Tuesday, December 3, 2019

తాంబూలాలకు పిలుపు రారండి



తాంబూలాలు పుచ్చుకోండి 
రండోయ్ రా రండోయ్



 జిలేబి

109 comments:

  1. Ha ha, great idea 👌😃. And a sad reflection on the state of affairs 🙁.

    ReplyDelete
  2. >>> *తాంబూలాలు పుచ్చుకోండి * *రండోయ్ రా రండోయ్* *జిలేబి*

    అన్నారు కదా యని నా బ్లాగులో టపా వేసి మరీ వచ్చాను. టపా మీ సంకలిని జిలేబి వదన లో రాలేదు. ఉదయమే వేశాను. ఏమో ఏమైందో నని నా బ్లాగ్ సెట్టింగ్స్ చెక్ చేశాను. మరల మద్యాహ్నం రీపోస్ట్ చేశాను. అయినా రాలేదు.
    ఇక్కడే కాదు, శోధిని, తెలుగు బ్లాగులు లలో కూడా రాలేదు. ఒక్క మాలిక లోనే వచ్చింది. ఎందుకు ఇలా జరిగింది ? ఏమైనా సలహా ఇవ్వగలరా? ........ మహా

    ReplyDelete
    Replies


    1. మాలిక్ ఈజ్ సుప్రీం :) అందువలన :)



      జిలేబి

      Delete
  3. ఉల్లిపాయ తాంబూలం. రోజులలాగే ఉన్నయి :)

    ReplyDelete


  4. ఆకలి బాధలు తప్పును
    మాకిక వేయంగ నోట్లు మాదయ కలుగన్
    మీ కలలు పండును సుమా
    చీకటియే వెలుఁగు నిచ్చు జీవిత మిదియే!


    జిలేబి

    ReplyDelete


  5. మా కరుణామయుని జనన
    మీ కాలమగును దయాళు మీకై వచ్చున్
    వేకువ జామగు తొలగును
    చీకటియే! వెలుఁగు నిచ్చు జీవిత మిదియే!


    జిలేబి

    ReplyDelete


  6. లోకేశుడు కలడా పెం
    జీకటి కావల యతనము చేయగ నాతం
    డే కృప చూప తొలంగును
    చీకటియే! వెలుఁగు నిచ్చు జీవిత మిదియే!


    జిలేబి

    ReplyDelete


  7. ఓ బ్యాచిలర్ శోకము :)


    ఆ కన్బొమ నచ్చెన్! పే
    చీ, కటియే! వెలుఁగు నిచ్చు జీవిత మిదియే?
    ఆ కాణేలిని చూడగ
    నా కర్షణయే తొలంగె నా లావు గనన్


    జిలేబి

    ReplyDelete


  8. పాకిస్తానున కలదా
    చీకటియే! వెలుఁగు నిచ్చు జీవిత మిదియే
    మాకు భరతభూమియె! షా
    జీ! కావుడి మమ్ము కాందిశీకులమయ్యా


    జిలేబి

    ReplyDelete


  9. చీకటి లోనైన బతుక
    మా కలవాటని తలచిన మాన్యుల్లారా
    మీకై "యికిగాయి" యిదే
    చీకటియే! వెలుఁగు నిచ్చు జీవిత మిదియే

    Ikigai -

    https://en.m.wikipedia.org/wiki/Ikigai


    జిలేబి

    ReplyDelete


  10. ఓ కాశీనాథ! బతుకు
    చీకటి! యే వెలుఁగు నిచ్చు జీవిత మిది? యే
    కాకి బతుకాయెనయ తం
    డ్రీ! కవళమ్మునకు గడిగడిని పడిగాపుల్


    జిలేబి

    ReplyDelete


  11. లోకంబులదేదైనను
    చీకటియే! వెలుఁగు నిచ్చు జీవిత మిది యే
    లోకంబునగన లేమోయ్
    స్వీకారముచేయగా భువిని మాత్రమ్మే


    జిలేబి

    ReplyDelete


  12. పిడిగుద్దుల నన్యులు మీ
    దు డిగనురుక చింతయె వలదు సుమీ యనుచున్
    కడిగిన ముత్యము వలె దో
    చెడు మతమున్నపుడె శాంతి చెలఁగును భువిలో!


    సహనమ్మే మా మతమ్ము సర్వంసహలోన్!


    జిలేబి

    ReplyDelete


  13. పిడుగులు మీదు పడ్డను పవిత్రపు బుద్ధుల వీడకన్ భళా
    యడుగక ముందుగాను తమ యాస్తుల నిచ్చు విశాల మైన పో
    కడ, వసుధైవ యాజవపు కారుణమెల్లెడ చూపి యాద దో
    చెడు మతమున్న లోకమున శ్రేయము నెక్కొను సుస్థిరమ్ముగన్!



    జిలేబి

    ReplyDelete


  14. మబ్బుని నేనెన్ని తడవ
    లబ్బా నడ్డు పడినా నిలా? సూర్యునిపై
    యబ్బో శశి యడ్డుపడగ
    నబ్బుర పడి వేచి చూచి నారుకద జనుల్ :)



    జిలేబి

    ReplyDelete


  15. నుడివెడు ద్వేషపు పల్కుల
    వడి ఖండించుచు జనులను వాత్సల్యముతో
    కడతేర్చుచు ప్రేమను పం
    చెడు మతమున్నపుడె శాంతి చెలఁగును భువిలో!


    జిలేబి

    ReplyDelete


  16. నాయుడు వారింటి వారట!

    అమెరికా నివాసియట! తిరుపతి నేటివట!

    సాఫ్టువేర్ రంగంలో ఆర్కిటెక్టట!

    వేదాధ్యయనమ్ము చేయు చుండెనట అమెరికాలో!

    సంస్కృతమ్మున అలవోకగా అవధానము చేసె త్రిగళావధానమ్ములో కోనేటి రాయునికై మహతిలో


    What a deadly combination !

    Kudos!


    పాలడుగు శ్రీచరణు! ధా
    రాళమ్ముగ సంస్కృతపు పరాంగవమై వే
    దాలను నేర్చి వధానిగ
    గ్రోలంగను చేసె ప్రేక్షకులు మెచ్చు సుధల్


    Linked in profile -

    https://www.linkedin.com/in/sricharan-paladugu-8805081


    Cheers
    జిలేబి

    ReplyDelete


  17. Some వాదం ! సమ, వేదం.

    పంప వమ్మ పిల్ల వాడిని చాకిరీ
    కనగ, "లొల్లి చేయ కయ్య" తల్లి
    చెప్పె "చదువు కొనగ చేవయు గూడును,
    బడికిఁ బోవు వాఁడు పనికి, రాఁడు"


    జిలేబి

    ReplyDelete


  18. తండ్రి తో తల్లి ఒడి- మన బడి ; జై జగన్ :)

    అడుగుల కాని యామడువు లా యడి యాళుర మైతి మయ్య ! పో
    కడ యిక మార గాను మన కర్మయు మారును! పిల్ల వాడయెన్
    బడికిఁ జనంగ నిష్టపడువాఁడు; జగమ్మున వ్యర్థుఁడై చెడున్
    వడివడి నేర్వకున్న ! మన బాళి యికన్ వలదయ్య వానికిన్

    జాల్రా
    జిలేబి
    వస్తుందా పదిహేను వేలు జనవరి తొమ్మిదో తారీఖు ? :)

    ReplyDelete


  19. జగనుడి అమ్మ ఒడి అదిగ
    దిగో! జనవరినెల తొమ్మిదిని ఖాతా లో
    డిగనురుకుచు పదిహేన్వే
    లగుకాత జిలేబులన భళా! వై యెస్ సార్!


    జిలేబి

    ReplyDelete


  20. మనమిరువురమే యేల్బడి
    యను పదమును చేర్చి నామయా కవి వర్యా
    అనగా గమనించితి మే
    మని వారున్ను నుడివిరి సమాధానముగా :)


    వారు వారు అండర్ స్టేండు మాడు కొన్నారు :)


    జిలేబి

    ReplyDelete


  21. అలుకుచు నలుకుచు గురువుల
    కొలువును విడువక జిలేబి కుస్తీలన్ చే
    య, లలితపు పదములు కుదిరి
    పలుకే మఱి పరిమళంపుఁ బద్యంబయ్యెన్!


    జిలేబి

    ReplyDelete


  22. వెలుదండ వారి అద్భుతం-


    ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    "బడికిఁ బోవు వాఁడు పనికిరాడు"

    సందర్భము:
    ఏత ద్విద్యాద్వయే లబ్ధే భవితా నాస్తి తే సమః
    బలా త్వతిబలా చైవ సర్వ జ్ఞానస్య మాతరౌ
    బా.కాం.22-16
    బల అతిబల అనే ఈ రెండు విద్యలూ లభిస్తే నీ కెవ్వరూ సాటి రారు. ఇవి సకల జ్ఞానానికీ మూలభూతాలు..
    అని విశ్వామిత్రుడు రాముని కా విద్య లుపదేశించినాడు.
    వెంట వెళ్ళినంత మాత్రాన విశ్వామిత్రుడు ఆచార్యుడై ఏ గురుదక్షిణా అడక్కుండానే ఇంకా ఎన్నో గొప్ప గొప్ప అస్త్ర మంత్రాలను రాముని కుదేశించినా డని,
    రాముడు తాటకిని వధించినా డని, శివధనుర్భంగం గావించినా డని విని అయోధ్యలోని ఒక పౌరుడు మురిసిపోతూ మరొకనితో ఇలా అంటున్నాడు.. అదీ సందర్భం.
    (మామూలు బడులలో మామూలువే చెబుతారు. మామూలు పనులకే అవి పనికివస్తాయి. లోక కల్యాణం కోసం విద్యలు నేర్పరు. పొట్ట కూటికోసం నేర్పేవి కదా!..)

    పనికివచ్చు నతడు=పనికివచ్చును రాముడు
    దానికి = లోక కళ్యాణ కార్యానికి
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    కనుగొనగా ముని గొనిపోయినది యేమొ
    ఘనమైన యాగంబుఁ గాచుట కట!..
    ఒప్పార నుపదేశ మొనరించినది యేమొ
    యనుపమానములైన యస్త్రము లట!..
    అనఘ విశ్వామిత్రు నంతటి యాచార్యు
    డా రామచంద్రున కమరె నంట!..
    ఆ తాటక వధించి, యలికాక్షు విలు వంచి,
    యఖిల లోకారాధ్యు డయ్యె నంట!..
    పని యనంగ నేమి టన లోక కళ్యాణ
    మగును.. పనికివచ్చు నతడు దాని..
    కది విశేష.. మంతె!.. అవనిలో మామూలు
    బడికిఁ బోవు వాఁడు పనికిరాడు..

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    27.12.19
    -----------------------------------------------------------


    అద్భుతం ! దేనికైనను రామాయణము‌ మీకే చెల్లును వెలుదండ వారు !


    వెలుదండ వారి పదపు ర
    వళి చదువక బడికిఁ బోవు వాఁడు ప నికిరాఁ
    డు! డవిణను భజాయించుచు
    నుడివెద తప్పక చదువు పనుపడ జిలేబీ!





    జిలేబి

    ReplyDelete


  23. వడివడి పరుగిడకన్ తడ
    బడి తడబడి బడికిఁ బోవు వాఁడు ప నికిరాఁ
    డు!డబడబ మాట లాడని
    బుడతడు కూడనిక పూవుబోడి జిలేబీ :)


    జిలేబి

    ReplyDelete


  24. మీనపు మేషమ్ముల య
    జ్ఞానపు లెక్కల బతుకున చాలమి తోడై
    దీనము గా లాగుచు నతి
    దానముఁ జేసినఁ గలుగును దారుణ బాధల్!


    జిలేబి

    ReplyDelete


  25. జ్ఞానపు దారి వీడుచు విచారణ చేయక మందబుద్ధితో
    మీనపు లగ్నమందరరె మేషపు రాశిని దూరె రాహువం
    చా నసలన్ కుదేలుపడి చాలమి తో స్థితి మించి నట్టియా
    దానముఁ జేయఁగాఁ గలుగు దారుణ వేదన సజ్జనాళికిన్!


    జిలేబి

    ReplyDelete


  26. ఆకాశవాణికి పంపినది :)


    వీనుల విందు గానముల వేడుకకత్తెలతో సయాటలన్
    తేనియ లెల్ల గ్రోలెదము తెవ్వనయే మధురంబటంచు నా
    మేనియె సర్వమంచు సరి మేలము లాడి విభావరిన్ సమా
    దానము జేయగా గలుగు దారుణ వేదన సజ్జనాళికిన్!


    జిలేబి

    ReplyDelete


  27. చిరుజీవి వలని రాయల
    రరె జారి పడుననుకొన ఖరారుగ పోవ
    య్య రగడలకిది తలముకా
    దొరేయ్ యనుచు తరిమిరి వలదువలదని భళా‌ :)


    జిలేబి

    ReplyDelete


  28. కవి! యూతగొమ్మ తెలుగున
    కు! విమలపు హృదయులకున్ను ! కొంత గలదు చిం
    త విదురుల పురమ్మన! నా
    యవధానిని రాజమండ్రి యడలం జేసెన్!


    జిలేబి

    ReplyDelete


  29. నన్ బిల్వ నవధానంబునకు నేనేమి చేతురా లింగా :)


    ప్రవరాఖ్యుల్ గలరా పురమ్మున! సభన్ ప్రాంగమ్ము వాయింతురే!
    కవులై పండితులై జనాళి యలవోకంగన్ తృటిన్ చేతురే
    చవులూరించెడు పద్యముల్! బిలిచిరే చట్టంచు రమ్మంచు! నా
    యవధానంబఁట రాణ్మహేంద్రవరమం దయ్యో భయం బయ్యెడిన్!


    నే రాను గాక రాను :)

    జిలేబి

    ReplyDelete


  30. అమితాబు బచ్చనునికిడ
    సముచితపు పురస్కృతి వయసాయెనకొయటం
    చు మరి తలచెనట తాను వి
    రమించు కొనవలెన నటన మరియిక యనుచున్


    జిలేబి

    ReplyDelete


  31. మవురిన్ వాయించి నను బి
    లువ వచ్చిరిగా యనుచు తళుకులీనెడు ప
    ట్టువలువల ధరించి వెడల
    నవధానిని రాజమండ్రి యడలంజేసెన్!


    ఆహా! రాజమహేంద్రి :)

    జిలేబి

    ReplyDelete


  32. అవలీలగ లలితుడచట
    నవధానము చేసెనంట ! నాకింక జిలే
    బి,విధురమకొ యనుచు వెడల
    నవధానిని రాజమండ్రి యడలంజేసెన్!


    జిలేబి

    ReplyDelete


  33. అంతంబగుచుండె దశక
    మంతంబగుచుండె కాంతిమతియై జ్యోతి
    స్సంతయు నింపి! రమణి! యీ
    కాంతకు వీడ్కోలు వలుకఁగాఁ దగు నేఁడే!


    జిలేబి

    ReplyDelete


  34. స్వాంతనమున్ జిలేబివలె చక్కగ చేర్చె జనాళి మేలుకై
    నెంతయొ చేయిదోడయె మనీషిత గాదశకమ్ముగా వెలుం
    గంతయు నిల్పె దీనులకు నాసరగానిలిచెన్! శుభాంగి యీ
    కాంతకు వీడుకోలు వలుకం దగు నేఁడు హితమ్ముఁ గోరుచున్!

    రాబోవు కొత్త దశకమ్మునకు స్వాగతం
    పలుకుతూ
    ౨౦౧౦ దశకానికి బాయ్ బాయ్ అంటూ

    చీర్సు సహిత
    జిలేబి
    కాలవాహిని
    అలల వాటున సాగి పోవుట సులభతరమే
    అలల నెదరొడ్డి సాగి పోవుట సులభతరమే?

    ReplyDelete
    Replies
    1. పంతము బూని గ్రామ్యపు విభావరు లద్ది తెనుంగు పద్యమున్
      సాంతము వ్యావహారికపు సద్గుణ శోభల దీర్చగా వలెన్
      సుంతయు తేటతెల్లముగ చొప్పడ నేరని గ్రాంధికాసురో
      కాంతకు వీడుకోలు వలుకం దగు నేఁడు హితమ్ముఁ గోరుచున్!

      Delete

    2. వారెవ్వా గ్రాంధికాసురోకాంత :)

      జిలేబీయమేయిది :)


      అదురహో రాజన్నా వారు

      జిలేబి

      Delete


  35. ముంతను దాచక చల్లకు
    చెంతకు వచ్చుచు విడువక చెందమ్మీ! క
    వ్వింతల నీరతగురువే
    వంతల నిఁడుఁగాత నూత్నవత్సర మింకన్


    నూతన 2020 తో సై యంటూ
    బ్లాగ్ లోకం లో దశాబ్ధిని దాటిన
    ఎవర్ ఫ్రెష్
    జిలేబి :)

    ReplyDelete


  36. కొంత డిమానిటైజనుచు కొంత తలాకుని తట్టి లేపి,లా
    వంతయు జూపి రాముని నివాసపు చిక్కుసమస్య తీర్చి పై
    వంతుగ కాందిశీకులను పౌరులు గా నిల బెట్టిరే!భళా
    ఇంతకు మించి మంచిని వినిర్భయు లై నిలుపంగ భాజపా
    వంతల నిచ్చుఁగాత నవవత్సర మెల్లఁ బ్రజాళి మెచ్చఁగన్!


    జిలేబి

    ReplyDelete


  37. గంతకు తగుబొంతగ బ
    ల్వింతగ శ్రీ విట్టుబాబు విదురుల దరి క
    వ్వింతల నింతియె తను బ్రో
    వంతల నిఁడుఁగాత నూత్నవత్సర మింకన్!!


    బ్రోవన్+తలనిడుగాక :)


    జిలేబి

    ReplyDelete
    Replies

    1. గుండువారి రెవ్యు

      బాగున్నదండీ మీ పూరణము! అభినందనలు!
      బ్రోవన్ + తల = బ్రోవందల...అవుతుందండీ...

      Delete


  38. మోడి పై అప్పోజిషను వారి కిసుకిసు కసికసి


    పుంతల దొక్కెడు వేగం
    బంతయు తగ్గంగ మోడి, పటిమయు వీగన్
    చెంతయు చేరుచు మిక్కిలి
    వంతల నిడుగాత నూత్న వత్సరమింకన్!


    Not Amen!
    జిలేబి

    ReplyDelete
  39. సుంత రసఙ్ఞత లరయక
    పంతముగా పూరణములపై దృష్టి నిడే
    పంతుళ్ళ కా సమస్యలె
    వంతల నిఁడుఁగాత నూత్నవత్సర మింకన్!

    ReplyDelete


  40. తేటగీతి పాదగర్భిత కందము


    "మంచిని గోరుచు తపమొన
    రించగ భవబంధముల పరిధియున్ మీరన్
    సంచితపు "కలిమి గలుఁగు వ
    సించినఁ గాననమున" " ప్రవచించిరి గురువుల్


    జిలేబి

    ReplyDelete


  41. పలుకుల నెమ్మితోడు తమ భావన లందు పరాత్పరుండె భా
    సిలగను జీవితమ్మున ప్రసిద్ధము గా ననురాగమొక్కటే
    బలిమియు మీరగా, విరియబాఱగ బుద్ధియు మోక్షగామిగా
    కలిమి ఘనంబుగాఁ గలుగుఁ గానలకేఁగి వసించువారికిన్!


    జిలేబి

    ReplyDelete


  42. కష్టేఫలి తాతగారు


    కుశలమేనా?


    జిలేబి

    ReplyDelete


  43. రైతు భరోసా! హాలిక
    దాతలకిదె రామ్ భరోస! ధాత్రిని జగనుం
    డే తరమగు నేత సుమీ
    కోతలు కావతనివి సరకున్న మనుజుడోయ్


    జాల్రా
    జిలేబి

    ReplyDelete


  44. హైకూలవి బాగుండును!
    పైకూలు జిలేబులనెడు పైత్యంబులతో
    చాకుని దింపెడు వంటక
    మై కాంతయొకతె బలాగు మామి గలదయా :)


    జిలేబి

    ReplyDelete


  45. కలడొక అనానిమస్సూ
    విలవిల లాడుచు తిరిగి కవితల వెనుక తా
    విలపించు చుండు భోరను
    చు లావుగ దొరలుచు! పేరు చుప్పాయి సుమీ :)


    నారదా!

    జిలేబి

    ReplyDelete


  46. పలువిధముల జీవితమున
    విలువలు మృగ్యమ్ములయ్యె, విజ్ఞులు మెచ్చన్
    పలువిధముల తళుకు బతుకు
    కులె మేలని పలు తలముల కోమలి వినవే


    జిలేబి

    ReplyDelete


  47. వలపుల పేరిటన్ యువత పావనమైన తలమ్ములందు పీ
    కలవరకున్ పరిప్లుతల కాంక్షల తేలుచు మత్తు గానగా
    విలువలు మృగ్యమౌటఁ గని, విజ్ఞులు మెచ్చిరి మోదమందుచున్
    కలవరమేల! యౌవనమె కాలము సూవె వినోదమాడగా!

    జిలేబి

    ReplyDelete


  48. లలితాదిత్యుడు! బుడతడి
    పలుకుఁజెలి వరమవధాన పటిమని చూడన్
    బిలబిల సైనికపురికి జ
    నులార రండి మదియే పనుపడగ నేడే


    జిలేబి

    ReplyDelete


  49. జగనన్న చిత్తూరు రాక :)

    క్లీన్ అండ్ గ్రీన్ చిత్తూరు చూడ ముచ్చట :)

    అన్నా ! జగనన్నా రా రమ్మా ప్రతినెలా :)

    (శంకర్ దయాళ్‌ శర్మ చలువ తిరుపతి క్లీన్ అండ్ గ్రీన్ ఆ రోజుల్లో అయినట్లు :)




    జగనన్న వచ్చుననుచు గ
    బ గబా చిత్తూరు నగర పాలిక ముస్తా
    బగు తీరు చూడ ముచ్చట
    యెగదా! నెలకొక్క మారయిన రమ్మ యికన్ :)


    జాల్రా
    జిలేబి

    ReplyDelete


  50. పైకూ జుజుబీ గిద్యాల్
    మాకు వలదు కావలెన్ సుమా దండిగ భే
    షై కొబ్బరి చిప్పల్ ! సా
    మీ! కోరినదిమ్మ మాకు మించారగనన్

    జిలేబి

    ReplyDelete


  51. Come we go :)


    బాతాము పోయెదము రా
    నూతన సంవత్సరఁపు వినోదము లే, లా
    తీ,తరుణి, కాదు కదుటే!
    చూతాస్త్రుండు తిరుగాడు చువ్వన నచటన్


    జిలేబి

    లాతి - అన్యము - ఆంధ్రభారతి‌ ఉవాచ :)

    ReplyDelete


  52. ఆకాశవాణికి పంపినది

    వయసొచ్చిన మనవడితో ఓ బామ్మ

    జాతర బోవు కైపుల ప్రచారపు మాధ్యమ వార్త జూచి,యా
    పోతము నెక్కి సీమను కపోతపు రీతిని దాటి, క్రొత్తగా
    నూతన వత్సరమ్మున వినూత్న వినోద విహారమెందుకో
    తాత! శివాలయమ్మున సదాశివుడిన్ కొలువంగ మేలగున్!


    జిలేబి

    ReplyDelete


  53. ఏతావాతా వినవోయ్
    నూతన సంవత్సరపు వినోదములే, లా
    వై తరముగ నెక్కొను నరు
    డా! తాగుము మదిర గడగడ నిపుడె వినవోయ్

    జిలేబి

    ReplyDelete


  54. సాతానులవలె తిరుగు
    ళ్లా! తాగుచు తందనమ్ములా ! మారండ
    ర్రా! తరమై నిలవని యీ
    నూతన సంవత్సరఁపు వినోదము లేలా ?


    జిలేబి

    ReplyDelete


  55. దైవా‌నుగ్రహము వలయు
    నీ విశ్వము నీదిగాన నిర్మలముగ నీ
    వా విశ్వేశ్వరుని కొలువు
    మా విఘ్నమ్ములు తొలంగ మహిని జిలేబీ


    జిలేబి

    ReplyDelete


  56. చిప్ప కవితల్ భళా నా
    కొప్పెను పిచ్చగ కవివర కోరుకొ నెద నే
    నిప్పుడె ప్రచురిండయ్యా
    అప్పనముగ నే చదువుకొనంగ కలుపుచున్ !


    జిలేబి

    ReplyDelete


  57. పైకూ పిడకల పీడ స
    లాకమ్ములనుండి నాకిలా తలమున దే
    వా కరుణని విడుదల నీ
    వే కలిగించెవలెనయ్య వేడితి బుచికిన్


    పాపం పసివాడు
    తిరుగుచుండు వెర్రులెత్తి :)


    జిలేబి

    ReplyDelete


  58. సూర్యావారి మనోరథము


    తిరుగు చుంటిని ప్రతి దినము గగనమున
    నాంగ్ల భాషలోన‌ నాదు పేరు
    బెట్టిరి దినమునకు! భేషుసెలవనిరి!
    ఆదివారమె సెలవందదేల?


    జిలేబి

    ReplyDelete


  59. తేకువ తో ఖజాకమున తీరుగ వెల్గును చేర్చినాడ నే
    వేకువ జాముగా మొదలు వేడిని వారికి చేర్చినాడ చే
    నాకుగ ! నాదు పేరిడి జనాళి దినమ్ము విరామమందురే
    నాకిది యాదివార మయినన్ సెలవే లభియింప దెందుకో!

    సూర్యారావుగారి సణుగుడు


    జిలేబి

    ReplyDelete


  60. బండగరమను పదమరరె
    మెండుగ నచ్చెను భళారె మించారగనన్
    కొండాట్టములాడు జుజుబి
    కుండక ముండకపు వ్రాతకు సరిపడు సుమీ


    నారదా!
    జిలేబి

    ReplyDelete


  61. గోవిందా గోవిందా


    మదియే మూలము ప్రార్థనల్ సలుప ప్రామాణీకమా పోలి గా
    ధ!దశాకర్షము నూలుకొల్పగను ప్రాధాన్యమ్ముగా ముక్తికై
    ముదితా! పాడ్యమినాఁడె చేయఁగఁ దగున్; ముక్కోటి యేకాదశిన్
    ముదమారంగను వేంకటేశ్వరుని ప్రాముఖ్యమ్ముగా కొల్వుమా!



    జిలేబి

    ReplyDelete
    Replies


    1. ఈ కథ ఓల్డ్ కథేనా లేక మాడర్న్ పోలియా ?

      https://www.google.com/amp/s/telugu.samayam.com/religion/festivals/history-and-significance-of-poli-padyami-or-poli-swargam-the-last-day-of-karthikam/amp_articleshow/72237966.cms

      Delete


  62. పదిలమ్ముగ వేంకటపతి
    హృదిని జిలేబీయమై సహృదయత చేరన్
    మదియే ముఖ్యము పూజకు
    ముదితా! యేకాదశియు సముచితము ప్రథమన్


    జిలేబి

    ReplyDelete


  63. అదిరెన్ పోవె జిలేబి నీతెలివి ! బాహాటమ్ముగా చెప్పకే
    ముదితా! పాడ్యమినాఁడె చేయఁగఁ దగున్ ముక్కోటి యేకాదశిన్
    సదనంబందున నవ్విపోదురు సుమా చక్కంగ విద్వాంసులే
    మది! పొద్దాయెను వీడుమానిదుర గొమ్మా లెమ్మ బింబాధరా!

    జిలేబి

    ReplyDelete


  64. "ఆశీల" జుగుప్సలతో
    హే! సూధన పూరణల్ ప్రహేళికలేలా!
    ఓసారూ! బండగరము
    గా సాధనలేలనొ! నయగారము లొల్కన్

    నారదా!
    జిలేబి

    ReplyDelete


  65. మొదలయ్యె ఇరాను సమర
    మదిగో కెన్యా మొదలుగ మరి యెక్కడి దా
    క దమన కాండయు బోవున్?
    వదిరెడు కాలము పనిపడి వచ్చె జిలేబీ


    జిలేబి

    ReplyDelete


  66. అదిరెన్ పోవె జిలేబి నీతెలివి ! బాహాటమ్ముగా చెప్పకే
    ముదితా! పాడ్యమినాఁడె చేయఁగఁ దగున్ ముక్కోటి యేకాదశిన్
    సదనంబందున నవ్విపోదురు సుమా చక్కంగ విద్వాంసులే
    మది! పొద్దాయెను వీడుమానిదుర గొమ్మా లెమ్మ బింబాధరా!

    జిలేబి

    ReplyDelete


  67. తప్పుతడకలే అంటూ
    డప్పుని కొట్టు గురువా! తడకకట్టుసరే
    చప్పు‌న సరియైన విషయ
    మొప్పెడు రీతి వివరింపు మోయీ గురువా:)


    జిలేబి

    ReplyDelete


  68. పరుపుల దొరలు సుఖమ్మదె
    పరకాంతాసక్తుల కగు; వరసంపత్తుల్
    పరుగున దరి చేరగ వా
    రరయని సంగతులు లేవు రమణి జిలేబీ

    జిలేబి

    ReplyDelete


  69. పరిచయమయిన మరు నిముష
    మరరె షికారులకరుగ రమణిని బిలిచెడా
    పరమ దయాళుత్వమదే
    పరకాంతాసక్తుల కగు వరసంపత్తుల్!

    జిలేబి

    ReplyDelete


  70. స్వరమాధుర్యమ్ములజో
    రరె వారికి సొత్తు సూవె రమణి జిలేబీ
    పరకాళా ధరియించుట
    పరకాంతాసక్తుల కగు వరసంపత్తుల్!


    జిలేబి

    ReplyDelete


  71. అరరే జారుల్లారా
    పరుగెత్తవలదు వడివడి పడతులకై! ఆ
    నరకమ్మే మరి తప్పక
    పరకాంతాసక్తుల కగు వరసంపత్తుల్!


    ***

    పరుపున పరుండనొకతయె
    నరకమ్మగు జీవితము! వినండి దొరకు నా
    పరుపున వివిధ సుఖములే
    పరకాంతాసక్తుల కగు వరసంపత్తుల్!

    ఆపై చేరుమా ఆసుపత్రి :)


    ***

    పరిశోధింపగ ముక్తి య
    పరకాంతయగు! దొరకదు గభాలున ! దొరకం
    గ రతి యుపరతి సహితమా
    పరకాంతాసక్తుల కగు వరసంపత్తుల్!


    ***

    స్వరమాధుర్యమ్ములజో
    రరె వారికి సొత్తు సూవె రమణి జిలేబీ
    పరకాళా ధరియించుట
    పరకాంతాసక్తుల కగు వరసంపత్తుల్!


    ***

    పరుపుల దొరలు సుఖమ్మదె
    పరకాంతాసక్తుల కగు; వరసంపత్తుల్
    పరుగున దరి చేరగ వా
    రరయని సంగతులు లేవు రమణి జిలేబీ

    ***

    పరిచయమయిన మరు నిముష
    మరరె షికారులకరుగ రమణిని బిలిచెడా
    పరమ దయాళుత్వమదే
    పరకాంతాసక్తుల కగు వరసంపత్తుల్! :)


    ***

    గురువులమని నిత్యానం
    ద రసజ్ఞులమని విభుని యెదయె పరమానం
    ద రహస్యమని బిలుచుటయె
    పరకాంతాసక్తుల కగు వరసంపత్తుల్!

    ***

    మురిపెమ్ములతోడా బం
    గరు చైనుల తోడు వచ్చి గాట్టిగ వాటే
    సి,రసికత చూపు ఘనతయె
    పరకాంతాసక్తుల కగు వరసంపత్తుల్!

    ***

    చురచుర చూచెడు భార్యను
    మరచుచు ప్రియసఖియె తనను మరులుకొలుపు కి
    న్నెర యనుకొను పెన్నిధియే
    పరకాంతాసక్తుల కగు వరసంపత్తుల్!

    ***

    కురులను ముంగురులను సం
    తరించుచు రమణుల తోడు తరియించుచు బే
    షరతుగ లొంగక నొంగుట
    పరకాంతాసక్తుల కగు వరసంపత్తుల్!

    ***

    మరిమరి నిన్నే మొరలిడి
    తి రమణి వయ్యారి రావె తియతీపివి నీ
    వె రమా యని ముదమారుట
    పరకాంతాసక్తుల కగు వరసంపత్తుల్!

    ***

    వరుడను నేను వనితవీ
    వరయగ ధరణి మనదే సువాయింతురుగా
    పరిచయగీతిక! ప్రణయమె
    పరకాంతాసక్తుల కగు వరసంపత్తుల్!

    ***

    అరయగ వారు నిరాడం
    బరులోయ్! తాము తమదనెడు స్వార్థత లేదోయ్
    పరమాప్తులా రమణులే
    పరకాంతాసక్తుల కగు వరసంపత్తుల్!

    ***

    చురుకైనవారు! మీదుగ
    పరిచయముల పెంచుకొనెడు భావజుని పరం
    పరవారిది! సున్నితమే
    పరకాంతాసక్తుల కగు వరసంపత్తుల్!

    ***

    కొరుకుడు పడని వనితల కు
    దురుగ తమదరిని బిలిచి వదురుట వలదటం
    చు రహస్యమ్ముల దాచుట
    పరకాంతాసక్తుల కగు వరసంపత్తుల్!

    ***

    కురిసింది వాన! మదిలో
    విరజాజులు విరియ బూసె! విభుని వలె ప్రియం
    పు రసికతయు పలుకులె పో
    పరకాంతాసక్తుల కగు వరసంపత్తుల్!

    ***

    ఉరుకుల శ్రమణుల హృదయము
    పరుగిడ పరిపరి విధముల వడివడి తనరం
    గ రమణునిగ వెలుగుట భళి
    పరకాంతాసక్తుల కగు వరసంపత్తుల్!

    ***

    అరమోడ్పుకనుల జూచుచు
    వరదుని వలె గాన్పడుచు యవనికను తొలగిం
    చి రయముగా దోచు మనసు
    పరకాంతాసక్తుల కగు వరసంపత్తుల్!

    ***

    అరయగ నాథుడతడె! చ
    క్కెరంపు గుమ్మా యటంచు కెంజాయిని చే
    ర్చి రతనమై మది దోచుట
    పరకాంతాసక్తుల కగు వరసంపత్తుల్!

    ***

    కురిపింతురు తేనెలొలుకు
    పురిగొల్పెడు పల్కులన్ గబుక్కున తృటిలో
    పరిచయముచేసుకొని! భళి
    పరకాంతాసక్తుల కగు వరసంపత్తుల్!


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. అరయగ జిలేబి ముసుగున
      వరలు బుధవరులకు కొన్ని పాళ్ళెక్కువగా
      పరకాంతాసక్తి కలదొ
      నర నను ననుమాన మొదవు , నౌనో కాదో ?

      Delete




    2. నిందారోపణ లేలా !
      వందనములు మీకు రాజ ! వారెవ్వా ! ఆ
      కొందలపు పల్కులేలా !
      బిందాసుగ నయ్యరుకొక బింబాధరయే! :)


      యథో మనః‌ తథో భ్రాంతిః‌ :)

      నారదా!

      జిలేబి

      Delete

  72. ముళ్ళంచుల సిలువలు వా
    రొళ్ళంతయు గుచ్చుకొనెను రోతగ జగనున్
    కళ్ళింతలు చేసికొనుచు
    మళ్లీ మళ్లీ గనంగ మనుజులకు సుమీ :)


    జిలేబి

    ReplyDelete


  73. సరిరారెవ్వరును సుమీ
    కరుణయె మారూపమంచు కవ్వింపులతో
    సురలన్ దేల్చెడు శక్తియె
    పరకాంతాసక్తుల కగు వరసంపత్తుల్!

    ***

    గురిచూసి విసురుదురు వల
    నిరువైపుల పడిన పడతిని తమోలోక
    మ్మిరు వైపుల దేల్చు పటిమ
    పరకాంతాసక్తుల కగు వరసంపత్తుల్!


    జిలేబి

    ReplyDelete


  74. మురుగా యెండ్రు మనిదనై
    కరుణై కడలాయ్ నినైక్క కణ్ణమ్మా యెం
    డ్రరిగిర్కు వందు నిర్కుమ్
    పరకాంతాసక్తుల కగు వరసంపత్తుల్!


    మరీ ఇంత జిలేబియా :)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. మళ్ళీ నాలుగో పాదంలో తెలుగు వచ్చిందే? అలా రెండు భాషలను కలపకూడదనే నిబంధనేదో ఉందనుకుంటానే?🤔

      Delete

    2. అబ్బే ఆ సమ్మెలన్నీ మాకప్లికబుల్ కావండి :)



      జిలేబి

      Delete

  75. ఇది ఫుల్ అండ్ ఫుల్ జిలేబీయమే :)


    మురుగా యెండ్రు మనిదనై
    కరుణై కడలాయ్ వణంగ కణ్ణమ్మా యెం
    డ్రరిగిర్కు వందు నిర్కుమ్
    మరియాదైక్కురి యవన్ ప్రమాదం దాన్ పో :)


    ఆహా తెలుగు బ్లాగ్లోకమా యెంత
    పుణ్యం చేసుకున్నావో కదా
    జిలేబి లాంటి బ్లాగిణి నీ యింట నడయాడ :)



    జిలేబి

    ReplyDelete


  76. అదిగో మిసైల్సి రాకుని
    కుదిపెన్ మార్కెట్లనింక కుదుపునకొ వడిన్
    పదిలంబగు‌చున్ యుద్ధం
    బదిగో ఛాయలగుపించె పాహి గణేశా!


    జిలేబి

    ReplyDelete


  77. Trump says " All is well!"



    ఆయుధములున్ కలవు! మే
    మాయుత్తమ్మై గలము సుమా పోరునకున్
    వాయించెదమ్మి రానుని
    ద్రోయుచు తిమిరమ్ములోన దొంగల నెల్లన్


    జిలేబి

    ReplyDelete


  78. జేజేలు జననేత జగనన్న కి - శ్రీకారానికి‌ నేడే రాక!

    అమ్మ ఒడి యే ప్రగతికి మూలము

    అమ్మో! ఏమన్నారూ ?
    సమ్మెలె దేశప్రగతికి సాధనము లగున్?
    నమ్మము కందివరార్యా
    కమ్మని "అమ్మ ఒడి" యే ప్రగతికి కుదురగున్


    వస్తాయి పదేనువేలు
    తెస్తాయి భోగభాగ్యాలు :)


    జాంగ్రి

    ReplyDelete


  79. తమ్మిని బమ్మి గా నిలిపి తప్పుడు మాటల కాంగ్రెసీయులే
    సమ్మెలె సాధనమ్ములు నిజమ్ముగ దేశపురోభివృద్ధికిన్
    నమ్ము మటంచు దేశపు జనాళిని మోసము చేసిరెల్ల‌ కా
    లమ్ము! జిలేబి! అమ్మ ఒడి లబ్ధియె యూనిక వృద్ధి చెందగాన్!

    జిలేబి

    ReplyDelete


  80. దేనికైనా రామాయణమే :)

    విభీషణుడు రావణునితో సమ్మె - నిబంధన - కట్టుపాటులె వలయు నని పల్కు సందర్భములో


    అమ్మణ్ణి లక్ష్మి యా సీ
    తమ్మను విడుమయ్య మనకు తనకలి చేర్చున్!
    తమ్ముని మాటవినుమయా
    సమ్మెలె దేశప్రగతికి సాధనము లగున్!


    సమ్మె - నిబంధన కట్టుపాటు ఆంధ్ర భారతి ఉవాచ



    జిలేబి

    ReplyDelete
  81. “పాటతో నేను” బ్లాగులో మీ కామెంట్ “జిలేబి” గారూ👇
    // “తమిళ అక్షరం ’ழ’/'zha' ను తెలుగులోని ’ఱ’ ’ళ’ అక్షరాలను కలిపి పలికినట్లుగా పలుకవలెను

    ఎంత ప్రయత్నించినను నోరు తిరగదే వారు పలికి నట్లు :” //
    ———————————-

    ఈ కాలంలో ఎవరికైనా శిక్ష వెయ్యాలంటే టీవీ ఎదురుగా కుర్చీలో కట్టేసి కూర్చోబెట్టి వరసగా ... మళ్ళీ మళ్ళీ ... సీరియల్స్ చూపించాలి అంటుంటాం.
    మరో రకం శిక్ష ఇప్పుడే తట్టింది - అదే ఈ తమిళ అక్షరాన్ని సరిగా పలకడం వచ్చేటంత వరకు సాధన చెయ్యమని నిర్బంధించడం 😀.

    ReplyDelete
    Replies

    1. అழగు చెల్లం నీంగదాన్ పోంగ :)



      జిలేబి

      Delete
    2. పొగిడారా, తిట్టారా? ఏదో “పో పో” అన్నట్లనిపిస్తోంది😒.
      అసలు మాకీ అరవ సేవ యెందుకు తెలుగు బ్లాగుల్లో కూడా? ఎల్లాగూ మన టీవీ ఛానళ్ళ నిర్లక్ష్యపు ధోరణి వల్ల రేజస్తమానం అరవ హీరోలతో నిండిన సినిమాలే తెలుగు ఛానళ్ళలో చూపిస్తున్నారు (బహుశః తక్కువ ఖరీదుకు దొరుకుతాయేమో?). వీడు, వీడు పోతే వాడు, వాడు పోతే వాడి తమ్ముడు, వాడు పోతే వాడమ్మ మొగుడు అన్న ఓ సినిమా డైలాగు లాగా ..... కమల్ హసన్. కాకపోతే రజనీకాంత్, కాకపోతే రజనీకాంత్ అల్లుడు, కాకపోతే విక్రమ్, కాకపోతే సూర్య, కాకపోతే సూర్య తమ్ముడు, కాకపోతే విజయ్, మరొకడు, మరొకడు .... ఆగని దండయాత్ర.

      ధనుర్మాసం వస్తే అదొక అరవ హడావుడి ఈ మధ్య తెలుగునాట బాగా ఎక్కువైంది.

      తెలుగు భాష గురించి పెద్దగా బాధపడిపోవడం అనవసరం అనిపిస్తుంది😔.

      Delete

    3. ఆయ్

      మా అరవం వాళ్ల మీద ఇన్నేసి మాటలంటారా ఉండండుండండి మా నిర్మలా మామి దగ్గర చెప్పి మీ పించను ఆపు చేయమంటా :)



      జిలేబి

      Delete
    4. ఆఁ ఆఁ, ఏదైనా ఆపెయ్యడానికి మాత్రం ఆర్ధికమంత్రులు ఏమీ సంకోచించరు లెండి.

      ఇంతకీ పైన మీరు నన్ను అరవంలో అన్న మాటలకు అర్ధం చెప్పరేం?

      Delete
    5. అనుంగు చెల్లెమ్మా నీకు దానంగా ఈ పొంగడం ఇస్తున్నా. అందుకో అని అర్థమేమోనండి!

      Delete
    6. హ్హ హ్హ హ్హ సూర్య, బాగా ప్రయత్నించారు👌.
      ఇది చూస్తే మీకన్నా ఒకటి రెండు ముక్కలు తమిళం నాకే ఎక్కువ తెలుసేమో అనిపిస్తోంది 😁. కనీసం “పోంగ” అంటే పొండి అని, “నీంగ” అంటే మీరు అని చూచాయగా తెలుసు 🙂, కరక్టేనా “జిలేబి” గారూ?

      Delete


  82. పోటెత్తిరి జగనన్నని
    వాటము గానైన చూచి వాహ్ వాహ్ యనగా
    ధాటిగ అన్నా చిత్తూ
    రే టాపు తలమ్ము పార్టి రెపరప లాడన్ !


    జాల్రా
    జిలేబి

    ReplyDelete

  83. పదిహేన్ వేల్ అక్కౌంటు లో పడినాయి (ట) !!!

    జై జగనన్నా :)

    చేయు నతడె చెప్పంగన్ !
    మాయా మర్మము లెరుగని మనిషి జగనుడోయ్!
    చేయూత నిచ్చె తల్లుల
    కే యావత్తు జనులున్ సుఖీభవ యనగా !



    జాల్రా
    జిలేబి

    ReplyDelete


  84. వలదు! మాట వినుమెపుడు బడిన నపుడు
    చేయ జంతువుల వలె కచేరి‌‌లోన
    గొంతు చించుకొనుచు గోల గోలలేను
    దుఃఖమే కూర్చుఁ గాదె వధూటి, రతము!


    జిలేబి

    ReplyDelete


  85. దుఃఖమ దేల స్నేహితుడ! దూరకు చట్టని సందుగొందులన్
    దుఃఖము తీరదయ్య! నిను త్రోయును మాయని మాటు వేయుచున్
    దుఃఖము పుట్టె చట్టని వధూటియు వెన్కనె బుట్టె మానవా
    దుఃఖము గాదె చక్కని వధూటి, రతంబు, విదగ్ధకోటికిన్!

    జిలేబి

    ReplyDelete


  86. నీహారికాజీ

    శంకరాభరణం సభలో కవీశ్వరుల ఇవ్వాళ్టి దుఃఖానికి కొంత వూరట కలిగించేటట్లు కొంత "స్వాంతన వచనమ్ములు" పల్కడానికి రావలసినదిగా వేడుకోలు


    ఇట్లు
    నారదాయ నమః
    జిలేబి

    ReplyDelete
    Replies
    1. పొద్దున్న లేవడమే అగ్గిపెట్టె చేత్తో పట్టుకుని లేస్తారా మీరు “జిలేబి” గారూ?🙂

      Delete
    2. అழగు చెల్లం నీంగదాన్ పోంగ :)
      బంగారుతల్లీ నువ్వే పో :(

      Delete

    3. బంగారు తండ్రి (కొండ) మీరే పోదురూ :)


      జిలేబి

      Delete
    4. నీహారిక గారు కలగజేసుకుంటే గానీ ఆ తమిళ వాక్యానికి అర్థం బయటకు రాలేదన్నమాట. Unfair “జిలేబి” గారు ☹️.

      బైదివే, ఆ వాక్యం నన్నుద్దేశించి అన్నదే కదా 😎?

      Delete


    5. మీ ప్రశ్నకు జవాబు చెప్పిన వారిలో వారొక్కరే కొంత దరిదాపుల్లో వచ్చేరు కాబట్టి దాన్ని‌ సవరించి వివరించడం జరిగినది :)



      జిలేబి

      Delete


  87. ఓరోరి అనానిమసూ
    మా రాజా వారు నీ "కమంట్ల"ను భళిరా
    పారేసారేకి పదా
    పోరా పో వేరు తలము పో పొమ్మింకన్ :)


    నారదా
    జిలేబి

    ReplyDelete