Sunday, May 28, 2023

"శంగోళ" మదిగో ! శుభాకాంక్షలతో!

 

The Sengol, Lotus, Peacock, Banyan 

Congratulations to India's diversity !



"శంగోల" మలరె నదిగో

చెంగలువ శిరమన  ప్రావృషికపు పసనుతో

డంగట బహుపాదమలరె

బంగారు భవితకు ప్రజల ప్రతినిధులమరన్!


చీర్స్

జిలేబి

Saturday, May 13, 2023

Dancing Dark Clouds - 51

 శ్యామలీయ కందాలు - 51


భువనైక మోహనుని ది

వ్యవిలాసపుమూర్తిని తనివారగ దర్శిం

ప వలనకొ కన్నులున్ వే

లువేలు కలిగిన? తపమ్ములొనరింప దగున్



జిలేబి

Monday, April 10, 2023

శ్యామలీయం వారి రామ కీర్తనలలో "కందాలు" - 1

 


రామ నామ మహిమ యిట్టిట్టిదకో !



శ్రీరామ నామ మహిమ వి

నా రహి గలదా జనులకు ? నగుమోమన సీ

తారాములదిట్టిట్టిద

కో? రఘుపతిని మనసార కొలువు జిలేబీ !



జిలేబి

"శ్రోత్రీయుల" కోరికపై 
ఈ శీర్షిక మొదలు.



Friday, April 7, 2023

దేశం సుభిక్షంగానే వుంది :)

 హమ్మయ్య 


బ్లాగు లోకం బతికే వుంది.


చీర్స్


జిలేబి

Tuesday, April 13, 2021

ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!



జవసత్త్వమ్ముల కాపా

డవలె సుమా బతుకు పరుగిడవలె జిలేబీ !

ప్లవమంటె తెప్ప యట! నా

వ వలె జనులను కడతేర్చవలెను జిలేబీ !



శుభాకాంక్షలతో

జిలేబి





Sunday, January 3, 2021

మా తెలుగు తల్లికి "మొழி" పూదండ!

 

మా తెలుగు తల్లికి


మొழி పూదండ !




Thursday, November 26, 2020

అసంభావితాలు (story continues)

 

అసంభావితాలు :)


Story continues.


కొన్ని కొన్ని పదాలు కొన్ని ‌కొన్ని ప్రాంతాలలో ఉపయోగించకుండా కాలగర్భంలో కలిసిపోతే అవి ఓ‌యబ్బో తప్పే తప్పూ అంటూ చాంతాడంత టపాలు రాసే విదులనబడే విదురులు గల పంచదశలోకాని కున్నూ, బ్రౌను దొరగారి ‌నిఘంటువు లోని పదమే కదాండి అంటే ఆంధ్రభారతి లో లేదంటూ లింకు చూపించే మా వినరా వారికున్నూ, ఇదే మాట మా జైగొట్టి వారు సవాలు విసిరి మరిన్ని ఆధారాలతో వస్తే ఆయ్ చర్చ ఇంతటితో సమాప్తమనేసి ఏకపక్షాన నిర్ణయం తీసుకున్న మా శ్యామలరాయల వారికున్నూ బస్తీ మే సవాల్ ఇదిగో స్క్రీను షాటు - బ్రౌను నిఘంటువు నుండి‌. 



కాయ్ రాజా కాయ్

ఇక్కడ కామింటడానికి 

టపా అద్దెకివ్వ బడును :)



ఇట్లు 

నారదీయ

జిలేబి

Saturday, November 14, 2020

దీపావళీయము

 

బ్లాగ్ బాంధవులకు


కర్మ వశాత్తు జీవితంలో

పంచదశలోకంలో

కలిసి సంబరాలు

చేసుకుంటున్న 

అందరికి


ఈ దీపావళి ఇప్పటి

సంక్లిష్ట పరిస్థితి నుండి

మానవాళిని

తప్పిస్తుందన్న 

ఆశాభావంతో


దీపాలు వెలుగ వలె నీ

శాపమగు కరోన తొలగి, చక్కగ మెరుగై

వ్యాపారములు, పరమపద

సోపానపు బతుకు బండి సొబగుగ కడచన్!



శుభాకాంక్షలతో

జిలేబి

14-11-2020.


Monday, November 2, 2020

ఏకత్వం


శరీరము ఆత్మ విడివోకుండా

ఏకీకృతంగా వుండగలవా?


అన్ని పనులూ చేసుకుంటూ
మృదుత్వాన్ని పెంపొందించుకుంటూ
అప్పుడే పుట్టిన పసిపాపలా నిర్మలంగా
వుండగలుగుతావా ?

నిర్మలీకరించుకుంటూ నీ అంతర్దృష్టిని మలినం
కాకుండా చూసుకోగలుగుతావా?

అందరిని ప్రేమిస్తూ దేశాన్ని పాలిస్తూ
నిస్వార్థుడవై వుండగలుగుతావా?

దివికి సింహద్వారమైన శక్తి స్వరూపిణి
గా మనగలుగుతావా ?

సమీక్షించుకుంటూ నిష్కపటంగా
నిష్కామివై నీ పని చేయగలుగుతావా?

క్రొంగొత్తదనానికి జీవంపోస్తూ
అన్నిటినీ కలిగి నిర్మోహంగా
నిష్కామకర్మతో
నిరంకుశత్వం లేక పరిపాలించటమే
ధర్మ ప్రవర్తన.

దావొ దే జింగ్
లావొ జు.

Source-10

Carrying body and soul and embracing the one,

Can you avoid separation?
Attending fully and becoming supple,
Can you be as a newborn babe?
Washing and cleansing the primal vision,
Can you be without stain?
Loving all men and ruling the country,
Can you be without cleverness?
Opening and closing the gates of heaven,
Can you play the role of woman?
Understanding and being open to all things,
Are you able to do nothing?
Giving birth and nourishing,
Bearing yet not possessing,
Working yet not taking credit,
Leading yet not dominating,
This is the Primal Virtue.

This is the Primal Virtue.

స్వేచ్ఛానువాదం
జి లే బి.


తృప్తి

 


మొత్తం నిండేలా చూడకు.
కొంత వదిలిపెట్టు‌.

కత్తికి పూర్తిగా పదునుపెట్టాలనుకోకు
మొక్కవోతుంది.

అంతా నీకే కావాలనుకోకూ
ఎవరూ దానిని కాపాడలేరు‌.

సంపదలసంఖ్యాకం
కీర్తిబావుటాలు
నాశనానికే మార్గాలు.

నీ పని అయ్యాక విశ్రామం తీసుకో.
దివికి మార్గమిదే.

దావొ దే జింగ్

లావొ జు.

Source-9

Better stop short than fill to the brim.

Over-sharpen the blade, and the edge will soon blunt.
Amass a store of gold and jade, and no one can protect it.
Claim wealth and titles, and disaster will follow.
Retire when the work is done.
This is the way of heaven.

స్వేచ్ఛానువాదం


జి లే బి.