మకుటా రామ ! - 
 
The Legacy of Rama's Crown 
 
వయాంగ్ కులిత్ 
ఉపోద్ఘాతం -
మన దేశం లోని తోలు బొమ్మలాట లాంటిది ఇండోనేషియా లోని వయాంగ్ కులిత్ (Wayang Kulit). 
ఈ వయాంగ్ కులిత్ జావా సంస్కృతి కి సంబంధించినది. జావా, బాలీ ద్వీప సమూహం లో ఇప్పటికి బతికి న సంస్కృతికి ప్రతీక. United Nations declared this as an World Heritage to be preserved. 
జావా ద్వీప జనబాహుళ్యం లో ఉన్న నమ్మిక  ప్రకారం జావా లో సంతతి పరీక్షిత్ వారసులు గా చెప్పుకోవడం కద్దు. 
వీరి పురాతన భారత యుద్ధ - భారత కథ సుమారు పది/పదకొండో శతాబ్దం లో వ్రాయ బడింది. ఇది పురాతన జావా భాష లో వ్రాయ బడింది. ఈ శైలి ని కాకవిన్ అంటారు (ట!). (Ka Kawin or Ke Kawin). 
ఈ వయాంగ్ కులిత్ లో ముఖ్యం గా భారత దేశపు భారత రామాయణం లో నించి వచ్చే పాత్రల తో తోలు బొమ్మలాట ఉంటుంది. 
మధ్య మధ్య లో సులుకున్ (శ్లోకం ? ) అంటూ సంస్కృత, పురాతన జావా పద జాలం కలిసిన వి కనబడతాయి. (ఇవి ఛందో బద్దం గా ఉండటం విశేషం )  
ఒక రాత్రి మొత్తం (సుమారు ఆరు గంటల పాటు ) సాగుతుందట ఈ తోలు బొమ్మ లాట. 
అట్లాంటి ప్రదర్శన లో ఒకటి మకుటా రామ !. 
రాముని కిరీటం  అన్న కథా వస్తువు ఆధారం గా మహా భారత కాలపు నాయకుల ను పెట్టుకుని నీతి , సంస్కృతి , మంచీ చెడ్డా చెప్పు కునే టట్లు ఉంటుంది. 
ఈ ఆట లో ముఖ్య పాత్రలు 
అర్జునుడు - ఇతనికున్న యితర పేరు మన భారత దేశం లో లేనిది(నాకు తెలిసినంత వరకు)   -  జనకుడు . . జ్లామ్ప్రోంగ్ ; మార్గన; పెర్మది (పెర్మది, జ్లామ్ప్రోంగ్ జావా పేర్ల లా ఉన్నాయి). 
సాదేవ (సహదేవుడు); నకుల; 
శకుని - సంగ్కుని అన్న పేరు తో ఉన్నాడు ! 
ధర్మ రాజు - పుంత దేవ అన్న పేరుతో కనబడ తాడు. 
దుర్యోధనుడు - మరో పేరు - జగపితాన ; (జగత్పిత ?) 
దుర్సాసన (దుశ్శాసనుడు) ; కార్తమరామ ; చిత్రాక్ష ; చిత్రాక్షి; దుర్మగతి   (కౌరవ సంతానం ) - చిత్రాక్ష, చిత్రాక్షి కవలలు (మగ వారు). 
బాణోవతి -   దుర్యోధనుని భార్య భానుమతి  వీరి ప్రకారం బాణోవతి ! 
లెక్ష్మణవతి - లక్ష్మణ - దుర్యోధనుని కూతురు; 
దుర్ణ (ద్రోణ)- ఇతర పేరులు - ద్విజ వర ; కుంభాయన ; 
భీష్మ- గంగా దత్త  ; 
అశ్వత్థామ ; 
కర్ణుడు - యితని యితర పేర్లు - సూర్యపుత్ర; సూర్యాత్మజ ; బసు కర్ణ; 
అర్జుని భార్య సుభద్ర కు వీరి ప్రకారం పేరు సెంబద్ర ; మరో పేరు లారా ఇరెంగ్ ! ; సింతవక - సెంబద్ర మగ వేషం లో మారినప్పుడు పేరు; (ఎందుకు మారింది ? కథా విషయం లో కి వెళితే తెలుస్తుంది :)) 
నారద  - (నారదుల వారు లేకుంటే కథ ఎట్లా మరి !) 
భీమసేనుడు; ఇతని యితర పేరులు - భ్రాతసేన ; ఆర్యసేన; 
మహంబీర ! - గరుడుడు ( గరుడ లేకుంటే మరి ఇండోనేషియా ఎట్లా ! ) ; 
క్రేస్న - కృష్ణ - హరిమూర్తి ; 
ఈ తోలు బొమ్మ లాట లో రామాయణ కాలానికి చెందిన వాళ్ళూ కనడతారు - 
విభీషణుడు- మరో పేరు గుణవాన్ ; 
విభీషణుడి కొడుకు - భీషవర్ణ ; 
కుంభకర్ణుడు ; అతని భార్య కిశ్వణి ! (కుంభకర్ణుడి భార్య పేరు మొదటి సారి వినడం!) ; 
అనోమోన్ - హనుమాన్ - మన హనుమంతుల వారు . 
వాయు సంతానం గా, హనుమాన్ వారితో బాటు జాజల్వ్రేక (అసురుడు) ; కువర - పాము; సితుబంద - ఏనుగు;
కేశవసిద్ధి - తపస్వి - రామ మకుటాన్ని భారత కాలం లో వారికి అంద జేయ డానికి వేచి ఉన్న  తపస్వి. 
లింబుక , చంగిక - వీళ్ళు కామెడి ట్రాక్ - లంబూ జంబూ లాగా అన్న మాట ! (మాయా బజార్ గుర్తొస్తుందా? )
సరే కథాక్రమం బెట్టిదన !
(సశేషం!)