Friday, December 2, 2011

కామెంటు కోసం ఒక టపా రాద్దామని !

అందరూ టపా కి కామెంటు రాస్తారు. సరే, కొంత వెరైటీ గా కామెంటు కోసం ఒక టపా రాద్దామని !

కామెంటడం అన్నది ఒక కళ. అది బ్లాగ్ లోకం లో కొందరికి అచ్చి వచ్చిన విద్య.

మరికొందరికి చాలా కామెంటాలని ఉంటుంది.

 కాని సమయాభావం వల్లో, సాంకేతిక కారణాల వల్లో, చిన్నగా రాసి ఊరుకుంటారు.

ఇవ్వాళ బ్లాగ్ లోకం లో జల్లెడ వేసామంటే ఎక్కువగా కనిపించే కామెంటు రెండు చుక్కలు ఒక బ్రాకెట్టు ! :)

ఆ తరువాయి - కనిపించే చాలా కామన్ కామెంటులు - సూపెర్, కెవ్వు, కేక ! హ హ హ , hahahaha ,
lol...ఇలా చిన్ని చిన్ని పదాలతో కామెంటు తారు.

సో ఇవన్ని తెలుగు లోకానికి బ్లాగ్ లోకపు సరి కొత్త పదాలు

కొన్ని ఇప్పట్లో ఉన్న తెలుగు పదాలే, కొత్త అర్థం ఆపాదించుకోవడం కూడా కద్దు. ఉదాహరణకి , కెవ్వు కేక - ఈ పదం టపా సూపెర్ అన్న అర్థం లో వాడతారనుకుంటా . అంతర్జాలం లో మరిన్ని సరికొత్త పదాలు పోను పోను వస్తూంటాయి అనుకుంటాను.

కొంత కాలం పోయాక , నిఘంటువు ఎవరైనా ప్రచురిస్తే , ఈ కొత్త పదాలు ఆ నిఘంటువులో వస్తాయేమో ? మొదట్లో కొంత విముఖం గా ప్రచురించినా పోను పోను వేరు వేరు ప్రచురణలలో కొత్త అర్థాలతో వస్తాయేమో !

మరో పోకడ, టపా కన్నా సుదీర్ఘ మైన కామెంటు- వ్యాఖ్య ! ఇది టపా కన్నా చాంతాడంత మరో టపా అంత నిడివి ఉండటం కద్దు.

కొన్ని చమక్కులు,
కొన్ని కవితలు,
కొన్ని పద్యాలు,
కొన్ని చేణుక్కులు,
కొన్ని సమస్యా పూరణలు
కొన్ని కొంటె దనాలు
కొన్ని ఇన్ఫర్మేటివ్
వెరసి నేటి బ్లాగ్ కామెంటులు
ఓ విన్నూత్న సాహితీ ప్రక్రియ !

ఇప్పటి దాకా రానిది చైను కథానిక, కామెంట్ల ద్వారా ! (టపా ల లో ఇంతకు ముందే గొలుసు కథలు వచ్చేయని ఒక మారు జ్యోతి గారు చెప్పారు - సో , కామెంటుల లో ఇప్పటిదాకా ఈ ప్రయత్నం రాలేదనే భావిస్తాను !


చీర్స్
జిలేబి.

20 comments:

 1. నమస్కారం వరూధిని గారు,

  ఇప్పుడు ఏపోస్ట్ కన్నా కామెంట్స్ అదేవ్యాఖ్యలు రాకపోతే బాధపడిపోతారుజనాలు.
  కొత్తగ facebook ఒక్కటి వచ్చింది కదా
  దానిలో ఏదో ఒకవిషయము రాయడం దానికింద కొన్నివందల వ్యాఖ్యలు అవి లేకపోతె అది పరమ సుద్ధ వేస్ట్ పోస్ట్ అనే భావన.
  ఇదో ప్రభంజనం(అదే new wave) అన్నమాట. మనంకూడా ఇందులో భాగస్తులమే.
  అందుకే మీ పోస్ట్ కి నా వాఖ్య.

  ఇదో సరదా!!!!!! ఎవ్వరి మనసు నొచ్చుకోకుండా!!!

  ReplyDelete
 2. ఇప్పుడు మీరు వ్యాఖ్య కోసం టపా రాసారా ఐతే?
  సూపెర్, కెవ్వు, కేక ! హ హ హ , hahahaha , lol.. ;)

  ReplyDelete
 3. హా హా హా నేను కామెంట్ చెయ్యను కదా!

  ReplyDelete
 4. మీకు కూడా రెండు కెవ్వులు, నాలుగు :) :) :) :)

  ReplyDelete
 5. విరిసిన అరవిందం గారికి (ఎ పేరో తెలీయటం లేదు - కాబట్టి ప్రొఫైల్ పేరుతో సంబోధన!)

  స్వాగతం. మీకు ఈ టపా నచ్చినందులకి నెనర్లు. మీరన్నట్టు ఇదో సరదా - వ్యాఖ్యల సంఖ్య బట్టి టపా గట్టిదనం అన్న మాట ఆలోచింప దగ్గ మాట. ఈ e లోకం లో అన్నీ వైటు బట్టి ఉంటున్నాయేమో !

  చీర్స్
  జిలేబి.

  ReplyDelete
 6. సుభ గారు,

  కామెంటు మీద టపా అని రాసి ఉండాలేమో ! కామెంటు కోసం అన్న టపా అర్థం ఐపోయినట్టుంది ! అయినా మళ్ళీ మీరు ఆ కామన్ కామెంటు లు అన్నీ కలబోతగా రాయడం మరో విశేషం !

  ReplyDelete
 7. తెలుగు పాటలు గారు,

  మీరు తెలుగు పాటల లాగే మరీ కొంటెగా జవాబిచ్చారు! తెలుగు పాటలలో అవునంటే కాదనిలే కాదంటే అవునని లే గుర్తుకొస్తోంది ! నెనర్లు.

  ReplyDelete
 8. ఆ సౌమ్య గారు,

  మీ దవా, దహా మొ లగు వాటిని ఎప్పుడు మీరు 'కామెంటపా ' బోతారు? రెండు 'కేకులు' నాలుగు చుక్కల బ్రాకెట్లు కి నెనర్లు.

  ReplyDelete
 9. నిజం చెప్పేరు. ఈ కేకలు కెవ్వుకేకలూ ద. హా అవన్నిటికీ నేను కూడా మెలిగా అలవాటు పడుతున్నా. ముందు అవేమిటో కూడా తెలిసేవి కావు.
  క్రిష్ణవేణి

  ReplyDelete
 10. హమ్మయ్య, కృష్ణవేణి గారు,

  మొత్తం మీద కామేన్టటం వచ్చేసినట్టే వున్నది మీకు. భారారె టపాలలో ఓ మారు చూసిన కామేన్టలేక కష్టపడ్డ కృష్ణవేణి మీరే అనుకుంటాను!
  అప్పుడే ఏముంది. ముందుంది 'దురదగొంటాకుల పండగ! ఆల్ ది బెస్ట్!

  చీర్స్
  జిలేబి.

  ReplyDelete
 11. ఆహా, అది అచ్చు నేనే అంటే నేనే. కామెంటడం మరీ కొత్త కాదు కానీ ఎక్కువ అలవాటు లేదు. అయినా ఆ దురదగుంటాకుల పండగ నాకొద్దు బాబోయ్. కోరి కోరి తల గోరికించుకోవడం ఎందుకూ?
  క్రిష్ణవేణి

  ReplyDelete
 12. 'kri' అనబడు కృష్ణవేణి గారు,

  అడుసు తోక్కేసారు, కామేన్టడం కోసం. ఇక దురదగొంటాకుల పండగ కూడదనుకుంటే కష్టమే! వేచి చూడండి, మీ గుడ్ లక్ ఎంత ఉందొ మరి !

  చీర్స్
  జిలేబి.

  ReplyDelete
 13. "కామేన్టలేక కష్టపడ్డ కృష్ణవేణి " - ప్రాస బాగుంది. కానీ కష్టపడ్డానికి ఇష్టం ఉండాలి కదా కామెంటాలంటే!
  'kri' అనబడు కృష్ణవేణి గారు"- కాదు. క్రిష్ణవేణి అనబడే "క్రి"ని నేను మీరు వరూధిని అనబడే జిలాబీ ఎలాగో అలాగే.
  చీర్స్

  ReplyDelete
 14. I am disapponted I assumed that you will come be ready with quick come-back. Though I am not very old to your blog( as it is- for no one's) I expected brickbrats for my comment here.
  Krishnaveni

  ReplyDelete
 15. కృష్ణవేణి అనబడు 'kri' గారు,

  మీరు మరీ దురదగొంటాకు ఎఫ్ఫెక్ట్ కి బలి ఐపోయినట్టున్నారు.! పిలిచి మరీ గోక్కోవాలనుకుంటే ఎలా చెప్పండి! హతోస్మీ!

  మరీ అడిగారు చెబ్తాను, జిలేబి బ్రిక్ బాట్ ఇవ్వజాలదు. తనకి జిలేబి లు పంచడం మాత్రమె తెలుసు!

  చీర్స్
  జిలేబి.

  ReplyDelete
 16. జిలేబి అనబడు వరూధినిగారూ,దురదగొంటాకు అంటే నాకు తెలియదు.అయినా జిలేబీలు గుండ్రం గుండ్రంగా మెలికలు తిరిగి ఉంటాయని అర్థం. దీనికి వేరేదో ఉందనుకోండి. ఇమరతీ కీ తరహ్ అని. అది నిజానికి ఎక్కువ టేడామేడాది.ఇంకా ఉన్నాయి అలాంటిని.
  అయినా నేను మీరు పిలిస్తే గొకించుకొవడానికి ఎందుకు సిద్ధంగా ఉండాలిట?
  జిలేబీలు నాకు పడవు. అతి తీపి.

  ReplyDelete
 17. క్రి గారు,

  మొత్తం మీద జిలేబీలు పడని రెండవ వారు మీరు.! ఇదే వాక్యం కొన్ని రోజుల మునుపు మరెవరో కూడా అన్నారు. ! ఎం చేద్దాం. ఐ హేట్ జిలేబి టపా వెంటనే చదవాల్సిందే !

  చీర్స్
  జిలేబి.

  ReplyDelete
 18. అయ్యో జిలేబీలు పడవని కాదు. పడకపోతే మీ టపాలు ఎలా చదివి తీరిగ్గా కామెంటుతున్నాను? తినడానికే మరి అతి తీపి.
  చీర్స్
  క్రిష్ణవేణి

  ReplyDelete
 19. kri గారు,

  నన్ను వదిలెయ్యండి, నీ నీ ఆటకు రాలేను ! అమ్మ బాబోయ్, కాలికి వేస్తె మెడకి, మెడకి వేస్తె కాలికి వేస్తున్నారు మీరు! మీరే నెగ్గారు ! జిలేబి నచ్చిందన్నారు అదే పది వేల జిలేబీలకి పెట్టు.

  చీర్స్
  జిలేబి.

  ReplyDelete
 20. అయ్యో జిలేబీగారూ, నేనేదో హాస్యానికి రాసినందుకు మీరు సీరియస్గా తీసుకున్నట్టున్నారు. అలా అనుకోలేదు. మిమ్మల్ని గనుక నొప్పిస్తే క్షంతవ్యురాలిని.
  క్రిష్ణవేణి

  ReplyDelete