Saturday, December 17, 2011

బుజ్జి పండు తెలుగు చదువు - 6 - (భామా విజయం 1 )

ఫ్రాన్క్ఫర్టు అంతర్జాతీయ విమానాశ్రయం. టెర్మినల్ ఒకటి. తెల తెల వారి పోతోంది. బయట మంచు తెల్లటి తివాచీ లా పరుచుకొని వుంది. మత్తుగా 'సోనెన్' కిరణాలు మంచు పై పడి మధుర వేణువులు పలికిస్తున్నాయి కమ్మ తెమ్మర తోడు రాగా.


"హల్లో బుజ్జి పండూ, ఐ యాం బులుసు " అన్న మాటలు వినిపించి బుజ్జి పండు చదువుతూన్న 'విష్ణు శర్మ ఇంగ్లీషు చదువు' పుస్తకాన్నించి బయటపడి తలెత్తి చూసాడు తన హారీ పాటర్ కళ్ళద్దాల లోంచి.

అరవై ఏళ్ల పై బడ్డ మనిషైనా చలాకీగా కనబడుతున్నాడు ఓ పెద్దాయన.
కంటికి జోడు కళ్ళద్దాలు. ఫుల్ సూటు.
కాళ్ళకి సాక్స్ మీద హవాయి చెప్పులు .
చేతిలో సిగారు.
మరో చేతిలో చిన్ని బ్రీఫ్ కేసు.
పెదవుల పై ము.ము.న.

ఫక్కున నవ్వు వచ్చేసింది బుజ్జి పండు కి ఈ పెద్దమనిషి ని చూస్తూనే ! అసలు పేరు చెబ్తేనే జనాల పెదవుల మీద చి.న. రాగా లేనిది , ఆ పెద్దాయన ని కంటి ఎదుటే వున్నాడు, అదీ తనను తాను పరిచయం చేసుకుంటూ.

వీరి ఇద్దరి మధ్యా ఈ మీటింగు ఫ్రాన్కఫర్టు విమానాశ్రయం లో జరగటానికి కారణం ఏమిటి? దీని వెనుక ఎవరి ప్రోద్బలం వున్నది అన్నది తెలుసుకోవాలంటే మనం కొన్ని రోజుల మునుపు వెళ్ళాలి.

కొన్ని రోజుల మునుపు....

జర్మేనీ మ్యూనిచ్ మహానగరం. శ్రీ కృష్ణుల వారి మీద  రీసెర్చ్ లో  తలమునకలయ్యే పనుల్లో కూరుకు పోయి, బ్లాగులో ఇవ్వాళ ఏమి రాయాలో అన్న మధుర ఆలోచనల లో నిమగ్నమైన మధురవాణీ గారికి ఇండియా నించి ఫోన్ వచ్చింది.

" హాయ్, మధురా, కృష్ణ ప్రియని "

"ఊ "

"బులుసు వారు ఐరోపా వస్తున్నారు "

"ఊహూ"

"నీ హెల్ప్ కావాలి "

"ఊ"

"మా ఆర్ముగం పారీసు లో వున్నాడు. తన్ని ముఖాముఖి చెయ్యడానికి బులుసు వారు ఐరోపా వస్తున్నారు. డైరెక్ట్ గా పారీస్ కి వారికి కుదరలేదు. మధ్యలో ఫ్రాంక్ఫర్ట్ హాల్ట్ అక్కడ్నించి వెళ్ళాలి "

ఇప్పటికి మధుర మళ్ళీ భువి పై మ్యూనిచ్ నగరానికి , మన  లోకానికి వచ్చింది, ఊ, ఊహూ ల మధ్యనించి బయట పడి.

"కృష్ణా నీవేనా ! నీవేనా నను పిలచినది ! " అని , మళ్ళీ 'ఊ' హా' లోకం లోకి  జారుకోబోయి, పిలిచింది కో-బ్లాగిణి కృష్ణ ప్రియ అని గుర్తుకు వచ్చి,

"ఏమన్నావ్, ఏమన్నావ్, మళ్ళీ ఇంకో మారు చెప్పవూ " అంది మధుర. 

ఈ మారు కృష్ణ ప్రియ తల పట్టుకుని,  'మధుర వాణీ , అని పేరు పెట్టుకున్నావ్ కాబట్టి నీకు అన్నీ రెండేసి మార్లు చెప్పాలే  సుమా , అని మళ్ళీ మొదట్నించి మొదలెట్టింది.

అప్పటికి మధుర వాణీ, బుర్రలో వెలిగింది , వస్తున్నావారు  ఎవరు అన్నది.

బులుసు గారు వస్తున్నారోచ్ ! అన్న వార్త వినగానే, మధుర  ఆనందం ఇంతై వటుడింతై అన్నట్టు ఆకాశానికి అంతే లేదన్నట్టు అయ్యింది.

"బులుసు గార్ని నువ్వు ఫ్రాంక్ఫర్ట్ లో కలిసి అక్కడ్నించి వారిని నువ్వు ఐ సి ఈ ట్రైన్ లో పారీస్ కి అకంపనీ అవుతావా? " అంది కృష్ణ ప్రియ.

"కుదరదు. వార్నీ మ్యూనిచ్ కి లాక్కోచ్చేస్తాను. ఆపై ఓన్లీ పారీస్ " అని ప్లాన్ మార్చమంది మధుర వాణీ.

ఈ కొత్త ట్విస్ట్ తో కృష్ణ ప్రియ సరే నాకు కొన్ని గంటలు టైం ఇవ్వు అని నాలుగైదు కాల్స్, చాట్,మెయిల్ ' బులుసు వారికి నడిపి మొత్తం మీద  కొత్త ప్లాన్ కి నాంది పలికింది. బులుసు వారిని ఫ్రాంక్ఫర్ట్ ఏర్పోర్ట్ నించి మధుర పిక్ అప్ చేసుకుని మ్యూనిచ్ వెళ్తుంది అక్కడ కొన్ని రోజుల బస తరువాత బులుసు గారు పారీసు వెళ్తారని.

ఈ సంఘటన జరిగిన రెండో రోజులకి మధుర వాణీ కి మరో ఫోన్ - ఈ మారు అమెరికా నించి - జ్యోతిర్ మాయీ వారి దగ్గిర్నించి. "మధురా, మా బుడతడు, తెలుగు చదువు ముగించి, అమెరికా వస్తున్నాడు. మధ్యలో ఫ్రాంక్ఫర్ట్ లో ఫ్లైట్
లే ఓవర్ లో వుంటాడు. కలుస్తావా అతన్నీ ? " అని.

"బుజ్జి పండుమని కలవమని రిక్వెస్ట్ చెయ్యవలెనా జ్యోతిర్, జస్ట్ ఆర్డర్ ఇవ్వండీ, " అని మధుర చెప్పి, ఎప్పుడు వస్తున్నాడు అంటే, బుజ్జి పండు రాక, బులుసు గారి రాక ఒకే రోజున అని తేలింది.

"బుజ్జి పండుని నేను మ్యూనిచ్ కి పిలుచుకెళ్ళనా ? "

"ఓహ్, నో, తను క్రిస్టమస్ కి అమెరికా లో వుండాలన్నాడు- కాబట్టి కుదరదు" జ్యోతిర్మయి చెప్పారు.

"ఓహ్, ఐతే , నాకూ కుదరదే " అని " వీలయితే చూస్తాను  " అని చెప్పి, మనసులో, బుజ్జి పండు ని బెర్లిన్ కి కిడ్ నాప్ చెయ్యడానికి ప్లాన్ తయారు చేసుకున్నారు మధుర వాణి.

దాని పర్యవసానం ఈ బులుసుగారి 'హల్లో బుజ్జి పండు ఐ యాం బులుసు " అన్న ఈ మాటలు.

(ఇంకా ఉంది)

16 comments:

 1. suparoooooooooooooooooooooooooooooooooo suparu....edi srujana leka nijamaaa??!!!!

  ReplyDelete
 2. ఇందు మూలముగా అందరికి తెలియజేయునది ఏమి అనగ? మేము పేరు మార్చుకొని వచ్చాము మా పేరు మీ అందరికి నచ్చుతుంది అని ఆశతో మీ మౌనముగా మనసుపాడినా బ్లాగ్

  ReplyDelete
 3. aa "memu" ante evarandi babu??

  ReplyDelete
 4. వామ్మో! కిడ్ నేప్ ప్లాన్లు ఇంత పకడ్బందీగా జరిగిపోతున్నాయో! వామ్మో!

  ReplyDelete
 5. >>>ఫుల్ సూటు.
  కాళ్ళకి సాక్స్ మీద హవాయి చెప్పులు .

  బుజ్జి పండే కాదు విమానాశ్రయం లో ఉన్నవాళ్ళందరూ కిం.ప.దొ.న.

  ఎంత జోకర్ గా కనిపించినా మరీ సర్కస్ లో బఫూన్ వేషం వేయించడం ఖండిస్తున్నాను అధ్యక్షా. మధుర వాణి గారు ఎప్పుడు వస్తారో, మళ్ళీ కృష్ణప్రియ గారు, మధుర వాణి గారు మాట్లాడుకొని నాకు ఒక బూట్ల జత ఎవరు కొనిపెడతారో నని ఉత్కంఠ తో ఎదురుచూస్తున్నాను.

  ReplyDelete
 6. @రాఫ్సన్,

  నెనర్లు.

  @మౌనముగారు,

  మీరు మౌనమువీడి కొత్త గొంతుకతో పాడుతున్నండులకు మిక్కిలి సంతోషం!

  చీర్స్
  జిలేబి.

  ReplyDelete
 7. @కష్టేఫలె గారికి,

  అంతా అంతర్జాలమహిమ! ఫాస్ట్ వరల్డ్ లో చక చక అన్నీ మేనేజ్ చేసుకుంటున్నారు భామా మణులు !

  చీర్స్
  జిలేబి.

  ReplyDelete
 8. @బులుసు గారికి,

  ఆర్యా!

  ఇందులో జిలేబి తప్పిదము ఏమియు లేదు. ఇది బులుసు వారు స్వయం గా రాసుకున్న వివరణ.

  http://varudhini.blogspot.com/2011/11/blog-post_25.html

  కొంత కనికరించి చలి ప్రదేశము గావున కాలి కి సాక్సులు, చేత సిగారు జిలేబి గారు చేర్చడం జరిగినది. తప్పిదము జరిగిన మన్నించవలె. మధుర వాణీ, కృష్ణ ప్రియ వారలు ఈ విషయమును గమనించి, మాష్టారు గారికి ఖరీదైన బూట్లు (జత అన పదమును గమనించవలె) మంజూరు చేయవలె. ప్రస్తుతం వారు ఫ్రాన్క్ఫర్టు ఏర్పోర్ట్ లో నె వున్నారు కాబట్టి వెంటనే అక్కడే వారు కొనులాగు నిర్ణయించ వలె !

  చీర్స్
  జిలేబి.

  ReplyDelete
 9. konni rojulugaa ikkada pappu maadinattu vaasana vastundi..

  telivitetalu okkari sottam kaadu madam..gurtupattalemanukuntunnaaraa???

  ReplyDelete
 10. రండ,రండ, అరుణా రావు గారు,

  మీరూ పాక శాస్త్ర ప్రవీణులే నన్న మాట. అంత త్వరగా పప్పు మాడిన వాసన కనబెట్టేసారు. వెల్కం.

  చీర్స్
  జిలేబి.

  ReplyDelete
 11. జిలేబిగారూ..సాంకేతిక కారణాల వల్ల బ్లాగు లోకంలోకి రావడానికి కొంత ఆలశ్యమైనది. బుజ్జిపండు బులుసుగారిని కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. అయితే ఇప్పుడు మా బుజ్జిపండు జర్మనీలో మధుర గారింట్లో ఉన్నాడన్నమాట..బావుంది బావుంది...

  ReplyDelete
 12. జ్యోతిర్ మాయీ వారు,

  మీరు మరీ దీరోదాత్తురాలే సుమా! బుజ్జి పండు 'కిడ్ నాప్' అయినాకూడా భయపడకుండా వున్నారు ! మధురవాణీ గారు ఏమీ చెప్పటం లేదు బుజ్జి పండు గురించి, సో నాకూ తెలీదు వారింటి లోనే వున్నాడా లేక ... అని. వారేమో ప్రస్తుతం కాబోయే శ్రీవారి కి లేఖ వ్రాయడం లో బిజీ గా వున్నారు. అదయ్యేక విషయం ఏమైనా తేలునేమో !

  చీర్స్
  జిలేబి.

  ReplyDelete
 13. జిలేబి గారూ కంగారేమీ లేదండీ బుజ్జిపండు జర్మనీలోనే ఉన్నట్టు విశ్వాసనీయ వర్గాల భోగట్టా..

  ReplyDelete
 14. ఇంతకీ నేను ఇంకా జర్మనీ ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్టు లోనే ఉన్నానా? నా క్షేమ సమాచారములు తెలియపర్చవలసిందిగా మా ఆవిడ కోరుచున్నారు.

  ReplyDelete
 15. @బులుసు గారికి,

  ఉభయ కుశలోపరి! బులుసు గారు ఇంకా జర్మనీ ఫ్రాంక్ఫర్ట్ ఏర్పోర్ట్ లో నే వున్నారని, క్షేమముగానే వున్నారని వినికిడి. మధుర వాణీ గారు బుజ్జి పండుని ఎలా ఇంటర్నేషనల్ ఏరియా నించి బయటకు తీసుకురావడం అని శ్రీ కృష్ణ స్వాములతో చర్చించాలని చూస్తున్నారు. శ్రీ కృష్ణుల వారేమో కోర్టు కేసులో , అక్కడ రష్యా లో బిజీ గా వున్నారు. వాణీ గారి వాణీ వారికి వినిపించడం లేదు, వెయిట్ చెయ్యాలి కామోసు !

  చీర్స్
  జిలేబి.

  ReplyDelete