అంతులేని పయనం
మైడియర్ ఫ్రెండ్,
ఎక్కడికీ పయనమని అడగకు. ఈ పయనం అంతు లేనిది. ఎందుకు అంతులేనిదంటే చప్పున చెప్పలేను.
కొన్ని విషయాలకు కారణాలడిగితే జవాబు శూన్యం అనిపిస్తుంది. అంటే కారణం నీకు తట్టడం జరిగితే అవి శూన్యం నించే వచ్చేయని.
శూన్యం నించి వచ్చిన విషయాలకు ప్రశ్నలకు విషయాలకు జవాబులు అక్కర్లేదు. అవి సమయానుసారంగా మనకే విశదీకరింప బడతాయి.
విశదీకరణ మళ్ళీ సమయం కాలం పై ఆధార పడి వుండటం శూన్యత్వానికి ప్రతీక అని మాత్రం చెప్ప గలను.
అది ప్రతీక మాత్రమే శూన్యం కానేరదు.
ప్రతీకకి ప్రతీకరించబడే వస్తువుకీ మధ్య ఈ అవినాభావ సంబంధం అనాదినించీ వున్నదనటం సత్యదూరం కాదు.
సత్యానికి ప్రతీక గా నిలిచిన వాళ్లు సత్యం కాలేరు. వాళ్లు ప్రతీకలు మాత్రమే.
సత్యం ఒక స్థాయి. ఆ స్థాయి కి సామీప్యత చేకూరితే అప్పుడు ప్రతీక లేర్పడతాయి. అంత మాత్రానా సామీప్యం చెందినవి సత్యం కాలేవు.
సత్యం నిత్యం. సత్యానికి ప్రతీక నీ అనుభవ పూర్వకం. సత్యం శాశ్వతం. ప్రతీక శాశ్వతం కాలేదు కాబోదు కూడా.
శాశ్వతం అన్నది జగాంతరాల తరువాయి కూడా యధాస్థితిని పొందగలిగి వుండేది.
యుగం ఒక మారు తనకు దీటుగా సత్యానికి ప్రోద్బలంగా ( సత్యానికి ప్రోద్బల మక్కర లేదు ) యుగకర్తని ప్రసాదించడం యుగానికి మాత్రమే చెల్లుతుంది.
తన దగ్గరున్న చిన్ని చిన్ని బొమ్మలకు బొట్టుపెట్టి కాటుక దిద్ది సంతోషిస్తుంది చిన్ని పాప. యుగం కూడా అంతే.
అంత మాత్రాన బొట్టూ కాటుక ప్రోద్బల మైనంత మాత్రాన అవి లేకుండా బొమ్మలు లేకుండా వుండక బోవు.
Source not known.
టైపాటు
జిలేబి