Tuesday, April 7, 2026

డిన్నర్ ( రాత్రి భోజనము)

 

ఆకలి 

మాడిపోతోంది‌.

డైనింగ్ టేబుల్ 

నిండుగ

పలు రకాలైన ఫుడ్

జంక్ నాన్ జంక్ 

మల్టీ కుజైన్.

కల్నరీ ఆర్ట్ కి

ప్రతీక గా 

టేబుల్ మెరుస్తోంది.

కట్లరీ చూసా.

గోల్డెన్ రంగు‌.

అబ్బ ఎక్కడ

చూసినా గోల్డే‌.


తిందామా ?

ప్చ్ తింటే 

నిద్ర పట్టదు

ఆయాసం వస్తుంది‌.

పోన్లే 

ఇవ్వాళ 

ఏకాదశి

అనుకో‌


రాత్రి ఆకలేయదూ ?

వేస్తే చూస్తాం

ఇప్పుడైతే వద్దు‌

షుగర్ ఎక్కువ అయినట్టుంది 

ఆల్రెడీ‌.

జీ! విత మాధుర్యం అంటే

ఈ షుగర్ ఎక్కువవడమేనో?



జిలేబి

1 comment:

  1. అన్నా అతిరథ భోజన !
    డిన్నర్ సేయంగ రమ్ము , తీపి జిలేబుల్
    సున్నుండలు , లడ్డూల్ , అ
    న్నున్నయి పలు పాయసాలు నోరూరించున్

    షుగరా ! ఫర్లే ! పులసల
    యిగురు , చికెను ఫ్రైయు , మటను - ఎగ్ బిర్యానీల్
    సెగ దగలదు గ్రేప్ వైనున
    వగ దొలగ భుజించ వచ్చు , వద్దనకు సఖా !

    ReplyDelete