Friday, March 5, 2010

శ్రీ కృష్ణ విలాపం

స్వామీ శ్రీ కృష్ణుల వారు చిద్విలాసం గా యమునా తీరే - తన పద హారు వేల మంది గోపికలతో కొలువై ఉండగా ఎవెర్ హ్యాపీ బ్లిస్స్ ఆనందా స్వామిజి గారు - ఉండేలు దెబ్బకి పరారి ఐ వచ్చిన కుందేలు వలె కృష్ణా జీ ముందు ధబీల్మని ప్రత్యక్షమై -

హేక్ కృష్ణ- ఇదేమి నన్నిలా జనాలు వెంట పడి తరిమేలా చేస్తివి? నేనేమి పాపం చేసినాను- నువ్వేమో ముగ్గురు భామల తో చాలక పదహారు వేల మంది గోపికలతో ఉంటె - ఆ హా కృష్ణ విలాసం - అంతా విష్ణు మాయ అని జనాలు పోగిడేరు?
మరి నేను ఒక్కగానొక్క రాగ రంజిత హృదయేశ్వరి తో నా లోకం లో ఉంటె వాడెవడో నీవు శకుని కుటిలత్వాన్ని మాయ బజార్ లో అదేదో దర్పి ణి లో చూపెట్టినట్టు - నన్ను నీ కర్మభూమి లో నీ కర్మ నీదే అన్న రీతిలో నడి రోడ్డులో నిలిపేడు? ఇది ఏమైనా న్యాయమా స్వామీ ? అంటే

క్రిష్ణులవారు తన యోగ నిద్రని కాసేపు పక్కకి పెట్టీ - కళ్ళు మూసుకుని అవలోకించి - భక్తా - ఈ మధ్య నన్ను నీవు మరీ మరీ తలచుకుంటూ ఉంటివి - దేశం లో ఎడా పెడా భగవద్గీతల సభలలో నా గురించి మరీ పొగిడి తివి - ఆ హా నా భక్తుడు ఇంతగా నన్ను పొగిడే గదా అని నేను నిన్ను ఓ క్షణం తలిస్తిని. మరో మారు తలిచేలోపు మా సత్య - స్వామీ భక్తులని మరీ ఎక్కువైగా తలవకండి ప్రాబ్లెం - అని చెప్పడం తో భక్తులని తలిస్తే ఏమి ప్రాబ్లెం అని ఓ క్షణం ఆలోచనలో పడితిని.

ఇంతకీ ఇదన్న మాట సంగతి - మరీ రసగ్నుడవే అని సరే అయినదేమో అయినది ఇక కావాల్సిన కార్య మేదో చూడు అని సలహా ఇచ్చేరు పరమాత్ముల వారు- అంతా విష్ణు మాయే - నా చేతి లో ఏముంది అని కృష్ణు ల వారు ఆ యోగ మాయని ఓ క్షణం తలిచేరు.

ఈ కృష్ణుడు కూడా నన్ను కాల రాసాడే అని ఎవెర్ హ్యాపీ స్వామిజి గారు ఇంకా ఏమి చెయ్యడం - అని స్వామీ వారి మీంచి తన దృష్టిని యమునా పైకి - ఆ పై పదహారు వేల గోపికల పై కి చూపులని సారించేడు. గోపికలలో రాగ రంజితాలు ఆతనికి గోచరించినై.
ఆ హా అర్థమైంది - యోగ మాయ ఉద్దేశం ఇదన్న మాట అని భాష్యం చెప్పుకుని - గోపికలు - మీకు వ్రిందావనం గురించి చెబ్తాను ఇలా రండి అన్నాడు.

అదిగో అప్పుడే మొదలైంది - శ్రీ కృష్ణులవారి "విలాపం" ! ఆ కాలం లో శంకరుడే భోలా శంకరుడని అనుకుంటిని - ఈ కలి యుగం లో నన్నే ఈ మానవుడు - భోల్తా కొట్టిన్చాడే - అని -

వారి విలాపాన్ని విని - కల్కి భాగావాను ల వారు- "వరదా" - నేను నీకు కలి గీత నేర్పిస్తాను ఇలా రా నాయనా అని ' వరదా- భగవంతునికి భక్తునికి అనుసంధాన మైనది అంబికా అగరొత్తులు మాత్రమె కాదు - అంబిక "గరం" ఒత్తులు కూడా అనడంతో-

- కృష్ణుల వారు మూర్చ పోయి "హా సత్యా" - అంటే - హుష్ కాకి- సత్యమే లేచి పోయింది. !

చీర్స్
జిలేబి.

3 comments:

  1. రంజిత పూజిత అంగవైభోగమే
    నిత్యానంద నంద నందనమే!

    ఓ జిలేబీ దేవీ ఇంతకు సత్య ఎక్కడ? ఎవెర్ హ్యాపీ ఎక్కడ? ;)

    ReplyDelete
  2. వరదా- భగవంతునికి భక్తునికి అనుసంధాన మైనది అంబికా అగరొత్తులు మాత్రమె కాదు - అంబిక "గరం" ఒత్తులు కూడా అనడంతో----

    ఇది కొంచెం అర్థం అయి అవనట్టుగా వుంది..ఎదో తెలిసినట్టు మళ్ళి అదికాదేమో అన్నట్టు వుంది..జిలేబీ గారూ ఈ అంబికా గరం వత్తులు గురించి కొంచెం విశదీకరిస్తారా?

    ReplyDelete