వంద పేజీ ల పైన లింకులు
పన్నెండు పై బ్లాగులు
మూడు వేల టపాలని అందుకుంటున్న బ్లాగ్ వేగం
ఒక మిల్లియన్ దరిదాపుల్లో విజిటర్స్
Nearly 5 fruitful years in 'Blog Industry' !
ఆవిడ ఒకప్పటి ఇల్లలుకుతూ తనను తాను మరిచిపోయిన
సత్యవతీ శారద
ఒక శుభోదయాన పిల్ల గాలి లా మారి - బ్లాగ్ ప్రభంజనం గా పరిణితి చెందింది.
ఆమె ఒక 'పుయల్ - వియల్' !
నేడు బ్లాగ్ లోకపు 'జ్యోతి'
బ్లాగ్ గురువు
బ్లాగ్ లోకాం తపసా జ్వలంతీం !
December 22, 2011
జ్యోతి వలబోజు గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలతో
ఓ ఫన్ ఆర్ట్ విత్ జేకే బ్లాగ్ముఖీయం !
ఇది ఒక ABN- ఆంద్ర జిలేబి సహసమర్పణ !
నమస్కారం జ్యోతి గారు ! పుట్టిన రోజు శుభాకాంక్షలు !
మీరు ఒక వ్యక్తి యా లేక శక్తి యా ? పన్నెండు పై బ్లాగులు , ఎడతెరపని వ్యాస పరంపరలు. గృహిణీ గురుతరమైన భాద్యతలు. మీకు టైమ్ ఎలా కుదురుతుంది. రాత్రుళ్ళు నిద్రపోరా?
నమస్తే. ధన్యవాదములు.
అందరికీ లాగే నాకూ వున్నది ఇరవై నాలుగు గంటలే అండీ !. దాన్ని మనం ఎలా సద్వినియోగ పరచు కుంటాం అన్నదాన్ని బట్టి మన టైం మేనేజ్మెంట్! ఇరవై నాలుగు గంటల్నే, డెబ్బై రెండు గంటలు గా ఉపయోగించుకోవచ్చు.
The secret of success in the 21st century is all about learning things fast and unlearning them even faster!
మీ ఫ్యామలీ గురించి...
మావారు సివిల్ ఇంజనీరు, పిల్లలు దీప్తి, కృష్ణచైతన్య .ఇద్దరు వర్కింగ్. మేము ఉండేది .హైదరాబాదు. నేను ఇంట్లోనే ఉంటాను.
మీ అమ్మ గారి గురించి చెప్పండి ...
ఒక్కతే కూతురుగా పుట్టడంలో ఉన్న మజానే వేరు. అన్ని రాజభోగాలే. అమ్మ చేసే అలంకారాలు అన్నీ మనకే. చెప్పొద్దు కాని మా అమ్మ నాకు చిన్నప్పటినుండి గురువులా అన్నీ నేర్పేది. ముఖ్యంగా తెలుగులో చదవడం, ఏదైనా నేర్చుకోవడం. వంట దగ్గర అంటే కాస్త కాస్త సాయం చేయడం వరకే.
మార్కెట్లో కనబడిన కొత్త డిజైన్ ఫ్రాకులు, డ్రెస్ లు కుట్టేది . మల్లె పూలు మొదలయ్యాయంటే చాలు కనీసం మూడు నాలుగు సార్లైనా పూల జడ వేసుకోవాల్సిందే. అచ్చంగా నా జడకు డైరెక్టుగా కుట్టాల్సిందే.పూలజడ వేసుకునే రోజు ఒక ప్రత్యేకమైన రోజుగా ఉండేది.
కనీసం మూడు గంటలు కూర్చుంటే కాని జడ పూర్తయ్యేది కాదు. ఇక సాయంత్రం , పట్టులంగా వేసుకుని, అమ్మ నగలు పెట్టుకుని ఫోటో స్టూడియోకెళ్ళి వెనకాల అద్దం పెట్టి మరీ ఫోటో దిగడం.
నాకు పుస్తకాలు చదవడం అలవాటు చేసింది మా అమ్మే. క్లాసు పుస్తకాలే కాకుండా తప్పనిసరిగా చందమామ కొనేది పేపర్‌తో పాటు. ముందు సింగిల్ పేజీ కథలు చదువుతూ మెల్లిగా సీరియల్స్ చదివేదాన్ని. పాత పేపర్లవాడు వచ్చినప్పుడు చందమామల్లోని సీరియల్ కథలన్ని కట్ చేసి దాచుకునేదాన్ని.
మీ అమ్మాయి చదువుకి మీరు ఏమైనా సాయం పట్టారా ?
నేను అంతర్జాలానికి వచ్చిందే మా అమ్మాయి చదువుకోసం. ఇంజనీరింగు మూడవ సంవత్సరంలో ఉండగానే "మమ్మీ ! నేను CAT , XAT పరీక్షలకు చదువుతాను" అంది. ఆర్ధిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్న పరిస్థితులలో చదువుకుంటానంటే ఎలా వద్దనగలను.కాని నేను చెప్పింది ఒకటే.. నువ్వు సీరియస్సుగా చదువుతానంటే . ఓకె.. నువ్వు చదువుకో. మిగతా విషయాలు నేను సేకరిస్తాను అని నెట్‍లో కావలసిన సమాచారం సేకరించడం, నెట్ లో కలిసిన మిత్రులతో కాలేజీలు, ఉద్యోగం గురించి తెలుసుకోవడం నేను చేసేపని. కాని తను పట్టుదలతో చదువుకుని , ప్రతిష్టాకరమైన కాలేజీలో అదీ హైదరాబాదులో చేరింది. అనుకున్నది సాధించింది.
బుడిబుడి అడుగులతో ఆడుతూ పాడుతూ పెరిగిన నా చిన్నారి , అతి చిన్న వయసులొ ఇప్పుడు ఒక పెద్ద కంపెనీలో భాధ్యాయుతమైన ప్రాజెక్ట్ ఇంజనీరుగా ఉంది అంటే నాకు చాలా గర్వంగా ఉంది.
ఇంటి ఇల్లాలు చేసే పనులకు వెల కట్ట గలమంటారా ?
ఇంటికి దీపం ఇల్లాలు అంటారు, ఆవిడ చేసే సేవలు అమూల్యం.
అట్లాంటి ఇల్లాలు చేసే పనులకు నిజంగా వెలకడితే ఎంతవుతుందో తెలుసా? అక్షరాల ఓ వెయ్యి అమెరికన్ డాలర్లంత! అంటే మన లెక్కలో అరవై వెల రూపాయల పై చిలుకు!
మహిళల కోసం ప్రమదావనం ! మహిళల కోసం జల్లెడ లో ప్రత్యెక ప్రాంగణం కూడలి లో ప్రత్యేక విభాగం! స్పెషల్ చాట్ రూం నారీ భేరీ ఏమిటండీ మీ స్పెషాలిటీ ?
అదే మరి మా మహిళల ప్రత్యేకత.. ఒక్క టపా రాస్తే వంద టపాలు రాసినట్టు అన్నమాట.
ఆడవాళ్ళలో జీనియస్ లు ఎందుకు లేరంటారు ?
ప్రతి ఒక్క ఆడదీ జీనియస్ అండీ. ఈ జీనియస్ అనబడే వ్యక్తికి చెమ్మగిల్లే హృదయం ఉండాలి.కంట తడి పెట్టగలిగే మెత్తటి మనసుండాలి. ఈ గుణాలు ఆడవాళ్ళలో సహజం. అందుకే ప్రతీ స్త్రీలో ఓ జీనియస్ ఉంది. వెరయిటీ కే ఈ రోజులలో ప్రచారం, అందుకేనేమో ఏ ఒక్క మగవాళ్ళలో తప్పి జీనియస్ పుడితే, వెంటనే వారికి ప్రాచుర్యం వచ్చేస్తుంది.
పేగు తెంచుకుని నేలపై పడినప్పుడు ఆ ఆడపిల్ల అమృత కలశంగా కాలేదు. అగ్నికుంపటి కాలేదు. ఒక స్త్రీ అనుకుంటే సాధించలేని దంటూ ఏమీ లేదు.
మీరు బ్లాగ్ ఎప్పుడు మొదలెట్టారు ?
సెప్టెంబర్ 14, 2007 న.
ఇల్లలకగానే పండగౌనా అని సత్యవతీ గారి కథ. చాలా సంవత్సరాల మునుపు వచ్చింది.
ఇల్లలుకుతూ ఒక శారద తన్ను మరిచి పోయిందట. ఈనాటికీ మన చుట్టూ ఎంతోమంది తమ పేరు మరచిపోయిన శారదలు ఉన్నారు. భర్త , పిల్లలు , సంసారం తప్ప వేరే లోకం తెలిదు. అలాటి ఓ పేరు మరచిపోయిన శారదల్లో నేనూ ఒకదాన్నేఒకప్పట్లో ..
అప్పట్లో అందరి ఆడాళ్ళలాగే ఇంటిపని కాగానే నిద్రపోవడం, టీవీలో వచ్చే చెత్త సీరియళ్ళన్నీ చూడడం( అప్పుడవి మహాద్భుతాలు) వాటిగురించే చర్చించడం, మరునాటి కోసం ఎదురుచూడ్డం చేసేదాన్ని. వేరే వినోదం అంటూ లేదు మరి. ఐనా నాలో ఎదో అసంతృప్తి. నాకు నచ్చిన పాటలు, వంటలు, జోకులు, కథలు,పురాణగాథలు. వీటన్నింటి గురించి మాట్లాడుకోటానికి స్నేహితులు లేరు.
మొదటినుండి తెలుగు అంటే ప్రాణం. పుస్తకాలంటే మరీను. మరి ఏదైనా విషయం గురించి చర్చించాలి, సందేహం తీర్చుకోవాలి అంటే ఎవరూ లేరు. అందుకే గూగుల్‌లో కనపడ్డ తెలుగు గుంపులన్నీ చేరిపోయా. అప్పటికి గ్రూపులంటే తెలీదు. తర్వాత ఒక్కటొక్కటిగా తెలుసుకుని, బ్లాగ్ మొదలెట్టాను.
మొదట్లో నా బ్లాగులో ఏమి రాయాలో తెలీదు. అంతా అయోమయం. అందుకే ఎక్కువగా నాకు నచ్చిన విషయాలను రాసేదాన్ని. మెల్లి మెల్లిగా నా స్వంత రాతలు మొదలుపెట్టాను. అలా అలా నాకు ఇష్టమైన అభిరుచులన్నీ బ్లాగులుగా చేసుకున్నాను. బ్లాగు మొదలెట్టిన సంవత్సరంలోగానే కంప్యూటర్ ఎరాలో ఒక సమగ్రమైన వ్యాసం రాయగలిగాను.
ఈ బ్లాగులు ఏమి ఆశించి మొదలెట్టారు ?
ఈ బ్లాగులవల్ల ఏదో ఆశించి కాదు. కాని ఈ బ్లాగుల వల్ల నాకే తెలియని రచనాశైలి బయటికొచ్చింది అని చెప్పగలను. అలాగే ఎంతో మంది ఆత్మీయులను పొందగలిగాను. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నాకే నవ్వొస్తుంది.
ఈ బ్లాగులవల్ల మీకు ఏమైనా మంచిది జరిగిందా ?
ఈ బ్లాగుల వల్ల నా ఆలోచన, అవగాహనా శక్తి పెరిగింది.నిజం. ఎప్పుడైనా ఏ విషయమైనా నచ్చిందైనా , నచ్చనిదైనా, నా స్వంత విషయమైనా వెంటనే బ్లాగులో రాసుకుని అందరితో పంచుకోవడం అలవాటైపోయింది. అందరూ కుటుంబ సభ్యులు, పాత మిత్రులలా అనిపిస్తుంది. ఈ ప్రయాణంలో నేను ఎవ్వరితోను పోటీ అనుకోలేదు. నాకు నేనే పోటీ పెట్టుకుని రాసుకుంటూ పోయా. మొదటినుండి నాదో అలవాటు మంచిదో కాదో తెలీదు. నాకు తెలిసింది పదిమందికి చెప్పడం, తెలీంది పదిమందిని అడగడం. అదే పాటిస్తూ వస్తున్నా ..
ఇప్పుడు నేను మా ఇంట్లోవాళ్ళకి , మా పుట్టింట్లో గర్వంగా చెప్పుకుంటాను ఇంటర్‌నెట్‌లో దేశవిదేశాల్లో నాకెంత పేరుందో తెలుసా అని.. ఇది నేను ఇంట్లోనే ఉండి చేయగలిగాను అని. అందరూ ఊరికే అనేవారు మరి ఎప్పుడూ కంప్యూటర్లో ఏం చేస్తుంటావు అని. నేను ఎన్ని బ్లాగులు రాసినా అది నా కుటుంబ బాధ్యతల తర్వాతే తీరిక సమయాలలో చేస్తున్నాను.
అంతర్జాలాన్ని సక్రమంగా ఉపయోగించుకుంటే ప్రపంచం మనచేతిలో ఉండడంకాదు ప్రపంచానికే మనం పరిచయమవుతాం..
జ్యోతక్క గా చాలా మందికి తెలుసు గాని, ఎప్పుడైనా నెట్ లో అల్లరి చేసారా మీరు ?
అదేంటో గాని చిన్నప్పటినుండి అల్లరి చేసి ఎరుగను. ఇంట్లో ఒక్కదాన్నే ఆడపిల్లను, పెద్దదాన్ని. ఎవరితో పోట్లాడేది? అల్లరి చేసేది.? ఇది మస్తీ గ్రూపులో జరిగిన సంఘటన. అది నేను చేరిన కొత్తలో జరిగింది. నా నిజమైన వివరాలు ఒక్క గ్రూపు ఓనర్‌కి, ఒక అమ్మాయికి మాత్రమే తెలుసు. గుంపులో నేను చాలా యాక్టివ్‌గా ఉండేదాన్ని. ఎదో ఒక ఆట, చర్చ మొదలు పెట్టేదాన్ని. అప్పుడప్పుడు వంటకాలు పంపించడం గట్రా. ఆ సమయంలో ఒక అబ్బాయి చేరాడు.
ఎప్పుడు కూడా అమ్మాయిలను తెగ సతాయించేవాడు. నేను పంపిన మెయిల్స్ మీద కూడా ఎదో ఒక కామెంట్ చేసి కోపం తెప్పించేవాడు.నాకు ఆ అబ్బాయికి తరచూ గొడవ జరిగేది. అతడు తనకు తానే చాలా గొప్ప అనుకునేవాడు.
అలా ఒక రోజు ఈ బ్లాగ్ విషయం లా గుంపులో ఒక చర్చ మొదలు పెట్టాను. మీరు చేసిన అల్లరి చెప్పండి అని.
ఒక్కొక్కరు చెప్తున్నారు . అప్పుడు నాకో ఐడియా వచ్చింది. వెంటనే ఒక మెయిల్ చెసా." ఇంతవరకు నేను గుంపులో చెప్పిన వివరాలు తప్పు. నేను అమ్మను కాదు అమ్మాయిని, నా వయసు తప్పు చెప్పాను. నేను M.B.A చదువుతున్నాను. కావాలని గుంపులో అల్లరి చేసాను. ఎవ్వరిని మోసం చేయాలని కాదు " అని కాస్త గ్యాస్ కొట్టాను. ఇంకా ఆ తరువాయి ఆ అబ్బాయి పాట్లు చెప్పా లంటారా ?
మీకు సంగీతం అంటే ఇష్టం. ఏమంటారు ?
సంగీతం, నృత్యం, చిత్రలేఖనం మొదలైన 64 కళల్లో సంగీతం మొదటి స్థానంలో ఉంది. పసిపిల్లలు, పశువులు, పాములు, పక్షులు, మొక్కలు కూడా సంగీతాన్ని విని ఆనందిన్స్తాయని అంటారు. అంతే కాక మ్యూజిక్ థెరపీ వల్ల మానసిక రుగ్మతలను కూడా పోగొట్టవచ్చని వైద్యులు చెప్తున్నారు. "Music is Universal Language" ప్రపంచం అంతటికీ తెలిసిన ఏకైక భాష సంగీతం. ప్రపంచ సంగీతమంతా ఏడు స్వరాల (సప్తస్వరాలు) మీదే ఆధారపడి ఉంది. సంగీతానికి పునాది ఈ సప్తస్వరాలు.
ఉదాహరణకి, బిళహరి-- ఈ రాగం పాడి చనిపోయినవారిని కూడా బ్రతికించవచ్చు అంటారు. అమృతవర్షిణి-- ఈ రాగం పాడి ముత్తుస్వామి దీక్షితులు ఎట్టయాపురంలో వర్షం కురిపించి క్షామాన్ని రూపుమాపారని చెబుతారు
ఎక్కడి దింతటి యోపిక? యెక్కడి వీ జ్ఞానరుచులు, హెచ్చగు రీతుల్? మాటలు, పాటలు, వంటల మూటలతో, ’బ్లాగులోకము’న నొక్క ’డజన్’కోటలనే నిర్మించిన మీ ప్రతిభా రహస్యం ఏమిటి ?
ఇందులో రహస్యం ఏమీ లేదండీ.
తీరిక లేకుండా సాగిపోతున్న నా దినచర్యలో ఒక్కసారి ఆగి "నేనేంటి??" అన్న ఆలోచన చేయడం మొదలైంది. నేను ఎప్పుడు కూడా గతం గురించి కాని, వర్తమానం గురించి కాని చింతించలేదు. ఈ రోజు మాత్రమే నా చేతిలో ఉంది. దాన్ని ఎలా సద్వినియోగపరుచుకోవాలి అనుకున్నాను.
అప్పట్లో కంప్యూటర్ అంటే ఒక డబ్బా టీవీ, టైప్ రైటర్ అని తప్ప వేరే తెలీదు.
నిజంగా చెప్పాలంటే ఈ తెలుగు బ్లాగు వల్ల నాకంటే ఎక్కువ ప్రయోజనం పొందింది, సద్వినియోగపరుచుకున్నది ఎవరూ లేరనుకుంటా. తీరిక సమయాన్ని నెట్ పై వినియోగించి నేను పొందిన లేదా సాధ్యం చేసుకున్న కలలు చెప్పనా ?
దీపంజ్యోతి పరబ్రహ్మ..మనిషి నడవడానికి శక్తి కావాలి. ఆ శక్తినందించేది ఆహారం. అందుకే షడ్రుచులు. మనిషి నడతకు కావాలి మేలుకొలుపు. అదే జ్యోతి బ్లాగు. సాహితీసేద్యంలో సాహితీసమరాంగణ చక్రవర్తి పదఝరిలో ఓలలాడించే ఆముక్తమాల్యద,కమ్మనిపాటల గీతాలహరి,చక్కటి పాఠాల బ్లాగ్ గురువు,చరాచర సృష్టివైచిత్రిలో విచిత్ర మానవ స్వభావాలను పౌరాణిక కథలద్వారా ప్రస్ఫుటించే జగన్నాటకం,పొద్దు గడిచేందుకు పొద్దుగడి,నవ్వనివాడు పాపి అని తిట్టిమరీ నవ్వించే Jyothi అందించే హాస్యపు పుణుకులు మాటల చెణుకులు, భక్తిదారులు చూపి ముక్తిమార్గపు బాటను వేసే నైమిశారణ్యం, అంతే .
మీ విజయానికి దోహదం ?
నా విజయంలో పాతిక శాతం మావారికి, పాతిక నన్ను ప్రోత్సహించే నా పిల్లలు, మిత్రులకు, మిగతా యాబై శాతం నాకేనండి. ఎప్పుడు కూడా నాకంటూ ఒక లక్ష్యం పెట్టుకోలేదు. ఎదురొచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుని, కష్టపడి విజయం సాదిస్తూ వచ్చాను. బ్లాగడం మీద అవగాహన, తెలుగు లో బ్లాగమని ప్రోత్సాహం.. వగైరాల ద్వారా 'నేను సాధారణ గృహిణినేనర్రా.. ఇపుడు చూడండి నన్ను..' అన గలిగాను.
ఒకప్పుడు తెలుగుబ్లాగు గుంపులో అల్లరి పిల్ల జ్యోతి, నేడు జ్యోతక్క, రేపటి ప్రస్థానం ఎక్కడికో?
జ్యోతిని ఇలానే వెలగనివ్వండి. కొన్ని ప్రమిదలు అనుకరిస్తాయి, మరికొన్ని, ఆశ్చర్యపడతాయి, అబ్బురపడతాయి, మరెన్నో అనుకరిస్తాయి. ఇంక ఎందరో జ్యోతక్కలు వస్తారు.రావాలి. జ్యోతి ఎప్పటికీ ఇలానే జ్వలిస్తూ ఉండాలి.
మీకు 'Blog Ambassadar' అని టైటిల్ ఇస్తున్నా నా తరపునించి అని జిలేబి గారు అన్నారంటా?
బ్లాగ్ లోకం లో మీకు పుయల్- వియల్ అని తమిళ బ్లాగర్స్ బిరుదు ఇచ్చారని విన్నాము ? (పుయల్- అంటే ప్రభంజనం - వియల్ అంటే - బంగారం !)
I love my computer/blogs because my friends live in it! నా సంతోషంలో ఆనందించి, బాధలో ఓదార్పు నిచ్చి, విజయాలలో అభినందించే ప్రియమైన బ్లాగు మిత్రులకు వందనాలు. మనఃపూర్వక కృతజ్ఞతలు.
అసలు రక్తసంబందం లేకుండా ఇంత ఆత్మీయత , ఆప్యాయత ఉన్న స్నేహాలు ఏర్పడతాయని కలలో కూడా అనుకోలేదు. ఇంతమంది బ్లాగు మిత్రులలో కొందరు కుటుంబ మిత్రులుగా కూడా మారారు!
I learn from my fellow bloggers. టైమ్స్ ఆర్టికల్ ద్వారా పరిచయమైన ముత్తులక్ష్మి అనే తమిళ బ్లాగరు తన నాలుగవ బ్లాగు వార్షికోత్సవ సందర్భంగా నాకు ఈ అవార్డు ఇచ్చింది.
బ్లాగు నెయ్యము మనకెంతొ బాగు బాగు
ఒకరి కొకరుగ సాయము ఒనర గూడ
జీవితంబున మనకెంతొ తావి నిచ్చు!
జయము జయమేను మనకింక జగతినందు
రౌడీ గారు, రౌడీ గారి అమ్మ గారు కథా కమామీషు ?
ఎవరూ మలక్పేట రౌడీ గారా ? మలక్ బ్లాగులోకంలోకి వచ్చింది నా మూలంగానే.. నన్ను కెలకడానికి వచ్చాడు అప్పుడెప్పుడో. తర్వాత పరిచయం కలిగి , స్నేహం పెరిగింది. కాని చివరికి నావల్లే కెలకబడ్డాడు పాపం.. అందుకే పెద్దలు చెప్పారు ... (... ఇది మీకు తెలుసు...)... అతని స్నేహం వల్ల నాకు కొన్ని రౌడీ వేషాలు అబ్బాయి లెండి. ఆ పై వారి అమ్మగారితో పరిచయం ఓ మరువలేని అనుభవం.
మన 'టెల్గూ' టీవీ ఏంకర్ ల గురించి మీ అభిప్రాయం ?
ఈ లంగరమ్మలు ఏమి మాట్లాడినా మాట్లాడక పోయినా హొయలు.. ఇందులో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే అంతా తెలుగువారే. ఐనా కూడా తమ వ్యాఖ్యానాలలో తెలుగు తక్కువ ఇంగ్లీషు ఎక్కువ ఉపయోగిస్తుంటారు. వాడుక భాషలో పదాలను కూడా ఇంగ్లీషులోనే చెప్పాలా? ఇక్కడ ప్రోగ్రాం చేసే ప్రొడ్యూసరు, డైరెక్టరు , యాంకరు, చూసేవాళ్లు , ఆ చానెల్ కూడా తెలుగే. మరి ఈ ఇంగిలిపీసు అవసరమా?? నూనె, ఉప్పు, చక్కెర ను కూడా ఇంగ్లీషులోనే పలుకుతారు. మనం వాటిని ఆయిల్, సాల్ట్ , షుగర్ అని అనము ఇందులో పాల్గొన్న మహిళలు మాట్లాడేది తక్కువ ఈ యాంకరమ్మల గోల ఎక్కువగా ఉంటుంది. వాళ్లు చెప్పింది ప్రేక్షకులకు ఎక్కడ అర్ధం కాదని అనుకుంటారో ఏమో వీళ్లు వెంటనే మళ్లీ చెప్తుంటారు. ఇక కొందరైతే మాష్ కి స్మాష్ కి తేడా తెలీని ముద్దుగుమ్మలుంటారు. అదేనండి ఉడికించిన బంగాళదుంపలను చిదిమి వాడతాము కదా. ఒక్కోసారి మాష్ అంటారు, ఒక్కోసారి అది బాంబు అనుకుని స్మాష్ అంటారు. ఖర్మరా బాబు..
అప్పటి అమ్మాయిలకీ , ఇప్పటి అమ్మాయిలకీ వ్యత్యాసం ?
అసలు ఇప్పటి అమ్మాయిలకు మంచి అభిరుచి అలవాటు చేసుకోవాలన్న ఇచ్చుక కొంత తక్కువే అనుకుంటాను. చదువు, కంప్యూటర్లు, సినిమాలు, మొబైల్ లేదా ఐప్యాడ్ పెట్టుకుని పాటలు వినడం. మంచి వాయిద్యం నేర్చుకుందామని ఎంత మంది అనుకుంటున్నారు?. ఏమంటే మాకు టైం లేదు అంటారు.
మా కాలంలో ఐతేనా??. .... అప్పట్లో స్కూల్లో, బాలభవన్ లో సంగీతం, వాయిద్యం నేర్చుకునే సదుపాయం ఉండేది. అసలైతే స్కూల్లో వారానికి ఒక రోజు సంగీతం క్లాసు కూడా ఉండేది. ఇంకా లైబ్రరీకి ఒక పీరియడ్ ఉండేది. మేము కూడా చదువుకుంటూనే ఆటలు, పోటీలు, సంగీతం, వక్తృత్వ పోటీలు అన్నీ పాల్గోనేవాళ్ళం. ఇంటికొచ్చి వేరే ఆటలు. ఏంటో ఈ నాటి పిల్లలు. చదువు తప్ప ఏది నేర్చుకుందామనే ఆసక్తి లేదు....
ఊరగాయల్ని గురించిన మూడనమ్మకాలు,ఊరగాయలూ, ఆధ్యాత్మిక చింతనా మీద మీరు రిసెర్చ్ చేసారంటా ?
ఊరగాయల మీద నా పరిశోధనా వ్యాసానికి ఓ డాక్టరేట్ ఇచ్చారండోయ్ మన బ్లాగ్ మిత్రులు నాకు !
ఆముక్తమాల్యదకు ముందే 14వ శతాబ్దంలో రచింపబడిన క్రీడాభిరామములో ఊరగాయలను గురించి చెప్పబడిన ఒకపద్యం చెప్పనా ?
కప్పురభోగి వంటకము, కమ్మని గోధుమపిండి వంటయున్,
గుప్పెడు పంచదారయును, గ్రొత్తగ గాచిన యాల నే, పెస-
ర్పప్పును, గొమ్ము నల్లనటి పండ్లును, నాలుగు నైదు నంజులున్,
లప్పలతోడ గ్రొంబెరుగు, లక్ష్మణవజ్ఝల యింట రూకకున్
(దీని భావమేమి జ్యోతి గారు అంటే, వారు చెప్పింది -మంచి సన్నన్నము, గోధుమపిండి వంట (రొట్టె), పంచదార, ఆవు నేయి, పెసరపప్పు, అరటి పండ్లు, నాల్గైదు ఊరుగాయలు, పెరుగు ఇవన్నియు ఒక రూకకు లభించును.)
కొత్తావకాయ గారి గురించి మీ అభిప్రాయం ?
అదేంటో వారి పేరు చూడగానే కొత్త ఆవకాయ ఎర్రగా నోరూరిస్తూ ఉంటుంది. ఇదిగో ఇప్పుడే వేడన్నంలో ఆవకాయ వేసుకుని తిని వచ్చా కాబట్టి నో ప్రాబ్లమ్. ! కొత్తావకాయ కి మించి చవులూరించేది ఇంకోటి ఉండదని అనుకుంటాను !
వేసవిలో ముఖ్యమైనది ఆవకాయ. కొత్తావకాయ పెట్టగానే అన్నీ జాడీలోకి పెట్టేసాక , కొంచం తీసి పక్కన పెట్టుకుని రాత్రికి వేడి వేడి అన్నంలో ఈ ఆవకాయ , నూనె వేసుకుని (నెయ్యి వేస్తే చప్పబడిపోతుంది) తినడం. చివర్లో కొద్దిగా పెరుగు తింటే కారం గీరం జాన్తా నై !
మీ బ్లాగులో భోజనానికి సంబందించిన టపాలు ఎక్కువ రాస్తుంటారు. మీరు మాంచి భోజనప్రియులా ? (పేరులోనే, బోజు కూడా వుందే మరి !)
భోజనం అనగానే ముందుగా గుర్తొచ్చేది అమ్మ చేతి వంటె. ప్రతీ అమ్మ అన్నపూర్ణే కదా. భర్త కోసం ఇష్టమైన వంటకాలు చేసిపెట్టు అతనికి ప్రేమతో వడ్డిస్తుంది ఇల్లాలు. అతను ప్రీతికరంగా తింటే తాను తృప్తి పడుతుంది ఆ ఇంతి.
షడ్రుచులు బ్లాగు రాసే మీకు నిజంగా అన్ని వంటలు చేయడం వచ్చా , లేక ఊరికే పుస్తకాలనుండి చూసి బ్లాగే స్తూంటారా చాలామందికి సందేహం ?
అందుకేనండోయ్, నా బ్లాగులో చాలా చోట్ల నేను చేసిన వంటలే ఫోటో లనే పెడుతూంటాను!.
మీకో సంగతి చెప్పనా? అసలు నేను షడ్రుచులు వెబ్ సైట్ మొదలెట్టడానికి కారణం మా అల్లుడే..
మీరు బ్రహ్మాండ మైన వంటకాలు చేసి, వాటి ' టెంప్టింగ్ ఫోటోలు బ్లాగులో పెట్టి, బ్రహ్మచారి బ్లాగర్ల మనోభావాలు దెబ్బతీసినందుకు జ్యోతక్క తక్షణం బేషరతుగా క్షమాపణలు చెప్పాలని అఖిలాంధ్ర బ్రహ్మచారుల సంఘం తరఫున డిమాండ్ చేసారంటా!
ఒక్క క్షమాపణ మాత్రమె కాదండోయ్ , గుత్తివంకాయ కూర తలా ఒక్కొ బ్రహ్మచారికి హాట్‌బాక్స్‌లో పెట్టి ఇవ్వాలని కూడా డిమాండ్ చేసారండీ! అ టపాల తో, వాళ్ళని నలభీమ పాక ప్రవీణులు గా కూడా చేసానండి!
మగవాళ్లు వంట నేర్చుకోవడంలో ఉన్న లాభాలు చెప్తాను నోట్ చేసుకోండి. ఇష్టమున్న వంటలు చేసుకోవచ్చు.చేయడం రాదంటారా? పుస్తకాలు ఉన్నాయి, నా షడ్రుచులు, ఇంకా ఎన్నో బ్లాగులు,సైట్లు ఉన్నాయి. రెండు మూడుసార్లు చెడిపోయినా పర్లేదు అనుభవం వస్తుంది. ఒక సారి చెడ్డా, అదే కూర బ్రహ్మాండంగా రెండో మారు వస్తుంది. మెస్సులు, హోటల్లకు డబ్బు తగలేసే పని ఉండదు.
పెళ్ళయ్యాక కూడా ఆవిడ పుట్టింటికెళ్లినా, మీకు ఇష్టమైనది తినాలనిపించినా ఇంచక్కా వంటింట్లోకి ఎంటర్ అయిపోయి వంట చేసుకుని తినేయడమే. ఐనా వంట చేయడం బ్రహ్మ విద్యా? నలభీములదాకా ఎందుకు? ఈనాటి టిఫిన్ బండి ఐనా, చిన్న,పెద్ద, చుక్కల హోటల్లన్నింటిలో మగవారే కదా ఉండేది. ఆడవాళ్లు మీ ఉద్యోగాలు చేయగాలేంది మీరు ఈ వంట చేయడం ఒ లెక్కా? తలుచుకుంటే ఉఫ్ అని ఊదేయరూ? ఆలస్యమెందుకు? గరిట పట్టుకోండి బ్లాగ్ బ్రహ్మచారులు, అయిపోండి బ్లాగ్ పాక ప్రవీణులు!
ఈ టపా చదివే వారికి, ఏవైనా షడ్రసోపేతమైన 'క్రేజీ' కాంబినేషన్ చెబ్తారా ?
పూరీలు కాస్త ఎర్రగా కాల్చుకుని వేడి టీలో ముంచుకుని తింటే,, ఏ స్టార్ హోటల్ బిస్కిట్లు, బ్రేక్ ఫాస్ట్లు పనికిరావు.
మామిడి పండ్ల పానకం తయారు చేసి చల్ల పెట్టెలో పెట్టి . మండే ఎండాకాలంలో ,జిల్లుమనే పానకంలో వేడి పూరీలు కాని, చపాతీలు కాని ముంచుకుని తింటే నా సామిరంగా ఆ మజాయే వేరు.
పెరుగన్నంలో అప్పడాలు చిదుముకుని తినడం.
కమ్మపొడి అన్నంలో కలిపి గుండ్రటి ముద్ద చేసి..కంచంలో పక్కన ఆవకాయనూనె వేసుకొని..దానిలో ముంచుకొని తింటే..ఆహా!
చల్లపులుసులో కొత్తిమీర.. పచ్చిమిరపకాయ... ఆహా....
కందిపచ్చడిలో ఆవకాయ కలిపి తింటే..చెప్పలేం దాని రుచి
బోలెడంత వేరుసెనగ చట్నీ లో ఒక 'చిన్న' ఇడ్లి.."
కమ్మటి గడ్డ పెరుగులో వేడి వేడి జిలేబీలు? భలే ఉంటుంది. జిలేబీలు టీలో ముంచుకుని తినడం !
పెరుగు అన్నం లోకి ముద్దపప్పు...ఇడ్లి లోకి చారు....దోసెలు బెల్లం పులుసు..
ఇలా చెప్పుకుంటూ పోవచ్చండీ !
సంక్రాంతి పల్లెటూళ్ళలో చేసుకున్న అనుభవాలు మీకు వున్నాయా ?
నాకు పల్లెటూరి అనుభవం లేదు కాని పట్నం కబుర్లు చెప్తాను. నా చిన్నప్పుడూ సంక్రాంతి పండగంతా నాదే. మామూలుగా ఇంటి పని చేయని నేను సంక్రాంతి నెలరోజులు మాత్రం ముగ్గులు పెట్టేదాన్ని, పెళ్ళయ్యేవరకు కూడా. పండుగ నెలరోజుల ముందునుండే రకరకాల ముగ్గులు కలెక్ట్ చేయడం, ప్రాక్టీస్ చేయడం, స్నేహితుల వద్ద కూడా నేర్చుకోవడం ఇలా సరదాగా గడిచేది. రోజూ ఎనిమిదివరకు లేవని నేను ఆ నెలరోజులు చలి ఉన్నా కూడా
ఐదింటికే లేచి, శుభ్రం చేసిన వాకిలిలో రోజుకొక ముగ్గు వేయడమంటే భలే సరదాగా ఉండేది. చీకటిగా ఉన్నా భయమేసేది కాదు ఆ రోజుల్లో. అప్పుడప్పుడూ నేను ప్యాంటు షర్టు వేసుకుని ముగ్గు వేస్తుంటే అందరు వింతగా చూసేవారు. ముఖ్యంగా పాలకోసం వెళ్ళే మగవారు!~(వాళ్ళ కామెంటులు ,- ఆ ముగ్గులు చూసి , ..ఎన్ని రోజులైందో అంత perfect geometry చూసి లాంటివి విని నవ్వేసేదాన్ని!)
ఆ రోజుల్లో పతంగులు చాలా హుషారుగా ఎగరేసేవారు. ఆకాశం నిండా రంగు రంగు పతంగులు, అరుపులు , పిల్లలందరు డాబాలపైనే ఆ రోజంతా. ఇంకా పతంగులకు రక రకాల తోకలు కత్తిరించి పెట్టడం. కనుమ రోజు నేను మా తమ్ముళ్ళుకలిసి మిగిలిన ఆ రోజుల్లో సరదాలే వేరు!
మీ శ్రీ వారి పేరు , మరి వారి గురించి చెబ్తారా ?
ఆయన పేరా? అమ్మో భర్త పేరు ఎలా చెబుతారండి? పాపం కదూ? ఆయన ఫోటో సరియైనది లేకపోవడం వల్ల ఆయనకు సంబంధించిన వివరాలు ఇస్తున్నాను.
ఇంట్లో ఎప్పుడూ సీరియస్‌గా ఉన్నా, బయటికెళ్తే మాత్రం అందరితో సరదాగా జోకులేస్తూ, నవ్విస్తూ, నవ్వుతూ ఉంటారు.
ఎప్పుడైనా వంట బాగా లేకపోతే కోపంతో చిందులు తొక్కుతారు. బాగుంటే మాత్రం 'బా గుంది' అనరు. కామ్‌గా తినేసి వెళ్లిపోతారు.
మీ వారినీ అడిగామండీ, ఇదే ప్రశ్న, వారిచ్చిన సమాధానం చెప్పమంటారా!
చెప్పండి. అందులో ఏముంది. !
(జ్యోతి వారి శ్రీ వారు చెప్పింది - జ్యోతి కి మాత్రం ఇది చెప్పకండేం , అని వారు చెప్పింది-
నేను ఇంట్లో సీరియస్‌గా ఉంటాను అంటుంది. కాని తను ఎప్పుడు చూసినా ఆ బ్లాగుల్లో ఏదో బర బర రాసుకుంటూ, సీరియస్ గా వుంటుంది. ఏదో నిజంగా జరుగుతున్నంతగా లీనమై పోతుంది. ఎవరితోనూ మాట్లాడదు. పైగా వాటి గురించి ఇరుగు పొరుగు అమ్మలతో చర్చలు అదీ కంపూటర్ లోనే !
ఏదో పెళ్లయిన కొత్తలో వండిన కూరలు బావున్నాయంటే ఇక ప్రతీ రోజూ చెప్పాలా.అసలే ఆఫీసుకెళ్లే టెన్షన్.వంట బాగోకుంటే కోపం రాదా చెప్పండి ?)
మీకున్న బ్లాగ్ గుర్తింపు గమనించి, TRS వారు, మా నారా వారు, తమ తమ పార్టీ లకి 'అంతర్జాల ' బ్లాగ్ వాణి' గ ఉండమని రిక్వెస్ట్ చేసారంటా ?
బాగా చెప్పారండీ మీరు మరీను ! అది 'కోతల రాణి పెందరాళ కన్న కల ! అస్సలు ఈ రాజకీయాలంటేనే నాకు పడదు.
ఆ టపా రాసాక, అసలు ఒక్కసారైనా ట్రై చెయ్యొచ్చు గదా రాజకీయాల్లోకి, మా జ్యోతక్క అంటూ చాల మంది అడిగారు. ఎందుకండీ అని అడిగితే, మాకు జ్యోతక్క బాగా తెలుసు అని మేము చెప్పుకోవచ్చుగాడా అని చెప్పారు ! వాళ్ళ మాటలని నమ్మి నేను రాజకీయం లో వెళ్లి వుంటే!
మీరు 'శ్రీ వారలకు ' ఇచ్చే సలహా ?
"ఎం! మొగుడో ! ఏమో ! పెళ్ళానికి మూరెడు మల్లె పూలు తేడు ! మణులడిగానా , మాణ్యాలడిగానా ? అలిగిన ఇల్లాలిని మస్కా కొట్టడానికి మల్లెపూలకు మించిన సాధనం లేదేమో. ఈ కిటుకు ఎంతమంది భర్తలకు తెలుసు?
మధురమైన సుమధురమైన చల్లని సువాసనతో మరులు గొల్పే మల్లెపూలు మండే ఎండాకాలంలో ఎందుకే పూస్తాయి?
ఆలోచించి చూడండి. 'When the things go hot, ఓ చెండేడు మల్లెపూలతో మీ ఇంటి కెళ్ళి చూడండి. ఆ తరువాత మీరే 'హాయి హాయి' గా అంటూ పాడేసుకుంటారు !
మీరు కొత్త గా వచ్చె బ్లాగర్లకి ఇచ్చే సలహా ?
మీరు మీ రంగంలో అత్యుత్తమమైన విజయాలను స్వంతం చేసుకోవాలన్నా, యావత్ ప్రపంచం మన్ననలనీ పొందాలన్నా లక్ష్యాన్ని సాధించడంలో రేయింబవళ్ళూ కష్టపడడానికి తోడు మీ ప్రయత్నంలో వైవిధ్యతను ఆపాదించుకోవాలి.
ఫలానా వ్యక్తి ఫలానా విధంగా కష్టపడ్డాడు. కాబట్టి అదే మార్గాన్ని అనుసరిస్తే మనమూ సక్సెస్ అవుతాం అన్న ధోరణి మీ ఉనికినైతే కాపాడగలుగుతుందేమొ తప్ప మీకంటూ "మీకో" ప్రత్యేకత ఆపాదించ లేరు. కాబట్టి మీ కంటూ ఓ ప్రత్యేకతని కలిగించుకోండి. The idea is that "being different" from the set path.
మా ఏడుకొండల వాడి గురించి మీ అభిప్రాయం ?
మాకు పాతికేళ్ళ నుండి ప్రతి సంవత్సరం తిరుపతి కి వెళ్ళే అలవాటు ఉంది. అలా అయినా కాస్త విహార యాత్ర లాగా ఉండేది. తిరుపతి నుండి మరి కొన్ని ప్రదేశాలు కూడా వెళ్ళే వాళ్ళం.తిరుపతి ప్రయాణం అంటే ఒక గొప్ప అనుభూతి ఉండేది. అప్పట్లో ఇచ్చే ప్రసాదాలు ఇక చెప్పనక్కరలేదు. ఇరవై పెద్ద లడ్డూలు, ఇరవై గారెలు, ఇరవై వడలు, అన్న ప్రసాదాలు ( పులిహోర, చక్రపొంగలి, దధ్యోజనం, పొంగలి) ఇలా ఇచ్చేవారు. ఆ సువాసనలు ఇప్పుడేవి...అలా నింపాదిగా స్వామిని చూసే అదృష్టం కోసం ఎన్ని కష్టాలైనా పడొచ్చు అనిపించేది. ఎన్.టి.ఆర్ కాలంలో ఐతే అక్కడ చాలా స్ట్రిక్ట్ గా ఉండేది. ముఖ్యంగా అప్పటి E.O ఫై.వి.ఆర్. కే ప్రసాద్ గారు తిరుమలలో అవినీతి అనేది మచ్చుకైనా కనపడకుండా చేసారు.
మరి ఇప్పుడు తిరుమల అంటే అవినీతి సామ్రాజ్యం ఐపొయింది. సిఫారసులు కావాలి. సరే అలా ఖర్చు పెట్టి వెళ్ళినా దేవుడిని కనీసం ఒక్క నిమిషం కూడా చూడనివ్వరు.మొదటి ద్వారం దగ్గరనుండే పదండి పదండి అంటూ తోసేయడమే. కలికాలం అంటే ఇదే మరి. భక్తులు డబ్బులు వేయగానే రొంటిలో దోపుకోవడం. ఇదీ తంతు. కళ్యాణం ఐతే మరీ మొక్కుబడిగా చేస్తున్నారు. రెండు లడ్డులు, రెండు గారెలు ఉన్నా కవర్ మన మొహాన పడేసి , తాంబూలాలిచ్చేసాం ఇక తన్నుకు చావండి అన్నట్టు మూటా ముల్లా సర్దుకుని వెళ్ళిపోతారు. ఇపుడు తిరుమలలో పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. మొత్తం కమర్షియల్ . ఇన్ని కష్టాలుపడి వేంకటేశ్వరుడిని చూడాలని వెళ్తే లాభమేంటి ? కళ్ళారా చూడనీకుండా తోసేయడం. మరి ఎందుకు వెళ్ళడం?? ఇందు గలడందు లేడను సందేహము వలదు . చక్రి సర్వోపగతుండు. అని నా మనస్సుకు చెప్పెసుకున్నా.
మీ కంటూ వున్న కలలు ?
హైదరాబాద్ మహానగరంలో ఉన్న నీటి సమస్య తెలియనిదెవరికి. రోజుకు అరగంట వచ్చే నీళ్ళతో ఎన్ని అవసరాలు తెర్చుకోవాలి. అప్పుడే బట్టలు ఉతుక్కోవడం, గిన్నెలు కడుక్కోవడం, ఇంకా పట్టిపెట్టుకోవడం.. హాయిగా స్నానం చేసే అదృష్టం కూడానా. బకెట్ నీళ్ళతో స్నానం పూర్తి చేసుకోవాలి. అదే ఈతకొలను, వానజల్లు అనుకుంటూ. ఐనా " జలకాలాటలలో గల గల పాటలలో ఏమి హాయిలే హలా! అహ ఏమి ఆ ఆనందం !
కొండల నడుమ ఎటువంటి శబ్ద కాలుష్యం లేని చోట, చుట్టూ పచ్చని చెట్ల మధ్య ఒక చిన్ని ఇల్లు.ఇంటివెనక ఒక ఈత కొలను. ఎండాకాలంలో చల్లగా, చలి,వాన కాలంలో గోరువెచ్చగా ఉండే నీళ్ళు.హాయిగా పాత పాటలు వింటూ ఒక్కదాన్నే ఈత కొడుతూ, పక్కనే ఓ షాంపేన్ బాటిల్, వేయించిన జీడిపప్పు పెట్టుకుని సిప్ చేస్తూ (మావారికి చెప్పకండే) ఎంజాయ్ చేయాలని నా తీరని (అస్సలు తీరే చాన్సే లేని) కోరిక. కలలోనే కదా నో ప్రాబ్లం.!
బ్లాగడం గురించి మీ అభిప్రాయం ?
బ్లాగడం ఇప్పుడో నిత్యావసరం. అందులోనూ తెలుగువారికి అన్నంలో ఆవకాయంత అత్యవసరం! ఆలస్యమైపోయినా ఫర్లేదు ... వెంటనే బ్లాగ్ మొదలెట్టండి! అవసరమైతే బ్లాగ్ గురువు చూడండి!
మీ పుణుకులు చాలా పాపులర్ ! మచ్చుకకి ఒక్కటి చెప్పండి ?
ఒక కూరగాయ అందరినీ చాలా మర్యాదగా తిడుతుందంట. ఏంటది???
మనిషి ఎలా బతకాలంటారు ?
మనిషి ఎలాగయినా బ్రతకవచ్చు కానీ మానవత్వ విలువలను కాపాడుతూ బ్రతకటమే నిజమయిన బ్రతుకు.
అన్ని దానాలలో ఏది గోప్పదానం అనుకుంటారు ?
ఆకలి అన్నవాళ్ళకి అన్నం పెట్టడం, దాహం అన్నవాళ్ళకి నీళ్ళివ్వడం ప్రతి మనిషి చేయవలసిన కనీస ధర్మం. అన్ని దానాలకన్నా అన్నదానం గొప్పదని అనుకుంటాను.
ప్రమదావనం లో బ్లాగులు ఇవీ రాసుకోవడమేనా? లేక ఇంకేమైనా చేస్తుంటారా మీరు ?
ప్రమదావనం అనేది మహిళా బ్లాగర్ల గ్రూపు. ఇందులో సభ్యులు సహాయ కార్యక్రమాలు చేస్తున్టారండీ.
కూడు, గూడు, గుడ్డ ప్రతి ఒక్కరికి అవసరం. కాని ఎందరో అభాగ్యులకు ఇది అందని ఫలమే.. కూడు ఎలాగో దొరికినా, గూడు లేకున్నా ఎక్కడ కాసింత జాగా దొరికితే పడుకుంటారు.. కాని గజ గజ వణికించే చలిలో దుప్పటి లేకుండా పడుకునే వాళ్ళు ఎంతో మంది మనకు కనిపిస్తారు. హృదయాన్ని కదిలించే ఈ దృశ్యాన్ని చూసి, చలించి, వారికి ఇతోదికంగా సహాయం చెయాలని ప్రమదావనం సంకల్పించింది.
ఐతె ఎవరు వారు? ఎచటి వారు? అనే వివరాలు అడగకుండా, చెప్పకుండా నిశ్శబ్దంగా సహాయం చేయాలని నిర్ణయించాము. పదివేల విలువైన ఉలెన్ రగ్గులు కొని ఈ కార్యక్రమం నిర్వహించాము.
ఉదయం మూడుగంటలకు బయలుదేరి ఫుట్ పాత్ ల మీద, దుకాణాల ముందు చలికి ముడుచుకుని పడుకున్నవారికి నిద్రాభంగం కలగకుండా దుప్పట్లు కప్పేసి వచ్చేసాము.
ఈ మీ పుట్టిన రోజున, పాతకాలపు మిత్రులు, బ్లాగర్లు తాత్కాలికం గా బ్లాగుల నిలిపిన వారి ని మీరెలా స్వాగతిస్తారు ?
రండి,రా రండి పాత బ్లాగు వీరులారా,
టపాల రెక్కలపై ఎగిరిరండి.
చిరకాల అనుభవ శూరులారా,
కొత్త వారలను కలుసు కొండీ, కలుపుకోండీ!
మీ కిదే మా మనసుల పునః స్వాగతం ! సుస్వాగతం !
జ్యోతి గారు,
మామూలు గృహిణి స్థాయి నుండి మీరు బ్లాగ్లోకంలో ఎంత గొప్ప స్థానానికి చేరారో ఇంతకాలం మీ ద్వారా సాయం పొందిన వారికి, మీ మంచితనం తెలిసిన వారికి తెలుస్తుంది. మీలో కష్టించి పనిచేసే స్వభావం మాలాంటి బ్లాగర్లకు ఆదర్శం. మరోసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. వెలిగే దీపం మరిన్ని దీపాల్ని వెలిగిస్తుందన్న మాట నిత్య సత్యం. చురుకుదనం,ప్రోత్సాహం,అణకువ,మర్యాద,విఙ్ఞానం,దూరదృష్టి, సమయసద్వినియోగం ఇలాంటి పదాలు చూడాలనుకున్న వారికి మీరు ఒక నడయాడే ఉదాహరణం.
నేటి మీ జన్మదినం,కోటి వరాల కానుక కావాలని,తల్లిదండ్రులు, గురువుల దీవెనలు మీపై కలకాలం వర్షించాలని, మిత్రుల అభినందనలతో , కుటుంబమనే నందనవనంలో , నిత్యకళ్యాణం - పచ్చతోరణం గా జ్యోతిగా కాంతులు నింపాలని మీ పెదాలపై చెదరని చిరునవ్వు తాండవమాడాలని.... మనసారా ఆకాంక్షిస్తూ,
శుభాకాంక్షలతో
Concept by Zilebi
జేకే - JUST KIDDING !
ABN - Active Bloggers Network
- ఆంధ్ర జిలేబి - ఇంకెవరు నేనే !
చీర్స్
జిలేబి.
అసలు మీరు భలే వ్రాసేస్తారు! నిజంగానే ముఖాముఖీ జరిపి వ్రాస్తారో లేక వాళ్ళ బ్లాగుని క్షుణ్ణంగా పరిశీలించి వ్రాస్తారో కూడా తెలియదు నాకు!
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteiam new how to join piase sand me
ReplyDeletejilebi is sweet even it is hot.జ్యోతి గారితో ఇంటర్యూ చాలాబాగుంది. క్లుప్తంగా జ్యోతిగారిని బాగా పరిచయం చేసారు. జ్యోతిగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేయండి.
ReplyDeleteనాలుగురోజుల్నించి కనపడడంలేదేమీ అనుకున్నా, ఇదా సంగతి.....
ReplyDeleteవంటలు, వార్పుల గురించి వ్రాసుకునేవాళ్ళకి ఇంత పబ్లిసిటీ అవసరమా? నేను మహిళా బ్లాగర్ల బ్లాగుల్లో కల్పన గారి బ్లాగ్ మాత్రమే చదువుతుంటాను.
ReplyDeleteమిగితా మహిళా బ్లాగర్ల బ్లాగుల్లో ఉండేవి వంటలు, వార్పులు, కుట్లు, అల్లికలు లాంటివి మాత్రమే. మహిళలు అలాంటివాటికే ప్రాధాన్యత ఇవ్వడం మహిళాభ్యుదయానికి వ్యతిరేకం. గతంలో గూగుల్ బజ్‌లో నాకూ, జ్యోతికీ మధ్య గొడవ జరిగింది. నన్ను బ్లాక్ చెయ్యమంటూ గార్ధభఘోష కూడా చేసింది. ఆమెని జ్యోతక్క అంటూ కొండ మీదకి ఎక్కించడం నాకు ఏమాత్రం నచ్చలేదు.
జ్యోతి గారి పరిచయం బావుంది..
ReplyDeleteధన్యవాదాలు జిలేబిగారు. నేనే మీ ఇంటర్యూ తీసుకుందామనుకుంటే మీరు నా గురించి రాసేసారు. చాలా హోమ్ వర్క్ చేసినట్టున్నారే.. Thanks a Lot..
ReplyDeleteచాలా బాగా రాసేరండీ జ్యోతి గారి గురించి :)
ReplyDeleteజ్యోతి గారి గురించి చక్కగా చెప్పారు. ఇంత బాగా research చేసి వ్రాసినందుకు అభినందనలు.
ReplyDeleteజ్యోతి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
జ్యొతి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు .
ReplyDelete@రసజ్ఞ గారు,
ReplyDeleteఇది జ్యోతి గారి బ్లాగ్ముఖీయం! సో, ఇందులో ముఖాముఖీ వుందనే అనుకుంటాను !
చీర్స్
జిలేబి.
@శైలజ గారు,
ReplyDeleteవెల్కం. కొత్తదనానికి నెరవ నేల, జ్యోతి గారి బ్లాగ్ గురువు బ్లాగ్ చూడండీ,బ్లాగడం లో సుళువులు మీ సొంతం!
చీర్స్
జిలేబి.
కష్టే ఫలే శర్మ గారికి,
ReplyDeleteచాలా కరెక్టుగా కనబెట్టేసారు! కామెంట్లకి జ్యోతి వారికి శుభాకాంక్షల తో ఈ టపా మీకు నచ్చినందులకు!
చీర్స్
జిలేబి.
@ జ్యోతిర్మాయీ వారికి
ReplyDeleteనెనర్లు. ఈ మధ్య జిలేబి వారి బ్లాగు అంతా 'జ్యోతి' మాయ
గా వున్నది !
@సుభ గారు,
కడలి కున్న వైశాల్యం గమనిన్చినందులకు నెనర్లు !
@బులుసు మాష్టారు గారికి,
నెనర్లు. అంతా బ్లాగు మాయ !
@మాలాకుమార్, ప్రవీణ్ శర్మ గార్లకు
నెనర్లు.
చీర్స్
జిలేబి.
@బ్లాగ్ జ్యోతి గారికి,
ReplyDeleteధన్యవాదములు. మీకు టపా నచ్చినందులకు !
హోం వర్క్ మీ విషయం లో మాత్రం ఓ సీరియస్ ఆర్ట్ అయిపొయింది!!!!
మీ పుట్టిన రోజు విశేషాలు టపా ఎప్పుడు ?
చీర్స్
జిలేబి.
@ప్రవీణ్ గారు,
ReplyDeleteమా కోర మాన్దేల్ ఎక్స్ప్రెస్స్ ఓడిస్సా లో ఆగినప్పుడు, అక్కడి ఫ్లాట్ ఫారం మీది వేడైన పూడీలు నాకు భలే నచ్చుతుందండి. ఇక అక్కడ్నించి మొదలు మేము కోల్కత్తా చేరుకునేదాక వేడి వేడి పూడీలు !
నెనర్లు.
చీర్స్
జిలేబి.
@ప్రవీణ్ మహా ప్రభో,
ReplyDeleteనన్నోగ్గేయ్యండి! తప్పై పోయింది. మీ దే నెక్స్ట్ !
చీర్స్
జిలేబి.
మీ సునిశిత శక్తికి జోహార్లు హాట్ హాట్ జిలేబి గారు:) ఇలాగే 'మీ ఫన్ ఆర్ట్ విత్ జెకె' కంటిన్యూ చేసేయండేం. సరేనా:) మేము ఇంకా బాగా ఎంజాయ్ చేస్తూ పోతాం. జ్యోతక్క గారికి నేను కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తున్నాను.
ReplyDelete@జయ గారు,
ReplyDeleteమీ ప్రోత్సాహములకు నెనర్లు! తప్ప కుండా ఓ ఫన్ ఆర్ట్ కంటిన్యు అవుతుంది మీ కోరిక మేరకు ! రాబోయేది ఎవరో మీకు ఇప్పుడే గ్రహించేసి వుంటారు అనుకుంటాను !
చీర్స్
జిలేబి.
chaalaa, chaalaa baagaa vraasaaru .. keep it up jilebi gaaru ..............
ReplyDelete@రుక్మిణి దేవి గారికి,
ReplyDeleteస్వాగతం బ్లాగుకి. మీకు జ్యోతి గారి బ్లాగ్ముఖీయం నచ్చినందులకి నెనర్లు. కీప్ విసిటింగ్ అగైన్ !
చీర్స్
జిలేబి.
సూపర్ పోస్ట్.. భలేగా కూర్చారండీ ప్రశ్నలూ సమాధానాలూ.. :))
ReplyDelete@మధురవాణీ గారు,
ReplyDeleteనెనర్లు, జ్యోతి భవ్య బ్లాగ్ ఆ కూర్పు కి పునాది.
చీర్స్
జిలేబి.