Thursday, July 12, 2012

బాక్పాక్ బకరా బాబు కథ (ఫణీంద్ర గారి కోరిక పై)

బాక్పాక్ బకరా బాబు కథ (ఫణీంద్ర గారి కోరిక పై)

మొన్న టపా రాయ డానికి మేటరు ఏమీ లేదంటే బాక్పాక్ బకరా బాబు కథలు రాయండని పీక్యూబ్ ఫణీంద్ర గారు చెప్పేరు.

బాక్ పాక్ బకరా బాబు గురించి చెప్పా లంటే మేటరు కు కొదవేంటి ?

ఇంతకీ ఈ బాక్బాక్ బకరా బాబు వేష ధారణ గురించి చూస్తే, మానవుడు బాక్పాక్ తో బాటు తలకో (చెవికో) పరికరం పెట్టుకుని (ఏమిటది ? నీలి పళ్ళు - అబ్బా పళ్ళు ఎందుకు చెవిలో పెట్టు కుంటారు సుమీ వీళ్ళు ? పళ్ళూడి పోయాయా అంటే అదీ లేదు మరి ) చేతిలో రెండు బ్లాక్ బెర్రీ లు పెట్టు కుని ( అదేదే స్ట్రా బెర్రీ ఉన్నా ఫర్లేదు , ఏదో అబ్బాయి ఆరోగ్యం గా వుండ డానికి  స్ట్రా బెర్రీ చేతిలో పెట్టుకుని ఉన్నాడు అనుకోవచ్చు!) కనబడ్డాడు మొన్న మహా నగర  వీధుల్లో.

హలో అని పలకరించా.

మానవుడు జవాబివ్వలే. మళ్ళీ హలో అన్నా. జవాబు లేదు ఇట్లా కాదనుకుని మొబైల్ నించి తనకి కాల్ ఇచ్చా. వెంటనే మబైల్ ఆన్ చేసి 'గుడ్ మార్నింగ్, బాక్పాక్ బకారాబాబు హియర్ అన్నాడు.

అబ్బో మానవుడు ఫోన్ లో గాని మాటలాడ డు సుమీ అని ముక్కు మీద వేలేసుకున్నా !

ఫోన్ కట్ చేసి బకారాబాబు బాగుండావా నాయనా అన్నా.

అప్పటికి తను ఈ లోకం లోకి వచ్చేడు.

ఆ ఎం బాగు  బామ్మ గారు అన్నాడు.

అదేమిటోయ్ లక్షల్లో సంపాదిస్తా వుండావు  అట్లా నీరస పడి  పోయావు అడిగా.

ఎక్స్క్యూస్ మి , అని మళ్ళీ ఫోన్ ఆన్ చేసి చేతి తో సైగ చేసేడు.- ముఖ్య మైన కాల్ అన్నట్టు.

ఆ చెవిలో ఉన్న పరికరం, వాడి అవతారం చూస్తే, ఫక్కున నవ్వొచ్చింది

ఎవరైనా తమకు తామే మాట్లాడు కుంటూం టే  ఎవడీ పిచ్చోడు అనిపించేటట్టు  ఉన్నాడు మానవుడు.

తన ఎదుట ఎవరో ఉన్నట్టు వాడు ఊగేస్తూ తల ఎగరేస్తూ మాట్లాడు తున్నాడు

చేతులు విపరీతం గా ఊపెస్తున్నాడు.

భయం వేసింది బకరా బాబు కి ఏ  మైనా ఫిట్స్  వచ్చేస్తుందేమో నని.

బకరా బాబు బకరా బాబు అన్నా, వాణ్ని గట్టిగా ఊపా. .

ఐయాం ఆల్రైట్ అన్నాడు వాడు.

ఏమి రైటో ఏమి లెఫ్టో  పైనున్న మా వేంకటేశు స్వామీ వారికే తెలియాలి మరి !

అబ్బాయ్ ఇట్లా ఇంత సేపు మాట్లాడతా ఉండావే గొంతు పట్టుకు పోదా అన్నా.

బామ్మా, ఏం  చేసేది, ఇట్లా మాట్లాడు తానె ఉండాలాయే మరి అన్నాడు.

కొందరికి మాట్లాడ తానె ఉండటానికి కంపనీలలో డబ్బులు ఇస్తారట!

అంతే గాక, ఎవడేక్కువ మాట్లాడితే వాడికే పైసలు ఎక్కువట మరి. పొద్దస్తమానం మీటింగులూ, ఎక్సెల్ షీట్లలో కలర్ఫుల్ గా గ్రాఫులు గట్రా రాస్తే గీస్తే ఇంకా పైసలు ఎక్కువట మరి. బాక్పాక్ బకరా బాబు విశదీకరించాడు.

ఏమి బకారాబాబు మరి మీ ఆఫీసులో ఎవడు అసలైన పని చేస్తాడు ? అన్నా అర్థం గాక.

బామ్మోయ్,ఇట్లాంటి జవాబులు లేని ప్రశ్న అడగ మాకే, అన్నాడు వాడు.

సరే బకరా బాబు భోజనం  మాటేంటి ?  అని సందేహం పడ్డా.

నో భోజనం. ఓన్లీ వర్కింగ్ లంచ్ అన్నాడు.

సరే మీ ఆవిడ ఎలా ఉందోయ్ అడిగా..

తన్ని చూసి నెల రోజులాయె అన్నాడు.

ఏమిరా ఏమైనా విశేషమా పుట్టింట్లో ఉందా ? సంతోషం తో అడిగా, అబ్బా ఇన్నేళ్ళకి ముని మనవడు చూడొచ్చు సుమీ అని ఆశ పడి పోయి.

అబ్బే, తనది నైట్  డ్యూటీ నాది డే డ్యూటి. ఇద్దరం సరైన సమయం లో ఒక్క నెలదాకా ఇంకా కలవందే  అని కలవర పడి  పోయేడు !

ఏడు కొండల వాడా గోవిందా గోవిందా మరి!

ఏమండీ పీక్యూబు పురాణ పండ ఫణి గారు, మీ కైమనా బకరా బాబు మిసెస్ బకరీ బేబీ కనబడితే కాస్త బకరా బాబు ని కలవ మని చెబ్దురూ మరి !

చీర్స్
జిలేబి.

5 comments:

  1. ఎప్పుడో ఒకప్పుడు ఈ దశాబ్దంలో కలుస్తారులెండి.

    ReplyDelete
  2. వరూధిని gaaru, ee young gen life ne antha andi. vere maargam ledhu kadhaa !!

    ReplyDelete
  3. Nice one...
    "అంతే గాక, ఎవడేక్కువ మాట్లాడితే వాడికే పైసలు ఎక్కువట మరి. పొద్దస్తమానం మీటింగులూ, ఎక్సెల్ షీట్లలో కలర్ఫుల్ గా గ్రాఫులు గట్రా రాస్తే గీస్తే ఇంకా పైసలు ఎక్కువట మరి. బాక్పాక్ బకరా బాబు విశదీకరించాడు."

    correct!!!

    ReplyDelete
  4. నాకు బకరీ బేబీ కనబడితే, బకరా బాబు ఒకడు గింజుకుంటున్నాడు కదా.... నీకెందుకమ్మా ఉద్యోగం చేస్తూ బకరీ బేబీవి అయ్యే ఖర్మ... అంతకంటె డిగ్నిఫైడ్‌గా హోంమేకర్ ఉద్యోగం చేసుకోవచ్చుగా... (అచ్చ తెలుగులో చెప్పాలంటే ఇంట్లో కూచుని అంట్లు తోముకుంటూ ఉండొచ్చుగా) అని ఓ ఉచిత సలహా పారేస్తాను. ఏమంటారు జిలేబీ గారూ...!

    ReplyDelete