ఋగ్వేదం - దీర్ఘ తమస్ - తురీయం వాచ !
ఋగ్వేదం మొదటి మండలం లో దీర్ఘ తమస్ ఋషి ప్రణీత సూక్తులు వరుసగా 140-164 మధ్యన వస్తాయి.
ఈ దీర్ఘ తమస్ ఋషి పుట్టుక - కథా పరం గా పుట్టుక తోటే గుడ్డి వాడు . గుడ్డి వాడుగా పుట్టినా జ్ఞానం లో మేధ .
ఈతని ఋక్కులు ఆంగ్లం లో చెప్పాలంటే రిడిల్స్ .
రెండు వాక్యాల లో అనంతమైన అర్థాన్ని ఇమిడింప జేయడం ఈతని గొప్ప తనం .
వాక్కు గురించి చెబ్తూ నాలుగు రకాలైన వాక్కు ఉందంటాడు ; (అవి ఏమిటి అని ఋక్కు లో లేదు ) కాని ఆ నాలుగు రకాలైన వాక్కులో మూడు గుహ్యమైనవి ; ఒక్క నాలుగో వాక్కు మాత్రమె మనుష్యలకి తెలిసినది అంటాడు .
చత్వారి వాక్ పరిమితా పదాని తాని విదుర్ బ్రాహ్మణా యే మనీషిణః
గుహా త్రీణి నిహితా నేన్ఘయంతి తురీయం వాచో మనుష్యా వదంతి --- ఋగ్వేదం - మండలం ఒకటి 164-45
Speech is of four types ;the sages who are wise know them; three that are hidden in the cave -non-speak able; men speak the fourth speech.
వాక్కు నాలుగు విధాలు ;
అందులో మూడు గుహ్యమైనవి;
నాలుగో విధమైన ది మాత్రమె మనుష్యులు పలుక గలిగినది-> వైఖరి - (వాక్య రూపకమైన వాక్కు )
నాలుగు విధాలైన వాక్కు ->
పర - పరవాణి లేక పర వాక్ --> పరమాత్ముని స్పందన
పశ్యంతి -> తమ ధ్యానం లో చూడ గలిగినది ? -> ఋషులు
మధ్యమ -> మనస్సు కి మేధ కి సంబంధించినది -> మేధావులు
వైఖరి -> వాక్య రూపక మైన వాక్కు ; --> మనుష్యలు
Kabir Das:
ऐसा वाणी बोलिये , मन का आपा खोये
अपना तन शीतल करे, औरों का सुख होयें
Speak in a manner that brings peace and tranquility to the mind; One’s speech should calm and pacify not only the listener, but also the speaker.
శుభోదయం
చీర్స్
జిలేబి