-
Thursday, September 4, 2014
Tuesday, September 2, 2014
Saturday, August 30, 2014
ఇక మీదట నేను దేవుణ్ణి నమ్ముతాను !!
దేవా కన రావా కరుణించి ... " ఓ కొత్త భక్తుడు ప్రార్థించడం మొదలెట్టాడు.
పైనున్న కనులు కనబడని, చెవులు వినిపించని దేవునికి హటాత్తు గా కళ్ళు కనిపించి, చెవులు వినిపించడం మొద లెట్టింది . హటాత్తు గా అనడం తప్పు. ఈ మానవ మాత్రుల తో 'లావాదేవీ లు మాట్లాడి మాట్లాడి ,దేవుడు కూడా బిజినెస్స్ అంటే ఏమిటో ఓ మోస్తరు అర్థం చేసుకున్నాడు . బిజినెస్స్ కి కావాల్సింది న్యూ బిజినెస్స్ అన్న సూత్రం అన్నది గ్రహించేడు . అంటే, తన బిజినెస్స్ బాగా నడవాలంటే , ఆల్వేస్ కొత్త బిజినెస్స్ ఉండా లన్నది ప్రాథమిక మౌళిక సూత్రం .
అందుకే కొత్త భక్తుడు ఎవడైనా కొంత గీ పెట్టినా చాలు - వెంటనే తన్ని కలవడానికి, తనతో భేటి ఇవ్వడానికి , అతను చెప్పే మాటలు విని వెంటనే వాడికి ఓ సౌలభ్యమైన 'సొల్యూషన్' ఇవ్వడానికి పై నున్న భగవంతుడు వెంటనే ఆతురత చూపిస్తాడు . అదే పాత భక్తుడైతే వాడు అరిచి గీ పెట్టినా అస్సలు పట్టించు కోడు - అట్లాస్ట్ దేవేరి ఏమైనా రెకమెండు చేస్తే , అప్పుడు పోనీ లే అని కొంత కరుణి స్తాడు !
తన ద్వార పాలకుణ్ణి పిలచి ఆ కొత్త భక్తుడి మొరని వినడానికి ఉద్యుక్తు డయ్యాడు
నీ పేరేమి నాయనా ! కరుణాంత రంగుడై అడిగాడు భగమంతుడు!
కొత్త భక్తుడు పేరు చెప్పాడు !
అరె, నా అవతారాల లో రెండు పేర్లు కలిపి పెట్తుకున్నావే ! మెచ్చు కోలు గా చూసేడు భగవంతుడు . ఈ బిజినెస్స్ టెక్నిక్ కూడా భగవంతుడు ఈ మానవ మాత్రుల వద్దనించే నేర్చుకున్నాడు - ఏదైనా సరే మొదటి అప్ప్రీ షిఎట్ చేయాలి ! కొంత పెప్పర్ కలిపి అనినా సరే యు ఆర్ హేండ్ సామ్ యు నో అనాలి !
కొత్త భక్తుడు చెప్పాడు - అది మా పేరెంట్స్ నాకు తగలెట్టిన పేరు - అసహ్యం గా ముఖం తిప్పేడు .
భగవంతుడు గతుక్కు మన్నాడు ! వీణ్ణి వదిలించు కోవటం బెటరు అనుకుని
భక్తా నీ కోరిక ఏమి ? అడిగాడు
దేవా, నేను దయ్యాల్ని నమ్మి కథలు గట్రా రాసేను . మొదట్లో సూపెర్ డూపెర్ అయ్యేయి అవి . ఆ పై అంతా ఫ్లాప్ షో ఐ పోయేయి . వీటికి కారణం నేను దెయ్యాల్ని నమ్మటం వల్లే నని నమ్మి , ఇక మీదట మారాలి అనుకుని నిన్ను నమ్మడం మొదలెట్టా చెప్పాడు భక్తుడు -- "నా కథలు, బ్లాగులు గట్రా సక్సెస్ అయ్యే మార్గం చెప్పు .
మళ్ళీ లావాదేవీయేనా భగవంతుడు దీర్ఘం గా ఆలోచించి చెప్పేడు -
భక్తా ! నీ మార్పు కి సంత సించి నాడను !
నీకూ దెయ్యాలకి ప్రారబ్ధ కర్మ అవశేషం ఇంకా తీరలేదు కాబట్టి నువ్వు దెయ్యాల గురించి ఇంకా ఇంకా రాస్తూనే ఉంటావు కాని ఇప్పుడు నన్ను నమ్మాలని వచ్చేవు కాబట్టి చెబుతా - ఇక మీదట దేవుణ్ణి నమ్మిన దెయ్యాల గురించి కథలు, బ్లాగు లు టపాలు గెలుకు అవి సూపేరు డూపెరు అవుతాయి
ధన్యోస్మి ధన్యోస్మి స్వామీ ! చెప్పేడు కొత్త భక్తుడు సంతోషం తో !
చీర్స్
జిలేబి
Friday, August 29, 2014
Tuesday, August 26, 2014
జిలేబి జాకెట్ ఛాలెంజ్ !
జిలేబి జాకెట్ ఛాలెంజ్ !
ఈ మధ్య ఐసు బకెట్ ఛాలెంజ్ అని ఎవరో అంటే , మరోక్కరు లోకలైజేడ్ వెర్షన్ రైజ్ బకెట్ ఛాలెంజ్ అంటే , మనం కూడా ఒక జిలేబి బకెట్ ఛాలెంజ్ అని ఛాలెంజ్ విసరోచ్చు కదా అని హెడ్డింగ్ పెడితే అప్పు తచ్చై అది జిలేబి జాకెట్ ఛాలెంజ్ అయి కూర్చోంది .
బకెట్ ఐతే నేమి, జాకెట్ ఐతే నేమి శ్రీ శ్రీ లాంటి కవులకి అగ్గి పుల్ల సబ్బు బిళ్ళ, కవితా వస్తు వైతే, సినీ 'కావు' కావు లకి కిటికీ లు పెట్టిన జాకెట్టు కిత కిత లు పెట్టె 'ఐటము సాంగోప సాంగము లైతే , మరి మనకు మాత్రం జిలేబి జాకెట్ ఛాలెంజ్ అన్న హెడ్డింగు ఎందుకు పనికి రాదు అనుకుని 'పని లేక' కాస్త 'కష్టే' పడి కామెంటు ఫలముల కోసం ఒక టపా కొట్టి చూద్దారి అనుకుని ఈ టపా మొదలెట్టా !!
ఇంతకీ ఈ జిలేబి బకెట్ ఛాలెంజ్ ఏమిటి ?
బ్లాగు లోకానికి తిలోదకాలిచ్చిన బ్లాగోదరుల్లారా, బ్లాగోన్మణీయు లారా , ఇదే జిలేబి బకెట్ ఛాలెంజ్ ! మీరందరూ మళ్ళీ బ్లాగు లోకాని రండి ! ఇదే ఈ బకెట్ ఛాలెంజ్ !! ఈ టపాలకి (నా ఒక్క టపా కి మాత్రమె కాదు ) ఈ 'ఈ' లోకపు , పంచ దశ లోకపు టపాలకి లైకులు కొట్టి బకెట్ ఛాలెంజ్ విసరండి !!
రండి ,అ బకెట్ల కొలది కామెంట్ల తో ఛాలెంజ్ లు విసురుకుని బ్లాగు లోకాన్ని మళ్ళీ మక్కలిరగ దీద్దాం !!
శుభోదయం
చీర్స్
జిలేబి
జాకెట్ అని రాసానా అది క్లిక్కుల కోసం -- అప్పు తచ్చు ! బకెట్ ఛాలెంజ్ అన్న మాట !
Saturday, August 23, 2014
జిలేబి (ల) సింగపూరు విజయం!!
జిలేబి (ల) సింగపూరు విజయం!!
ఇదిగో జిలేబి సుష్మా మేడం ఫోను నీకు పెందరాళే ఫోను !
జిలేబి జి, కల్ హీ నికల్ చల్నా సింగపూర్ ఆ వైపు నించి మేడం గారి హుకుం !!
మరో రెండు గంటల్లో మరో ఫోను
మమతా దీది ఆన్ లైన్ లో ఉన్నారు -- ఈ మారు అయ్యరు గారు కొద్దిగా సందేహిస్తూ ఫోనిచ్చేరు
"మోయ్ సింగపూర్ జాబో లాగే, అప్నోర్ పేక్ రెడీ కొరో '
మరో నాలుగు గంటల్లో మరో ఫోను
జిలేబి నువ్వేమన్నా మరీ అంత గొప్ప ఫిగర్ వా ? కేసీఆర్ ఆన్ లైన్ అయ్యరు గారు అబ్బుర పడేరు !
జిలేబి గారు, జర ఈ వారం లో సింగ పూరు కెళ్లాల . కూసింత మీరూ సాయం పడుదురూ ... అసలే అరవ మేళం అక్కడ కొంత మాట సాయం ఉంటాది '
బాల్చీ తంతే నెక్స్ట్ ఫ్లైటు లో మేడం సుష్మాజీ గారితో సింగపూరు లో పడ్డది జిలేబి !!
ఏమిటో మరి ఈ మధ్య వరస బెట్టి అందరూ సింగపూరు పయనం కట్టె స్తున్నారు !!
మన 'ఆచంద్ర తారార్కం' వారు ఆంధ్ర దేశాన్ని సింగపూరు లా చేసేస్తా మన్నారు !!
అదేమీ సింగపూరు మాయయో అనుకుని జూస్తే 'సింగపూరు' సింగారి పాట గుర్తు కొచ్చింది
ఇక మిగిలింది సుష్మా గారి వెనకాల్నే మన మోడీ గారు 'సింగా పోరు' వెళ్ళడమే మరి !!
శుభోదయం
జిలేబి
Thursday, August 14, 2014
ఇక మీదట జిలేబిలు చుట్టటం ఆపేయ దలచు కున్నా !
ఇక మీదట జిలేబిలు చుట్టటం ఆపేయ దలచు కున్నా
చాలా సీరియస్ గా ఆలోచించి ఇక మీదట జిలేబీలు వేయటం ఆపేయ దలచుకున్నా !
బ్లాగుల టపాలు గెలకటం జిలేబీ లు వేయటం రెండు వేల ఎనిమిదవ సంవత్సరం లో మొదలయ్యింది . అంటే ఇప్పటి దాకా దాదాపు ఆరు సంవత్సరాలు గా వేస్తున్నా .
ఈ ఆరు సంవత్సరాల లో అప్పుడప్పడు జిలేబీ లు హాట్ హాట్ అయ్యేయి . కొన్ని సమయాల్లో 'పులిసేయి' . కొన్ని సమయాల్లో జిలేబి లు బూమ్ రాంగ్ అయి మీద పడ్డేయి
ఇవన్నీ చూసుకుంటూ , ఆ పై కూడా రాయకుండా ఉండకుండా జిలేబీ లు 'ఘీ'మ్ కరించ కుండా ఉండ లేక పోయా .
ముదుసలి కాలం లో ఓయ్ జిలేబి నీకు ఇది ఏమి ఈ ఆరాటం, యంగ్ జనరేషన్ తో పోటీ పడుతో కామెంట్ల పంటలు పండిచడం నీకు తరమా అని మా అయ్యరు గారు అప్పుడప్పుడు అనడం కూడా పరిపాటి అయి పోయే
అందుకే చాలా సీరియస్సు గా ఆలోచించి ఇక మీదట జిలేబీ లు వేయకుండా ఉండాలని టపాల కి స్వస్తి వాచకం పలికి రిటైర్ అయి పోవాలని అనుకుంటున్నా .
ఇక ఈ టపా వీక్షకులు కాదూ కూడదూ అంటే ప్చ్ ప్చ్ అని రెండు రోజుల్లో మరో మారు టపా పునః 'ఘీం' కీ కరణం కావించక తప్పదని కూడా అనుకుంటున్నా !!
కాబట్టి అరివీర బ్లాగు వీరుల్లారా , వీర నారీ మణుల్లారా ! ఇదియే 'బ్లేడు' జిలేబి వేయు ఆఖరి జిలేబి !!
చీర్స్
జిలేబి
(బ్లాగు లోకం లో ఇది ఒక సదాచారం - అప్పుడప్పుడు ఇట్లా 'అస్త్ర సన్యాసం' చేస్తున్నా అని టపా రాయటం ఇది ఒక ఆచారం/పరిపాటి . కాబట్టి నేను కూడా ఈ ఆచారాన్ని, సదాచారాన్ని పరిపాటి ని మన్నించి ఈ టపా వేయటం జరిగినది ! కాబట్టి బ్లాగోదరుల్లారా ఈ టపా సీరియస్సు ని మీరు గమనించగలరని నా అఖండ విశ్వాసం ! --దురదస్య దురదః జిలేబి నామ్యా దురద గొంటాకుహ !!)
Wednesday, August 13, 2014
"ఈ ఒక్క జన్మ చాలు" అనబడు - యాదృచ్చిక జిలేబి ఆత్మ ఘోష !
"ఈ ఒక్క జన్మ చాలు" అనబడు - "యాదృచ్చిక జిలేబి" ఆత్మ ఘోష !
ఏమోయ్ జిలేబి బర బరా గీకి పారేస్తున్నావ్ అదీ చెమటలు కారి పోతున్నాయి . అడిగేరు మా అయ్యరు గారు .
హు అన్నా హా అన్నా !
అదేమండి అయ్యర్ వాళ్ ! పోయే కాలం వచ్చేసింది ఇక అందుకే నా ఆత్మ కథ ని రాసి దేశం మీద తోలేసి, తాంబూలా లిచ్చేసా తన్నుకు చావండి లెవెల్ లో నా ఆత్మ కథ రాసి పడేస్తున్నా చెప్పా మా అయ్యరు గారికి
ఎందుకోయ్ జనాల మీద అంత కోపం నీకు
హు అన్నా హా అన్నా !
కాకుంటే మరి, నా లైఫు లో ఇట్లాంటి దేశం లో పుట్టి నేనింత జబరదస్త్ గా దేశానికి సేవ జేస్తే అసలు దేశం నా కేమిచ్చింది హుంకరించా
అందుకని?
అందుకే , 'ఈ ఒక్క జన్మ చాలు ' అన్న నా ఆత్మ కథా ఘోషని దేశం మీదకి తోల బోతున్నా ! చెప్పా
నువ్వు చచ్చేది కాక ఆ పుస్తకాన్ని పబ్లిష్ జేసి ఎన్ని చెట్లని చంప బోతున్నావో మరి - మా అయ్యరు గారు నిట్టూర్చేరు .
చెట్ల ని మాత్రమె కాదండోయ్, నా జీవిత పథం లో వచ్చిన ప్రతి ఒక్కరి భాగోతం బట్ట బయలు జేస్తా . నా ఆత్మ ఘోష కి నేనే హీరోయిన్ కాబట్టి ఆ కథ లో ఒక్కరే సిన్సియర్ ఐన వారు - అది నేనే నేనే నేనే . మిగిలిన వాళ్ళంతా నా ఘోషకి హాం ఫట్ అవ్వాల్సిందే !
ఇంతకీ నా గురించి ఏమి రాస్తున్నావే జిలేబి ?
మీ గురించా ! మీరు నన్ను జిలేబి ని జేసినారని వాపోతా చెప్పా మరో వంద పేజీల ఘోష ని రాసి పడేసి కుదేసి !
శుభోదయం
జిలేబి
దేశం లో ఇప్పుడు ఆత్మ ఘోష ల కాలం - ప్రతి ఒక్కరు ఘోషిస్తున్నారు - ఇక నేను కూడా 'ఘోషా' యిస్తా !!
Monday, August 11, 2014
బ్లాగ్జోతిష్య శర్మ గారి కసౌటీ కి - మరో ఫ్లైటు కూలె !
బ్లాగ్జోతిష్య శర్మ గారి కసౌటీ కి - మరో ఫ్లైటు కూలె !
అది ఏమి మాయయో అంతా విష్ణు మాయ గా ఉన్నది
మా అయ్యవారు 'ప్రేడిక్ట్' చెయ్యటం వల్ల ఫ్లైటులు పెడేలు మని కూలుతున్నాయా
లేక ఫ్లైటు లు కూలేక మా అయ్యవారు దానికి 'భాష్యం ' రాస్తున్నారా అన్నంత గా
ఒకటి నొకటి ముడేసు కుని మోదేసు కుంటున్నాయి
దీనికి తోడు నక్షత్ర కన్యల రేడు చంద్రుడు కూడాను ! !
ప్చ్ ! ఈ సమీకరణానికి తెర ఎప్పుడో మరి
జిలేబి
Tuesday, August 5, 2014
Subscribe to:
Posts (Atom)




