Thursday, February 26, 2009

అమ్మాయి పెళ్లి

ప్రియమైన చెల్లెలు వరూధిని కి -
అక్కయ్య ఆశీర్వదించి వ్రాయునది. ఉభయ కుశలోపరి.
అమ్మాయి సౌమ్య పెళ్లి విషమై కాబినెట్ మీటింగ్ బామ్మ ఇవ్వాళ పెట్టింది.
మన ఇంటి పెద్ద మంత్రులు ఐన అన్నయ్యలు హాజారైనారు మీటింగుకి. మీ బావగారు నిమిత్త మాత్రులు కాబట్టి బామ్మే మీటింగుని ఖరారు చేసి ఉచిత పీఠాన్ని అలంకరించింది.
మూడోతరం మంత్రులు అంటే చిన్న చితకా కుర్రకారు అందరు క్వాలిటి కంట్రోల్ ప్రోగ్రాం కోసం దేశాల మీద ఉన్నారు కాబట్టి (నిన్నూ చేర్చి) వాళ్ళంతా గైరు హాజారు మీటింగుకి.
దరిమిలా బామ్మ నీ పెళ్లి ఖాతా వెతికి దాని ప్రకారం అమ్మాయి సౌమ్య పెళ్లికి బడ్జెట్ తయారుచేసింది. అందు ప్రకారం పెళ్లి ఖర్చులు వెరసి పది రెట్లు ఎక్కువై పోయినాయి. బడ్జెట్ బ్రతుకులు కాబట్టి బామ్మ బుగ్గ నొక్కేసుకుని బావ గారి వైపు చూసింది - మీ బావగారు ఎలాంటి ఫీలింగు లేకుండా నా వైపు చూడడం నేను ఏమి చెయ్యాలో పాలుపోకుండా మన ఇంటి పెద్ద మంత్రులు వైపు చూడడం వాళ్లు ఏమి చెయ్యాలో తెలియకుండా బామ్మ వైపు చూడడం బామ్మ తీక్షణ ద్రిష్టి తో మమ్మల్ని వీక్షించి "ఒరేయి బడుద్దాయిలు - మీరేమి చేస్తారో నా కవసరం. ఎట్లా చేస్తారో నాకనవసరం. అమ్మాయి పెళ్లి మూడు నెలల్లో ఖరారు అయిపోవాలి " అని అల్టిమేటం జారి చేసింది.
ఈ తంతు తో ఇవ్వాల్టి కాబినెట్ మీటింగ్కి బామ్మ వీడుకోలు చెప్పి అందర్నీ పని మీదికి అంటే అమ్మాయి సౌమ్య పెళ్లి కి పురమయ్యించడం తో నా మనసు కొంత కుదుట పడింది. ఈ మీటింగు తరువాయి మీ బావగారు యథా ప్రకారం దిన పత్రిక పడక కుర్చీలో కూర్చుని తిరగేయ్యటం మొదలెట్టేరు ! ఏమి చేతును నా చిట్టి చెల్లీ?
ఇదీ కథ!
బావగారికి నా నమస్సులు. !
ఇట్లు
నీ పెద్ద అక్కయ్య
భామతి.

Saturday, February 21, 2009

చిత్తూరోళ్ళ కథ-౩

ఈ మూడో ఎపిసోడ్ లో నాకు తెలిసిన చిత్తూరోళ్ళ తెలుగు గురిన్చి రాస్తాను. ఈ చిత్తూరు జిల్లాలో అదీను చిత్తూరులో తెలుగు భాష మీద మక్కువతో తెలుగు ని నేర్చుకుని తెలుగు లో రచనలు చెయ్యగల సత్తా ఉన్న తమిళులు ఉన్నారు. కాని పత్రికా ముఖముగా వీళ్ళు ప్రాముఖ్యులా అన్న విషయం నాకు తెలియదు.
రాయల సీమ రాళ్ళ సీమ లో భాషా ఉద్యమం అంటూ ఎప్పుడైనా జరిగిందా అన్న విషయం నాకు తెలియదు. కాని ప్రముఖులైన మధురాంతకం రాజారాం, కలువకొలను సదానంద, మునిసుందరం, లాంటి ఆ కాలపు రచయితల్ని వదిలి పెడితే ఈ మన ప్రస్తుతపు జమానా లో చిత్తూరు నించి ఎవరయినా వ్రాస్తున్నారా లేక కథా వ్యాసంగం ఎవరైనా చేస్తున్నారా అంటే సందేహమే! దీనికి కారణం ఏమయి ఉండవచ్హన్నది నా చిన్ని బుర్రకి అందని విషయం!
ఈ విషయం గురించి ఎవరికైనా ఇంకా ఎక్కువైన సమాచారం తెలిసి ఉంటే కామెంటగలరు!

21-02-2009 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం పురస్కరించుకుని శుభాకంక్షలతో

జిలేబి.

PS: ఈ పై టపా బరహ నోటేపాడ్ సహాయం తో రాసినది. బాగుందని ఆశిస్తాను. Its a really good unicode software. Thanks to: http://www.baraha.com

తెలుగు లో ఆఫ్ లైన్ లో టైపు చెయ్యడం ఎలా?

హెల్లో బ్లాగు భాయి బ్లాగు దీదిస్ - ఇవ్వాళ మీ కోసం ఓ మంచి విషయం గురించి చెప్ప దలచుకున్నాను. ఈ బ్లాగులో టైపు చెయ్యడానికి అనువుగా అంటే ఆంగ్లం లో టైపు చేస్తే తెలుగు లో కనబడేట్టు http://www.baraha.com వాళ్లు ఓ ఆఫ్ లైన్ ఎడిటర్ తయారు చేసి ఉన్నారు. ఇందులో చాలా భాషల్లో టైపు చెయ్యొచ్చు ఆంగ్ల భాష మూలంగా. అంతే గాకుండా ఈ బరహపాడ్ అన్ననోటేపాడ్ చాలా సులువుగా టైపు చేసుకోవడానికి ఆన్ లైన్ (ఆంటే వెబ్ కి కనెక్ట్ చెయ్యకుండానే ) లేకుండానే టైపు చేసుకుని జస్ట్ ఓన్లీ పోస్ట్ చేసేటప్పుడు వెబ్ కనెక్ట్ చేసేసుకుంటే చాలన్న మాట! నాకైతే భలే నచ్చింది ఈ మృదు బరాహం! ప్రయత్నించి చూడండి!

బరహ సాఫ్ట్వేర్ దౌన్ లోడ్ చేసుకోవడానికి లంకె: http://www.baraha.com

ఛీర్స్
జిలేబి.

Thursday, February 19, 2009

భాషలో కి పదాలు ఎలా వస్తాయి?

కథన కుతూహలం ! ఈ మధ్య ఓ సందేహం వచ్చింది. ఒక భాషలోకి పదాలు ఎలా వస్తాయీ అని. ఉదాహరణకి తెలుగులో ఇన్ని పదాలు ఉన్నాయి గా ఇవి తెలుగు భాష మాట్లాడేవాల్లలో ఎలా ప్రాచుర్యం లోకి వచ్చి ఉంటాయీ? ఎప్పుడైనా ఆలోచించి చూసారా? నాకైతే చాలా ఆశ్చర్యమే ఈ విషయం పైన!

ఈ మధ్య కొన్ని రోజుల క్రితం అసలు నెనర్లు అన్నది తెలుగు పదమేనా అన్న సందేహం వేలిబుచ్చినప్పుడు చాలా మంది బ్లాగోదరులు మంచి గా వివరణ ఇవ్వడం నాకు చాలా సంతోషాన్ని కలుగ జేసింది.

ఈ మధ్య ప్రింట్ మీడియా లో "సత్యం లెక్కలు" అన్న పదం "గోల్మాల్" అన్న అర్థం లో వాడుకలో వచ్చింది సత్యం ఎపిసోడ్ తరువాయి. సో ఈ పదం ఈలాగే ఉపయోగిస్తుంటే కొన్ని సంవత్సరాల తరువాయి నిఘంటువులలో ఈ పదం కూడా ఎక్కి ఆ తరం వాళ్ళకి ఈ పదం యొక్క అర్థం వివరించ బడ వచ్చునని అనుకుంటా!

ఈ టపా గురించి ఈ సబ్జెక్టు గురించి మీ వ్యాఖ్యలని తెలియ జేయ్యగలరు సుమా! మీరేమంటారు?

మీ బ్లాగేశ్వరి
జిలేబి.

Monday, February 16, 2009

మీ శ్రీవారు ఇంటి పనుల్లో సహాయం చేసేలా చెయ్యడం ఎలా?

ఈ టపా లేడీస్ స్పెషల్. అంటే మగవారు చదవ కూడదని కాదు. (చదివితే వాళ్లు ఈ కిటుకు తెలుస్కుంటే మనకి మేలు లేఅడు కాబట్టి వాళ్లు చదవరని ఆశిస్తాను!)

మీరు కిచెన్ తో తలమునకలయ్యే పనుల్లో బిజి బిజి గా ఉంటే మీ వారు పడక్కుర్చిలో నింపాదిగా కూర్చుని ఏ ఈనాడు పత్రికో లేకుంటే లాప్ టాప్ పెట్టేసుకుని ఈ లాంటి బ్లాగో చదివేస్తుంటే మీకు మరీ చిరాకు ఎక్కువై దమ్మని ఈ గరిటో లేకుంటే ఏ గిన్న్నో కింద గిరాయించి ప్రొటెస్ట్ చేస్తారా? లేక తెక్నికులు ఉపయోగించి మీ వారిని వంట గది లోకి రప్పించి వారిచే మెప్పుగా కార్యసాధన అయ్యేలా చేస్తారా? ఈ రెండు పద్దతిలో నూ ఒక్కో మారు ఒక్కో ఫలితాన్ని సాధించవచ్చు. ఈ మీరు పనిచేస్తుంటే మీ శ్రీ వారు పదక్కూర్చీ సీను మమ్మీ లేజీ బాయ్ కి మధ్య జరిగే తమాషా! లేజీ బాయ్ ని నిద్ర లేపాలంటే గదమాయింపు లేకుంటే బుజ్జాగింపు రెండు అవసరం. ట్రై చేసి చూడండి!

ఛీర్స్
జిలేబి.

Saturday, February 14, 2009

చిన్న జీయర్ - సింగపూరు - గీతా జయంతి


Photo Courtesy: వరూధిని from Singapore through MMS
శ్రీ మాన్ చిన్న జీయర్ గారు ఇవ్వాళ సింగపూరు లో గీతా జయంతి సందర్భం గా "గీతా జయంతి" అని ఎందుకా పేరు వచ్చింది? అసలు గీతా జయంతి అంటే ఏమిటి? అన్నా శీర్షిక పై అనుగ్రహ భాషణం ఇచ్చారు అక్కడ ఉన్న పెరుమాళ్ కోవిల్ లో. ఈ సందర్భం గా ఆయన భాషణం లో గీతా జయంతి గురించిన విశేషాలని ప్రాముఖ్యతని జన బాహుళ్యానికి సులభ రీతిలో అర్థమయ్యే లాగా వివరిస్తూ గీతా ప్రాశస్త్యాన్ని శ్రీ కృష్ణ పరమాత్మ యొక్క గీతా సారాన్ని చక్కటి ఆంగ్ల భాష లో సింగపూరు లోని వివిధ భాషలవారికి అర్థమయ్యేట్టు తన యొక్క పంథాలో విసదీకరించారు. ఈ గీతా జయంతి అని సింగపూరు హిందూ ఎండోమెంటు బోర్డు వాళ్లు జరిపే ౧౨ వ వార్షికోత్సవం లో ఈయన సంభాషణం అందర్నీ చాల ఆకట్టుకుందని అక్కడ వారి అభిప్రాయం వెలిబుచ్చడం స్వామీ వారి దర్శనం చేసుకోవడం వాళ్లు చాల క్రమశిక్షణతో మెలగటం చాల మెప్పైన రీతి గా ఈ కార్యక్రం కొనసాగటం ఆఖరున చిన్న పిల్లకి జీయర్ గారిచే బహుమతి ప్రదానం గావించడం ఈ కార్యక్రమ విశేషాలు. జై శ్రీమన్నారాయణ !
ఛీర్స్
జిలేబి.
Photo & కంటెంట్ Courtesy: వరూధిని from Singapore through MMS

Friday, February 13, 2009

ఇడ్లీ గిడ్లీ - సాంబార్ గీంబార్ అనబడే చిత్తూరోళ్ళ కథ -2

ఇలా సాగే ఈ "గ" కత లో పానకం లో పుల్లలా ఓ విషయం చెప్పవలసే వస్తుంది. అదేమిటంటే చిత్తూరోళ్ళ భాష మీద అరవం భాష ప్రభావం. మనకి ఆంద్ర ప్రదేశ్ అవతరణకి మునుపు ఈ చిత్తూరు పరిసర ప్రాంతాలు గ్రేట్ మద్రాస్ ప్రెసిడెన్సి కింద ఉండేదా అప్పట్లో ఈ చిత్తూరు లో ప్రామినెంట్ భాష అరవమే! అంటే ఇప్పుడు లేనట్టు కాదు. ఇప్పుడు కూడా చిత్తూరులో తెలుగు తెలియకపోయినా పర్లేదు గాని అరవం మాట్లాడితే మీరు లోకల్ దాదా అన్నా అని తెలుసు కోవచ్చని ఈ జిల్లాలో పనిచేసినప్పుడు మా ఫ్రెండ్ ఒకతను చెప్పారు. కాస్త తీరిగ్గా జన భాష ని గమనిస్తే ఇది నిజామేనని అని పించింది. ఈ మధ్య శ్రీమాన్ చిరంజీవి గారు చిత్తూరు జిల్లా రాజకీయ పర్యటనలో చిత్తూరు లో ఏకంగా జనాన్ని అరవం లో సంబోధించారని పత్రికల్లో చదివినప్పుడు ఔరా ఇప్పుడూ చిత్తూరోళ్ళ "గ" భాష గట్లాగే ఉంటుందని వూహించేసుకుని చిత్తూర్లో మా ఫ్రెండ్ ని "ఏమోయ్ బావున్నావా ఏమిటి విశేషాలు " అని కదలిస్తే కథా కమామీషులు "గ" పొర్లి పొంగటంతో ఆ హ్హ ఈ "గ" భాష "గ" భాషయే అని తీర్మానించేసుకున్న!

ఈ టపా కి మొదటి దఫా లో బ్లాగరు మిత్రులు "ఏమిబా మీ ఊరేంది అని అడిగారు. " నాడో డికి " అన్ని ఊర్లు మన్వేగాబ్బ?

ఛీర్స్
జిలేబి.

Thursday, February 12, 2009

ఇడ్లీ గిడ్లీ - సాంబార్ గీంబార్ అనబడే చిత్తూరోళ్ళ కథ

జంబూద్వీపే భరతహ్వర్షే భరతఖండే మేరోహో పర్వతే దక్షినే పార్స్వే ఆంధ్ర రాజ్యాం రాయలసీమే చిత్తూరు జిల్లే ....
హమ్మయ్యా! ప్రవర అయ్యింది కాబట్టి ఇంక కథ చెప్పొచ్హుకుంటా. అయినా చిత్తూరు జిల్లా దాకా వచ్హేసాక చిత్తూరు మాండలీకం గురించి రాయక పొతే ఎలాగంటారూ?
ఈ చిత్తూరు లో వృత్తి రీత్యా ఉన్నప్పుడు చిత్తూరు కి సంబంధించిన స్పెషల్ భాష ని గమనించడం జరిగింది. అదే ఈ తపా శీర్షిక!
అంటే 'గ ' భాష అన్నమాట.

హోటెల్ కి వెళితే ఎదో ఇడ్లి ఉందా అని అడగకుండా వీళ్ళు అడిగే తీరు ఎలా అంటారా? - "ఏమిబా ఇడ్లీ గిడ్లీ ఏదైన ఉందా?" అంటారు.

ఆట్లాగే "సాంబార్ గీంబార్" అన్న పదం చాలా తరచుగా వినొచ్హు. నాకు తెలిసనంత వరకు రాయల సీమలో చిత్తూరు లో ఉన్న్న ఈ "గ " భాష చిత్తూరు పరిసర ప్రాంతాలకే పరిమితమనుకుంటా.

ఈ "గ" భాష ఎంత పాపులర్ అంటే ఆస్సాము దేశంలొ పని చెసేటప్పుడు ఓ అస్సామీ కొలీగు - తను బాంక్ లొ చిత్తూరు లొ పని చెసేడటా- నాకున్న చిత్తూరు పరిచయాన్ని తెలుసుకొని "ఏంబా ఇడ్లి గిడ్లీ " అన్నాడు!
వార్నీ ఈ "గ" భాష ఇంత పాపులర్ అన్న మాట అని అప్పుడే తెలిసింది.
ఇంతకీ ఈ టపా గిపా గురించి మీ అభిప్రాయం ఏమిటిబా?

ఛీర్స్
జిలేబి.
http://www.optionsraja.tk

Monday, February 9, 2009

డాట్ టీ కే - ಡಾಟ್ ಟೀ ಕೆ - डाट टी के - டாட் டி கே

ఏమిరా అబ్బాయీ ఏమి సమాచారము అని మా అక్కయ్య అబ్బాయి ని అడిగితే ఈ డాట్ టీ కే వెబ్ సైట్ గురించి చెప్పేడు. మన భారతదేశం లో వెబ్ సైట్ లు కో.ఇన్ అని ఉన్నట్టు డాట్ టీ కే అని వెబ్ సైట్ డొమైన్ రిజిస్ట్రేషన్ ఫ్రీ గా చేసుకోవచ్చు. దీని వల్ల ఉపయోగమేమీ తిరుమలేశా అని అడిగితే వాడన్నాడు మీ వెబ్సైటు టైపు చెయ్యాలంటే
http://www.varudhini.blogspot.com/ అని పెద్దగా టైపు చెయ్యాలి గదా అలా కాకుండా సింపుల్ గా http://www.varudhini.tk/ అని టైపు చేస్తే ఎలా ఉంటుందంటారు? అన్నాడు.

ఈ డాట్ టీ కే గురించి తెలుసు కోవాలంటే ఈ క్రింది లంకె ఉపయోగించి తెలుసుకోవచ్చు.!
ఆ పై ఈ సైట్ రిజిస్ట్రేషన్ పూర్తి గా ఫ్రీ అన్న మాట!
http://freedomains.acsowa.tk


ఛీర్స్
జిలేబి.

Saturday, February 7, 2009

సింహ నృత్యం - చీనా సాంప్రదాయం

ఓ మారు ఓ చినీయుల గ్రామాన్ని ఓ భూతం పట్టు వదలని విక్రమార్కునిలా పట్టేసుకుని జనాల్ని సతాయించిందట. ఆ కాలం లో గ్రామ వాసులంతా దగ్గిరలో ఉన్న అడవి రాజు సింహం గారిని ప్రార్థించి "సింహం దేవరా మా మొర ఆలకించి భూతం గాడి భరతం పట్టించండి అని మొర బెట్టుకుంటే సింహం రాజ వారు హుష్ కాకి అని మనం కాకి ని తరిమే నిమేశంలో భూతం గాడిని గ్రామ పరిసరాల్లో నించి వెడల గొట్టేసారట. అప్పట్నించి సింహం వారు చినీయుల ఫేవరెట్ అయిపోయ్యేరని కథా కమామీషు.


ఆ తరువాయి మరో మారు మరో భూతం ఆ గ్రామస్తుల్ని పట్టేసుకుని సతాయిస్తూంటే మారు గ్రామస్తులు సింహం రాజ వారిని వెతికే ప్రయత్నం చేస్తే సింహం వారు అసలు కనిపించ కుండా పోవడం తో ఏమి చెయ్యాలో అని పాలు పోక ఆలోచనలో పడి ఉంటే అక్కడ ఉన్న కుర్ర కారు "పెద్దలు మేము సింహం వేషం కడతాము మీరు డంకా భాజాయించండి సుమీ " అని ఆలోచన ఇచ్చేరు. ఆలోచనేమో బాగున్నట్టున్దేనని వారు భావించి సింహం వేషం లో కుర్రకారు న్రిత్యం చేసి భాజా లో డంకా లో మ్రోగిస్తే ఆ మోతకి భూతం గారు నిజమ్గా సింహం వచ్చేసిందని భయపడి పోయి పరుగు లంకించు కోవడం తో అప్పట్నించి చెడుని పార ద్రోలదానికి సింహ నృత్యం చెయ్యబడుతుందని - సాంప్రదాయం అయిందని కథా పురాణం.

ఈ కోవలో చినీయుల నూతన సంవత్సరమప్పుడు ఈ సిమ్హ నృత్యం సాంప్రదాయ పద్దతి లో పాతని పార ద్రోలి కొత్తని ఆహ్వానించడం అన్న భావ వీచికగా మొదలయ్యి ఇప్పుడు ఈ సిమ్హ నృత్యం చెసేవాళ్ళు ఒక కళాకారులుగా గుర్తించబడెంతవరకు ప్రాచుర్యంలొ కి వచ్హింది.
ఈ కథా నేపధ్యం లొ ఇక్కడ ఒక అపురూపమైన సిమ్హ నృత్యం ఫోటో ఇచ్హాను. ఇది ఈ సంవత్సరం చినీయుల నూతన సంవత్సరం (ఈ సంవత్సరం వీళ్ళకి "ఎనుబొతు" సంవత్సరం) అప్పుడు శింగపూర్ వ్యాపార దృష్ట్యా వెల్లినప్పుడు తీసిన చిత్రం ! కనులవిందుగా ఉందని భావిస్తాను. ఇదే మొదటి మారు ఇలా కమ్మీల పై ఈ సింహ నృత్యం చూడడం నా వారకైతే. ఈ సింహ వేషధారులు కుర్రకారులు కళా కారులు.

జిలేబి.