మానేజ్మెంట్ గురువులు, మానసిక శాస్త్ర నిపుణులు చెప్పే సులువైన మాట - పరుగు ఆపడం ఒక కళ.
అసలు పరుగు లో వున్న వాడు పరుగు ఆప గలడా అని ?
పరుగంటేనే డైన మిజం. అంటే ఎల్ల వేళలా పరిణితి. అట్లాంటి నాన్-స్టాటిక్ డై మేన్షన్ లో వున్న వాడు పరుగు ఆపాడంటే వాడు స్టాటిక్ స్టేట్ కి రావాలి.
స్టాటిక్ కరెంట్ షాక్ మనం అప్పుడప్పుడు చవి చూస్తూంటాం. సో, స్టాటిక్ స్టేట్ లోనూ కొంత పాటి డై న మిజం వుంది. అంటే సకల చరమూ ఆచరమైనా అందులో రవ్వంత చరత్వం ఉంటుందను కుంటాను.
సో, చరాచర సృష్టి అన్నది ఆచరత్వం, చరత్వం కాని దాని నించి వచ్చిందని చెప్పటం లో కొంత సూక్ష్మం వున్నట్టు ఉంది.
ఆచరమైనంత మాత్రాన చరం గొప్పదని కాదు. అట్లాగే చరమైనంత మాత్రాన అచరం గొప్పదని కాదు.
దీంట్లో ని మర్మ మెరిగి, చర అచర లో దేనిని ఎ పద్ధతి లో ఉపయోగించు కోవాలో అన్న దానిని గ్రహిస్తే ఓ మోస్తరు జీవితం సాఫీ అని భావిస్తాను.
కాకబొతే ఈ చర అచర ల లో ఏది ఎప్పుడు ఉపయోగించాలి అన్నది మాత్రం ప్రతి ఒక్కరి అనుభూతి కి , వారి వారి ప్రయత్నాలకి లోబడి ఉంటుందను కుంటాను.
అచర స్థితి లో ఉండి చర మార్గాన్ని కర్మ సిద్దాంతం గా చేసి చూపించిన ఓ మరిచి పోతూన్న 'గాంధీ' కి నివాళు లతో !
జిలేబి.