గోదావరి వంతెన తెలుగు వాడి గుండె చప్పుడు అని ఒక అయ్య వారు చెప్పారు.
గుండె చప్పుడు అసలు తెలుగు వాడికి ఉందా అన్నది నా ప్రశ్న .
ఉంటే పదిహేను ఏళ్ళు గా వినబడని చప్పుడు, ఇప్పుడు శబ్దం చేస్తుందా ?
పర్యాటక మంత్రి తెలుగు వారు - దేశ విదేశాల లో తిరిగిన వారు . పర్యాటక శాఖ కి కావలసినది మార్కెటింగ్ టెక్నిక్ .
సినీ పరిశ్రమ లో దీని పూర్తీ ఎఫెక్ట్ తెలిసిన వారు.
ఆంధ్ర దేశం లో ప్రతి ఒక్క మంత్రీ కనే కల దేశాన్ని సింగపూరు లా చేస్తా నని . మరి హేవలాక్ బ్రిడ్జీ ని, తెలుగు వారి గుండె చప్పుడు ని ఇట్లా ప్రతిబింబి స్తారా ? జవాబు కాలమే చెప్పాలి
సింగపూరు కేవనాగ్ బ్రిడ్జీ, కాలగతి లో హేవలాక్ బ్రిడ్జీ కి సమ ఉజ్జీ - సింగపూరు వెళ్ళిన వారెవ్వరూ దీని పై ఫోటో దిగ కుండా తిరిగి రారు - పర్యాటక మంటే మాటలు కాదు - చేతలు చూద్దాం మరి తెలుగు వారి తేజం ! కాలగతి లో బతికి పర్యాటక ప్రముఖ వేదిక గా ఉన్న పాదచారుల బ్రిడ్జీ - సింగపూర్ ఐకానిక్ సింబల్ - కేవనాగ్ బ్రిడ్జీ - హేవలాక్ కి స్ఫూర్తి నిస్తుందని ఆశిస్తూ
ఫోటో కర్టసీ గూగులాయ నమః
చీర్స్
జిలేబి
ఎదుటివారిని చూసి నేర్చుకునే నేర్పయినా ఉండాలండి.
ReplyDelete
Deleteకష్టే ఫలే వారు
అంతే అంతే ! చూద్దాం నేర్చుకుంటారేమో అని !
జిలేబి
This comment has been removed by the author.
ReplyDeleteరైల్వే వాళ్ళు దానిని తీసేస్తాం అన్నప్పుడే కానీ ఉత్తప్పుడు ఎవరూ పట్టించుకోరు.నిజంగా ఇలా చేస్తే చాలా బాగుంటుంది .
ReplyDelete
Deleteరాధిక నాని గారు,
మన దేశం లో పర్యాటకానికి పర్యాటక ప్రదేశాల కి కొరత లేదు. లేనిదల్లా సరియైన వ్యవస్థ - ఏకీకృత వ్యవస్థ . ఉదాహరణ కి మెట్రో ల లో రైలు దారి ఎడారి బస్సు ల వారి దారి గోదారి ! ఏకీకృత వ్యవస్థ వస్తే అన్నీ సౌలభ్య వసతులు వస్తే పర్యాటక ప్రదేశాలు అభివృద్ధి చెంద వంటారా ?
జిలేబి