గా అనిపిస్తుంది . కష్టానికి కొదవలేదు . అంత జీవిత కాలం కష్ట పడ్డా ఫలం దక్కినట్టు అనిపించదు. ఏదో కొరత జీవన ఆఖరి ఘట్టం దాకా ఉండక పోదు .

మళ్ళీ అలాగే, కృషి కి తక్కువా ఉండదు .

మానవ జీవితం  లో ఏదైనా సరే మనం సాధించాలి అని అనుకున్నప్పుడు అది సాధించి తీరుతాం అంటారు ఆశావాదులు . అట్లా అని జీవితం లో కృషి సలపని, నిమిషం కూడా వృధా చేయని వాళ్ళ జీవితాల్లో అసలు ఎప్పుడైనా సుఖ శాంతులు ఉన్నాయా అని కూడా అనిపించేలా సంఘటనలు ఉన్నాయి .

మరి ఈ కష్టే ఫలే ? కృషి తో నాస్తి దుర్భిక్షం అందరికీ వర్తించదు లా అనిపిస్తుంది .

అంటే దీనికి తోడు మరేదో అదృశ్య శక్తి కాకుంటే అదృశ్య కారణం తోడైతే గాని వీరి జీవితాల లో ఫలం గాని శుభిక్షం గాని కనబడ కుండా ఉండదేమో అని పించేలా సంఘటనలు కూడా ఉన్నాయి .

మరి కొందరి జేవితాలు వడ్డించిన విస్తరి . వారేమి చెయ్యక పోయినా వారి ముంగిట అన్నీ వాలి పోతూ ఉంటాయి .
వీరికి కష్టే ఫలే కృషి లాంటివి అసలు అవసరం లేదేమో అనిపిస్తుంది .

ఇంతకీ ఈ విషయం లో మీ అభిప్రాయాలని తెలియ జేయ గలరు !

వీటికి అతీతం గా మరో కారణం (factor ?) ఉండాలేమో అవి సాకృతం గావడానికి ?


శుభోదయం
ఈనాటి జిలేబీ
అంతులేని అవకాశాల
జిలేబీ పాకం !!

జిలేబి 

Tuesday, July 23, 2013

కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్


కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్!
 
ప్చ్ ! తెలుగు భాష లో ఈ పాటి అక్షరాలు చాలేమో
ఏదైనా చెప్పడానికి,
కామెంటు కొట్టడా నికి
 మన అభిప్రాయాలను వెలువర చ డానికి !
 !
ఎవరా మహానుభావులు
ఇన్నేసి అక్షరాలని
కనిపెట్టినది అనవసరం గా !
 
 
చీర్స్ 
జిలేబి 

Monday, July 22, 2013

గురుపూర్ణిమ గుండు సున్నా !

గురుపూర్ణిమ గుండు సున్నా !

ఇవ్వాళ గురు పూర్ణిమ.

గురువు లేక ఎటువంటి గుణికి తెలియదని త్యాగరాజ స్వామీ వారి ఉవాచ.

అందరికీ ప్రస్తుత జమానా లో గురువు ఉండి ఉండ వచ్చు, ఉండక పోవచ్చు.

గురువు దొరకాలంటే దానికీ పెట్టి పుట్టి ఉండా లంటారు. నేను చెబుతున్నది సద్గురువు ల గురించి.

మన కర్మ కొద్దీ, స్వామీ వారల అదృష్టం కొద్దీ, మనకు గుండు సున్నా గురువు లూ తగలవచ్చు.

గుండు సున్నా ఆహా ఏమి అమోఘం అని మనం వారి సున్నా లో భాగమై పోయి సుడి గాలి లోని నావలా కొట్టుకు పోవచ్చు.

కాబట్టి గురువు ని గురించి సదవగాహన కలిగి ఉండటం అన్నది మన ఈ కాలానికి కావలిసిన కనీస అవసరం. లేకుంటే గుండు సున్నా మనకి కలిగే అవకాశం ఉన్నది

కాషాయం కట్టిన వాడంతా గురువై పోతే మనం గుండు సున్నా లయి పోవడం ఖాయం.

ఓ టీవీ  కొనాలంటే మార్కెట్ లో కెళ్ళి వంద మార్లు విచారణ మొదలెడతాం.

కాని స్వామీ వారల కొచ్చే సరికీ మన ఈ విచక్షణ హుష్ కాకీ అన్న మాట. !

ఇంతకీ గురు పూర్ణిమ అని ఇట్లాంటి సంభాషణ రాస్తున్నారేమిటి మీరూ ఏమైనా గుండు సున్నా గురువు లయి పోయారా అంటారా,మరి జిలేబీ రౌండు గా గుండు సున్నా లా నే కదండీ ఉండేది.?

అందరికీ శుభాకాంక్షల తో,

శ్రీ కృష్ణం వందే జగద్గురుం.

జిలేబి.

Friday, July 19, 2013

జిలేబీ ఒట్టి పనికిరాని దని తీసి పారేసిన కష్టే ఫలే శర్మ !

కాలక్షేపం కబుర్ల లో పిడకల వేట !
ఫ్లాష్ ఫ్లాష్ జిలేబి  నెంబర్ ఎయిట్  బ్లాగ్ చేనల్ స్పెషల్ !

వ్యాఖ్యానం ఒకటి :

జిలేబీ ఒట్టి పనికిరాని దని తీసి పారేసిన    కష్టే ఫలే !

జిలేబి  కావాలా, జాంగ్రీ కావాలా అంటే ఎలా? ఖచ్చితం గా జాంగ్రీ  యే గొప్ప అని చెప్పిన దీక్షితులు

వ్యాఖ్యానం రెండు :

మనమందరం పొట్టకూటికై బతిమాలి బతుకుతున్నాం అన్న అయ్య వారు

పర సుఖం అంటే ముక్తి. మిగిలినవన్నీ పొట్టకూటి కోసం చేసేపనులే 

వ్యాఖ్యానం మూడు :

చదువు ని తీసి పారేసిన శర్మ గారు

చదువుకోక ముందు కాకరకాయ అన్నవారు చదువుకున్న తరవాత కీకర కాయ అన్నట్లుగా తయారవుతున్నారు,

వ్యాఖ్యానం నాలుగు :

చదువుకొన్న వారికి అర్హతల్లేవు అంటూన్న చదివిన పండితుడు

చదువు కొ న్న  వారికి అర్హత డిగ్రీలలో ఉంటోంది కాని పనిలో కాదు.

వ్యాఖ్యానం ఐదు :

అధికారం లో ఉన్నవారంతా గాడిదలన్న కష్టే ఫలే - అందరూ మందూ భాయిలే !

వెధవలకి పదవులొచ్చినా గాడిదలకి కొమ్ములొచ్చినా పట్టుకోలేమన్నట్లుగా, ఇప్పుడు పనికిరానివారు మాత్రమే అందలాలెక్కుతున్నారు.- మందు, విందు, పొందు కోసం వెంపర్లాడుతున్నారు, 

వ్యాఖ్యానం ఆరు :

విద్య, వైద్యం, రక్షణ,న్యాయం ఈ నాలుగూ వ్యాపార వస్తువులు

వ్యాఖ్యానం ఏడూ :

ఎవరికీ అసలు నిపుణతలు లేవన్న నిష్టాగారిష్టుడు

ఇప్పుడు చదువుకొన్న  వారికి చేసే పనిలో నిపుణతలేదు, చేస్తున్నపని మీద శ్రద్ధ లేదు.

వ్యాఖ్యానం ఎనిమిది :

విదేశాల లో వాళ్లకు డిగ్రీలు లేవని కుదేసి చెప్పిన బ్లాగర్

విదేశలలో డిగ్రీలకి ప్రాముఖ్యత లేదు,


హరిలో రంగ హరి !
 
ఇవ్వాల్టి జిలేబీ 'వాతలు' సమాప్తం !
 
రేపు మళ్ళీ కలుసు కుందాం !
 
 
ఛీ,ఛీ,ఛీ జిలేబి

(Should we go so low fourth estate? The debate continues!)

Thursday, July 18, 2013

ఐదు రూపాయల బిళ్ళ !

ఐదు రూపాయల బిళ్ళ !
 
ఐదు రూపాయల బిళ్ళ కి 
నేడు వేల్యూ వచ్చేసింది 
ఇదీ కదా మోడీ ఫికేషన్ అంటే !
 
 
శుభోదయం 
జిలేబి 

Wednesday, July 17, 2013

ఆకాశం తో అల్లరి !

 
ఆకాశం తో అల్లరి చేద్దామని 
నింగి కి ఎగిరితే  ప్చ్ 
గురుత్వాకర్షణ క్రిందకి లాగుతోంది !
 
సముద్రపు అలలతో పైకేగారాలని 
అలల తో దోబూచు లాడితే ప్చ్ 
ఉప్పెన క్రిందకి లాగుతోంది 
 
ప్చ్ ప్చ్ ప్చ్ ! ఈ 'ప్' ని కూడా
'చ్' క్రిందకి లాగుతోందేమిటి !
 
 
శుభోదయం
జిలేబి  

Monday, July 15, 2013

ఈ మెయిలు పెళ్ళాలు - ఎస్ ఎమ్ ఎస్ మొగుళ్ళు !

 
 
మారిన కాలం లో 
ఈ మెయిలు పెళ్ళాలు -
ఎస్ ఎమ్ ఎస్ మొగుళ్ళు !
ట్వీటర్ టింగు రంగళ్లు 
పేస్ బుక్ ఫెమినా లు 
 
వెరసి మేము 'ఎలెక్ట్రానిక్' జీవులం !!
 
 
చీర్స్ 
జిలేబి 

Saturday, July 13, 2013

'మోడీ' ఫికేషన్ !

'మోడీ' ఫికేషన్ !
 
భూగోళాన ముసురు ఎర్ర చీనా కి నల్ల మరక
అభివృద్ధి తరుగు ఐతే గొడుగు పట్టిన
సామాన్యుడే దేశాన్ని కాపాడ గలిగే
మేధావి - 'మోడీ'ఫీకేషన్ జరూర్ !!

జిలేబి భావానికి శ్రీ కంది శంకరయ్య (శంకరాభరణం బ్లాగు ) గారి పద్య రూపం !
 
ఇలను జూడ ముసురె, యెఱ్ఱ చైనాకేమొ
నల్ల మరక, ప్రగతి నాస్తి, భరత
భూమి బ్రోతుమన్న ‘మోడీ’ఫికేషనే
దిక్కటంచు బుధులు దెల్పినారు.
 
*****
 
కాంతాలోలుండె మోక్షగామి యనఁదగున్
 
ఇద్దరి కి ఇరుకైన దారి తావుంటే ఆతండు లేడు
ఆతండు ఉంటే తా లేడు,ప్రేమ బాట పూబాట
పరమాత్మ బాట ఒక్కండే ఒక్కండై ఏ
కాంతాలోలుండె మోక్షగామి యనఁదగున్.
 
జిలేబీ భావానికి గన్నవరపు నరసింహ మూర్తి గారి పద్య రూపం 
 
స్వాంతమున జ్ఞాన మలరగ
ధ్వాంతము దాఁ బాసి పాసి ద్వంద్వము దొలగున్
శాంతము చిత్త మమర నే
కాంతాలోలుండె మోక్షగామి యనఁదగున్.
 
గన్నవరపు వారికి , కంది శంకరయ్య గారికి ధన్యవాదములతో
 
మోడీ ఫికేషన్ జిలేబీయం !
 
 

Thursday, July 11, 2013

మీర జాల గలడా నా యానతి ...


మీర జాల గలడా నా యానతి ... జిలేబి పతి అని చెప్పుకోవాలి నేనైతే !

ఆ మధ్య అయ్యరు గారు ఊరెళితే అని రాసా చూడండీ దాని తరువాయి మా అయ్యరు గారు ఫోన్ చేసి, ఇదిగో జిలేబి , ఇక్కడ తుంగభద్రా తీరం లో ఈ శంకరాచార్యుల వారి మటం లో నే సెటిల్ అయిపోవాలని ఉందోయ్ అంటే వామ్మో వామ్మో, ఇది మొదటి కె మోసమై పోయేటట్టు ఉన్నదే అనుకుని వద్దంటే కాదు సెటిల్ అయి పోతా నని భీష్మించు కుంటే మరీ ప్రాబ్లం అయి పోతుందని

'ఆహా మీ నిర్ణయం అమోఘం' అన్నా మేచ్చేసు కుంటూ.

ఆ మొబైలు బయలు కావల ఉన్న అయ్యరు గారు ఈ సమాధానం ఎదురు చూసినట్టు అని పించ లేదు కామోసు, ఒక్క క్షణం నిశ్శబ్దం  లైను లో .

అంటే ... నీ కేం బాధ లేదా ?

అబ్బే, నా కేం బాధ ! మీకే మరి బాధ గా ఉంటుందేమో మరి అక్కడ ఒంటరి గా సన్యాసాశ్రమం లో ... ప్చ్ అని పెదవి విరిచా ...

అంటే ?

అంటే వేళకి నేను భోజనం చేసానో లేదో అన్న ఆలోచన లో నే అక్కడ ఉంటారేమో మరి ' అన్నా మొదటి క్రాసు వేస్తూ .

ఆ అలా ఎందుకు ఉంటా అన్నారు బెట్టు గా

మరి ఈ ఒక్క వారం  లో మీరు ప్రతి రోజూ ఫోను చేసి జిలేబీ భోం చేసావా అని అడుగుతూ ఉంటే ను అట్లా అనిపించింది అన్నా ఈ మారు రవ్వంత గద్గద స్వరం తో ... స్వరం మార్చడం మా కేమన్నా కొత్త విద్యా ? పెళ్ళికి ముందే బామ్మ మాకు నేర్పించిన ముదితల్ విద్య గదా ఇది మరి !

ఇంతకీ ఇవ్వాళ భోం చేసావా ? కంటం లో ఆతురత ఈ మారు అయ్యరు వారి లైను లో  ...

ఊహూ అన్నా అప్పటికే రెండింతలు మెక్కి ఉన్నా నీరసం గా ... అరవై నాలుగు కళలలో అబద్దం కూడా ఒకటి అనుకుంటా మరి ?

సరేలే జిలేబీ, నువ్వన్నది సబబే మరి ! నేనిక్కడే సెటిల్ అయి పోయే ఆలోచన మానుకుంటా లే, నువ్వేమి బెంగ పెట్టు కొమాకు

అబ్బే, నా కేమి బెంగ లేదండీ, మరి మీ ఆరోగ్యం ఆలోచనలతో చెడి పోతుందేమో అని ... అంతే ! ' నొక్కి చెప్పా ఈ మారు ...

వద్దులేవే, ఏదో , ఓ వారం బాగున్నది గదా అని ఇక్కడే సెటిల్ అయి పోదా మానుకుంటే, ఆ పై మన హోటలు వ్యాపారం ఎవరు చూసుకుంటారు వచ్చేస్తా లే

కైలాసం వెళ్ళినా ఈ అయ్యరు గారు హోటలు తో నే వెళ్ళా లనుకునే రకం ! ఈ పాటి దానికి సన్యాసాశ్రమం లో ఉంటా నంటా డా , ఈయన్ని ఇంకొంచెం 'leg pulling' చేద్దామనుకుని ,

ఆ , హోటలు ఇక్కడ బందు చేసి, అక్కడే పెట్టేసు కుంటే పోలే మరి !

ఇప్పుడు అయ్యరు గారి బుర్ర ఓ బడా లెక్క వేసింది

'అబ్బే, ఇక్కడ హోటలు పెడితే ఎవరోస్తారే, మటం లో నే ఉచిత భోజనం ! అంతే గాక, సరకులు కావాలంటే కొండ దిగాలి , అదీ గాక కొత్త ప్రదేశం ! బిజినెస్సు ఎట్లా నడుస్తుందో ఏమో మరి

అవునవును అన్నా ఈ మారు వంత పాడుతూ ...

అక్కడే సెటిల్ అయ్యే ప్లాన్ బందు చేసి, ఇంటికి వచ్చి చేరండి, అన్నా ఈ మారు అధారిటీ తో 

'ఎంతైనా, చెప్పు జిలేబీ, నీ ఆలోచన ఎప్పుడు తప్పు కాదె అట్లాగే ఇంటికి వచ్చేస్తా లే ! అని పోగిడేసేరు ఈ మారు అయ్యరు గారు

జిలేబీ యా మజాకా !మీర జాల గలడా నా యానతి ... జిలేబి పతి !!


శుభోదయం
చీర్స్
జిలేబి 

Wednesday, July 10, 2013

ప్రకృతి - ప్రళయ కృతి

పాదాల చెంత లో అలలు 
ముద్దాడాయి
కేరింతల ఆనందం 
 
పాదాల ని లాగేస్తూ అలలు 
ఆకాశానికి ఎగిరేయి 
కెవ్వు కేకల ఆర్తనాదం 
 
ప్రకృతి ఒకప్పుడు తల్లి 
మరొక్కప్పుడు కాళీ 
 
ఎప్పుడు ప్ర కృతి 
మరెప్పుడు ప్రళయ కృతి 
ఎవరికెరుక ?
 
తాం అగ్ని వర్ణాం తపసా జ్వలంతీం !
 
శుభోదయం 
జిలేబి 

Tuesday, July 9, 2013

జిలేబి కాలక్షేపం ఖబుర్లు - హేవలాక్ బ్రిడ్జి ఇట్లా రూపాంతరం చెందు తుందా ?


గోదావరి వంతెన తెలుగు వాడి గుండె చప్పుడు అని ఒక అయ్య వారు చెప్పారు. 

గుండె చప్పుడు అసలు తెలుగు వాడికి ఉందా అన్నది నా ప్రశ్న .

ఉంటే పదిహేను ఏళ్ళు గా వినబడని చప్పుడు, ఇప్పుడు శబ్దం చేస్తుందా ?

పర్యాటక మంత్రి తెలుగు వారు - దేశ విదేశాల లో తిరిగిన వారు . పర్యాటక శాఖ కి కావలసినది మార్కెటింగ్ టెక్నిక్ .

సినీ పరిశ్రమ లో దీని పూర్తీ ఎఫెక్ట్ తెలిసిన వారు.

ఆంధ్ర దేశం లో ప్రతి ఒక్క మంత్రీ కనే కల దేశాన్ని సింగపూరు లా చేస్తా నని . మరి హేవలాక్ బ్రిడ్జీ ని, తెలుగు వారి గుండె చప్పుడు ని ఇట్లా ప్రతిబింబి స్తారా ? జవాబు కాలమే చెప్పాలి

సింగపూరు కేవనాగ్ బ్రిడ్జీ, కాలగతి లో హేవలాక్ బ్రిడ్జీ కి సమ ఉజ్జీ - సింగపూరు వెళ్ళిన వారెవ్వరూ దీని పై ఫోటో దిగ కుండా తిరిగి రారు - పర్యాటక మంటే మాటలు కాదు - చేతలు చూద్దాం మరి తెలుగు వారి తేజం ! కాలగతి లో బతికి పర్యాటక ప్రముఖ వేదిక గా ఉన్న పాదచారుల బ్రిడ్జీ - సింగపూర్ ఐకానిక్ సింబల్ -  కేవనాగ్ బ్రిడ్జీ - హేవలాక్ కి స్ఫూర్తి నిస్తుందని ఆశిస్తూ


ఫోటో కర్టసీ గూగులాయ నమః

చీర్స్
జిలేబి
  

Monday, July 8, 2013

మనసా తుళ్ళి పడకే !


మరువం లో
నమనం లో
సాగర మధనం లో 
తుళ్ళింతల తరుణం లో 
పరువపు మయూఖ 
డమరుక మృదంగ 
కేళీ విలాస వయ్యారం
నయాగరా సౌందర్య రాగం
 
 
జిలేబి 

Friday, July 5, 2013

Man-Gaal-సూత్రం !


Man
 
Gaal
 
అనుసంధాన 
 
సూత్రం !
 
మంగళ సూత్రం !
 
శుభోదయం 
 
చీర్స్ 
జిలేబి 

Wednesday, July 3, 2013

మనవాళ్ళుట్టి వెధవాయిలోయ్ !


మనవాళ్ళుట్టి వెధవాయిలోయ్ !
ఎవరన్నారండీ ఈ మాట ! 
గిరీశం గారితో చెప్పించింది  ఎవరు ? 
ఎందుకు చెప్పించేరు ?
చెప్పేరు కదా అని మనం గిట్లా మన పేరుని సార్థకం చేసేసు కుంటున్నా మంటే మనం ఎంత గోప్పోళ్ళం ! అర్థం చేసుకోరూ మరీను !

అబ్బా కాలాతీతం గా ఈ మాట చారిత్రాత్మక మైన సత్యమై పోయింది ! 

హేవలాక్ బ్రిడ్జీ కట్టినా బ్రిటీషోడు  వెళ్లి అరవై ఏళ్ళు దాటినా గురజాడ వారు మనం ఉట్టి వెధవాయిలోయ్ అని జెప్పి ఆ సోరాజ్జెం  వచ్చిన కాలం దాటి పోయినా  ఇంత నిర్ద్వ్హంధం గా మనం మనల్ని గురించి న ఈ మాట తప్పు కాకుండా , చెక్కు చెదర కుండా మనకున్న ఈ క్వాలిటీ ని పరిరక్షించు కుంటూ వస్తున్నా మంటే మనం ఎంత గోప్పోళ్ళం ! అర్థం చేసుకోరూ మరీను !

పిండా కూడు పోయి ఆ ఉత్తర దిక్కున మనవాళ్ళు ప్రాణాలు అరచేతిలో టావుల్ దప్పి ఉంటే మనం ఒకరి నొకరం ఆడి  పోసుకుంటూ ఆయ్ నువ్వొట్టి వెధవాయోయ్ అని ఎగస్పార్టీ వాణ్ని కాలరాచేస్తూ దినపత్రికలలో టాప్ మేటరై పోయా మంటే మనం ఎంత గోప్పోళ్ళం ! అర్థం చేసుకోరూ మరీను !

దేశాన్ని ఉద్దరించే స్తామన్న ప్రతి వెర్రోడికీ సై అని పట్టం కట్టి మనల్ని మనం శేబాష్ అని తట్టేసు కున్న వాళ్ళ మాయె అంటే మనం ఎంత గోప్పోళ్ళం ! అర్థం చేసుకోరూ మరీను ! 


చీర్స్
జిలేబి