నేనెందుకు రాస్తున్నాను ?
ఈ ప్రశ్న అడిగితే, టపీ మని ఇవ్వగలిగే సమాధానం - మా ఖర్మ కాలిన కొద్దీ అని వేడిగా, వాడిగా చెప్పేస్తారు మా అయ్యరు గారైతే.
ఇంతకీ అప్పుడప్పుడు ఇట్లాంటి మనో ప్రేరిత సంక్లిష్ట అసమాధాన ప్రశ్నలు ఎందుకు ఉదయిస్తాయి చెప్మా అని ఆలోచిస్తే, అప్పుడప్పుడు అనిపిస్తుంది, అసలు మన రాతల వల్ల బాగు పడ్డ వాళ్లె వారైనా ఉన్నారా అని.
రాతల్ చదివి తలరాతల్ మారుతాయా అని అడిగితే, తప్పక ఉంటుందను కుంటాను. ఉదాహరణ కి స్వామీ వివేకానంద వారి సంభాషణలు, పుస్తక రూపేణా చదివి ఎంత మంది ఉత్తెజితులవటం లేదు ఇప్పుడు కూడా?
అంటే ఈ రాతలు మనస్సు అట్టడుగు పొరల్లో నించి, వస్తే వాటికి ఆకర్షింప బడే వాళ్ళు ఖచ్చితం గా ఉంటారని పిస్తుంది.
సో, మన మనస్సులో జరిగే సంఘర్షణ లకి మరో వ్యక్తీ వాక్కులో, లేక రాతల లో వాటి ప్రతిధ్వని వినిపిస్తే వాటికి మనం ఆకర్షితులవుతామని అనుకోవచ్చా?
ఈ ఆలోచనని ఇంకొంచం పొడిగిస్తే, ఐరన్ ఫైలింగ్స్ కి అయస్కాంతం, అయస్కాంతానికి ఐరన్ ఫైలింగ్స్ ఒకటి కి మరొకటి సహాయ కారి లా ఉన్నట్టు భావ సారూప్యం కలవిగా ఉన్నట్టు ఉన్న రెండు మనస్సుల కలయిక ఐన రాతలు వాక్కులు దగ్గిరైనప్పుడు వాటికి మధ్య ఓ అవినాభావ సంబంధం కలిగేటట్టు అనిపిస్తుంది.
అబ్బా , నేను కూడా ఓ థీసిస్ ప్రతిపాదించేసా !
చీర్స్
జిలేబి
తిరగేస్తే 'బీ లేజీ' !

very nice "Jilebee"
ReplyDeleteso Sweet of you!!
ధన్యవాదాలండీ వనజ వనమాలీ గారు!
Deleteజిలేబి.
ఏమో! నిజం చెబితే నిష్టూరం.
ReplyDeleteఅర్థం కాకున్నా నోరెత్తకుండా చదువుతున్నాం గదండి, పైగా ఇలాంటి క్విజ్ కూడానా? :(
:P
హన్నా శంకర్ గారు,
Deleteకామెంటు తో కొట్టినా మరి ఓపిగ్గా భరిస్తున్నామండీ, మరి దీనికేమంటారు?
చీర్స్
జిలేబి.
రాయడం మానేయండి.
ReplyDeleteఆయ్ లబలబ గారు,
Deleteరాయడం మానేయండి అంటారా! చస్తే కుదరదండీ ! ఎంత మాట ఎంత మాట ? ఆ పై దురద ఎట్లా వదిలేది మరి రాయకుండా ఉంటే ?
చీర్స్
జిలేబి.
ఒకే పోస్టులో మూడు సినిమాలు భలే చూపెట్టారు!
ReplyDeleteజీడి పప్పు గారు,
Deleteమీరు మూడు సినిమాలు చూసిన మత్తులో వేరే టపా మీద కామేంటి నట్టున్నారు ? మీరు చెప్పిన మూడు సినిమా కథలు ఇంతకు మునుపు టపా పైనేనా ?
జిలేబి.
ఎందుకేమిటి..అందరూ ఎందుకు రాస్తారో మీరూ అందుకే..
ReplyDeleteఅబ్బా జ్యోతిర్మాయీ గారు,
Deleteమీరున్నూ మరీ ! అందరూ ఎందుకు రాస్తారో మనమూ అందుకే రాసినా, అలా చెప్పకూడ దండీ ! మనం స్పెషల్ గా మరి ఆల్వేస్ !
ధన్యవాదాలు.
సరదా శారదా లాస్య భావ బ్లాగ్భావరి !
(ఈ పై వాక్యం బాగుందంటారా ?)
చీర్స్
జిలేబి.
ఇంతకీ మీరు అయస్కాంతమా? ఇనుప రజనా? రెండూనా?
ReplyDeleteకష్టే ఫలే వారు,
Deleteమేము ఒట్టి జిలేబీ మాత్రమే!
చీర్స్
జిలేబి.
అసలు మన రాతల వల్ల బాగు పడ్డ వాళ్లె వారైనా ఉన్నారా,
ReplyDeleteమీకు చాలా ఆశలు వున్నాయ్ అండి, మీ రాతలతో మారిన వాళ్లతో సన్మానం చేయించేసుకుందామనే,...హి,హి.......
మీ తత్వవివేచన అద్భుతం.
ఏముంది?
ReplyDeleteమెదడుకి దురదపుడితే గోక్కోలేరు కదా!
ఇలా బ్లాగుల్లో గీకుతున్నారన్నమాట.