ఈ మధ్య ఒక వారం గా జ్యోతిష్యం మీద ఎగ బడి అసలు జిలేబీ నువ్వు జిలేబీ నేనా అన్నంత దాకా రావడం తో, ఇక ఈ ప్రహసనం మనకు వద్దు బాబోయ్ అని విరమించేసా !
సరే వేరే ఏదైనా టీం పాస్ , టైం పాస్ చేద్దారి అని ఆలోచిస్తూంటే, ఏడుపు ఏమన్నా'ఆండోల్ల' పేటెంటు రైటా అని జర్నో డ్రీమ్స్ పురాణ పండ ఫణీంద్ర వారు పురాతన మైన ప్రశ్న ని లేవ దీశారు.
అక్కడినించి మొదలయ్యి, నేను ఓ నాలుగు బ్లాగు లు తిరిగి వస్తే, ప్రతి బ్లాగు లో నూ కన్నీళ్ళే !
అయ్యా బాబోయ్ ఏమిటీ బ్లాగు లోకం కన్నీళ్ళ పర్యంతం అయి పోయే అని ఆలోచిస్తే, ఓహో, చంద్ర కుజ ప్రభావాల వల్ల ఎగసి పడే అగ్ని కణాలు వూరికే వదలి పెట్టవు సుమీ అని పించింది.
ఈ కన్నీళ్ళ గురించి ఆల్రెడి చెప్పేసా -
సర్వ రోగ నివారిణీ నయన ధారా వాహినీ నమోస్తు నిత్యం పరిపాలయామాం అని.
ఆలోచిస్తే, కన్నీళ్లు అసలు లేకుంటే ఏమయి ఉండేది అని పించింది. కరడు గట్టిన హృదయం కూడా, పాషాణ మైన గుండె కాయ కూడా, ప్రేమకు తడిసి కరిగి పోతుంది అంటారు.
అట్లా, ఈ కన్నీళ్లు, బాధ కి, ఆనందానికి, అన్నీటికి కలగలపై, గుండె కాయ బరువుని తగ్గిస్తూ మనకంతా 'లైట్ ' మొమెంట్స్ కల్పించడం అనే ప్రక్రియ లేకుండా ఉంటే మనం ఎట్లా ఉండే వారం?
జీవకోటి కి కన్నీళ్లు లేకుంటే అసలు హృదయ స్పందనలు అనేవి ఉన్నాయి అని తెలిసి ఉండే వా?
గగుర్పాటు అంటాం. భయాందోళనలంటాం. అన్నీటికి ఈ కన్నీళ్లు చేదోడు వాదోడై ఉండటం దీని విషయం.
డాక్టర్లు సైంటిఫిక్ గా కారణాలు చెప్పొచ్చు గాక. వాటి కన్నా విలువైనది, ఈ కన్నీళ్లు కలిగించే తేట దనానికి వేరే ఏదీ సరి పోదు అనిపిస్తుంది.
లాఫింగ్ క్లబ్స్ ఉన్నాయి అంటారు. అట్లాగే ఏడుపు గొట్ల క్లబ్ ఉంటా యంటారా ?
చీర్స్
జిలేబి.