Saturday, January 28, 2012

వినా మనమోహనం !!

వినా మనమోహనం ననా ధో ననా ధః 

సదా మనమోహనం స్మరామి స్మరామి

హరే మనమోహనం ప్రసీద ప్రసీద

ప్రియం మనమోహనం  ప్రయచ్ఛ ప్రయచ్ఛ !



చీర్స్

జిలేబి.

Friday, January 27, 2012

మీరేం చేస్తున్టారండీ ?

మీరేం చేస్తున్టారండీ అన్నా రా మధ్య ఒకరు.

వంట చేస్తున్టానండీ అన్నా.

అది సరేలే నండీ , అది తప్పించి వేరే ఏమైనా వ్యాపకం ఉందా అన్నారు వారు.

వుందండీ, పనిలేక కాలక్షేపం ఖబుర్లు లాంటివి చదువుతూ ఉంటా నండీ అన్నా.

ఎక్కడండీ సాక్షి లో నా జ్యోతి లో నా అడిగారు వారు.

అబ్బే బ్లాగ్ లోకం నండీ అన్నా.

అంటే అడిగారు వారు.

అదండీ అంతర్జాలం అని ఒకటి వుందండీ అందులో చాలా బాగ రాస్తున్టారండీ అందరూ అవన్నీ అప్పుడప్పుడు చదువుతూ ఉంటా అన్నా

చదివి ఎం చేస్తారండీ ? అడిగారావిడ.

చదివి నచ్చితే కామెంటు కొడ తా నండీ అన్నా.

అదేమిటండీ నచ్చితే కొడత నంటారు అని అడిగారు వారు.

నచ్చక పోయినా కొడుతూ వుంటారండీ అన్నా.

అయ్య బాబోయ్ రాసేవాడు చదివే వాడికి లోకువని చెప్పండి అట్లయితే అన్నారావిడ.

అవునేమో కదా ఇక్కడ బక్కెట్టు బోర్లా పడిందే చెప్మా అనుకున్నా !


చీర్స్
జిలేబి.

పద్మార్పిత !

సంవత్సారినికో మారు
జరిగే సంబరం
గణ తంత్రోత్సవ
'పద్మా'ర్పితల లిస్టు

కొన్ని గత కాలపు  శ్రీ ల  
పునరుజ్జీవన  భూషితం  

కొన్ని జీవించి ఉన్న ఉత్తేజాలు
ఇప్పటికి నిస్తేజాలు
కాల గతిన కలిస్తే
అవుతాయేమో విభూష ణాలు

సంవత్సరానికో సారి
జరిగే సంబరం లో
మరో మారు అంబారీ ఎక్కిన
పద్మార్పిత !



చీర్స్
జిలేబి.

Wednesday, January 25, 2012

బందీ అను బంధం

హే ప్రభూ,
అక్కడ నువ్వు ఒంటరి గా వున్నావని
తెలిసి నిన్ను బందీ చేయాలని చూస్తున్నా
కానీ నువ్వు చేసే మాయ ఏమిటో తెలియదు
ఇక్కడ నేనే బందీ అయి పోయాను

ఈ బందీ బంధము నీదే అని
అనుకున్నా  అదేమిటో
ఆకలేస్తే చిన్న పాప నోట్లో చెయ్యేసుకుని
చప్పరించే వైనం లా వుంది

ఈ పై నున్న బందా , ఎప్పుడు బందీ అగునో ?

తేరీ సహీ నాహీ అయిన
జిలేబి.

(శ్రీ శర్మ గారి 'అనుబంధం' ప్రశ్న కి జవాబు )

Tuesday, January 24, 2012

బాలయ్య vs జిలేబి !బాపురే రమణీయం !

బాపురే రమణీయం !

బెష్టు మట్టి బుర్ర !

ఈ మధ్య బాపురే రమణీయం శ్రీ రామ రాజ్యం వారి అర్ధ శత (వందకి పరుగులిచ్చేందుకు కొంత పుష్ అప్ ) వేడుకలని  తీరిగ్గా 'నిల్చొని' చూసాను. నిల్చొని అనడం ఎందుకంటే , standing ovation అన్న మాట. ఒక్కింత మర్యాద.

ఈ తీరికైన వ్యాపకం లో ఆఖరున (బాలయ్య మొదటే మాట్లాడితే ఆ పై జనాలు ఎవరూ ఇక ఉండరని తను ఆఖర్లో మాట్లాడను కున్నారో, కాకుంటే, మట్టి బుర్రలు ఆఖర్న మాట్లాడడమే బెష్టు అనుకున్నారో తెలీదు గాని ) బాలయ్య మాట్లాడాడు.

స్టేజీ ని ఈ వైపు నించి ఆ వైపుకి 'జానా' పెడుతూ సింహం లా తిరుగుతూ ఒక్కింత గ్రాంధికమూ, గ్రామ్యమూ కలిపి మాట్లాడడం మొదలెట్టాడు, సామి రంగా, జిలేబి కి కాంపిటీషన్ కోచ్చేసాడే సుమా బాలయ్య కూడా అని నేను హాశ్చర్య పోయాను సుమా.

ఎందుకంటే, ఆ మధ్య మా భారారే (ఇంకా 'మా' భారారే వారే అను కుంటున్నా, !) ఆయ్ అందరూ హారం పత్రికకి సంక్రాంతి లోపే కథలూ గట్రా పంపించండి అంటే, నేనూ సై అని, భారారే , ఏప్రిల్ ఒకటో తారీకులో గా సంక్రాంతి కి ఆర్టికల్ పంపిస్తానని వాక్రుచ్చాను. వారు ఓ కోడా జాడిన్చేరు, ఆయ్ జిలేబి రమ్ము ఏమైనా తాగారా, ఏప్రిల్ లో ఏమిటి సంక్రాంతి అని !

ఇట్లాగే మా బాలయ్య కూడా, ఈ శ్రీ రామ రాజ్య అర్ధ శత మహోత్సవ వేడుకలలో, 'రాబోయే ఉగాది కి, గొబ్బిళ్ళు, నవ ధాన్యరాసులూ. అంటూ 'వాక్రుచ్చడం ' తో ముచ్చటేసి, బాలయ్యా , శభాష్, నువ్వూ జిలేబి కి సరి సమానమైన వాడవే నోయి అని నేను ముచ్చట పడి పోయా ! మొత్తం మీద, జిలేబి కి 'టెలీపతీ' ఉందండోయ్ !


బాలయ్య 'గొబ్బిళ్ళ ఉగాది' !!



say cheers to
జిలేబి !

Monday, January 23, 2012

పట్టు కొట్టు తిట్టు కాని మాట తీసి గట్టు మీద పెట్టు

ఏమోయ్ జిలేబీ, మార్కెట్టు కెళ్ళి  ఏం పట్టు కు రమ్మంటావ్ ?

ఏదో ఒకటి కొట్టు కు రండి.

అదేమిటోయ్, ఆ పరాకు,చిరాకు ?

ఉన్న మాటంటే ఉలుకెక్కువ అంటారు

సరేలే, ఆ బాస్కెట్టు గట్టు  మీద పెట్టు. ఇప్పుడే వస్తా !


చీర్స్
జిలేబి.

Saturday, January 21, 2012

'పద' తాడన కేళీ విలాసం !

రుషం లో

రువు

తాకిడి లో

మరుకం

వ్వుల పువ్వుల

కేకసలు రాదే భ

ళీ తంటా

విను వీధి

లాస్యం

సంగ్రామ కోలాటం !


జిలేబీ ఎందుకె

నీకీ వినువీధుల విహారం ?
మానుమా నీ ఈ

పద తాడన కేళీ విలాసం !


చీర్స్
జిలేబి.

Friday, January 20, 2012

కాలక్షేపం కబుర్లు శర్మ గారికి - విన్నపం

కాలక్షేపం కబుర్లు శర్మ గారికి విన్నపం.

విన్నపాలు వినవలెను వింత వింత లు -  మధ్య లో ధబాల్మని మీ టపాలు ఆపెయ్యడం ఏమీ బాగోలేదు.

కామెంటులు రాసే వారు కోకొల్లలు. కాని సత్తా ఉన్న టపా రాసే వారు కొంత మంది మాత్రమె. అందులో నాకు తెలిసిన ముఖ్యమైన వారు మీరు. మీలాంటి వారు రాసే టపాలని చదవడానికి ఎంతో మంది ఉండవచ్చు.

అర్థం  పర్థం లేని కామెంటు లకి వెరచి మీరు టపా ఆపు చెయ్యడం నాకు బెష్టు బుర్రలు చెయ్యాల్సిన పనిలా అని పించడం లేదు.

సో, మీరు ఈ విషయమై ఆలోచించి సరియైన ఒక నిర్ణయానికి వచ్చి టపాలు మళ్ళీ పునః ప్రారంభించాలని జిలేబీ విన్నపం.

జిలేబి.

Thursday, January 19, 2012

మసాలా 'దోషా'

ఒక తాతయ్య మాంచి దోసాలు వేసే వాడు.
ఆ దరిదాపుల్లో ఎగిరే కాకి ఒకటి
అప్పుడప్పుడు దోసల వాసనల్ని పసిగట్టేది
కాకి కి అవ్వ వేడైన వడలు వేసిన కథలు తెలుసు కానీ
దోసలు వేసే తాత దగ్గిర నించి 
దోసలు  ఎలా లాగాలో తెలీలేదు.
తాతా, తాతా , ఐ హేట్ దోసలు
అవి ఆరోగ్యానికి మంచి వి కావు అంది కాకి
కాకీ కాకీ నీ కెందుకు దోసలు నప్పలే
అడిగాడు తాతయ్య
చెప్పాగా , దోసలు ఆరోగ్యానికి
మంచివి కావని అంది మళ్ళీ కాకి
కాకులకు పట్టని దోస వేయ నేల
అని ఊరుకున్నాడు తాతయ్య
'కావు కావు' మన్నది మరో కాకి,
దానికి జవాబుగా.

కాలం మారినా కథలు మార కూడదు,
వాడెవడో దారిన పోయే దానయ్య ఏదో
అన్నాడని సీతమ్మ అడవులు పట్టింది.
దారిన పోయే కాకులు ఏదో అన్నా యని
ఈ తాత దోసలు వెయ్యడం ఆపేసాడు
ఈ సమీకరణం లో మిగిలింది ఏమిటి ?
కథ కంచికి , మనమింటికి.
నో చీస్, దోషా,
జిలేబి.
(కామెంటిన కనకాంగి కోక కాకెత్తు కు పోయిందని బ్లాగ్విత)

Wednesday, January 18, 2012

కాలక్షేపం కబుర్లు


ఇవ్వాళా  ఖాళీ.   నిశ్శబ్ద అసమ్మతి














నో చీర్స్
జిలేబి.