Thursday, July 26, 2012

వయ్యారాలు పోయిన వరూధిని ప్రవరాఖ్య !

అమ్మాయి వరుడి ముందు బుట్ట బొమ్మలా ఉన్నది

వరుడు అమ్మాయి తలెత్తి చూస్తుందేమో అని వేగిర పడుతున్నాడు

అమ్మాయి సిగ్గు మొగ్గై ఉన్నది.

మనసు ఆరాట పడు తోంది, తల పైకెత్తి చూడొచ్చు గా?

ఊహూ.. సంకోచం ఆందోళన కలగలసిన చూపుల సమయం

అమ్మాయ్ ఓ మారు తలెత్తి చూడవమ్మా అబ్బాయి నీ వైపే చూస్తున్నాడు , ఓ ముత్తైదువ ఉవాచ.

ఊహూ.

సీతా కల్యాణం అయిపోయింది.

పందిరి మంచం మీద అమ్మాయి చుబుకం పైకెత్తి అబ్బాయి కనులలో కనులు కలిపాడు.

వరూధిని వయ్యారాలు పోయింది!

ప్రవరాఖ్యుని కౌగిలి లో కరిగి పోయింది.


భాగం రెండు

'హాయ్ ప్రవర్ హౌ ఆర్ యు యార్ '

ప్రవర్ అమ్మాయి పలకరింపుతో బెరుకు పడ్డాడు.

అమ్మాయి కిసుక్కున నవ్వింది.

'నిన్నే పెళ్ళాడుతా తప్పక ' అమ్మాయి అబ్బాయి బుగ్గ గిల్లి వెళ్ళింది.

అబ్బాయి సిగ్గు మొగ్గయ్యేడు.

పట్టు బట్టి, పంతం బట్టి అమ్మాయి అబ్బాయిని స్వంతం చేసుకున్నది.

సీతా కల్యాణం అయింది

పందిరి మంచం మీద అబ్బాయి  చుబుకం పైకెత్తి అమ్మాయి  కనులలో కనులు కలిపింది.

ప్రవరాఖ్యుడు  వయ్యారాలుపోయాడు

వరూధిని కౌగిలి లో కరిగి పోయాడు!

సర్వ భూతేషు యేనైకం భావమవ్యయమీక్షతే!


చీర్స్
జిలేబి.

6 comments:

  1. హ హా...భాగం రెండు లో ఇంత మార్పా...
    మూడో భాగమెలా ఉంటుందో ;)
    బాగుంది.

    ReplyDelete
  2. జంబలకిడిపంబ

    ReplyDelete
  3. నిన్నటిదానికి ఇది రివర్సా! :)

    ReplyDelete
  4. అవును అవును కాలం మారింది. మనం కూడా కాలానికనుగనంగా మారాలి తప్పదు

    ReplyDelete