పిచ్చాపురం లో గొర్రెల మందల ని మేపుకుంటూ తన మానాన తాను బతికేసు కుంటున్న మందలోడు ఓ తెల్లారి మందల్ని బుజ్జగిస్తూ, గదమాయిస్తూ , చిన్ని బెత్తం తో పచ్చిక కోసం బయట పడ్డాడు.
నోట్లో కడా మార్కు బీడీ, చేతిలో బెత్తం, పై కెగ గట్టి న కొల్లాయి, ఓ బనీను 'సొగ్గుడ్డ' మొత్తం మీద పిచ్చాపురపు పిచ్చి మారాజు వాడు.
తినడానికి ఉంటే తింటాడు. ఎవరైనా పిలిచి అన్నం పెడితే బువ్వ తిని బ్రేవ్ మని 'బాగుండా దమ్మా బువ్వ' అనడం వాడికి తెలిసినది . అది ఎట్లాటి బువ్వ అని వాడికి పట్టింపు లేదు. కవళం పెట్టిన తల్లి కనకాంగి అంతే.
ఇట్లాటి పిచ్చి మారాజు కి అవ్వాళ ఆ వైపు కారులో వెళ్తూ ఓ సూటూ బూటూ వేసుకున్న ఆసామి కారులో వాడి మందలకి అడ్డం పడ్డాడు.
'కంట్రీ బ్రూట్ ' అన్నాడు కారు దిగ కుండానే ముఖం చిట్లించి సూటూ బూటూ వేసుకున్న ఆసామి.
మందల దొర నవ్వాడు. ఆసామి ఏమన్నాడో తెలీదు గాని వాడి సూటూ బూటూ వాడి కి బాగా నచ్చింది. సోగ్గా ఉన్నాడే అని అనుకున్నాడు.
మందలు దారి ఇవ్వలే. కారు దిగేడు ఆసామి. కుర్ర వాడి లా ఉన్నా వాడి పోయిన చెట్టు కొమ్మ లా ఉన్నాడు. ముఖం లో తెలియని వ్యధ.
ఆసామి మిథ్యా లోకపు ఐటీ మానవుడు.
బెంగుళూరు మహానగరం లో ఆనాటి బిజినెస్ మీట్ ఫ్లాప్ అవడం తో ఏ పొద్దుట పూటో ఆఫీసు నించి బయట పడి చికాగు గా రోడ్డు మీద పడి దిక్కు తెలీక డ్రైవ్ చేస్తూ అప్పటి దాకా పిచ్చాపురం అని ఒకటుందని కూడా తెలీకుండా ఉన్న వాడు,
అసలు ఐటీ లోకం అంటూ ఒకటి ఉందని దాంట్లో సూటూ బూటూ వాళ్ళు అప్పుడప్పుడు అర్ధ చడ్డీ లతో కూడా ఆఫీసు కొచ్చి పనిచేసే వాళ్ళు, పదివేళ్ళు , బుర్ర మాత్రం ఉండే వాళ్ళు, బడా బడా కార్లు ఉన్న వాళ్ళు, ఇత్యాది బహు విశేషాలు కల వాళ్ళు ఉంటారని తెలీని మందల దొర మరో వైపు,
వీళ్ళిద్దరూ ఆనాటి పొద్దుట పిచ్చాపురపు బయలు లో కలవడం అన్నది విధాత తలపున కలిగిన చిలిపి చేష్ట.
(ఇంకా ఉంది)

Good start. pl continue
ReplyDelete