Wednesday, July 10, 2013

ప్రకృతి - ప్రళయ కృతి

పాదాల చెంత లో అలలు 
ముద్దాడాయి
కేరింతల ఆనందం 
 
పాదాల ని లాగేస్తూ అలలు 
ఆకాశానికి ఎగిరేయి 
కెవ్వు కేకల ఆర్తనాదం 
 
ప్రకృతి ఒకప్పుడు తల్లి 
మరొక్కప్పుడు కాళీ 
 
ఎప్పుడు ప్ర కృతి 
మరెప్పుడు ప్రళయ కృతి 
ఎవరికెరుక ?
 
తాం అగ్ని వర్ణాం తపసా జ్వలంతీం !
 
శుభోదయం 
జిలేబి 

2 comments:

  1. ప్రకృతిననుసరిస్తే ఆనందం చెరిస్తే విలయం.
    ప్రకృత్యైనమః, వికృత్యైనమః,విద్యాయైనమః,సర్వభూత హితప్రదాయైనమః, శ్రద్ధాయైనమః, విభూత్యైనమః.....పిచ్చాళ్ళు..

    ReplyDelete
  2. అప్పటిదాకా నిశీథిలో నిశ్శబ్దంగా ఉండి గమనిస్తున్న ప్రకృత శక్తులు జూలు విదిలించాయి.
    మనిషి ఆగడం మనపై ఇంకానా అని కినుక వహించాయి.
    గాలి వీచింది. నీరు నిలువెత్తు లేచింది. కొండ కదిలింది, నేల జరిగింది.
    అప్పటిదాకే అంతా నేనే అనుకున్న మనిషి నిలబడ్డచోటే సమాధైనాడు
    ఆస్తి అహంకారం అణువణువున్న అములుకున్నవాడు అక్కడే కూలబడ్డాడు
    నేను, నాదన్నందంతా నీళ్లలో కలిసింది. లెక్కసరిపోయిందనుకున్న ప్రకృతి నిదానించింది
    కలిసుంటే ప్రమోదం, నాతో కలబడితే ప్రమాదమని గూఢంగా సూచించింది.

    ప్రజ్ఞాభారతి

    ReplyDelete