Monday, December 5, 2011

శ్రీ రామరాజ్యం నేను చూడను గాక చూడను !

అయ్య బాబోయ్ ,

బ్లాగ్ లోకం లో ఎన్నెని టపాలు శ్రీ రామరాజ్యం పై

ఇన్ని చదివాక నా తెలివి మరీ ఎక్కువై పోయింది.

సినిమా చూడ్డం మరో ఖర్చు ఎందుకు?

ఫ్రీ గా ఇన్నిన్ని టపాలు చదివేక, మొత్తం చిత్రం కళ్ళ ముందు ఫ్రీ గా వచ్చేసింది.

నేను సినిమా చూడను, రివ్యూలు  చదువుతాను.  అంతే !

(నేను హార్లిక్స్ తాగను , తింటాను  అని మా మనవుడు అంటే , వీపు మీద విమానం మోగుతుందిరా మనవడా అన్న మాటలు గుర్తుకొచ్చి.... మనకూ ఎవరైనా విమానం మోత పెడతారేమో, ఇక్కడ్నించి వెంటనే పరారై పో జిలేబి!. )

చీర్స్

జిలేబి.

6 comments:

 1. మా చేత అదే చేయిస్తున్నారుగా

  ReplyDelete
 2. పోస్టుకు శర్మ గారి కామెంట్ బాగుంది.

  ReplyDelete
 3. ఏంటీ మీకు మనవడు కూడా ఉన్నాడా ?

  ReplyDelete
 4. వరూధిని గారు.. శ్రీ రామరాజ్యం.. మొదట నేను కూడా అలానే అనుకున్నాను మరి చూడలేనంత గా లేదు ఒకసారి చుడండి

  ReplyDelete
 5. శ్రీ రామరాజ్యం నిన్ననే చూసాను నాకు మరి అంత బాగా ఎమి నచ్చలేదు నా అబిప్రాయం ఎమిటంటే శ్రీ రామపట్టాబిషేకం కంటే ముందు కథ బాగండునేమో!

  ReplyDelete
 6. కామేన్టిన శర్మ గారికి, ఆ వ్యాఖ్య బాగుందన్న పల్లా కొండల రావు గారికి నెనర్లు.

  @భాస్కర్ గారు, మీకు ఆ సందేహం ఏల? మనుజుడై పుట్టి న ఈ భవభందములు ఉండనే ఉండును. అంతర్జాలం లో రాయు వారు మానుజులే కదా !! నెనర్లు.

  @తెలుగు పాటలు గారు,

  చూడమని సలహా ఇచ్చినందులకు ధన్యోస్మి ! చూడవలె నని నన్నుడగ వలెనా, చూచి అది నభూతో నభవిష్యతి అన్న చిత్రం గా భావించడం కూడా జరిగింది. నయనతారానందం బాపురే రమణీయం, శ్రీ రామరాజ్యం !

  @రమేష్ చీర్ల (ఈ చీర్ల చీర్స్ కి తెలుగు అనువాదమా ?) గారు,

  మీ అభిప్రాయాన్ని బాపు గారి కి తెలియజేశాను. వారు రమణ గారికి ఈమైలు ఫార్వార్డ్ చేసానని మీకు చెప్ప మన్నారు. ఆ ఈ మెయిలు కి సమాధానం వస్తే తెలియజేస్తామని కూడా చెప్పారు. !

  చీర్స్
  జిలేబి.

  ReplyDelete